సంకలనాలు
Telugu

ఈ యంగ్ ఆంట్ర‌ప్రెన్యూర్ ఒక‌ప్పుడు కాలేజీ డ్రాప‌వుట్ !!

ashok patnaik
9th Dec 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

అందరి అమ్మాయిల్లాగానే ఇంటర్ తర్వాత బీటెక్ లో జాయిన్ అయిన సాయి సవిత ఫస్టియర్ పూర్తయ్యాక తనకు ఆ సబ్జెక్టు సూట్ కాదని అనుకున్నారు. రెండోఏడాది కి వచ్చాక తనకు ఆ చదువు కరెక్ట్ కాదనిపించింది. తన అభిప్రాయం పేరెంట్స్ తో చెప్పింది.స్కూలు రోజుల నుంచి క్లాసులో నంబర్ వన్ గా ఉన్న స్టూడెంట్ సడెన్ గా కాలేజీకి వెళ్లనంటోందేంటి అనే అనుమానం వచ్చినప్పటికీ, తనకు నచ్చని సబ్జక్ట్ కనక వద్దంటోందని అర్థం చేసుకున్నారు. అక్కడ మాత్రమే బ్రేక్ పడింది తప్పితే మరే విషయంలోనూ వెనకడుగు వేయలేదు సవిత.

“స్కూల్లో ఉన్నప్పుడు మంచి ఆర్గనైజర్ ని. కాలేజి వదిలేసిన తర్వాత వ్యాపారం చేద్దామని ఫిక్స్ అయ్యా” సవిత
image


బీబీఏ చదువుతూనే..

ఇంజనీరింగ్ డ్రాపవుట్ అయిన తర్వాత వ్యాపారం చేద్దామని ఉన్న సమయంలో బిబిఏ చదవుతానని నాన్న గారితో తన అభిప్రాయం పంచుకుంది సవిత. డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే ఐసిక్(AIESEC)కి వాలంటీరుగా పనిచేయడం ప్రారంభించారు. ఇంటర్న్ షిఫ్ కోసం ఈజిప్ట్ వెళ్లానని సవిత చెప్పుకొచ్చారు. స్కూలు రోజుల్లోనే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ఇటలీ వెళ్లానని గుర్తు చేసుకున్నారామె. ఐసిక్ లో టీం లీడ్, తర్వాత ప్రాజెక్ట్ లీడ్ గా ఎదిగాను. అప్పటి ఆలోచనే సోలార్ కంపెనీ. అయితే కంపెనీ రిజస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు. చివరి ఏడాది వచ్చే టప్పటికి కొన్నాళ్లు ఐసిక్ వ్యవహారాలు పక్కన బెట్టి చదువుపై శ్రద్ధ పెట్టాను. అలా 2014లో నా డిగ్రీ చేతికొచ్చింది. కాలేజీ నుంచే ఆంత్రప్రెన్యువర్ అయ్యానని సవిత అంటున్నారు.

కుటుంబమే బలం, బలహీనత

నాన్నకి రామాంత పూర్ లో స్కూల్ ఉంది. చాలా మంది ఆ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు దేశ విదేశాల్లో మంచి స్థాయికి ఎదిగారు. వాళ్లంతా డాడీని కలవడానికి మా స్కూల్ దగ్గరకి వస్తుంటారు. అది చూసినప్పుడల్లా ఎంతో స్ఫూర్తిని పొందేదాన్ని.

“దేశ భవిష్యత్ అంతా ఇప్పటి స్కూళ్లలోనే ఉందనే దాన్ని నేను నమ్ముతా” సవిత

ఇది ముమ్మాటికీ నిజం. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మా నాన్నగారే. ఆయన స్కూలే. ఇంట్లో నేను మిడిల్. అక్క పెద్దది. చెల్లి క్రియేటివ్ ఫీల్డ్ లో కెరియర్ వెతుక్కుంది. ఇక స్కూల్ బాధ్యత నేనే తీసుకోవాలనే అభిప్రాయం వినపడేది. అయితే దానికి నేను సిద్ధంగా ఉన్నప్పటికీ, నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు కోరుకున్నా. దానికి మా కుటుంబ సహకారం చాలా ఉంది. నా సోలార్ పవర్ కంపెనీ ప్రారంభరోజు నుంచి ఫాదర్ సలహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. మా కుటుంబ మద్దతుతో నేనీ స్థాయికి వచ్చానని చెప్పుకొచ్చారు సవిత.

