గిఫ్టుల మార్కెట్లో కిటుకులు పట్టాడు..‍! 22 ఏళ్లకే ఆంట్రప్రెన్యూర్ అయ్యాడు..!!

తొలి ఏడాదే ఏడాదే రూ.34 లక్షల రెవిన్యూ సాధించిన హ్యాండ్ మేడ్ జంక్షన్

11th Apr 2016
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close


30ఏళ్లకే అనితరసాధ్య విజయాలు సాధించిన 45 మంది అంట్రపెన్యూర్లు...

ఫోర్బ్స్ పత్రికలో ఈ శీర్షికతో వచ్చిన ఆర్టికల్ లో అందరిలోకెల్లా ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు సమన్ పాహ్వా. ఎలాంటి బిజినెస్ బ్యాక్ గ్రౌండ్ లేదు. ఇంటి దగ్గర నుంచి ప్రొత్సాహం అంతంతమత్రం. కేవలం తన సొంత సేవింగ్స్ తో స్టార్టప్ ప్రారంభించాడు. ఏడాదిలోనే రూ.34 లక్షల రెవిన్యూ సాధించాడు.

ఇంతకీ ఎవరీ సమన్ పాహ్వా..?

"హ్యాండ్ మేడ్ జంక్షన్" ఫౌండర్

ఏం చేస్తుంది హ్యాండ్ మేడ్ జంక్షన్..?

గిఫ్టులు ఇస్తుంది.. తయారుచేసి ఇస్తుంది.

ఈ మాత్రం దానికే పొంగిపోవాలా..?

అవును మరి... ఏదో రెడీమేడ్ గా ఉన్నవి అమ్మడమంటే ఏదో అనుకోవచ్చు. కస్టమర్ల మనసుకు నచ్చేలా గిఫ్టులు తయారు చేసి ఇవ్వడమంటే సమ్ థింగ్ డిఫరెంటే కదా. గిఫ్టు తయారవుతున్న ప్రతి దశలోనూ వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. చివరికి వారి మనసులూ గెల్చుకుంటారు.

ఎలా మొదలైందీ సక్సెస్ స్టోరీ..?

సమన్ పాహ్వా ఢిల్లీలోని గురుగోవింద్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యార్థి. కాలేజీ రోజుల నుంచే తనకు అంట్రప్రెన్యూర్ అవ్వాలనే యాంబిషన్ ఉండేది. దానికి ఏం చేయాలా అని తెగ ఆలోచించి- చివరికి హ్యాండ్ మేడ్ జంక్షన్ పేరుతో ఫేస్ బుక్ పేజీనే పెట్టుబడిగా పెట్టాడు. అందులో తను స్వయంగా డిజైన్ చేసిన గిఫ్ట్ ఆర్టికల్స్ ను అమ్మకానికి ఉంచాడు. తన ఆర్టికల్స్ తో ఢిల్లీ యూనివర్శిటీలో స్టాల్స్ కూడా ఏర్పాటు చేశాడు. ఫేస్ బుక్ ద్వారా అమ్మకాలు, కొనుగోలు చేసిన మిత్రుల ఫీడ్ బ్యాక్, అంతకు మించి అంట్రప్రెన్యూర్ గా మారాలనే యాంబిషన్... ఆ ప్రయత్నాన్ని తర్వాత స్టేజ్ కి తీసుకెళ్లాయి.

చదువయిపోయిన వెంటనే... గుర్గావ్ లో ఓ మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. చేరిపోయాడు. కానీ మనసంతా తన హ్యాండ్ మేడ్ జంక్షన్ పైనే ఉండేది. అందుకే ఎక్కువ కాలం జాబ్ చేయలేకపోయాడు. వెంటనే రిజైన్ చేసి హ్యాండ్ మేడ్ జంక్షన్ పై పూర్తి సమయం కేటాయించాడు. మొదట్లో తన వ్యాపారాన్ని ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం Zepo నుంచి సాగించాడు. Zepo మౌలిక సదుపాయాలు లేని ఈ కామర్స్ కంపెనీలకు తన సైట్ ద్వారా అన్ని సౌకర్యాలు సమకూర్చిపెడుతుంది. లాజిస్టిక్స్ సంస్థ ఫెడ్ ఎక్స్ తో ఒప్పందం చేసుకోవడం స్టోరీలో కీలక మలుపు. అలా 2015 ఏప్రిల్ లో తన హ్యాండ్ మేడ్ జంక్షన్ తో అంట్రప్రెన్యూర్ జర్నీ ప్రారంభించాడు సమన్ పాహ్వా. ఎమ్మెన్సీలోనే పనిచేస్తున్న సమన్ సోదరుడు సిమ్రన్ జిత్ సింగ్ కూడా లక్ష రూపాయల పెట్టుబడితో వచ్చి జాయినయ్యాడు. తర్వాత పూర్తి స్థాయిలో ముందడుగు వేశారు.

సోదరునితో సమన్ పాహ్వా<br>

సోదరునితో సమన్ పాహ్వా


పర్సనలైజ్డ్ గిఫ్టుల స్పెషలిస్ట్

గిఫ్టులు సిద్ధం చేయడంలో హ్యాండ్ మేడ్ జంక్షన్ ది ఎవరూ అనుకరించలేని శైలి. పూర్తిగా కస్టమర్ వ్యక్తిగత అభిరుచులకు ప్రాధాన్యం ఇస్తారు. గిఫ్ట్ తయారీ కోసం కస్టమర్ ఆన్ లైన్ లో ఆర్డర్ చేసినప్పటి నుంచి .. ప్రతీ దశలోనే మెయిల్స్ ద్వారా వారి అభిప్రాయాలు, ఆలోచనలు తెలుసుకుంటారు. వారు ఎవరి కోసం గిఫ్ట్ తీసుకుంటున్నారు.. వారిని మెచ్చేలా ఎలా సిద్దం చేయాలనేది మొత్తం సమన్ చూసుకుంటారు. వీరి గిఫ్టుల కేటలాగ్ లో రెండు వందల డిజైన్లు ఉన్నాయి. వాటిని కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తూంటారు. ప్రైస్ రేంజ్ రూ.300 నుంచి రూ.3,900 వరకు ఉంటుంది. ఇందులో 30 నుంచి 40 శాతం మార్జిన్- హ్యాండ్ మేడ్ జంక్షన్ కు మిగులుతుంది. గిఫ్టుల మెటీరియల్స్ సరఫరా చేసేందుకు ఎనిమిది మందితో ఒప్పందం చేసుకున్నారు. డిజిటల్ ప్రింటింగ్, లేజర్ ఎన్గేరేవింగ్ కోసం మరో ఇద్దరితో కలసి పనిచేస్తున్నారు. మొత్తం ఐదుగురితో ఇప్పుడు హ్యాండ్ మేడ్ జంక్షన్ నడుస్తోంది. ప్యాకింగ్ కి ఒకరు, ఢిల్లీ లోకల్ డెలివరికి ఒకరు, ప్రొడక్ట్స్ డిజైనింగ్ కోసం మరొకరు టీంలో ఉన్నారు.

" మాకు సొంత కార్పెంటర్ ఉన్నాడు. ఉడెన్ ల్యాంప్స్ కోసం చైనా నుంచి అక్రాలిక్ పైప్స్ ను దిగుమతి చేసుకుంటున్నాం. ప్రింటింగ్ కోసం కేనన్ ఫ్రాంఛైజీ స్టోర్ తో ఒప్పందం చేసుకున్నాం" సమన్ పాహ్వా

  స్టార్టప్ పట్ల వీరికి ఉన్న పట్టుదల ఫలితాలు వెంటనే లభించేలా చేసింది. ఏడాదిన్నర కాలంలోనే నాలుగు వేల ఆర్డర్స్ డెలివరీ చేశారు. నెలకు 8 వేల నుంచి 9 వేల వరకు యూనిక్ విజిటర్స్ సైట్ కు వస్తున్నారు. ఆర్డర్స్ లో ప్రతి నెలా పదిశాతం పెరుగుదల కనిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం రూ.34 లక్షల రెవిన్యూ నమోదు చేసింది. ఢిల్లీ నుంచే కాకుండా.. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నుంచి కూడా ఆర్డర్లు లభిస్తున్నాయి. వీరు తమ సొంత వెబ్ సైట్ నుంచే కాకుండా.. గివ్ టెర్, గిఫ్టింగ్ నేషనల్, గిఫ్ట్ విల్లా, క్రాఫ్ట్స్ విల్లా, షాపోఆప్ లాంటి ఇతర ఆన్ లైన్ మార్కెట్ ప్లేసుల ద్వారా కూడా అమ్మకాలు సాగిస్తున్నారు. 

ఊరిస్తున్న మార్కెట్

టెక్నోపాక్ అంచనా ప్రకారం.. ఇండియా గిఫ్టింగ్ మార్కెట్ 40 నుంచి 42 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. కార్పొరేట్ గిఫ్టింగులు వీటిలో కీలక భాగం ఆక్రమించే అవకాశాలున్నాయి. ఈ మార్కెట్ ఇరవై నుంచి నలభై శాతం పెరుగుదల నమోదు చేస్తోంది. మార్కెట్ ను అందిపుచ్చుకునే లక్ష్యంతో హ్యాండ్ మేడ్ జంక్షన్ కూడా భారీ ప్రణాళికలతో ముందుకెళుతోంది. నెలకు లక్ష విజిటర్స్ ను సాధించాలనే పట్టుదలతో ఉంది. అలాగే అన్ని రకాల వయసుల వాళ్లకి నచ్చేలా గిఫ్టుల డిజైన్లు పెంచాలనుకున్నారు. ఇప్పటికైతే స్టార్టప్ లాభాల్లో ఉంది. మరింత విస్తరించేందుకు కొంతమంది ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే యాప్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. పిన్ టెరెస్ట్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా కూడా ఆర్డర్ రిక్వెస్ట్ లు చేసేలా ప్రయత్నిస్తున్నారు.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close
Report an issue
Authors

Related Tags

Latest

Updates from around the world

Our Partner Events

Hustle across India