సంకలనాలు
Telugu

ఖర్చులను అదుపులో ఉంచే ‘హ్యాపే’ కార్డ్

కొత్త సొల్యూషన్‌తో ముందుకొస్తోన్న హ్యాపేవీసా కార్డులతోనే ఖర్చులు, లావాదేవీలుఉద్యోగుల ఖర్చులపై నియంత్రణఫండ్ రెయిజింగ్‌తో మరింత ముందుకు

ashok patnaik
7th May 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

వ్యాపారం అన్నాక ఆదాయ వ్యయాలను ఎంత బేరీజు వేసుకున్నా.. ఆదాయం పెంచాలంటే అంత సులువైన విషయం అయితే కాదు. వ్యయం తగ్గించడం కూడా అనుకున్నంత స్థాయిలో జరగక పోవచ్చు. కొత్తగా వ్యాపార రంగంలోకి వచ్చిన వారికి పరిష్కారం అనేది తలకుమించిన భారమే అవుతోంది. అలాంటి వారికోసం హ్యాపీ టీం మేమున్నాం అంటోంది. కంపెనీలో ఖర్చులను తగ్గించడమే కాదు వాటిని విశ్లేషించి పరిష్కార మార్గాలనూ చూపిస్తోంది హ్యాపే.

ఫౌండర్లు అన్షుల్ రాయ్, వరుణ్ రాఠి

ఫౌండర్లు అన్షుల్ రాయ్, వరుణ్ రాఠి


2012 లో ప్రారంభమైన హ్యాపే.. కార్పొరేట్ మార్కెట్లో తనదైన ముద్రను వేయగలిగింది. కంపెనీ ఖర్చులను చక్కదిద్దే వ్యవస్థను తయారు చేయడమే హ్యాపే లక్ష్యం. ఇది ఒక ఎండ్ టు ఎండ్ సొల్యూషన్. పరిష్కార మార్గాలను చూపించడమే కాదు ఫలితాలను కాగితాలపై లెక్కలేసి మరీ చూపిస్తుంది. హ్యాపే వెనకున్నవ్యక్తులు ఇద్దరు. అన్షుల్ రాయ్, వరుణ్ రాఠి. వీళ్లిద్దరూ ఐఐటి ఖరగ్‌పూర్ నుంచి వచ్చిన వారే. వీళ్లది 2010 బ్యాచ్. వీళ్ల రెండేళ్ల కష్టానికి ఫలితం లభించింది. ఆర్బిఎల్ బ్యాంక్ ఏంజెల్ ప్రైమ్ నుంచి పెట్టుబడులను ఆకర్షించింది హ్యాపే.

ఎక్స్‌పెన్స్ మేనేజ్మెంట్ (ఖర్చుల నిర్వహణ)ను క్యాష్, పేపర్ అవసరం లేకుండానే మొబైల్‌తో చేయాలనే లక్ష్యంగా హ్యాపే పనిచేస్తోంది. అన్ని ఖర్చులనూ తగ్గించి అకౌంటింగ్ చేయడం ఇందులో మనం చూడొచ్చు. సాధారణ వ్యాపార ఖర్చుల నిర్వహణ అనేది ఖర్చుతోకూడుకున్నదే. దాని జోలికి పోకుండా వీసా కార్డులతో ఖర్చు చేయడాన్ని ప్రొత్సహిస్తుంది. దీంతో ప్రతీ దానికి ఎంతో సులభంగా లెక్కదొరుకుతుందన్న మాట. ఈ పద్దతిలో ఖర్చులను మొబైల్, ఆటోమేటెడ్ ఖర్చులుగా విభజించి దానిపై రిపోర్టు ఇవ్వడంతోపాటు దాన్నే చివరిగా పరిగణలోకి తీసుకుంటారు. హ్యాపే ఫ్లాట్‌ఫాం పై కొనుగొళ్లన్నీ కార్డుతోనే జరుగుతాయి. ఉద్యోగులంతా కొనుగోలుకు సంబంధించిన రసీదులను ఖర్చుల రిపోర్ట్‌లో చూపించాల్సి ఉంటుంది.

పరిష్కారాలన్నీ వీసా కార్డుతోనే పూర్తవుతాయి. దీనంతటికీ రిమోట్ కంట్రోల్ లాంటి మొబైల్ అప్లికేషన్, వెబ్‌ ప్లాట్‌ఫాం ఉంటుంది. దీని పర్యవేక్షణతో ఉద్యోగుల ఖర్చులు, ఇతర లావాదేవీలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుస్తుంది. దీంతో దేనికెంత ఖర్చైంది ? ఎక్కడ ఎంత పెట్టాలి ? ఎక్కడ తగ్గించాలనే విషయాలపై క్లారిటీ వస్తుంది. 2015 ఫిబ్రవరి 23న అధికారికంగా హ్యాపే లాంచ్ అయింది. అంతకు ముందే టీం చాలా కంపెనీలతో తమ సేవల గురించి పూర్తి స్థాయి అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఆర్బీఎల్(రత్నాకర్ బ్యాంక్) తో కలసి ఈ ప్రాజెక్టులో పనిచేస్తోంది హ్యీపీ టీం. దేశవ్యాప్తంగా 180 బ్రాంచీలు, 350 ఏటిఎంలతో ఆర్బీఎల్.. వాణిజ్య బ్యాంకింగ్ రంగంలో వేగంగా దూసుకుపోతోంది.

హ్యాపే టీం

హ్యాపే టీం


టీ ల్యాబ్స్‌తో హ్యాపీ యాక్సలరేషన్ చేయడంతో ఏంజెల్ ప్రైమ్‌తో సంప్రదింపులు జరిపింది. ఏంజెల్ ప్రైమ్ ఆఫీసులో అప్పటికప్పుడే పరిష్కారాలు చూపించడంతో డీల్ ముందుకు సాగింది. జిప్‌డీల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత విసి ఫండ్ , హ్యపేలో రెండో పెట్టుబడిదారుగా ప్రవేశించింది. అమిత్ సోమానీని మేనేజ్‌మెంట్‌ బోర్డులో తీసుకోవవడంతో పేమెంట్ ఫోర్ట్‌ఫోలియో పెరిగిందనే చెప్పాలి. మైక్రో ఏటిఎంలను తయారు చేసే ఈజీ ట్యాప్‌లో కూడా ఏంజెల్ ప్రైమ్ ఇప్పటికే పెట్టుబడులు పెట్టింది.

యువర్ స్టోరీలో బీటా టెస్టర్‌గా మంచి అనుభవాన్నిచ్చింది. సాధారణ క్రెడిట్ కార్డులకంటే ఎంతో మెరుగైన ఫ్లెక్సిబిలిటీని ఇచ్చిందని యువర్ స్టోరీ సిఓఓ చందన్ రాజ్ అన్నారు. తమ ఖర్చుల విషయంలో చాలా రకాలుగా ఉపయోగపడిందని అభిప్రాయపడ్డారాయన. వ్యాపారానికి సంబంధించిన పరిష్కారాల విషయంలో ఏంజిల్ ప్రైమ్ మరోసారి పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడిందంటే.. హ్యాపే పెట్టుబడులకు ఏ స్థాయిలో న్యాయం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags