అట్టహాసంగా ప్రారంభమైన ఆగస్ట్ ఫెస్ట్

అట్టహాసంగా ప్రారంభమైన ఆగస్ట్ ఫెస్ట్

Saturday August 29, 2015,

1 min Read

image


హైదరాబాద్‌ కేంద్రంగా ప్రతీ ఏటా నిర్వహించే ఆగస్ట్ ఫెస్ట్ ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు నాలుగు వేలకు మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉంది. 200 డెమో స్టార్టప్స్, 50 మంది స్పీకర్స్.. సహా 300 మంది వరకూ ఇన్వెస్టర్లు హాజరుకాబోతున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ ప్రారంభించారు. స్టార్టప్స్‌కు తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను, రాయితీలను ఆయన వివరించారు. 'ది బెస్ట్ స్టార్టప్ సిటీ'గా హైదరాబాద్ ఎదుగుతుందని జయేష్ వివరించారు. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి.. పెద్ద ఆలోచనలు చేస్తూ చిన్న అడుగులతో ప్రయాణం మొదలుపెట్టాలని కలారి క్యాపిటల్ ఎండి వాణీ కోలా సూచించారు. ఆంట్రప్రెన్యూర్‌షిప్ అనేది ఒక ప్యాషన్‌ కానీ దానికి వయస్సు, టైంలో బేధం లేదని యువతను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో మలేషియా మ్యాజిక్ యాక్సిలరేటర్ సిఈఓ చెరిల్ యోహ్, సింగపూర్ యాక్సిలరేటర్ హుజ్ మ్యాసన్, నాస్కామ్ నుంచి బివిఆర్ మోహన్ రెడ్డి వంటి ప్రముఖులు ఈ రెండు రోజుల పాటు తమ అనుభవాలను పంచుకోబోతున్నారు.