చిన్న సంస్థలకు ఆన్‌లైన్ పేమెంట్ సౌకర్యం కల్పించే జ్విచ్

వంద‌కుపైగా పేమెంట్ గేట్ వేల‌కు స‌మ‌న్వ‌యక‌ర్త‌గా జ్విచ్‌త‌క్కువ కోడింగ్‌తో 24 గంట‌ల్లోపే పేమెంట్ ప్రాసెసింగ్ పూర్తిడెవ‌ల‌ప‌ర్లు, మ‌ర్చంట్ల‌కు పేమెంట్ల‌ను సుల‌భ‌త‌రం చేసిన సంస్థ‌ఆసియా, ఆఫ్రికాలో వ్యాపారాన్ని విస్త‌రించాల‌నుకుంటున్న జ్విచ్

6th Jun 2015
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

ఆన్‌లైన్ వ్యాపారం రోజురోజుకు విస్త‌రిస్తోంది. ఏవ‌స్తువునైనా ఈజీగా ఆన్‌లైన్ స్టోర్స్‌లో కొనేస్తున్నారు. ఐతే చెల్లింపుల విష‌యంలో మాత్రం చాలా స‌మ‌స్య‌లు ఉన్నాయి. ముఖ్యంగా మ‌ర్చంట్స్ క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. వారికి సొంతంగా పేమెంట్ ఆప్ష‌న్లు లేక‌పోవ‌డంతో ఇత‌ర పేమెంట్ గేట్ వేల ద్వారా ప్రాసెస్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ స‌మ‌స్య‌ల‌ను ఇప్పుడు సుల‌భమైన ప‌రిష్కారం సూచిస్తోంది 'జ్విచ్' .

అనీశ్ అచ్యుత‌న్‌, మాబెల్ చాకో సీరియ‌ల్ ఆంట్రప్రెన్యూర్‌లు. ఇంత‌కుముందు కూడా మొబైల్ పేమెంట్ స్టార్ట‌ప్స్ క్యాష్ నెక్ట్స్ (Cashnxt), నియ‌ర్‌టివిటీ (Neartivity), వైర్‌లెస్ అనే స్టార్ట‌ప్‌ల‌ను ప్రారంభించారు. ఈ సంస్థ‌ల‌ను ప్రారంభించిన స‌మ‌యంలో ఇండియా ఈ-కామ‌ర్స్ జోన్‌లో పేమెంట్ ప్లాట్‌ఫామ్‌కు అపార అవ‌కాశాలున్నాయ‌ని గుర్తించారు. దీంతో డెవ‌ల‌ప‌ర్లు, చిన్న వ్యాపారుల‌ే ల‌క్ష్యంతో జ్విచ్‌ను ప్రారంభించారు. అమెరికాలోని స్ట్రైప్‌, వీ పే సంస్థ‌లే వీరికి రోల్‌మోడ‌ల్‌.

image


జ్విచ్ అనేది ఒక పేమెంట్ ప్లాట్‌ఫామ్‌. ప్ర‌స్తుతం ఉన్న పేమెంట్ గేట్‌వేలు, వ్యాపారులను స‌మ‌న్వ‌యం చేస్తున్న ఓ డెవ‌ల‌ప‌ర్‌. ఆన్‌లైన్ చెల్లింపుల‌న్నింటికి సుల‌భ ప‌రిష్కారాన్ని చూపుతోంది. వెబ్‌సైట్ లేదా మొబైల్ వెబ్‌సైట్ ద్వారా అతి త‌క్కువ కోడింగ్‌ను ఉప‌యోగించి పేమెంట్‌ల‌ను అంగీక‌రిస్తుంది. ఈ వెబ్‌సైట్ ద్వారా చెల్లింపులు చేయాలంటే వ్యాపారులు మొద‌ట‌గా ఇందులో సైన‌ప్ కావాలి. ఆ త‌ర్వాత అన్నిర‌కాల పేమెంట్ల‌ను జ్విచ్ చూసుకుంటుంది. అతి త‌క్కువ డాక్యూమెంటేష‌న్‌తో కేవ‌లం 24 గంట‌ల్లోనే వ్యాపారిని పేమెంట్ ప్రాసెస్‌కు సిద్ధం చేస్తుంది.

"డెవ‌ల‌ప‌ర్లు, వ్యాపారులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను దృష్టిలోపెట్టుకునే ఈ స్టార్ట‌ప్‌ను ప్రారంభించాం. ఎక్కువ డాక్యుమెంట్లులు అడ‌గ‌డంతోపాటు పేమెంట్ ప్రాసెస్ పూర్త‌య్యేందుకు గ‌తంలో 15 నుంచి 45 రోజులు ప‌ట్టేది. అలాగే చెల్లింపులకు వేదిక‌గా ఉండే పేజీపై నియంత్ర‌ణ ఉండేది కాదు. దీంతో క‌స్ట‌మ‌ర్ బ‌ల‌వంతంగా పేమెంట్ గేట్ వే పేజీకి వెళ్లి త‌న చెల్లింపుల‌ను పూర్తి చేయాల్సి వ‌చ్చేది. ఆ స‌మ‌స్య‌ల‌కు మా వెబ్‌సైట్ ద్వారా ప‌రిష్కారం చూపుతున్నాం" అని అనీశ్ చెప్పారు.
జ్విచ్ వ్య‌వ‌స్థాప‌కులు మాబెల్‌, అనీశ్‌

జ్విచ్ వ్య‌వ‌స్థాప‌కులు మాబెల్‌, అనీశ్‌


అనీశ్‌, మాబెల్‌ల‌కు పేమెంట్‌, క‌న్జూమ‌ర్ మొబైల్‌, ఇంట‌ర్నెట్ స్పేస్‌లో 12 ఏళ్ల‌కు పైగా అనుభ‌వ‌ముంది. భార‌త దేశ తొలి మొబైల్ స్టార్ట‌ప్ క్యాష్‌నెక్ట్స్‌ను ప్రారంభించింది వీరిద్ద‌రే. పేమెంట్ గేట్ వే "పే యూ"లో అనీశ్ వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు. అలాగే ఆ సంస్థ‌కు ఇండియాలో అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా కూడా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత ఆసియానెట్ శాటిలైట్ క‌మ్యునికేష‌న్స్‌కు హెడ్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఇక‌ మొబైల్‌, ఇంట‌ర్నెట్‌, పేమెంట్ సంబంధింత రంగాల్లో మాబెల్ నిపుణురాలు. బెంగ‌ళూరు ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ పూర్వ విద్యార్థి.

ఇదీ ఆరంభం..

మొద‌ట్లో వినియోగ‌దారుల చెల్లింపులు జ‌రిపేందుకు వీలుగా క‌న్స్యూమర్ వాలెట్ 'కంపోనెంట్ ఐజ్వైప్ పేమెంట్ టెక్నాల‌జీస్' పేరుతో సంస్థ‌ను ప్రారంభించారు. అది స‌క్సెస్ కావ‌డంతో డెవ‌ల‌ప‌ర్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌పై దృష్టిసారించి, జ్విచ్‌ను ప్రారంభించారు. ఐతే ఇప్ప‌టికీ కంపెనీ పేరు ఐ జ్వైప్ టెక్నాల‌జీస్‌గానే కొన‌సాగుతుండ‌టం విశేషం.

వెబ్‌సైట్‌లో సైన‌ప్ అయిన 24 గంట‌ల్లోనే వ్యాపారులు ఫుల్ ఆన్‌లైన్ బోర్డింగ్ ప్రాసెస్‌తోస‌హా పేమెంట్ ప్రాసెస్‌ను పూర్తి చేయ‌గ‌ల‌డ‌మే ఈ జ్విచ్ గొప్ప‌త‌నం. సైన‌ప్ అయిన వెంట‌నే డెవ‌ల‌ప‌ర్లు, వ్యాపారుల‌కు సొంత చెల్లింపుల ఫామ్స్‌ను రూపొందించుకోవ‌చ్చు. అలాగే క‌స్ట‌మ‌ర్లు త‌మ చెల్లింపులు పూర్త‌య్యే వ‌ర‌కూ అదే పేజీలో కొన‌సాగేలా చేయొచ్చు.

