మిమ్మల్ని హాపీగా ఉంచాలన్నదే ఈ స్టార్టప్ లక్ష్యం
ప్రపంచం నలుమూలలకు విస్తరిస్తున్న భారతీయుల స్టార్టప్
ఆనందం అంటే ...
ఇష్టమైన గాడ్జెట్ కొనుక్కోవడం...!
ఆనందం అంటే ...
రయ్యిన దూసుకోపోయే కారుకు ఓనర్ కావడం..!
ఆనందం అంటే ...
లగ్జరీ బ్రాండ్స్ సొంతం చేసుకోవడం.. !
ఇదేనా ఆనందం..! ... ఎవరికైనా ఒక్కసారి ఆలోచిస్తే ఇవి క్షణికానందాలే. వాటిని సొంతం చేసుకున్నప్పుడు ఉన్న హ్యాపీనెస్ తర్వాత గుర్తు చేసుకున్నప్పుడు ఉండదు. పైగా ఊసూరుమంటాం.. ఎందుకంటే.. మనకు దక్కని ఆనందం కన్నా.. పెట్టిన సొమ్మే ఎక్కువని. తర్వాత అనిపిస్తుంది మరి..!
కానీ నిజమైన ఆనందాలు.. ఎప్పుడు గుర్తు చేసుకున్నా మనసు తేలికపడే క్షణాలు... మధురానుభవాలు వేరే ఉంటాయి.
స్నేహితులతో ఇష్టమైన ప్రదేశంలో ఉల్లాసంగా ఉత్సాహంగా గడపడం..!
ఉద్యోగ, వ్యాపార ఒత్తిళ్లకు దూరంగా కుటుంబంతో టైమ్ స్పెండ్ చేయడం..!
భార్యతో సుందరమైన ప్రదేశాల్లో ఏకాంతంగా గడపడం..!
అలాగే మనసులో తీరకుండా ఉన్న చిన్న చిన్న కోరికలను తీర్చుకున్నప్పుడు కలిగే ఆనందం..
తర్వాత అవి గుర్తుకొచ్చినప్పుడు కలిగే అనుభూతి అనిర్వచనీయం.
ఇలాంటి జ్ఞాపకాలను మనం ప్లాన్ చేసుకోలేం.. వాటికంతటికి అవి రావాల్సిందే అనుకుంటాం మనం.
కానీ మేం తెప్పిస్తాం అంటున్నారు.. "హెడ్ అవుట్" బృందం.
ఇష్టమైన వస్తువులు కొనడం కన్నా.. ఓ వారం ఆనందంగా గడపడమే.. నేటి యువతకు ఇష్టంగా మారింది. కొత్త జనరేషన్ లో మారుతున్న అభిరుచులకు ఇది దర్పణంగా నిలుస్తోంది. ఈవెంట్ బ్రైట్ సంస్థ ఇటీవల చేసిన సర్వే ప్రకారం యువతలో 78 శాతం మంది ఫిజికల్ గూడ్స్ కొనడం కన్నా.. ఈవెంట్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. ఇలాంటి యువతరం ఆలోచనలకు తగ్గట్లుగా వారి ఆనందాలను సృష్టించే లక్ష్యంతో ఏర్పడిన స్టార్టప్ హెడ్ అవుట్.
మీరు ఎక్కడికెళ్లినా ఏదీ ప్లాన్ చేసుకోకపోయినా చివరి క్షణంలో మీ ఈవెంట్ ను ఖరారు చేసే ఆన్ డిమాండ్ టూర్స్, యాక్టివిటీస్, ఎక్స్ పీరియన్సెస్ ఫ్లాట్ ఫామే హెడ్ అవుట్. గత ఆరు నెలల్లో ఈ స్టార్టప్ పదహారు రెట్ల వృద్ధిని నమోదు చేసిందంటే... విజయం పీఎస్ఎల్వీ వేగంతో సాగిపోతోందని ఈజీగా అర్థం చేసుకోవచ్చు.
ఆనందాన్ని అన్వేషించండి హెడ్ అవుట్ తో..!