image


రేస్ సోలార్ ప్రారంభం

ఇంతకు ముందు చెప్పినట్లు నేను కాలేజీ రోజు నుంచే వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నా. అయితే అది ఎలాంటి వ్యాపారం. రిలియబుల్ ఎనర్జీ తో వ్యాపారం చేస్తే పర్యావరణానికి సైతం మనం ఎంతో కొంత సాయం చేయొచ్చని అనుకున్నా. విండ్ పవర్ లాంటి వాటిని ట్రై చేద్దామనుకున్నా. వాటికి ఇన్వస్ట్ మెంట్ ఎక్కువ అవుతుందని భావించి సోలార్ లోకి అడుగుపెట్టా. రేస్ సోలార్ టెక్నాలజీస్ ప్రారంభమైంది. మొదలైతే అయిందికానీ మొదటి రోజు నుంచే దాని ఆపరేషన్స్ మొదలు పెట్టలేదు. దాదాపు ఏడాది పాటు మార్కెట్ రీసెర్చ్ చేశా. ఎన్నో ఈవెంట్స్, మీటప్స్ అటెండయ్యా.

“కిందటేడాది చివర్లో రేస్ సోలార్ పూర్తి స్థాయి ఆపరేషన్స్ మొదలు పెట్టింది.” సవిత

బిజినెస్ అంటే డబ్బులు సంపాదించడానికే అనే విషయాన్ని నేను నమ్మను. వ్యాపారం అంటే మా నాన్నగారు స్కూల్ నడిపేలాగా ఉండాలనుకున్నా. స్కూల్ అంటే భవిష్యత్ తరాన్ని తయారు చేసేలా, నా సోలార్ కంపెనీ కూడా భవిష్యత్ తరాలకు సహజసంపదను కాపాడే సంస్థగా అవతరించాలన్నారామె.

image


రేస్ సోలార్ పనితీరు, టీం

రేస్ సోలార్ కి తెలంగాణ, ఆంధ్రాల్లో మంచి నెట్ వర్క్ ఉంది. వందకు పైగా క్లెయింట్స్ ఉన్నారు. నెలకి 20కిలో వాట్ల ఉత్పత్తులను పంపిణీ చేస్తారు. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఇళ్లు, చిన్నతరహా పరిశ్రమలే రేస్ సోలార్ టార్గెట్. గ్రీన్ ఎనర్జీని జనంలోకి తీసుకు పోవాలనే ఈ సంస్థ మోటో. మెయిల్స్, ఫేస్ బుక్, ఇతర ఆన్ లైన్ సేవల ద్వారానే కంపెనీని ప్రమోట్ చేసుకుంటున్నారు సవిత. దీనికోసం ప్రత్యేకంగా ఎలాంటి ప్రకటనలు ఇవ్వలేదు.

“చిన్న వాటర్ హీటర్ తో మూడు బాత్ రూముల్లో వేడి నీళ్లను ఇవ్వొచ్చు.” సవిత

ఇప్పటి వరకూ దాదాపు కోటి రూపాయిల టర్నోవర్ కు చేరుకుంది రేస్ సోలార్. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు.

image


సవిత సోలార్ టెక్నాలజీస్ ఫౌండర్ . వన్ ఉమన్ ఆర్మి అన్నట్లు ఆమెనే ఆపరేషన్స్, ఇతర వ్యవహారాలు చూసుకుంటుంది. ఇద్దరు ఫుల్ టైం ఉద్యోగులు ఈ కంపెనీకి పనిచేస్తున్నారు. వర్క్ఆర్డర్లు వస్తే ఫ్రీలాన్సర్స్ , ఇతర కంపెనీలతో టై అప్ అయి దాన్ని పూర్తి చేస్తారు.

భవిష్యత ప్రణాలికలు

5లక్షల ప్రారంభ పెట్టుబడితో మొదలైన రేస్ సోలార్ టర్నోవర్ ఇప్పుడు కోటి రూపాయిల పైమాటే. టీంని ఎక్స్ ప్యాండ్ చేయాలి. డొమెస్టిక్ రంగంలో భారత్ లోనే నంబర్ వన్ సోలార్ కంపనీగా పేరు సంపాదించాలి. వచ్చే రెండేళ్లలో మానిఫ్యాక్చర్ ఇండస్ట్రీ ప్రారంభించాలని చూస్తున్నారు. మాని ఫ్యాక్చర్ చేయడానికి పెట్టుబడి వస్తే ఆహ్వానం పలుకుతున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో అతి తక్కువ ధరకే సోలార్ వెలుగులు వెలిగించాతనేదే నాలక్ష్యం అని ముగించారు సవిత
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags