బ్లాగ్‌తో డబ్బు ఎలా సంపాదించాలో తెలుసుకోండి !
బ్లాగ్ తో డబ్బు సంపాదించడం ఎలా ?మీ బ్లాగ్ కాసుల వర్షం కురిపించేందుకు 5 చిట్కాలు
బ్లాగ్ – ఏ టాపిక్ పైనైనా సరే మీ అభిప్రాయాలను యదేచ్ఛగా చెప్పగలిగే ఏకైక సాధనం. అదే విధంగా ఆన్ లైన్లో డబ్బులు సంపాదించాలన్నా కూడా బ్లాగే బెస్ట్. అయితే ఒక దురభిప్రాయం ఏంటంటే భారతీయ బ్లాగర్స్ బ్లాగింగ్ ద్వారా అనుకున్నంత డబ్బు సంపాదించలేకపోతున్నారని. అయితే ఇది నిజం కాదు. ఎందుకుంటే భారత్‌లో ఎంతోమంది బ్లాగర్స్ కొన్ని లక్షల రూపాయలను బ్లాగింగ్ ద్వారా సొంతం చేసుకుంటున్నారు.
ఒకవేళ మీకు బ్లాగ్ ఉంటే, దాని సాయంతో డబ్బులు సంపాదించలేకపోతుంటే .. ఇప్పుడే ఆ పని మొదలెట్టండి !
బ్లాగుతో బ్యాగు నిండాలంటే ఈ ఐదు పనులు చేసి చూడండి.
1. అడ్వర్‌టైజింగ్ నెట్వర్క్స్
మానిటైజేషన్‌లో ఇదో సులువైన మార్గం. బ్లాగ్ ద్వారా డబ్బు సంపాదించాలనుకుంటున్న వారికి తొలి అడుగు. అంతేకాదు బ్లాగ్ మానిటైజేషన్‌కి సంబంధించి చాలామంది ఎంచుకునే దారే ఇది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఫాలో అవుతున్నారు. భారత్ లో కూడా చాలాపాపులర్ అయ్యింది.
ఎలా పనిచేస్తుంది ?
బ్లాగ్ లో మీరు యాడ్స్‌ని డిస్ప్లే చేయండి. మీ బ్లాగ్ చూసేవారు ఆ యాడ్‌ని క్లిక్ చేయగానే, ఆ యాడ్ అడ్వర్‌టైజర్ నుంచి మీకు కొంత కమిషన్ వస్తుంది.
మీ బ్లాగ్ లో అదెలా సాధ్యం ?
1. మీరు పని చేయాలనుకుంటున్న యాడ్ నెట్వర్క్‌ను మొదట సెలెక్ట్ చేసుకొండి. ప్రస్తుతానికి బ్లాగర్స్, అడ్వర్టైజర్స్‌కు ఫేవరెట్ నెట్ వర్క్ ఏదంటే అది యాడ్ సెన్స్ (గూగుల్‌కు చెందింది). ఇది కాకుండా బిడ్ వర్టైజర్, ఇన్ఫోలింక్స్ కూడా ఉన్నాయి.
2. మీకు నచ్చిన యాడ్ నెట్వర్క్‌కు పబ్లిషర్‌గా వ్యవహరించేందుకు అప్లై చేయండి. మీకు పేమెంట్ ఎలా అందాలో తదితర వివరాలను అప్లికేషన్‌లో నింపండి (కమిషన్ డబ్బులు అందుకునేందుకు మీ అకౌంట్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది), ఈ డీటైల్స్‌ను అందుబాటులో ఉంచుకోండి.
3. ఒకవేళ మీ అప్లికేషన్ ఓకే అయితే, వెంటనే మీకు కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది.
4. ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ అందగానే, మీకు యాడ్ కోడ్స్ అందుతాయి. వాటిని మీరు మీ బ్లాగ్‌లో మీకు నచ్చిన చోట అక్కడక్కడా పేస్ట్ చేయాలి. ఉదాహరణకి : మీ బ్లాగ్‌లో యాడ్స్‌ను సైడ్ బార్స్ లోనో లేక టెక్ట్స్ మధ్యలోనో ఎక్కడ పెట్టాలో మీరే డిసైడ్ చేసుకోవచ్చు.
5. కోడ్స్‌ని సరిగ్గా పేస్ట్ చేస్తే చాలు .. ఇక ఆల్ సెట్ గో. మీ యాడ్ నెట్వర్క్ రెండు గంటల వ్యవధిలోనే మీరు ఫిక్స్ చేసిన చోట్లలో యాడ్స్‌ని డిస్ప్లే చేయడం ప్రారంభిస్తుంది.
6. దీంతో దాదాపు మీ పని పూర్తయినట్టే. ఇక మీ బ్లాగ్ చదివే వారు ఆ యాడ్స్‌ని క్లిక్ చేయవచ్చు, చూడొచ్చు. దీంతో మీ బ్లాగ్ మీకు కొంత డబ్బును తీసుకురావచ్చు.
బ్లాగ్ ద్వారా ఎంత సంపాదించవచ్చు ?
ఒక్కో క్లిక్‌కి ఎంతలేదన్నా రూ.60 నుంచి రూ. 300 వరకూ వస్తుంది. బ్లాగ్‌లో రాసే టాపిక్‌ని బట్టి, యాడ్ కంపెనీలు డబ్బులు చెల్లిస్తుంటాయి. ఎందుకంటే ఆ టాపిక్‌కి సంబంధించిన యాడ్సే మీ బ్లాగ్ లో కనిపిస్తాయి. ఎంత మంది మీ బ్లాగ్‌లోని యాడ్స్ క్లిక్ చేస్తే .. అంత డబ్బు మీకు వచ్చినట్టే.
ఎక్కువ సంపాదించడానికి సింపుల్ టిప్స్
యాడ్స్ ప్లేస్‌మెంట్ – ఏ ప్లేస్‌లో యాడ్‌ని డిస్ప్లే చేయాలో, ఎలాంటి యాడ్స్‌ను జనం చూస్తున్నారో, వేటికి ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయో చెక్ చేయడం. కొన్ని ఇమేజ్ యాడ్స్ వర్కౌట్ అవుతాయి. మరికొన్నింటికి టెక్స్ట్ యాడ్స్ సరిపోతాయి. కాబట్టి, అత్యధిక లాభాలు వచ్చేవరకూ యాడ్స్‌ను అడ్జెస్ట్ చేస్తుండండి.
2. మార్కెటింగ్
ఈ పద్దతి ద్వారా మీ బ్లాగ్‌కు మీరు ఆశించిన ఆదాయం రావడం ఖాయం. మీ రీడర్స్‌కు అవసరమైన ప్రొడక్ట్స్ , సర్వీసెస్‌ను అందించడం ద్వారా మీరు లాభపడొచ్చు. అయితే మీరు ప్రమోట్ చేసే ప్రొడక్ట్స్, సర్వీసెస్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇందుకోసం తగిన రీసెర్చ్, అనలైజేషన్ అవసరం. మీ రీడర్స్‌కు ఎప్పుడు ఏం కావాలో తెలుసుకోగలగాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందేమిటంటే … అతిగా ఒక ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే మీ బ్లాగ్‌లో మీరు రాసింది చదివి, వారి అభిప్రాయాలు చెప్పడానికే రీడర్స్ వస్తుంటారు, వారిని అడ్వర్టైజ్ మెంట్ల పేరుతో విసిగించవద్దు.
ఇదెలా పనిచేస్తుంది :
మీ బ్లాగులో ఒక ప్రొడక్ట్, సర్వీసుకు సంబంధించిన ఒక యాడ్, లింక్‌ని పెడతారు. ఎప్పుడైతే మీ రీడర్ ఆ లింక్స్, యాడ్స్ ని క్లిక్ చేసి ఏదైనా కొన్నప్పుడు, మీకు ఆ సర్వీస్, ప్రొడక్ట్ ప్రొవైడర్ నుంచి కొంత కమిషన్ వస్తుంది.