ప్రపంచంలో ఏదైనా ప్రముఖ నగరంలోకి వెళ్లినప్పుడు అక్కడ ఉండే వింతలు, విశేషాలు, ప్రదర్శనలు ఇలా ఎన్నో అంశాలు ఉంటాయి. వాటి గురించి పర్యాటకులకు తెలిసేది అంతంత మాత్రమే. టూరిజం ఆపరేటర్లు ఇచ్చే సమాచారం అరకొరే. అదే సొంతంగా వెళ్తే నెట్ మీద ఆధారపడాల్సిందే. ఇంటర్నెట్ లో సమాచారం దొరుకుతుందేమో కానీ.. అక్కడి వెళ్లడం.. టిక్కెట్లు బుక్ చేసుకోవడం.. మొత్తం తెలుసుకోవడం.. పెద్ద తలనొప్పి వ్యవహారం. ఈ బాధలన్నింటినీ ఒక్క క్లిక్ తో తీసిపడేసే యాప్ "హెడ్ అవుట్". ప్రఖ్యాత నగరాల్లో ఉండే ప్రజలకు కూడా అక్కడ టూరిస్ట్ ప్లేసులకు, ప్రదర్శనలకు వెళ్లడం ఓ ప్రహసనమే. వారికి కూడా ఈ హెడ్ అవుట్ మంచి ఒక్క క్లిక్ తో పనిచేసి పెడుతుంది. అంతే కాదు ధరల విషయంలోనూ పాజిటివ్ గా ఉంటుంది. ఆయా నగరాల్లో ఉండే సర్వీస్ ప్రొవైడర్స్, వ్యాపారస్తులను ఒకేవేదిక మీదకు తెచ్చి సులువైన, హ్యాపీ సర్వీస్ ను హెడ్ అవుట్ అందిస్తోంది. అందుకే డిమాండ్ కు తగ్గట్లుగా ధరలు కూడా మారేలా ఏర్పాటు చేశారు. పెద్దగా రష్ లేనప్పుడు సగానికంటే తక్కువ ధరకే ఆయా ప్రాంతాల్లో మధురానుభూతులు పొంది రావొచ్చు.
డిజాస్టర్ తో ప్రారంభం
హెడ్ అవుట్ స్టార్టప్ డ్రీమ్ రన్ కావొచ్చు. కానీ ఫౌండర్లు మాత్రం ఓ డిజాస్టర్ తో ప్రారంభించారు. వరుణ్ కోనా, విక్రమ్ జీత్ సింగ్, సురేన్ సుల్తానియా ఈ ముగ్గురూ మొదటి నుంచి మిత్రులు. కొత్తగా ఏదైనా చేయాలనే తపన వీరిలో కామన్ గా ఇంట్రెస్ట్. వీరి దృష్టి ఎక్కువగా మంచి ప్రదేశాలు, ఈవెంట్లు లాంటి వాటి మీదే ఉండేది. అందుకే 2013లో "టూర్ లాండిష్" అనే స్టార్టప్ ను ప్రారంభించారు. ఓసారి ఈ ముగ్గురు యూరప్ ట్రిప్ లో ఉన్నప్పుడు దీని ప్రారంభించారు. కానీ సరైన ప్రణాళిక లేకపోవడంతో ఆ యూరప్ టూర్ లానే "టూర్ లాండిష్" కూడా టేకాఫ్ అవగానే ఆగిపోయింది. ఈ అనుభవంతో వారు నిరాశపడినా... వెనక్కి తగ్గలేదు. మరింత కసరత్తు చేసి అమెరికా కేంద్రంగా 2014లో "హెడ్ అవుట్" ను లాంఛ్ చేశారు.
మొదట ఐదుగురితో ప్రారంభమైన ఈ స్టార్టప్ ఏడాదిన్నర తర్వాత బాగా డెవలప్ అయింది. ఇందులో ఇప్పుడు 30 మంది నిపుణులు పనిచేస్తున్నారు. అంతేకాదు అమెరికాలోని శాన్ ప్రాన్సిస్కో తో పాటు బెంగళూరు, దుబాయ్ లో కార్యాలయాలు ఉన్నాయి. బెంగళూరు కార్యాలయంలో ఇంజినీరింగ్, ఆపరేషన్స్ ను పర్యవేక్షిస్తుంది. దుబాయ్. శాన్ ఫ్రానిస్కో ఆఫీసులు మార్కెటింగ్, సేల్స్, బిజినెస్ డెవలప్ మెంట్ కార్యకలాపాలు నిర్వహిస్తూంటాయి. హెడ్ అవుట్ ప్రారంభించిన ఎనిమిది నెలల్లోనే అంటే ఏప్రిల్ 2015లోనే 1.8మిలియన్ డాలర్ల సీడ్ రౌండ్ ఫండింగ్ ను పొందారు. ఓలెక్స్, స్నాప్ డీల్, వాట్సాప్ లాంటి సంస్థల ఫౌండర్లు, ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు వ్యక్తిగతంగా ఫండింగ్ చేయడంతో పాటు, అమెరికాలో ఇన్వెస్టింగ్ సంస్థలైన వెర్షన్ వన్ వెంచర్స్, 500 స్టార్టప్స్, నెక్సస్ వెంచర్స్ పార్ట్ నర్స్, అరెనా వెంచర్స్ ఫండింగ్ అందించిన వారి జాబితాలో ఉన్నాయి.
