అమెరికా ఉద్యోగం వదిలేసి ఆఫ్రికాలో సమాజ సేవ.. ఓ భారతీయ యువకుడి సాహసం

4th Oct 2015
 • +0
Share on
close
 • +0
Share on
close
Share on
close

అమెరికాలో వచ్చిన ఉద్యోగాన్ని తొలి వదిలేశారు 25ఏళ్ల ధైర్య పూజారా. ఈ సాహసోపేత నిర్ణయాన్ని కొందరు విచక్షణా జ్ఞానం కోల్పోవడమని నిందించారు. కానీ ఈ నిర్ణయ ఫలితం ఒక ప్రభావిత కార్యక్రమానికి నాంది పలికింది.

జూలై 2, 2012 .. తోటివారిలాగానే ధైర్య పూజారా ఎం.ఎస్. పూర్తి చేసుకుని ఐటి సెక్టార్ హెల్త్ కేర్‌లో ఉద్యోగాన్ని సంపాదించారు. ఉద్యోగంలో చేరిన తొలిరోజు పని పూర్తి చేసుకుని సరిగ్గా సాయంత్రం ఐదున్నరకు కంపెనీ ఇచ్చిన విలాసవంతమైన, ఖరీదైన హోటల్ రూమ్ చేరుకున్నారు. అప్పుడు అతను తీసుకున్న నిర్ణయం బహుశా ఎవ్వరూ ఎప్పుడూ తీసుకుని ఉండరు, కనీసం ఆ ఊహకు కూడా తావివ్వరు. అలాంటిది అతను మాత్రం ఇలా అనుకున్నారు .. ‘ఇక చాలు, జరిగిందేదో జరిగిందని’, అంతే ఇక మళ్లీ ఆఫీసుకు వెళ్లనని.

image


ధైర్య, ముంబైకు చెందిన వారు. కాలేజీలో ఉన్నప్పుడే అంటే 19ఏళ్లకే వ్యాపారంలో అడుగు పెట్టారు. ఇంజనీరింగ్ విద్యార్థులు పుస్తకాలు కొనడానికి, అమ్మడానికి వీలుగా ఈ-కామర్స్ కంపెనీని స్థాపించారు. ఆ రోజులను ఆయన గుర్తుచేసుకుంటూ … 2009లో ఆ కంపెనీ ‘ఎకనామిక్ టైమ్స్’ అవార్డుకు ఎంపికైందని చెప్పారు.

“నా జీవితంలో తొలిసారిగా రెండు పదాలు విన్నాను – ‘ఎలివేటర్ పిచ్’, ‘బిజినెస్ ప్లాన్’. నాకింకా గుర్తుంది, మేము ఈవెంట్ అటెండ్ చేయడానికి వెళ్లినప్పుడు అక్కడి గార్డు మమ్మల్ని చూసి బిజినెస్‌మెన్ అనుకోలేదు, కాలేజీ పిల్లలనుకున్నాడు,” అని చెప్పారు ధైర్య. అనుకోకుండా ఆ కంపెనీలో కోర్ టీంగా ఉన్నవారంతా అమెరికాకు ఎగిరిపోగా … దురదృష్టవశాత్తు కంపెనీ షట్ డౌన్ అయ్యింది.

ఈ కామర్స్ సెటప్ ఫెయిల్ అవ్వడానికి తన పాత్ర ఉందని చెప్పే ధైర్య, ఆ ఘటన నేడు అమెరికాలో తనకెంతో ఉపయోగపడుతోందని చెబుతారు. సమర్థవంతమైన పెట్టుబడిదారుల విషయంలో ఇప్పుడు తానెంతో జాగ్రత్తగా ఉంటున్నానని తెలిపారు. బిజినెస్‌లో తాను ఏమేం చేయకూడదో తెలుసుకున్నానని, ఆ మేరకు ప్రవర్తిస్తున్నానని. ఇటు ఇన్వెస్టర్లకు కూడా ఈ విషయం తెల్సునని, అందుకే వారు తనపై నమ్మకం పెట్టుకుంటారని చెప్పారు.