మీ బ్లాగ్ లో చేయాల్సిందల్లా :
1. ఏదైనా పేరున్న నెట్ వర్క్, ఉదాహరణకి క్లిక్ బ్యాంక్, OMG ఇండియా, ట్రూట్రాక్ మీడియా తదితర వాటిల్లో ఏదో ఒక ప్రొడక్ట్, సర్వీస్ కు మీరు అనుబంధంగా ఉండదలచిన దాన్ని ఎంచుకోండి. లేదంటే ఫ్లిప్ కార్ట్, అమెజాన్ తదితర వెబ్ సైట్స్ అందించే అఫ్లియేట్ ప్రోగ్రామ్‌లో చేరిపొండి.
2. మీకు నచ్చిన వెబ్ సైట్‌లో చేరేందుకు అప్లై చేయండి. సంబంధిత వెబ్ సైట్ వారు మిమ్మల్ని అడిగే వివరాలు ఏంటంటే … మీ బ్లాగులో మీరు చేసే మార్కెటింగ్, ప్రమోషన్ స్ట్రేటజీస్ ఏమైనా ఉన్నాయా అని.
3. చాలా వెబ్ సైట్స్ మీ అప్లికేషన్‌ను చూస్తాయి, ఓకే నా కాదా అన్న విషయాన్ని 24-72 గంటల్లో చెప్పేస్తాయి.
4. మీ అప్లికేషన్ అప్రూవ్ అయితే, మీరు మీ అఫిలియేట్ అకౌంట్ సాయంతో, వివిధ లింక్స్, యాడ్స్‌ను మీ బ్లాగ్‌లో ప్లేస్ చేయోచ్చు.
5. మీ టాపిక్‌కు మ్యాచ్ అయ్యే యాడ్ , లింక్‌ను బ్లాగ్ లో యాడ్ చేసి, అది సరిగ్గా పనిచేస్తుందా లేదా చెక్ చేసుకోండి
6. అంతే ఇక మీ బ్లాగ్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎప్పుడైతే మీ రీడర్ ఆ లింక్స్, యాడ్స్ ని క్లిక్ చేస్తారో, ఆ ప్రొడక్ట్ ను ఎప్పుడైతే కొంటారో, కూర్చున్న చోటేకూర్చున్నట్టే మీకు మీ కమిషన్ ముడుతుంది.
బ్లాగ్ ద్వారా ఎంత సంపాదించవచ్చు ?
కమిషన్ ఇంత వస్తుంది అని కచ్చితంగా చెప్పడం కష్టం. ఎందుకంటే అది ఆయా వెబ్ సైట్, ప్రొడక్ట్ బట్టి ఉంటుంది. సేల్ వాల్యూని బట్టి బ్లాగర్ కు 2.5% నుంచి 50% వరకూ కమిషన్ రావచ్చు. ఒక్కోసారి కొనుగోలుదారులు తీసుకువచ్చే ప్రొడక్ట్ పై కూడా అది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి – మీ బ్లాగ్ లో ఫ్లిప్ కార్ట్ యాడ్స్ పెట్టారనుకొండి. ఒకవేళ మీ బ్లాగ్ రీడర్ ఎవరైనా బట్టలు కొంటే మీకు వచ్చే కమిషన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. అదే ఒక మొబైల్ ఫోన్ కొన్నాడనుకొండి పర్సంటేజ్ తగ్గుతుంది.
మీ రీడర్స్ కు అవసరమయ్యే సర్వీసెస్, ప్రొడక్ట్స్ ఏంటో తెల్సుకుని వాటిని ప్రమోట్ చేయడం. దీనివల్ల సేల్స్ పెరిగే అవకాశముంది. పేరున్న ప్రొడక్ట్స్ ఎలాగైనా తొందరగా సేల్ అయిపోతాయి కాబట్టి వారు ఎక్కువ కమిషన్ ఇవ్వరు. అందుకని … చిన్న చిన్నవే అయినా మంచి క్వాలిటి ఇచ్చే ప్రొడక్ట్ ను ఎంచుకుని ప్రమోట్ చేయండి .. తద్వారా ఎక్కువ కమిషన్ అందుకొండి.
