విదేశాల్లో చదివినా..వీధి బాలల్లో ఆనందమే అతడి లక్ష్యం

ప్రపంచం మొత్తం డబ్బువైపే పయనిస్తోంది. యువకులూ ఇందుకు మినహాయింపేమీ కాదు. కొందరైతే డబ్బులు, పబ్బుల వెంట పరిగెడుతూ మానవత్వాన్నే మర్చిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మెకానికల్ ఇంజినీరింగ్ చదవి, విదేశాల్లో ఉన్నత ఉద్యోగం చేసిన విష్ణు సోమన్ మాత్రం సమాజ సేవకే అంకితమై ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. స్మైలీస్ ఇండియా పేరిట ఓ ఎన్జీవో సంస్థను ఏర్పాటు చేసి వివిధ రకాల వైకల్యాలను ఎదుర్కొంటున్న చిన్నారుల పెదవులపై నవ్వులు పూయించేందుకు ప్రయత్నిస్తున్నారు.

19th Sep 2015
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

కాలేజీ చదివే రోజుల నుంచే విష్ణు సోమన్ కాస్త విభిన్నంగా ఆలోచించేవారు. ఏదైనా కొత్తగా చేయాలన్నదే ఆయన తపన. మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసినా, పేద చిన్నారులకు సాయం చేసేందుకు స్మైలీస్ ఇండియా పేరుతో ఓ సంస్థను ప్రారంభించడం అతని గురించి తెలిసినవారెవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. కళలు, సంస్కృతి, క్రీడా రంగాలను ప్రోత్సహించేందుకు ఈ సంస్థ ఏర్పాటైంది. చిన్నారులు తమ స్వప్నాలను సాకారం చేసుకునేందుకు, లక్ష్యాలను చేరుకునేలా ఈ సంస్థ ప్రోత్సహిస్తుంది.

‘‘మా స్కూల్ పాఠ్యాంశంలోనే భాగంగా సేవ అనేది ఓ అలవాటుగా మారిపోయింది. దుబాయ్ లో భుమితోపాటు మరికొన్ని సంస్థల్లో వాలంటీర్‌గా పనిచేశాను. నా ఆలోచనలను కార్యరూపం దాల్చేందుకు అంతర్జాతీయస్థాయిలో ఆ సంస్థలు ఎంతో సాయం చేశాయి’’ అని విష్ణు తెలిపారు.
ఫొటో క్యాంపైన్ నిర్వహిస్తున్న స్మైలీస్ ఇండియా వాలంటీర్లు

ఫొటో క్యాంపైన్ నిర్వహిస్తున్న స్మైలీస్ ఇండియా వాలంటీర్లు


ఇండియాకు తిరిగొచ్చిన తర్వాత 2011లో విష్ణు సొంతంగా ఓ గ్రూపును ఒకదాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఎనేబుల్ ఇండియా సంస్థలో వాలంటీర్ మేనేజర్ గా కూడా పనిచేస్తున్నారు. స్వచ్ఛంద సేవకులకు బాధ్యతలు అప్పగించడం, ఇంటర్న్‌షిప్ ప్రొగ్రామ్‌లను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు విష్ణు నిర్వహిస్తారు.

ది మిషన్

‘‘సమాజంలోని నిరుపేద చిన్నారులకు కళలు, సంస్కృతి, క్రీడలు, టెక్నాలజీ అందజేయాలన్నదే మా సంస్థ లక్ష్యం. అలాగే వారి ఆశయాలను సాధించేందుకు సాయం చేస్తాం. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పినట్టుగా కలలను సాకారం చేసుకునేందుకు ప్రతి ఒక్కరికి ఇతరుల సాయం అవసరం అన్నది మా భావన. వారి లక్ష్యాలను చేరుకునేందుకు మా సంస్థ తరఫున సాయం చేస్తాం. ఎంతో మంది వాలంటీర్లు తమ కెరీర్‌ను వదులుకుని మా సంస్థ తరఫున పనిచేస్తున్నారు. మరికొందరు ఉద్యోగాలు చేస్తూనే పార్ట్ టైం సేవలందిస్తున్నారు’’ అని విష్ణు వివరించారు.

పెయింట్ ఫర్ ఏ కాజ్..

మంచి ఉద్దేశం కోసం వాలంటీర్లు గోడలకు రంగులు వేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల గోడలకు, అనాథ శరణాలయాలకు, లైబ్రరీ వంటి వాటికి కొత్త రూపును తెస్తున్నారు. వైట్ వాష్ లాంటివి మాత్రమే కాకుండా చిన్నారులను ఆకట్టుకునేలా వాల్ డూడుల్స్, గ్రాఫిటీ వంటి వాటితో పెయింటింగ్ వేస్తున్నారు. గోడలను రక్షించడంతోపాటు మంచి సందేశాలను చేరవేయడంలో కూడా ఇవి ఎంతగానో ఉపయోపడుతుందని విష్ణు అంటున్నారు.

పాఠశాల గోడలపై గ్రాఫిటీ వేస్తున్న స్మైలీస్ ఇండియా కళాకారులు

పాఠశాల గోడలపై గ్రాఫిటీ వేస్తున్న స్మైలీస్ ఇండియా కళాకారులు


వేస్ట్ మేనేజ్‌మెంట్ రీసైకిల్..

టీమ్ మెంబర్స్, ఎక్స్‌పర్ట్స్ వర్క్ షాప్‌లను నిర్వహిస్తూ వేస్ట్ మేనేజ్‌మెంట్ రీ సైక్లింగ్ పై వాలంటీర్లు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.