ఒకసారి స్టార్టప్ జర్నీ మొదలెట్టాక, తానిక 9-5 ఉద్యోగం చేయలేనని ధైర్యకు అర్థమైంది. మొదట్నించే తనలో ఒక వ్యాపారి దాగున్నాడని అర్థం చేసుకున్నారు.

ఈ సందర్భంలో ఆయన ఒక సంఘటన గుర్తుచేసుకున్నారు. ఓసారి ధైర్య వాళ్ల నాన్న ఒక ఐఐటి ఇంజనీర్‌ను ఒక పెద్ద అమెరికన్ కంపెనీ ఏడాదికి 75 లక్షల ప్యాకేజీకి తీసుకుందని చెప్పారు. ఆ సమయంలో ఎవ్వరికైనా అంత ఎక్కువ జీతం తమకు కూడా వస్తే బాగుండనిపిస్తుంది, కానీ ధైర్య బుర్రలో వేరే ఐడియానే మెదిలింది. “అప్పుడు నేను మా డాడీతో … నా లక్ష్యం అలాంటి ఓ పెద్ద కంపెనీని పెట్టాలని, మీరు చెప్పిన జీతం ఇచ్చి ఉద్యోగులను నేను పెట్టుకోవాలని,” ఉందని చెప్పాను.

image


డ్రెక్సెల్ నుంచి మొజాంబిక్

తొలిరోజే అమెరికాలో ఉద్యోగం వదిలేశాక, అతడి యూనివర్సిటీ అయిన డ్రెక్సెల్ యూనివర్సిటి ఫిలడెల్ఫియా డీన్‌ను ఆయన కలిశారు. అక్కడ తాను ఒక ఇంటర్నేషనల్ ప్రోగ్రాంను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అందుకు గాను తనకేం డబ్బులు ఇవ్వక్కర్లేదని, కేవలం తాను ఆ ప్రోగ్రాంను డెవలప్ చేయడంపై ఫోకస్ చేస్తానని ఆమెకు చెప్పారు.

ధైర్య తన కల నిజం చేసుకోవడానికి అతడి ఇంటర్నేషనల్ ప్రోగ్రాం ఎంతో దోహదపడింది. దీని ద్వారా ఆయనకు యునైటెడ్ నేషన్స్‌లో ఎంతోమంది పెట్టుబడిదారులతో పరిచయం అయ్యింది. ఓసారి న్యూయార్క్‌లో ఓ మీటింగ్ జరిగింది. అక్కడ ధైర్యకు పరిచయమైన ఒక ఇన్వెస్టర్ వల్ల ఆయన జీవితమే మారిపోయింది.

ఆ పెట్టుబడిదారుడు ధైర్యను సూటిగా ఇలా ప్రశ్నించారు, “నువ్వు 24ఏళ్ల కుర్రాడివి. ఈ వయసులో ఒక పెద్ద ప్రైవేట్ యూనివర్సిటికి ఇంటర్నేషనల్ ప్రోగ్రాం నడుపుతున్నావు, కానీ నువ్వు ఇంతవరకూ ఆఫ్రికాకే వెళ్లలేదు ? అంతర్జాతీయ ట్రిప్ పేరుతో అక్కడికి ట్రిప్ తీసుకెళతామని నువ్వు చెప్పే మాటలను నమ్మి నా పిల్లలను, డబ్బును ఎలా ఇవ్వగలను ?” అని.

ఈ ప్రశ్నకు సరైన సమాధానం తన వద్ద లేదని ధైర్యకు అర్థమైంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెల్సిందే. ధైర్య తన ప్రోగ్రాం కోసం ఇంటర్నేషనల్ సైట్‌గా ఆఫ్రికాలోని మొజాంబిక్ ఎంచుకున్నారు. ఇంగ్లీష్ మాట్లాడని, యుద్ధంతో అతలాకుతలమైన ఒక దేశాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. “నిజం చెప్పాలంటే అసలు ఆ ప్రాంతం ఎక్కడుందో మ్యాప్‌లో వెతకాల్సి వచ్చింది,” అని ఆ రోజులను గుర్తుచేసుకుంటారు. చూశారా .. జీవితంలో ఎప్పుడూ కూడా ఆయన ఆఫ్రికాకు వెళతానని అనుకోలేదు. కానీ వెళ్లారు.

మొజాంబిక్‌లో క్వాంబాగా

మొట్టమొదట ఆయనకు ఎదురైన సమస్య స్థానిక భాష. కొత్త ప్రాంతంలో భాష రాకపోవడం పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో ఆయన స్థానికులకు దగ్గరయ్యేందుకు భాష నేర్చుకోవడం ప్రారంభించారు. మొజాంబిక్‌లో స్థానిక సంఘంలో ఒక్కటయ్యేందుకు ఏకధాటిగా ఐదు నెలలపాటు ఎంతో కష్టపడ్డారు. అక్కడి కుగ్రామంలోని ఒక ఆసుపత్రిలో బయో మెడికల్ ఇంజనీర్‌గా చేరారు.

క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల్లో అత్యంత జటిలమైనది ఏంటంటే ఖరీదైన మెడికల్ ఎక్విప్‌మెంట్ వాడకం ఎలాగో తెలియకపోవడం. జనాలు ఆ కారణంగా వాటిని ఉపయోగించడం లేదని గుర్తించారు. అంతెందుకు 50,000 నుంచి 80,000 అమెరికన్ డాలర్ల విలువైన పరికరాలను కూడా పక్కనపెట్టేసినట్టు తెల్సుకున్నారు. దీంతో ఆయన స్థానికులకు వాటిపై అవగాహన కలిగించారు. షర్ట్ స్లీవ్స్‌ను పైకెత్తి తానే స్వయంగా ఆ పరికరాలను ఫిక్స్ చేయడం మొదలెట్టారు. అది చిన్న ఊరు కావడం, ఒకరికొకరు బాగా పరిచయం ఉండడంతో .. ఆఘమేఘాలమీద ఈ విషయం ఊరంతా పాకింది. అమెరికా నుంచి వచ్చిన భారత కుర్రాడు మెడికల్ పరికరాలను ఫిక్స్ చేస్తున్నాడన్న వార్త అందరికీ తెల్సింది.

“అలా నేను ఆన్-కాల్ రిపేర్ మ్యాన్‌ అయ్యాను. ఎవరి ఇంట్లోనైనా ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైతే, వెంటనే నన్ను పిలిచేవారు. అదో మరువలేని అనుభవం, ఆ సమయంలో నా క్వాలిఫికేషన్స్ ఎందుకూ పనికిరావు అనిపించింది. వారి ఊరిలో నివసిస్తున్న సాటివాడిగా వారు నన్ను ట్రీట్ చేయడం మొదలెట్టారు,” అని చెప్పారు ధైర్య. అతి త్వరలోనే వారిలో ఒకరిగా మారిపోవడమే కాదు, క్వాంబాగా ఆఫ్రికన్ పేరును పెట్టుకున్నారు.

image


మొజాంబిక్ లో TED టాక్ ఏర్పాటు

ఈ క్రమంలో ధైర్య మరో అడుగు ముందుకు వేశారు. మొజాంబిక్ లో తొట్టతొలిసారిగా TEDx కాన్ఫరెన్స్‌ను ఏర్పాటుచేయాలనుకున్నారు. ఇదో బ్రాండింగ్ ఎక్స్‌పీరియన్స్ కాదు. బాహ్య ప్రపంచానికి తెలియని, కేవలం స్థానికంగానే మిగిలిపోయిన ఎంతోమంది పెట్టుబడిదారులను, రీసెర్చర్లను ఒక్కచోటికి తేవడం తన కర్తవ్యం . “స్థానికులైన వీరంతా ఎంతో తెలివైనవారు, ఎక్స్‌ట్రాఆర్డీనరీ వ్యక్తులు. వీరందరికీ విదేశాల నుంచి ఎవరో వచ్చి ఏదో కొత్తగా నేర్పించాల్సిన అవసరం లేదు. వారికి కావాల్సిందల్లా వారు చేసిన పనిని నలుగురికి తెలియజెప్పడమే,” అని వివరించారు ఆయన.