3. మీ ప్రొడక్ట్‌ను మీరే సేల్ చేయడం
మీ బ్లాగ్ పై వచ్చే ఆదాయంపై మీకు పూర్తి కంట్రోల్ రావాలంటే … ప్రొడక్ట్స్ ను సేల్ చేయడమే సరైన దారి. ప్రొడక్ట్ ను డిజైన్ చేయడం నుంచి, ప్రైజింగ్, మార్కెటింగ్ .. ఇలా ప్రతీ దానికి మీరే బాస్. కాబట్టి మీరు ఎంత కష్టపడితే అంత కాసుల వర్షం మీపై కురుస్తుంది.
పనితీరు
మీకున్న పరిజ్ఞానంతో ఒక ప్రొడక్ట్, సర్వీసును తయారుచేసి, మీ బ్లాగు సాయంతో రీడర్స్ కు అమ్మే ప్రయత్నం చేయండి.
మీ బ్లాగులో అమలు చేసే విధానం
1. మొదట ఒక ప్రొడక్ట్, సర్వీస్ ను మీ చేతులతో మీరే తయారుచేయండి లేదా ఎవరినైనా తయారు చేసి ఇవ్వమనండి. పుస్తకాలు, కుకీస్, DIY కిట్స్ లాంటివైనా లేకపోతే ఈ-బుక్స్, వీడియో కోర్సెస్ వంటి డిజిటల్ ప్రొడక్ట్స్ వంటివైనా సరే.
2. మీరు తయారుచేసిన దానికి మీరే ఒక ధర నిర్దేశించుకొండి. ఎలా డెలివరీ చేయాలో కూడా ప్లాన్ చేసుకొండి. కొరియర్, మెయిల్ లేక పర్సనల్ గా వచ్చి కలెక్ట్ చేసుకోవాలో ఆలోచించుకొండి. మీకు, కొనేవారికి సులువుగా ఉండేలా బ్యాంకు ట్రాన్స్ ఫర్, పేపాల్, క్యాష్, చెక్ .. అసలు పేమెంట్ ఎలా జరగాలనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకొండి.
వీటన్నింటికన్నా ముందు మీ బ్లాగ్ లో మీ క్రియేషన్ కు సంబంధించిన వివరాలన్నీ కనిపించేలా ఒక స్పెషల్ పేజ్ ని పెట్టండి. మీ క్రియేషన్ ఫీచర్స్, లాభాల గురించి చెబుతూనే .. రీడర్స్ కొనేందుకు వీలుగా ఒక బటన్ ని ఏర్పాటుచేయండి.
౩. మీ ప్రొడక్ట్/సర్వీస్ గురించి బాగా ప్రమోట్ చేయండి. ఈమెయిల్ మార్కెటింగ్, సోషల్ మీడియా ప్రమోషన్, ‘యాడ్ వర్డ్స్’ తదితర మార్గాల ద్వారా ఈజీగా ప్రమోట్ చేయోచ్చు.
4. మీ క్రియేషన్ పుణ్యమాని సేల్స్ చేయడమే కాదు మీరు మీ చేతి నిండా సంపాదించొచ్చు కూడా.
ఎంత సంపాదించగలరు ?
ఒక్క మాటలో చెప్పాలంటే మీ సంపాదనకు ఆకాశమే హద్దు. ధరను నిర్దేశించడం నుంచి అన్నీ మీ చేతుల మీదుగా జరుగుతాయి కాబట్టి .. ఎంత సంపాదించగలరో కూడా మీరే డిసైడ్ చేసుకోవచ్చు. మీ ప్రొడక్ట్ ఎంత బాగుంటే అంత ఎక్కువ అమ్ముడవుతుంది, అంత ఎక్కువ లాభాలు మీకు అందుతాయి.
