ప్రత్యర్థుల సమాచారం ఎలా, ఎందుకు సేకరించాలి ?

23rd Aug 2015
 • +0
Share on
close
 • +0
Share on
close
Share on
close

స్టార్టప్ ఆలోచనతో పాటే అవగాహన కూడా అవసరం..

అదే ఆలోచన మరింత మంది చేస్తుంటే.. ?

వారి వ్యూహాలను సొంత వ్యాపారానికి ఉపయోగించుకోవడం ఎలా ?

ఇతర కంపెనీల వ్యూహాలు, విధానాలు తెలుసుకోవడమెలా ?

వ్యాపారం ప్రారంభించేందుకు కొత్త ఆలోచన వచ్చినపుడు... ప్రపంచంలో తానొక్కడే ఆ అంశంపై ఆలోచిస్తున్నానని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. తాను స్టార్టప్ మొదలుపెట్టేపుడు ప్రదీప్ గోయల్ కూడా అలాగే అనుకున్నాడు. కానీ అదే ఆలోచనపై వేరేవాళ్లు కూడా కృషి చేస్తూ ఉండొచ్చు. కాకపోతే దాన్ని ఆచరణలో పెట్టే విధానం మాత్రం వేరుగా ఉండొచ్చు. కొంత తమ ఆలోచనలపై వారం మొత్తం కృషి చేస్తుంటారు. మరికొంత మంది వీకెండ్స్ లోనూ పట్టు వదలని విక్రమార్కుల్లా కష్టపడుతుంటారు. నెలల పాటు కష్టపడే వారు కూడా ఉంటారు. వీరిలో కొందరు బీటా వెర్షన్ వరకూ చేరితే.. ఆలోచనను ఆవిష్కరణ రూపంలోకి తీసుకొచ్చేవారు మాత్రం అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు.

"స్టార్టప్ ఏ స్థాయిలో పోటీదారుల గురించి ఆలోచించాలి ? ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ సమయంలో ఈ తరహా విశ్లేషణ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా ? ఇతరుల వ్యాపారాల గురించిన అంతర్గత ఆలోచనలు మనకెలా తెలుస్తాయి ? ఇదో చాలా క్లిష్టమైన ప్రశ్న."

పోటీ

పోటీ


స్టార్టప్ ను మొదలు పెట్టిన కొత్తలో కొన్ని తప్పులు చేశామంటారు ప్రదీప్. అయితే.. క్రమంగా పోటీదారుల గురించిన వివరాలను తేలికగా తెలుసుకుని, విశ్లేషించుకోగలిగారు. ఇలా చేయడంతో మార్కెట్లో 3 రకాల పోటీదారులు ఉంటారనే విషయం ప్రదీప్‌కు అర్ధమైంది.

ప్రారంభస్థాయి (SPROUTS)

బిజినెస్ ఐడియాలు, ఆలోచనలు, టీం ఏర్పాటు చేసుకునే దశ, నిధులు సమీకరణ స్థాయి.. ఇలాంటి దశల్లో ఉన్న కంపెనీలు మొదటి కేటగిరీ కాగా... వీటి గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు.

స్టార్టప్స్

అప్పటికే బీటా వెర్షన్ రిలీజ్ చేసినవి, కస్టమర్లను ఆకర్షించడం ప్రారంభించినవి, వ్యాపార స్థాయిని పెంచుకునేందుకు ప్రయత్నించేవి, అప్పుడే మొదట దశను అధిగమించిని ఈ కోవలోకి వస్తాయి. వీటిలో కొన్ని స్టార్టప్ అవార్డులు పొందినవి కూడా ఉండొచ్చు.

ఈ స్టార్టప్స్ కేవలం పోటీదారులు మాత్రమే కాదు. ఇవి మార్కెట్‌ని స్టడీ చేసి.. ప్రోడక్ట్‌కి ఉన్న డిమాండ్‌ని తెలియచేస్తాయి. ఒకే కాన్సెప్ట్‌పై పలు కంపెనీలు కుస్తీ పడుతున్నాయంటే.. అప్పటికే దానికి మార్కెట్ ఉందనే అర్ధం చేసుకోవాలి. ఈకామర్స్, ట్రావెల్, వినూత్న ఆవిష్కరణలు, డేటా అనలైటిక్స్, మొబైల్ ప్లాట్‌ఫాం ఇలాంటివే.

పెద్ద కంపెనీలు

ఒకవేళ అదే రంగంలో పెద్ద కంపెనీలు అప్పటికే ఉన్నాయంటే.. అది నిజంగా బ్యాడ్ న్యూసే. నిధుల సమీకరణ, మార్కెటింగ్ కార్యకలాపాలపై వీటికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. మీడియా ద్వారా తమకు ప్రచారం చేసుకునేందుకు పెద్ద సంస్థలకు ఆస్కారం ఎక్కువ. సరైన ప్రోడక్టును అందించడం కోసం.. పలు సర్వేలు చేసి మార్కెట్లోకి చొచ్చుకుపోతుంటాయి.

నిజానికి కస్టమర్ల అవసరాలపై తగిన అవగాహన లేకపోతే.. పెద్ద కంపెనీలతో పోటీ పడ్డం కష్టంగా అనిపిస్తుంది. అయితే.. ఒక్కోసారి చిన్న విషయాలు కూడా.. పెద్ద అవకాశాలుగా మారి మార్కెట్లో స్థిరపడ్డానికి తోడ్పడతాయి.

ఉదాహరణకు మాజిక్ బ్రిక్స్ పట్టించుకోని విషయాలతో.. హౌజింగ్.కాం ఏర్పాటై... సక్సెస్ సాధించింది. మేరు క్యాబ్స్ విస్మరించిన అంశాలతో.. ఓలా క్యాబ్స్ చొచ్చుకుపోయింది.

పోటీదారుల గురించి తెలుసుకోవడమే కాదు... పోటీని విశ్లేషించుకోవడం కూడా చాలా ముఖ్యం.

 1. మొదటి దశ - ఆన్‌లైన్ విశ్లేషణ
 • గూగుల్‌తో ప్రారంభం

కావాల్సిన అంశాలపై గూగుల్‌ చేస్తూ కొంత సమాచారం సేకరించుకోవచ్చు. ఓ సాధారణ కస్టమర్ మాదిరిగా.. కీవర్డ్స్ ఉపయోగించి ప్రయత్నించాలి. ఇలా సెర్చింగ్ చేయడం ద్వారా అదే తరహా ప్రోడక్టులు, సర్వీసులు అందిస్తున్న కంపెనీల లిస్ట్ సిద్ధం చేయాలి.

చాలాసార్లు గూగుల్ మొదటి పేజ్ లోనే పెద్ద కంపెనీలుగా చెప్పుకునేవి కూడా డిస్‌ప్లే కాకపోవచ్చు. కీవర్డ్స్ ఉపయోగించడంలో అశ్రద్ధ, ఎస్ఈఓ (సెర్చ్ ఇంజిన్ అప్టిమైజేషన్)పై నిర్లక్ష్యం వంటివి కారణాలు కావచ్చు. కానీ ఇలాంటి కంపెనీలకు వేరే అంశాలు, రూట్లలో పట్టు కలిగి ఉంటాయి.

 • స్టార్టప్ మీడియా ప్లాట్‌ఫాంలు

కంపెనీల లిస్ట్‌ను పక్కాగా తయారు చేసేందుకు.. స్టార్టప్ స్టోరీలను కవర్ చేసే ప్లాట్‌ఫాంలను ఆశ్రయించచ్చు. భారతదేశంలో స్టార్టప్‌లను యువర్ స్టోరీ, నెక్స్ట్ బిగ్ వాట్ సైట్లో తెలుసుకోవచ్చు. టెక్ క్రంచ్, మాషబుల్, రీడ్ రైట్ సైట్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి గ్లోబల్ స్టార్టప్‌ల వివరాలు తెలుస్తాయి. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి ప్లాట్‌ఫాంల లిస్ట్ కూడా పెద్దదే ఉంటుంది. ఇలా చేయడం ద్వారా మార్కెట్లో ఎంత పోటీ ఉంది, ఎన్ని అవకాశాలున్నాయి, అవతలి కంపెనీలు అవలంభిస్తున్న విధానాలేంటి అనే అంశాలపై అవగాహనతోపాటు... సొంత ప్రోడక్టును మార్కెట్ చేసుకునేందుకు... తగిన ప్రావీణ్యత లభిస్తుంది.

 • కాంపిటీటర్ల వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ ఎలా వస్తోంది ?

పోటీకి సిద్ధమయ్యేందుకు ఈ లిస్ట్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఓపెన్ సైట్ ఎక్స్‌ప్లోరర్ ద్వారా కంపెనీల సైట్లకు ఇన్‌బౌండ్ ట్రాఫిక్ ఎలా వస్తోందో తెలుసుకోవడం తేలికే. ఈ అంశంపై వీలైనంత ఎక్కువగా సమాచారం సేకరించగలగాలి.

 • ఓపెన్ సైట్ ఎక్స్‌ప్లోరర్

తక్కువ క్లిక్స్‌తో ముఖ్యమైన ఎక్కువ సమాచారం ఇవ్వగలిగే రూట్ ఇది. తాజా మీడియా కవరేజ్, అవార్డ్స్, బ్యాక్ లింక్స్‌కి సంబంధిచిన డేటా దొరుకుతుంది. ఈ లింక్స్‌ని స్టడీ చేయడం ద్వారా అవతలి కంపెనీల విజయంపై అవగాహన వస్తే... సొంత కంపెనీకి అప్లై చేయడం ద్వారా వేగంగా అభివృద్ధి సాధించచ్చు.

image


2. రెండో దశ - అంతర్గత సమాచారం

పోటీదారుల గురించిన సమచారం తగినంతగా లేదని ఏ సమయంలోనూ అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది వాస్తవం కాదు. ఇప్పటవరకూ ఎంతమంది కాంపిటీటర్స్ ఉన్నారో, మార్కెట్లో వారి స్థాయి ఏంటో లిస్ట్ చేసుకున్నాం. ఈ సమయంలోనే వారి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో కూడా చాలావరకూ చెబుతుంటారు. ఇది సొంత కంపెనీకి ఒక క్లూగా ఉపయోగపడుతుంది.

 • పోటీదారుల ఉద్యోగులని ఇంటర్వ్యూ చేయడం

కాంపిటీటర్ల అంతర్గత సమచారాన్ని తెలుసుకోవడానికి ఇదో పక్కా మార్గం. అయితే... అవతలి వారి రహస్యాలు సేకరించడం అనైతికం అని భావిస్తే.. ఈ రూట్‌ని వదిలిపెట్టేయచ్చు.

 • ఇన్వెస్టర్లకి ఇచ్చిన ప్రజెంటేషన్

కస్టమర్లు, ఇన్వెస్టర్ల కోసం వీలైనంత ఎక్కువ సమాచారం ఉండేలా ప్రెజెంటేషన్లను సిద్ధం చేసుకుంటాయి స్టార్టప్స్. వీటిలో కొన్ని స్లైడ్ షేర్ వంటి సైట్లలో పొందే వీలుంది. ఇలాంటి వివరాలను సేకరించేందుకు తగినంత సమయం కేటాయించాల్సి వస్తుంది. అలాగే బఫర్ లాంటి కంపెనీలు ఇన్వెస్టర్లకు ఇచ్చే వివరాలను... పబ్లిక్‌కి కూడా అందిస్తుంటాయి. పిచ్ఎన్వీ, బెస్ట్ పిచ్ డెస్క్ లలోనూ ఈ తరహా సమాచారం పొందే వీలుంది.

 • ప్రోడక్ట్ లాగిన్/ ట్రైనింగ్

పోటీదారులు అందిస్తున్న ప్రోడక్టులను ట్రై చేయడం మరో పద్ధతి. వారు ఆయా ఉత్పత్తుల తయారీకి ఏ మెటీరియల్ ఉపయోగిస్తున్నారో తెలుసుకోవచ్చు. గతంలో ప్రదీప్ SaasS బేస్డ్ బీ2బీ ప్రోడక్ట్‌ను ఉపయోగించేవారు. ఆ తర్వాత యూట్యూబ్ ట్రైనింగ్స్ కూడా ఫాలో అయ్యారు. కనీసం ఇద్దరు కాంపిటీటర్లకు చెందిన సైట్లలో లాగిన్స్ చేసి వివరాలు పొందాలి. దీని ద్వారా ఇతర కంపెనీల ప్రోడక్టుల గురించిన సమాచారంపై ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ పొందచ్చు.

 • అప్‌డేట్‌గా ఉండడం

పై రెండు స్టెప్స్ ద్వారా కాంపిటీటర్ల గురించిన సమాచారం, అంతర్గత బిజినెస్ ఐడియాలు మాత్రమే అందుదాయి. అయితే స్టార్టప్ వాతావరణం చాలా డైనమిక్‌గా ఉంటుంది. అందుకే అప్‌డేటెడ్‌గా ఉండడం చాలా ముఖ్యం.

3. స్టెప్ త్రీ

 • గూగుల్ అలర్ట్స్

ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాలను సమగ్రంగా తెలుసుకునేందుకు... కీలకమైన పోటీదారుల సమాచారం ఎప్పటికప్పుడు పొందేందుకు గూగుల్ అలర్ట్స్ సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం కీవర్డ్స్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఎంత గ్యాప్‌లో ఈ అప్‌డేట్స్ పొందాలో కూడా సెట్ చేసుకునే అవకాశాన్ని గూగుల్ ఇస్తుంది.

 • సోషల్ మీడియా

కాంపిటీటర్లకు చెందిన సోషల్ మీడియా, బ్లాగ్స్, యూట్యూబ్ ఛానల్స్‌కు సబ్‌స్క్రయిబ్ చేయడం మరో విధానం. దీని ద్వారా కొత్త ప్రోడక్ట్ అనౌన్స్‌మెంట్స్, కొత్త ఫీచర్స్‌తో పాటు ఇతర వార్తలు కూడా తెలుస్తాయని చెబ్తున్నారు ప్రదీప్.

స్టార్టప్ జర్నీలో సక్సెస్ సాధించేందుకు ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలంటారు ప్రదీప్ గోయల్. అయితే కాంపిటీషన్ అనాలసిస్ పై తానింకా నేర్చుకోవాలని అనుకుంటున్నానని... తనకు ఎవరైనా సలహా ఇవ్వచ్చని చెబ్తున్నారు ప్రదీప్.

రచయిత గురించి..

ఈ ఆర్టికల్‌ని ఇంగ్లీష్‌లో స్వయంగా ప్రదీప్ గోయల్ రాశారు. ఆంట్రప్రెన్యూర్‌గా మారేందుకు ఉద్యోగాన్ని కూడా వదిలేశారాయన. రెండు స్టార్టప్‌లకు మాజీ ఫౌండర్. ఆర్టికల్ రైటింగ్, మార్కెటింగ్, ఫైనాన్స్ రీడింగ్‌పై ఎక్కువ సమయం కేటాయిస్తారు ప్రదీప్. ఇతర స్టార్టప్ నిర్వాహకులకు సహాయం చేయడం ఈయనకు చాలా ఇష్టం.

Want to make your startup journey smooth? YS Education brings a comprehensive Funding and Startup Course. Learn from India's top investors and entrepreneurs. Click here to know more.

 • +0
Share on
close
 • +0
Share on
close
Share on
close