విధి వెక్కిరించినా సాకర్ తో పేదరికం పై సమరం
ఫ్రాంకో. టఫ్ట్ లో గ్రాడ్యుయేషన్ మరో నెలలో పూర్తవుతుందనగా ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు. మధ్యాహ్నం జరిగే పికప్ గేం లో ఆడతావా అని ఫోన్ సారాశం. చదువంటే ఎంత పట్టుదలగా ఉంటాడో, సాకర్ అంటే అంతే అభిమానిస్తాడు. అందుకే ఆటను మిస్ కాదలచుకోలేదు. ఠక్కున ఒప్పేసుకున్నాడు. అయితే ఆ గేమ్ ఫ్రాంకో జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసింది. ఇంతకూ ఆ ఆటలో ఏం జరిగింది? తర్వాత ఏం చేశాడు?
అప్పటికే 15 ఏళ్లుగా సాకర్ ఆడుతూనే ఉన్నాడు. కానీ ఎందుకో ఆ రోజు ఆట తన జీవితాన్నే మార్చేసింది. బంతిని కిక్ చేయగానే కాలు కలుక్కుమంది. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. లేవాలంటే వల్ల కావడం లేదు. డాక్టరే ఆశ్చర్యపోయాడు. అలాంటి గాయాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నాడు. మోకాలు డిస్ లొకేట్ అయింది. పూర్తిగా వంగిపోయింది. ACL (Anterior Cruciate Ligament), MCL, LCL, Strained PCL (Posterior Cruciate Ligament) ఫలితంగా మోకాలే లేకుండా పోయింది.
ఏ కాలుతో అయితే జీవితాన్ని ఏలాలి అనుకున్నాడోె ఆ కాలే లేకుండా పోయింది. శారీరకంగా, మానసికంగా కుంగిపోయాడు. జీవితం గందరగోళంలో పడింది. మెడికల్ అడ్మిషన్ ప్రాసెస్ అటకెక్కింది. ఒకపక్క పెయిన్ కిల్లర్లు, మరోపక్క రికవరీ థెరపీ. గ్రాడ్యుయేషన్ పూర్తవడానికి టైం పట్టింది. మెడిసిన్ లేటైతే లేటయింది. కానీ ఆటకు శాశ్వతంగా దూరమయ్యాడు. ఈ బాధ ఫ్రాంకో మనసులో ఎక్కువైంది.
రెండు నెలలకు సర్జరీ పూర్తయింది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. మెడికల్ స్కూల్లో అప్లయ్ చేసుకోడానికి ఏడాది టైముంది. ఆ సమయంలో మంచి పుస్తకాలు ముందేసుకున్నాడు. గొప్ప వాళ్లని కలుసుకున్నాడు. అప్పుడే అనిపించింది. కెరీర్ కోసం కాకుండా, ఒక మిషన్ కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. సోషల్ ఎంట్రప్రెన్యూర్షిప్ మీదకి మనసు మళ్లింది. ప్రజల్లో ఒక పాజిటివ్ చేంజ్ తీసుకురావాలనుకున్నాడు.
కిజజికి శ్రీకారం
సాకర్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానాన్ని కలుపుకుని, పేదరికాన్ని రూపమాపాలనేది అతని సంకల్పం. సాకర్ కు 3.5 బిలియన్ల అభిమానులు ఉన్నారు. వారందరినీ ఏకం చేసి, పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించాడు. సాకర్ లో తాను అభిమానించే గొప్పవారిలో చాలామంది పేదరికాన్ని అనుభవించినవారే. అందుకే సమస్యను అర్థం చేసుకుంటారని భావించాడు. అలా ఫ్రాంకో, కిజజికి శ్రీకారం చుట్టారు. స్వాహిలి భాషలో కిజజి అంటే జనరేషన్ అని అర్థం.
కిజజి మోడల్
కొన్ని వారాల పాటు అధ్యయనం చేసిన తర్వాత, పేదవారికి అవసరమైన బట్టలు, ఆహారం లాంటివి ఇస్తే- అవి తాత్కాలికంగా మాత్రమే పనికొస్తాయి. అది పేదరికం పై పోరాటం చేయడానికి ఎందుకూ పనికిరాదు. సమస్య గురించి తెలుసుకోవడానికి ఇలాంటి సహాయం ఉపయోగపడుతుందే తప్ప, శాశ్వతంగా పరిష్కరించలేం. పైగా దాంతో లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుంది. ఫ్రాంకో ఆ విషయాన్ని మెల్లిగా తెలుసుకున్నాడు. అందుకే ప్రత్యామ్నాయాలపై రీసెర్చ్ చేశాడు. మెక్రో క్రెడిట్స్ ద్వారా ఎకనామిక్ ఎంపర్మెంట్ కోసం కృషి చేస్తున్న మహమ్మద్ యూనిస్ గురించి తెలుసుకున్నాడు.
పేదరికంపై పోరాటం
కిజజి ఉత్పత్తుల్ని అమ్మడం ద్వారా వచ్చిన మొత్తంలో కొంత భాగాన్ని, ప్రపంచ వ్యాప్తంగా మైక్రో ఫైనాన్స్ ద్వారా లోన్స్ ఇవ్వడానికి ఉపయోగించాలని నిర్ణయించారు. లోన్ రీపే చేసిన ప్రతీసారి, మరో కొత్త వ్యక్తికి దాన్నిఇస్తారు. ఇలా చేయడం వల్ల ఏర్పాటు చేసుకున్న ఫండ్ ఖర్చు కాకుండా, రీసైకిల్ అవుతుంది. ఇక అమ్మకాలతో పాటే ఫండ్ కూడా డెవలప్ అవుతుంది" అని చెప్తున్నారు ఫ్రాంకో. ఫిలిప్పైన్స్, కెన్యా, బొలీవియా, ఎల్ సాల్వడార్, మాలి, అజర్ బైజన్ లో మైక్రొ లోన్స్ ఇస్తోంది కిజజి. ఇది ఫెయిర్ ట్రేడ్ సర్టిఫైడ్ కంపెనీ.
ఆటుపోట్లు
సోషల్ ఎంట్రప్రెన్యూర్షిప్ అంత సులభం కాదు. అనుకున్న వెంటనే పాజిటివ్ ఇంపాక్ట్ కనిపించదు. ప్రతీ సమస్య- చుట్టు పక్కల ఉన్న ఇతర పరిస్థితులతో ముడిపడి సంక్లిష్టంగా తయారవుతుంది. దీంతో తక్కువ సమయంలో అనుకున్న లక్ష్యాలను చేరడం కష్టం. సోషల్ వెంచర్ మిషన్ ను ప్రారంభించేటపుడు, చెప్పాలనుకున్న మెసేజ్ ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. నేను దాన్ని గ్రహించాను అంటున్నారు ఫ్రాంకో. ఇక ఆర్ధిక పరమైన నిర్ణయాలు తీసుకోవడం, లాభాలకు, అది చూపించే ప్రభావానికి మధ్య బాలెన్స్ చేయడం మరో సవాల్. సోషల్ ఎంట్రప్రెన్యూర్ షిప్ లో ఇది నిరంతరం జరిగే యుద్ధంలా ఉంటుంది" అంటారు ఫ్రాంకో.
నిత్యం పోరాటమే
తమ ప్రాజెక్ట్ మరే ఇతర ప్రాజెక్ట్ లా కేవలం చారిటీగా భావించొద్దని ఫ్రాంక్ అంటారు. "మా ప్రొడక్ట్స్ తో ఆడుకుంటున్నవారు కేవలం ఆడుతున్నాం అన్న భావనతో కాకుండా, ఒక కాజ్ కోసం వాళ్లు మా ప్రొడక్ట్స్ కొన్న ఫీల్ కావాలి. అందుకోసం మేము బాల్ ను అమ్ముకోవడం కాకుండా, ఒక్కొక్కరి స్టోరీని అమ్ముతున్నట్టుగా, బ్రాండ్ ను సెల్ చేస్తున్నట్టుగా ఫీలవుతాం" అంటున్నారు ఫ్రాంక్.
నిజమే కిజజి కేవలం ఫ్రాంకో డ్రీం ప్రాజెక్టే కావొచ్చు. ప్రస్తుతం అదొక విత్తనమే కావచ్చు. రేపు అది పెరిగి పెద్దదై వటవృక్షంలా మారుతుంది. అదే ధీమాతో ఉన్నాడు ఫ్రాంక్.