ఎక్కువ సంపాదించేందుకు చిట్కాలు
మీ రీడర్స్ ఏ ప్రొడక్ట్ ను కావాలనుకుంటున్నారో .. కొనాలనుకుంటున్నారో రీసెర్చ్ చేయండి. ఆ తర్వాతే డిజైన్ చేయడం ప్రారంభించండి. నిజంగానే వారు కోరుకుంటున్నది మీరు వారికి అందిస్తే … ఏ మాత్రం కష్టపడకుండానే మీ ప్రొడక్ట్ హాట్ కేక్ లా అమ్ముడవుతుంది.
మీ బ్లాగ్ ద్వారా ఫ్రీలాన్సింగ్
ఒకవేళ మీరు మీ బ్లాగ్ లో ఒకే టాపిక్ పై కొన్ని రోజులుగా రాస్తున్నారనుకొండి, కచ్చితంగా ఆ టాపిక్ పై మీకు కొంత పట్టు వస్తుంది. ఆ విజ్ఞానాన్ని, వివరాలను మీరు ఫ్రీలాన్సింగ్ చేస్తూ డబ్బు సంపాదించేందుకు వినియోగించుకోవచ్చు. వీటికి తోడు మీకు మార్కెట్ చేసుకునే తెలివితేటలు ఉంటే ఇక తిరుగేలేదు. మీ బ్లాగ్ లో మీ నైపుణ్యం గురించి అడ్వర్టైజ్ చేసుకుని, తద్వారా మీరు కావాల్సినంత సంపాదించుకోవచ్చు.
మీకు అంతగా నాలెడ్జ్ లేకపోయినా .. మీరు కొత్తగా బ్లాగ్స్ రాస్తున్న వారికి గైడెన్స్ ఇస్తూ … అందుకుగానూ కొంత ఫీజు వసూలు చేయోచ్చు. మీరు ఊహించనంతమంది మీ గైడెన్స్ కోసం డబ్బులు చెల్లించి మరీ వస్తారనడంలో డౌటే లేదు. ఇప్పటివరకూ మీరు అలాంటి గైడెన్స్ ఉచితంగా ఇచ్చి ఉంటే .. మీకు ఇదో పెద్ద సర్ ఫ్రైజే!
వర్కౌట్ అయ్యే విధానం
మీ విజ్ఞానాన్ని, తెలివిని ఒక కన్సల్టెంట్ గా అందించేందుకు ప్రయత్నించండి, అప్పుడు వాటి అవసరం ఉన్న వారు, డబ్బిచ్చి మరీ వాడుకుంటారు.
దీనితోపాటుగా మీరు ప్రాజెక్ట్స్ కూడా టేకప్ చేయోచ్చు, వాటి ఎగ్జిక్యూషన్ కు కూడా డబ్బులు వసూలు చేయవచ్చు.
4. మిమ్మల్ని మీరే ప్రమోట్ చేసుకోండి
1. ఫ్రీలాన్సర్ గా మీరు ఎలాంటి సర్వీసులను అందించగలరో క్లుప్తంగా చెప్పండి.
2. మీ బ్లాగ్ లో ఒక ప్రత్యేకమైన పేజీని ఇందుకోసం పెట్టండి. అందులో మీ సర్వీసెస్, మిమ్మల్నే ఎందుకు హైర్ చేయాలి, మీరు అందించే ప్రయోజనాలు, అన్నింటికన్నా ముఖ్యంగా మీ ఛార్జెస్, మీ కాంటాక్ట్ వివరాలు ఇవ్వండి.
3. మీరు అందించే సర్వీసుల గురించి మీ రీడర్స్ కు సమాచారం ఇవ్వండి. ఆ సర్వీసులను వాడుకొమ్మని చెప్పడమే కాకుండా, వారి బంధుమిత్రులకు తెలియజేయమనండి. ఎందుకంటే మీ బ్లాగ్ రెగ్యూలర్ రీడర్స్ కాబట్టి, మీ పనితనంపై వారికి అవగాహన ఉంటుంది, ఓ అభిప్రాయం ఏర్పడి ఉంటుంది కాబట్టి కచ్చితంగా వారు మీ సర్వీసులను వినియోగించుకునే ఛాన్స్ ఉంది.
4. సోషల్ మీడియా, అడ్వర్టైజింగ్ తదితర ఇతర ఛానెల్స్ ద్వారా మీ సర్వీసులను ప్రమోట్ చేసుకొండి. మీరు ఎంత ప్రమోట్ చేస్తే అంతమందికి మీ సర్వీసుల గురించి తెలిసే అవకాశముంది. అలా మీకు ఎక్కువ ఆఫర్స్ వచ్చే ఛాన్స్ ఉంది.
5. ఒకవేళ మీకు ఏదైనా ప్రాజెక్ట్ చేతికి వస్తే .. అనుకున్న సమయానికి ఒక ప్రొఫేషనల్ పద్దతిలో పూర్తి చేయండి. అలా మీ బ్లాగ్ ద్వారా డబ్బులు సంపాదించండి.
ఎంత సంపాదించవచ్చు ?
మీ రాబడి మీ తెలివితేటలపై ఆధారపడి ఉంటుంది. మీరు అందించే సర్వీసులు ఎంత పాపులర్ అయితే అంత ఆఫర్స్ వచ్చి పడతాయి. మీరు ప్రైజ్ డిసైడ్ చేస్తే చాలు – ఆదాయం దానంతట అదే పెరిగిపోతుంటుంది. ఒకవేళ మీ సబ్జెక్ట్ లో మీరు ఎక్స్ పర్ట్ అయితే … మీ ఖజానా ఆకాశాన్ని తాకుతుంది.
మీ బ్లాగ్ లో ఎలా అమలు చేయాలి ?
1. మీ బ్లాగ్ లో ఎక్కడ మీరు యాడ్స్ (యాడ్ స్పాట్స్ ) పేస్ట్ చేయాలనుకుంటున్నారో డిసైడ్ చేసుకొండి. హెడర్, ఫుటర్, సైడ్ బార్, మీ కంటెంట్ మధ్యలో ఇలా ఎక్కడైనా మీరు యాడ్స్ ని ప్లాన్ చేసుకోవచ్చు.
2. మీ బ్లాగ్ లో ‘ అడ్వర్ టైజ్ విత్ అజ్ ‘ అని ఒక పేజీని పెట్టండి. అందులో మీ వివరాలను అందించండి. తద్వారా అడ్వర్ టైజర్స్ మీ బ్లాగ్ వారి యాడ్స్ ని డిస్ప్లే చేయడానికి ఓకేనా కాదానని డిసైడ్ చేసుకుంటారు. మీ బ్లాగ్ ఆడియన్స్ గురించి, మీరు రాసే టాపిక్స్ గురించి, మరీ ముఖ్యంగా మీరు తీసుకునే ఫీజు వివరాలను ఇవ్వండి. మీ బ్లాగ్ కాబట్టి మీకు నచ్చిన ధరలను ఫిక్స్ చేయండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకొండి … ఒక్కో రకం యాడ్ స్పాట్ కు ఒక్కో ప్రైజ్ ని కూడా పెట్టుకోవచ్చు. బ్యానర్ కు ఎక్కువగా … కంటెంట్ లో యాడ్ రావాలంటే తక్కువగా ఇలా మీకు నచ్చినట్టు ఛార్జ్ చేయవచ్చు. మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ కావాలో వివరాలు ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు.
1. మానిటైజేషన్ నెట్ వర్క్ లో చేరేందుకు అప్లై చేసుకొండి. ఇందులో మీరు మీ బ్లాగ్ ను యాడ్ చేసుకోవచ్చు, మీ యాడ్ స్పాట్, ప్రైజింగ్ డీటైల్స్ ఇవ్వొచ్చు. ఈ నెట్ వర్క్ సాయంతో మీ బ్లాగ్ ను ఎక్కువమంది అడ్వర్ టైజర్స్ చూసే వీలుంది. ఈ మానిటైజేషన్ నెట్ వర్క్స్ లో BuySell Ads చాలా పేరు తెచ్చుకుంది.