"వ్యాపారులు చేయాల్సింద‌ల్లా జ్విచ్ జావా స్క్రిప్ట్‌ను యాడ్ చేసుకోవ‌డ‌మే. అలాగే త‌మ వెబ్‌సైట్‌లో కొన్ని కోడ్ లైన్స్ రాసుకోవాలి. ఎలాంటి ఐ ఫ్రేమ్ లేదా ఇత‌ర పేమెంట్ గేట్ వే పేజీల‌కు రీ డైరెక్ట్ కాకుండానే చెల్లింపుల‌ను పూర్తి చేయొచ్చు" అని మాబెల్ వివ‌రించారు. 

ఈ జ్విచ్‌లో టోకెనైజేష‌న్ పేరుతో ఓ ఫీచ‌ర్ ఉంది. అది క్ల‌యింట్ బ్రౌజ‌ర్‌లో ఉన్నవివ‌రాల‌ను అవ‌స‌ర‌మైనంత వ‌ర‌కు సేక‌రించి, పేమెంట్ కార్డ్ ఇండ‌స్ట్రీలో అనుమ‌తికి అవ‌స‌ర‌మ‌య్యేలా చర్యలు తీసుకుంటుంది. వెబ్‌సైట్‌లోనే కాదు ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ మొబైల్‌ల‌లో కూడా ఇన్ యాప్ పేమెంట్స్ పేరుతో ఈ ఫీచ‌ర్ అందుబాటులో ఉంది.


image


కార్డును స్టోరేజ్ చేసుకునేందుకు, రిఫండ్స్ కోసం జ్విచ్ ఓ అప్లికేష‌న్ ప్రొగ్రామ్ ఇంట‌ర్‌ఫేస్‌ను కూడా ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఎప్పుడుప‌డితే అప్పుడు వాడుకునేందుకు వీలుగా పేమెంట్ యాప్స్‌ను కూడా సిద్ధంగా ఉంచుతుంది. ఎలాంటి సాంకేతిక ప‌రిజ్ఞానం లేకుండానే బ్లాగ్‌ల ద్వారా, సోష‌ల్ మీడియా ద్వారా, ఈమెయిల్ ద్వారా, మిస్డ్ కాల్స్ ద్వారా చేసే చెల్లింపుల‌కు అనుమ‌తి ఇచ్చేందుకు వ్యాపారుల‌కు ఈ యాప్స్ ఉప‌యోగ‌ప‌డుతాయి.

డెవ‌ల‌ప‌ర్లు, వెబ్‌సైట్ ఓన‌ర్లే ల‌క్ష్యం..

డెవ‌ల‌ప‌ర్లు, చిన్న వెబ్‌సైట్ ఓన‌ర్లే జ్విచ్ టార్గెట్‌. ఈ ప్లాట్‌ఫామ్‌లో 50 ల‌క్ష‌ల‌మంది ఫ్రీలాన్స‌ర్లు, 25 మిలియ‌న్ల చిన్న‌,మ‌ధ్య త‌ర‌గ‌తి వ్యాపారులున్నారు. వీరే జ్విచ్ టార్గెట్‌.

థ‌ర్డ్‌పార్టీతో సంబంధాలే స‌వాలు

పేమెంట్ ఇంట‌ర్‌ఫేస్‌లో థ‌ర్డ్‌పార్టీతో సంబంధాలే చాలా స‌వాలుతో కూడుకున్న‌దంటారు అనీశ్‌. ఇలాంటి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకునేందుకు గ‌తంలో ఉన్న వీరి అనుభ‌వం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డింది. జ్విచ్ ప్లాట్‌ఫామ్ ద్వారా వంద‌కుపైగా పేమెంట్ ఆప్ష‌న్ల‌ను వ్యాపారులు ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇండియాలోనే కాదు ఆసియా, ఆఫ్రికాలో కూడా త‌మ వ్యాపారాన్ని విస్త‌రించాల‌ని జ్విచ్ భావిస్తున్న‌ది. వారి ల‌క్ష్యం నెర‌వేరాల‌ని ఆశిద్దాం.

Want to make your startup journey smooth? YS Education brings a comprehensive Funding and Startup Course. Learn from India's top investors and entrepreneurs. Click here to know more.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

Our Partner Events

Hustle across India