స్మైల్ టీవీ

కొందరు ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు కూడా ఈ ఎన్జీవో సంస్థలో చేరి నాణ్యమైన కంటెంట్‌ను అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ, ఫిల్మ్ మేకింగ్ కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలు కావడంతో వాటి జోలికి ఈ సంస్థ వెళ్లడం లేదు.

టాయ్ డ్రైవ్..

ఇదో సరికొత్త కార్యక్రమం. ఉపయోగించుకునేందుకు వీలున్న బొమ్మలను వాలంటీర్లు ఇళ్ల వద్దకు వెళ్లి సేకరిస్తారు. వాటిని మరింత శుభ్రం చేసి, అందంగా తీర్చిదిద్ది మురికివాడల్లో ఉన్న నిరుపేద పిల్లలకు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే చిన్నారులకు అందిస్తారు.

‘‘వాలంటీర్ ఎవరైనా సరే తమ సొంత ఆలోచనతో సేవలందించొచ్చు. దాన్ని అమలుపరిచేందుకు మేం ప్రయత్నిస్తాం. వీధుల్లో ఐస్ క్రీములను పంచడం, మేకోవర్ మానియా (అంధ వైక్యలం కలిగిన చిన్నారులకు), అనాధ శరణాలయాల్లో సండే సర్ ప్రైజ్ వంటి కార్యక్రమాలను నిర్వహించాం’’ అని విష్ణు వివరించారు.

డ్యాన్స్ ఫెస్టివల్ తాండవ్..

దృష్టిలోపం, శారీరక వైకల్యం, వినికిడి లోపం, పుట్టు సమస్యలతో బాధపడుతున్నవారందరినీ ఒకే వేదికపై తెచ్చేందుకు స్మైలీస్ ఇండియా ప్రతి ఏటా 'తాండవ్ ఫెస్టివల్' ను నిర్వహిస్తోంది. ఈ సంబరాల్లో అనాథ పిల్లలు, నిరుపేద చిన్నారులు సేవలందిస్తారు. వినికిడి సమస్యలు ఎదుర్కొంటున్న చిన్నారులతో మాట్లాడేందుకు దృష్టి లోపం కలిగిన చిన్నారులకు ఈ వాలంటీర్లు సాయం చేస్తారు. సంగీతాన్ని ఆస్వాదించేందుకు, మంచి హృదయంతో సాయం చేస్తారు.

‘‘ఈ మ్యూజికల్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు ప్రజలు వస్తారు. తమలోని ప్రతిభను బయటపెట్టుకునేందుకు వివిధ వైకల్యాలతో బాధపడుతున్న చిన్నారులకు ఈ ఫెస్టివల్ మంచి వేదిక’’ అని విష్ణు వివరించారు.
తాండవ్ ఫెస్టివల్ లో పాల్గొంటున్న చిన్నారులు

తాండవ్ ఫెస్టివల్ లో పాల్గొంటున్న చిన్నారులు


సోషల్ మీడియా డే ఫర్ గుడ్ పేరుతో మరో మంచి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తోంది స్మైలీస్ ఇండియా. సోషల్ మీడియా ఫుట్ ఫ్రింట్‌లను క్రియేట్ చేసుకునేందుకు ఎన్జీవోలకు బెంగళూరు వాలంటీర్లు సాయం చేస్తారు.

‘‘2014 తాండవ్ ఫెస్టివల్ లో 122 మంది స్మైలీస్ వాలంటీర్లు 200 మంది చిన్నారులకు సాయం అందించారు. ఏడు వివిధ రకాల నృత్య భంగిమలను ప్రదర్శించారు చిన్నారులు. మా కార్యక్రమాలన్నింటిలోకి తాండవ్ ఫెస్టివల్ చాలా పెద్దది. ఇందులో వాలంటీర్లు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. దేశవ్యాప్తంగా వాలంటీర్లను ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇదే ఉద్దేశంతో వాలంటీర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతి ఏటా 5 వేల మంది వాలంటీర్లను కొత్తగా చేర్చడమే మా లక్ష్యం’’ అని విష్ణు ధీమాగా చెప్పారు.

టీమ్ వర్క్..

విష్ణుతోపాటు రెజీ, విశాల్, అపూర్వ, దివ్యలు కూడా ఈ సంస్థలో కీలకంగా పనిచేస్తున్నారు. ‘‘నాగాలాండ్ లో రెజీ స్కూల్‌ను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం స్మైలీ టీవీ బాధ్యతలను రెజీనే చూస్తున్నారు. త్వరలోనే నాగాలాండ్ లో కూడా కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తాం. విశాల్ సోమన్.. నా సోదరుడు. అతనో ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్. సంస్థ మీడియా వ్యవహారాలన్నీ ఆయనే చూస్తారు. వాలంటీర్‌గా వ్యవహరిస్తున్న అపూర్వ.. కార్పొరేట్ ఎంగేజ్‌మెంట్లను పర్యవేక్షిస్తారు. మా అందరిలోకి చిన్నదైన దివ్య పలు కాలేజీల్లో సంస్థ గురించి ప్రచారం చేస్తారు’’ అని విష్ణు వివరించారు.

తాండవ్ ఫెస్టివల్ లో ఉత్సాహంగా పాల్గొన్న వాలంటీర్లు..

తాండవ్ ఫెస్టివల్ లో ఉత్సాహంగా పాల్గొన్న వాలంటీర్లు..Want to make your startup journey smooth? YS Education brings a comprehensive Funding and Startup Course. Learn from India's top investors and entrepreneurs. Click here to know more.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

Our Partner Events

Hustle across India