ఇందుకు సంబంధించి న్యూయార్క్ లోని TED వారితో ధైర్య సంప్రదించగా, వారు 3000 అమెరికన్ డాలర్ల విలువైన పరికరాలను ఒక బాక్స్‌లో పంపించారు. అయితే అది కస్టమ్స్ చెకింగ్ దగ్గరే ఆగిపోయింది. అయినా ఈవెంట్ మాత్రం ఆగలేదు. “మేము కొబ్బరి, అరటి ఆకులతో ‘TED’ అన్న అక్షరాలను తయారుచేశాము. ఈవెంట్ కు వచ్చిన వారికి వాటర్ బాటిల్, పార్లే-జీ బిస్కట్లు ఇచ్చాం. ఈ ఈవెంట్ కవర్ చేయడానికి నేను స్థానిక ఫోటో స్టూడియోకు వెళ్లి కెమెరాను అడిగి తీసుకొచ్చాను. అలా ప్రతి ఒక్కటి స్థానికుల సాయంతో జరిగింది,” అని ఆయన ఆ రోజును గుర్తుచేసుకున్నారు.

డ్రెక్సెల్‌కు తిరుగుపయనం – Y సెంటర్ ఏర్పాటు

అటు మొజాంబిక్ లో నెలకొన్న సమస్యలపై ధైర్య దృష్టి పెట్టగా … ఇటు డ్రెక్సెల్ యూనివర్సిటిలోని ఇంటర్నేషనల్ ప్రోగ్రాం చిక్కుల్లో పడింది. ధైర్య తిరిగొచ్చే సమయానికి ఏకంగా మూతపడింది. దీనికంతటికి జవాబుదారితనం లేకపోవడమే కారణమని ఆయనకు అర్థమైంది.

ఈ ప్రోగ్రాం ప్రభావం ఎంత ఉందో తెలియదుగానీ, దీనివల్ల ధైర్యలో ఒక వ్యాపారి పుట్టాడు. అటువంటి కార్యక్రమాలకు జవాబుదారీగా ఉండేందుకు ఆయన Y సెంటర్ ను ప్రారంభించారు. అందరినీ ప్రభావితం చేసేందుకు పుట్టిన Y సెంటర్ … విద్యార్థులను విదేశాలకు తీసుకెళుతుంది.

మలేరియా, ప్రెగ్నెన్సీకి ఎస్సెమ్మెస్ యాప్

Y సెంటర్ ఏర్పాటుచేశాక, మలేరియాతో కొట్టుమిట్టాడుతున్న మొజాంబిక్ ని కాపాడేందుకు అక్కడికి వెళ్లాలని ఆయన భావించారు. అప్పడికే ఆయన చికిత్స అవసరమైన వ్యాధిగ్రస్తుల కోసం SMS యాప్ తయారుచేశారు. అంతర్జాతీయ సమాజం అందిస్తున్న ఆర్థిక సాయం వల్ల అందరూ ఉచితంగా మెడికల్ టెస్టులు, ట్రీట్‌మెంట్ చేయించుకోవచ్చని ఆయన స్థానికులకు తెలియజెప్పారు. కేవలం వారు ఆసుపత్రికి వెళ్తే చాలని వివరించారు. కానీ నిరక్షరాస్యత, అవగాహన లేకపోవడం, మెడికల్ సెంటర్స్ దూరంగా ఉండడంతో ఎవ్వరూ ఆసుపత్రికి వెళ్లేందుకు ముందుకు రావట్లేదని తెల్సుకున్నారు.

“వారు ఇంటి వైద్యాన్నే నమ్ముకునేవారు, మలేరియా గురించే వారికి తెలియదు. దీంతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండేది. వారి దగ్గర ఉన్న దాని సాయంతోనే ఈ సమస్యకు ఓ పరిష్కారాన్ని చూపాలనుకున్నాను. ఓసారి ఒకతను నాకు మాట్లాడుతూ చెప్పాడు .. మొజాంబిక్ లో ఏది ఉన్నా లేకున్నా మూడు మాత్రం కచ్చితంగా ఉంటాయని అవి – సెల్ ఫోన్, కోకో-కోలా క్యాన్, దేవుడిపై నమ్మకం. దురదృష్టవశాత్తు అక్కడ తాగేందుకు నీళ్లు లేకపోయినా … ఎక్కడపడితే అక్కడ కోకో-కోలో మాత్రం దొరుకుతుంది,” అని ధైర్య బాధపడ్డారు.