విస్త్రతమైన పరిశోధన
మొదట్లో అమెరికాలోని ఒక్క సిటీతో ప్రారంభించినా... ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పది ప్రధాన నగరాల్లో సేవలు రన్ అవుతున్నాయి. ప్రతి నగరంలోనూ అడుగుపెట్టే ముందు అక్కడి ప్రజలు, పర్యాటకుల అభిప్రాయాలు, సర్వీస్ ప్రొవైడర్ల స్థితిగతులను అంచనా వేయడానికి విస్త్రతంగా సర్వేలు చేశారు. అందరితో మాట్లాడి అభిప్రాయాలు సేకరించిన తర్వాతే ముందడుగు వేశారు. ప్రతి నగరంలోనూ ఒక్కో రకమైన పరిస్థితులు ఉంటాయని వారికి అప్పుడే అర్థమైంది. వాటిని సవాళ్లుగా తీసుకుని ముందడుగు వేయడానికి సిద్ధమైపోయారు. ఉదాహరణకు దుబాయ్ లో వెండార్స్ మరీ అంత టెక్ సావీ కాదు. దాంతో వారు బుకింగ్స్ ను ఎస్సెమ్మెస్, ఈమెయిల్స్, ఫోన్ ద్వారా చేసే అవకాశం కల్పించారు. మామూలుగా అయితే యాప్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవచ్చు. కానీ దుబాయ్ లో పరిస్థితులను బట్టి పద్దతుల్ని కూడా మార్చుకున్నారు.
టెక్నాలజీ ఫ్రెండ్లీ వాతావరణం అంతకంతకూ పెరుగుతూండటం.. యువత కూడా వీటిపై పట్టు సాధించడంతో హెడ్ అవుట్ కు ప్లస్ అవుతోంది. మొబైల్ వెబ్, యాప్ ద్వారా హెడ్ అవుట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. పర్యాటకులతో పాటు ఆయా నగరాల్లోని స్థానికులు కూడా హెడ్ అవుట్ సేవలు వినియోగించుకుంటున్నారు.
సవాళ్లు కూడా ఉన్నాయి
ప్రస్తుతం హెడ్ అవుట్ రెండు ప్రధానమైన సవాళ్లు ఎదుర్కొంటోందని హెడ్ అవుట్ కో ఫౌండర్ వరుణ్ విశ్లేషిస్తున్నారు. సరైన నియామకాలు, కమ్యూనికేషన్ చానల్స్ ను ఎఫెక్టివ్ గా నిర్వహించడం అనేవే ఆ రెండు. ప్రస్తుతం హెడ్ అవుట్ బృందం ఈ రెండింటి మీద దృష్టి పెట్టింది. రాబోయే రోజుల్లో ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో పాగా వేయాలనుకుంటున్న వీరు.. అందుకు కావాల్సన ఎంప్లాయీస్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.
"చాలా స్టార్టప్ లు ముందు పని నడవడానికి ఎవరో ఒకర్ని నియమించుకుంటూ ఉంటాయి. కానీ మేము అలా చేయాలనుకోవడం లేదు. ఓ మంచి బృందాన్ని రూపొందించాలనుకుంటున్నాం. దీనికి ఉద్యోగుల సంఖ్య ఒక్కటే సరిపోదు. సామర్థ్యం కూడా ఉండాలి" వరుణ్, కో ఫౌండర్, హెడ్ అవుట్
హెడ్ అవుట్ విభిన్నమైన టైమ్ జోన్లతో ఉన్న నగరాల్లో సేవలు అందిస్తోంది. అందరితో ఒకేసారి కంపెనీ వ్యవహారాలపై చర్చించడం కొద్దిగా కష్టమైన పనే. అందుకే అన్ని నగరాల్లోని వారితో ప్రతి సోమవారం హెడ్ అవుట్ పేజ్ లోనే రౌండ్ టేబుల్ మీటింగ్ పెడతారు. అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఆలోచనలు పంచుకుంటారు. ఇంటర్నల్ ఈ మెయిల్స్ ద్వారా కన్నా.. ఫేస్ టు ఫేస్ మాటలు, ఫోన్ లో నేరుగా మాట్లాడటం ద్వారానే వీరు ఎక్కువగా కమ్యూనికేట్ చేసుకుంటారు.
భవిష్యత్ లక్ష్యాలు
వచ్చే ఆరు నెలల్లో యూరప్ , ఆసియాల్లోని పదిహేను ప్రధాన నగరాలకు విస్తరించేందుకు కసరత్తు ప్రారంభించారు. సింగపూర్, హాంకాంగ్, బ్యాంకాక్ లాంటి సిటీల్లో వీరు పని ప్రారంభించారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఇండియా మార్కెట్ పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు యూజర్స్ పర్సనలైజ్డ్ ఎక్స్ పీరియన్సెస్, ప్రిఫరెన్సెన్స్ ను విశ్లేషించుకుని తదుపరి సర్వీస్ వ్యూహాలు మార్చుకుంటున్నారు.
హెడ్ అవుట్ కు ప్లస్ పాయింట్ ఏమిటంటే.. ఇది ఆన్ డిమాండ్ సర్వీస్ బుకింగ్ యాప్. అంటే అప్పటికప్పుడు బుక్ చేసుకుని క్షణాల్లో వెళ్లిపోవచ్చు. ఆన్ డిమాండ్ సర్వీస్ విషయంలో ఓలా క్యాబ్స్ సృష్టిస్తున్న సంచనలం ఇప్పుడు అంతా ఇంతా కాదు. ఇప్పుడు టూరిజం కేటగిరిలో హెడ్ అవుట్ ఇలాంటి సంచనలమే నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది.
హెడవుట్ యాప్ ను ఇక్కడి నుంచి డౌన్ లోడ్ చేసుకోండి