2. మీ బ్లాగ్ లో యాడ్స్ కోసం కొన్ని ఖాళీ బాక్సులను ఏర్పాటుచేయండి, అక్కడ ‘అడ్వర్ టైజ్ హియర్’ (ఇక్కడ అడ్వర్ టైజ్ చేసుకొండి) అని రాసిపెట్టండి. మీ బ్లాగ్ చూసే అడ్వర్ టైజర్స్ వాటిని చూసి అట్రాక్ట్ అవుతారు.
3. కొంతమంది అడ్వర్ టైజర్స్ మీతో కొంత బేరాలు ఆడొచ్చు. ఒకవేళ వాళ్లు చెప్పిన ధర మీకు ఓకే అయితే వెంటనే వారి యాడ్స్ ను లైవ్ చేసేయండి, అప్పుడు చూడండి మీ దగ్గరకు డబ్బు ఎలా వస్తుందో.
5. అధిక ఆదాయం కోసం
అన్ని యాడ్ స్పాట్స్ బాక్సులలో ‘ఇక్కడ అడ్వర్ టైజ్ చేయండి ‘ అని రాయకండి. ఏవైనా డమ్మీ యాడ్స్ ని పెట్టండి. దీనివల్ల ఎవరైనా అడ్వర్ టైజర్ వాటిని చూసినప్పుడు మీ బ్లాగ్ కు ఇప్పటికే క్లైంట్స్ ఉన్నారనుకుని, వారు కూడా మీ బ్లాగ్ లో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు రావచ్చు.
మీ బ్లాగ్ లో మిగిలిన యాడ్ స్పాట్స్ కూడా అయిపోతాయేమోనని, వారు వీలైనంత త్వరగా మీ బ్లాగ్ కు యాడ్స్ ఇవ్వొచ్చు. ఈ విధంగా అడ్వర్ టైజర్స్ మీతో బిజినెస్ చేసే ఛాన్స్ ఉంది.
ఇవి బ్లాగ్ లో కాసుల గలగలలు వినిపించేందుకు పాటించాల్సిన 5 పద్దతులు. బ్లాగ్ ద్వారా డబ్బులు సంపాదించడం అంటే అది రాకెట్ సైన్స్ కాదు అలాని చిన్నపిల్లల ఆట కూడా కాదు. మీరు ప్రమోట్ చేసే ప్రొడక్ట్స్, డిజైన్స్ కు సంబంధించి మీకు బాగా తెల్సి ఉంటే చాలు.
అన్నింటికన్నా ముందు మీ బ్లాగ్ కు కొంతమంది నమ్మకమైన రీడర్స్ ను సంపాదించుకోవాలి. ఎందుకంటే వారే మీ బ్లాగ్ కు డబ్బులు తీసుకొచ్చేందుకు రాచమార్గాలు. మీ బ్లాగ్ అసలు సిసలు రీడర్స్ కు చేరుకునేందుకు మీరు శాయశక్తులా కృషి చేయాల్సి ఉంటుంది.
చాలామంది బ్లాగర్స్ ఎక్సలెంట్ ఆర్టికల్స్ రాస్తారు కానీ వాటిని ప్రమోట్ చేసుకోవడంలో విఫలమవుతారు, ఒక్కోసారి మర్చిపోతారు. ప్రమోషన్ లేని బ్లాగ్ .. సీక్రెట్ డైరీతో సమానం. కేవలం బ్లాగర్ కు మాత్రమే అందులో ఏముందో తెలుస్తుంది. బ్లాగ్ ను ప్రమోట్ చేయడం వల్ల అది నలుగురికీ తెలుస్తుంది, రీడర్స్ కు చేరుతుంది, అలా పేరు తెచ్చుకుంటుంది, మీకు లాభాలు తెచ్చిపెడుతుంది. కాబట్టి .. మీ బ్లాగ్ ను బాగా ప్రమోట్ చేసుకొండి. ఒకటి లేదా అంతకు మించి మానిటైజేషన్ నెట్ వర్క్స్ లో అప్లై చేయండి, అంతే ఇక మీ బ్లాగ్ ద్వారా ఈజీగా డబ్బులు సంపాదించుకొండి.