ఎలాగూ సెల్ ఫోన్ ఉంది కాబట్టి, ధైర్య చేయాల్సిందల్లా ఒక యాప్ తయారుచేయడమే. అది నోకియా పాత సెల్ ఫోన్ లో ఉండే స్నేక్ గేమ్ ని పోలి ఉంటుందని ఆయన చెప్పారు. ఊళ్లో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే తమ ఆరోగ్యం బాగాలేదని, ఈ యాప్ సాయంతో క్లౌడ్ సర్వీసెస్ ద్వారా ఆసుపత్రికి కనెక్ట్ అయిన సంబంధిత నెంబర్ కు సమాచారం ఇవ్వొచ్చు. అలా ఈ సమాచారం అందుకునే వివిధ కమ్యూనిటి హెల్త్ వర్కర్స్ వెంటనే ఆ పేషంట్ వద్దకు చేరుకుంటారు.

తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవి రాకుండా చర్యలు చేపట్టిన యునైటెడ్ నేషన్స్‌కి ప్రస్తుతం ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతోంది. మొజాంబిక్ లో నెలకొన్న పరిస్థితులు, అపోహల వల్ల అక్కడ హెచ్ ఐవి సోకిన గర్భిణీలు దాన్ని అత్యంత రహస్యంగా ఉంచుతారు. “వారిలో ఎక్కువమంది టీనేజ్ అమ్మాయిలే, దీంతో వారు తాము గర్భవతులమని బయటికి చెప్పేందుకే ఇష్టపడరు.. ఎప్పుడైతే ఈ విషయం నలుగురికీ తెలుస్తుందో, అప్పుడేదైనా వైద్య సాయం అందించాలంటే అప్పటికే చాలా ఆలస్యం అయిపోతుంది,” అని తెలిపారు ధైర్య.

image


భవిష్యత్తు

Y సెంటర్ ప్రస్తుతం మొజాంబిక్ లోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలతో చేతులు కలిపింది. నాలుగు అమెరికన్ యూనివర్సిటీలతో పనిచూస్తూ ఈ ప్రోగ్రామ్ సాయంతో విద్యార్థులను ఆఫ్రికాకు పంపుతోంది.

ఫిలడెల్ఫియాలోని వరల్డ్ ఎకనామిక్ ఫారమ్ చాప్టర్ లో ధైర్య ఒకరు. 2014లో దక్షిణ కొరియాలో జరిగిన సోషల్ ఎంటర్ ప్రైజ్ వరల్డ్ ఫారమ్ లో ప్రసంగించాల్సిందిగా ఆయనకు ఆహ్వానం వచ్చింది.

ఫిలడెల్ఫియా, న్యూయార్క్ కు చెందిన యూనివర్సిటిలలో 25 ప్రసంగాలు, సెమినార్లు చేశారు. మైక్రోసాఫ్ట్ తో పాటుగా నగర వ్యాప్తంగా హ్యాకథాన్ నిర్వహించారు. యునైటెడ్ నేషన్స్, అమెరికాలోని టాప్ ఆర్గనైజేషన్ మెంబర్స్ తో ఆయన ఒక అడ్వైజరీ బోర్డును ఏర్పాటుచేశారు.

ఫిలడెల్ఫియా బిజినెస్ జర్నర్ లో ధైర్య ఫీచర్ కవర్ పేజ్ పై వచ్చింది. కేవలం అసాధారణ శక్తి సామర్థ్యాలు ఉన్న వారికే పరిమితమైన O1A వీసాను .. 2015లో అమెరికా ధైర్యకు ఇచ్చి సత్కరించింది.

 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • WhatsApp Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • WhatsApp Icon
 • Share on
  close
  Report an issue
  Authors

  Related Tags