అప్పు చేసే ముందు.. మా డీల్స్ చూడమంటున్న డీల్స్4లోన్స్

లోన్ కోసం డీల్ కావాలా ?డీల్స్4లోన్స్‌కి ట్యూన్ అయ్యారా?55లక్షల మందికి డీల్స్ అందించిన డీ4ఎల్మా నుంచి లోన్ అంటే... అదే బెస్ట్ డీల్ అంటున్న డీ4ఎల్

2nd Jul 2015
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

ఏ అవసరానికైనా సరే... ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వెతికేయడం ఇప్పుడు బాగా కామన్ అయిపోయింది. ఇట్టే సమాచారం వెతికి పట్టుకునే అవకాశం ఏర్పడ్డంతో... మొదటి గమ్యం ఇంటర్‌నెట్‌గా మారిపోయింది. సమాచారం తెలుసుకునేందుకు సాధనంగా ఏదైనా పర్లేదు. కానీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు... మరీ ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్త అవసరం. ఇందుకోసం నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఆ రంగంలో నైపుణ్యం ఉన్నవారు మన అవసరాలకు తగినట్లుగాను, మన సందేహాలను తీర్చడానికిగాను ఎంతో సహకరిస్తారు. ఈ రెండింటికీ సరైన మిశ్రమమే డీల్స్4లోన్స్.కాం.

image


డీల్ మొదలుపెట్టింది వీళ్లే

బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అందించే విభిన్నమైన రుణ ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని కస్టమర్లకు అందించే డీల్స్4లోన్స్ (డీ4ఎల్) స్టార్టప్‌ను రిషి మెహ్రా, అమితోజ్ సేథి, రిభు త్యాగిలు ప్రారంభించారు. మార్కెట్లో లభ్యమయ్యే పలు లోన్ ప్రోడక్ట్స్, వివిధ బ్యాంకులు అందించే రుణాల మధ్యతేడాలను తెలిపి, కస్టమర్లు సరైన నిర్ణయం తీసుకునేందుకు ఇది సహాయపడుతుంది.

2008 జూలైలో కార్యకలాపాలు ప్రారంభించిన డీ4ఎల్.. ఇప్పటివరకూ 55లక్షల మంది కస్టమర్లకు సేవలు అందించింది. ఈ వెబ్‌సైట్ ద్వారా రుణ ఉత్పత్తులు, వాటికి సంబంధించిన సమాచారం లభిస్తుంది. అంతేకాదు... టోల్ ఫ్రీ నెంబర్ సర్వీస్ ద్వారా.. కాల్ చేసిన వారి సందేహాలను నివృత్తి చేస్తుంది డీల్స్4లోన్స్.

ప్రతీనెల ₹200కోట్ల విలువైన రుణాలను డీల్స్4లోన్స్ ద్వారా అందిస్తున్నామని చెబ్తున్నామని రిషి. మార్కెట్లో లోన్స్ విభాగానికి ఉన్న డిమాండ్‌ను, అవకాశాన్ని ఈ గణాంకాలే నిరూపిస్తున్నాయని అంటున్నారాయన. “ప్రస్తుత రోజుల్లో కస్టమర్లు 25ఏళ్లు వచ్చేనాటికే అప్పులు తీసుకోవడం గురించి మాట్లాడుకుంటున్నారు. ఉద్యోగం చేయడం ప్రారంభించిన మూడేళ్లకే లోన్స్ వైపు మళ్లుతున్నారు. వీరికి రుణాలపై తగిన సమాచారం అవసరం. మార్కెట్లో ఉన్న వివిధ రుణ పథకాలపై వారికి అంతగా తెలీదం”టున్నారు రిషి.

image


అప్పు చేసేదెవరు ?

డీల్స్4లోన్స్ కస్టమర్లలో 72శాతం ఉద్యోగస్తులు కాగా... 28శాతం స్వయం ఉపాధి పొందుతున్నవారు. అలాగే 58% రుణాలను... ఢిల్లీ, ముంబై, బెంగళూర్, పూనే, హైద్రాబాద్, అహ్మదాబాద్ సహా... టాప్8 సిటీలకు చెందినవారే తీసుకుంటున్నారు. ద్వితీయ-తృతీయ శ్రేణి పట్టణాల నుంచి కూడా డిమాండ్ బాగానే ఉంది. 3-4 లక్షల మంది కస్టమర్లు చిన్నపాటి సిటీల నుంచే ఉంటున్నారని డీల్స్4లోన్స్ అంటోంది.

వెబ్‌సైట్, టోల్‌ఫ్రీ నెంబర్ల ద్వారా ప్రతీ నెలా లక్షన్నర మంది కొత్త కస్టమర్లు డీ4ఎల్‌కు జతవుతున్నారు. ఈ కంపెనీ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులతో సహా మొత్తం 13 ఆర్ధిక సంస్థలతో జత కట్టింది. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్(ఇప్పుడు కోటక్‌లో విలీనమైంది), ఫెడరల్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్, సిటి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, టీవీఎస్ క్రెడిట్, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా కేపిటల్, ఫులర్టన్ ఇండియాలతో భాగస్వామ్యం ఉంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో కలిసి... దేశవ్యాప్తంగా 180 ప్రాంతాల్లోని కస్టమర్లకు డీ4ఎల్‌ సేవలందిస్తోంది.

లోన్లను పోల్చడమా ?

పలు బ్యాంకులు ఇచ్చే ఒకే తరహా రుణాలను, కస్టమర్లు ఒకే విండోలో పోల్చి చూడగలిగే అవకాశం ఉండడం... డీల్స్4లోన్స్ ప్రధాన ఆకర్షణ అని చెప్పచ్చు. “బ్యాంకుల్లో రుణాల గురించి చెప్పేవారు ఒకరో, ఇద్దరో ఉంటారు. వారు తమ బ్యాంక్ ప్రోడక్టుల గురించి మాత్రమే చెబ్తారు. సమాచారం కోసం అన్ని బ్యాంకులకు తిరిగి పోల్చి చూడాలంటే చాలా క్లిష్టమైన విషయం. మా సైట్ ద్వారా అనేక బ్యాంకుల లోన్ ఉత్పత్తుల్లో... వారికి తగినదాన్ని పోల్చి చూసి ఎంపిక చేసుకోవచ్చం”టున్నారు రిషి.

నోయిడాలో ఆఫీస్ గల డీల్స్4లోన్స్ కంపెనీలో... సొంత కాల్ సెంటర్ స్టాఫ్ సహా... మొత్తం 65మందికి పైగా ఉద్యోగులున్నారు. దేశంలో భారీ సంఖ్యలో ఆర్థిక సంస్థలు ఉన్నా.. ఇప్పటికీ 6శాతం రుణాలిచ్చే వ్యక్తుల నుంచే తీసుకుంటున్నారని నాబార్డ్ అంచనా వేసింది. అంటే ఈ మార్కెట్‌లో ఇంకా విస్తృతమైన అవకాశముందనే అర్ధం అంటున్నారు రిషి మెహ్రా.

image


సమాచారమిచ్చేందుకు ప్రచారం

స్టార్టప్ స్థాయిలో మార్కెటింగ్ కోసం ఆన్‌లైన్, రేడియోల్లో యాడ్స్ ద్వారా ప్రచారం కల్పించారు. మీడియాలో ఎక్కువగా ప్రచారం కోసం త్వరలో ప్రత్యేకంగా పెట్టుబడులు కూడా చేయబోతున్నట్లు చెబ్తున్నారు రిషి. మరింతమంది కస్టమర్లను చేరుకునేందుకు ఈ వ్యూహం పని చేస్తుందన్నది వారి ఉద్దేశ్యం. “డీల్స్4లోన్స్ బ్రాండ్‌కు విస్తృతమైన ప్రచారం కల్పించబోతున్నాం. ఓ కార్టూన్ కేరక్టర్‌ను రూపొందించి, దాని ద్వారా కస్టమర్లను ఆర్ధిక అంశాలపై ఎడ్యుకేట్ చేస్తామ”ని చెప్పారు రిషి.

కొత్త యాప్‌లండీ...

వెబ్‌సైట్, టోల్‌ఫ్రీ నెంబర్లతోపాటు... కస్టమర్ల సంఖ్య పెంచుకునేందుకు రెండు మొబైల్ యాప్‌లను రూపొందించింది డీల్స్4లోన్స్. వీటిద్వారా కస్టమర్లకు క్రెడిట్ కార్డ్స్, హోమ్‌లోన్స్‌పై సమాచారం అందిస్తున్నారు. 2012లో క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ యాప్.. డీల్స్4లోన్స్ కార్డ్‌ను ఐఓఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంలపై రిలీజ్ చేశారు. మొత్తం ఇప్పటికి 32వేలకు పైగా డౌన్‌లోడ్స్ సాధించింది. 2010లో హోమ్‌లోన్స్, ఈఎంఐల కోసం లాంఛ్ చేసిన డీల్4లోన్స్ ఈఎంఐ యాప్‌... రెండు ప్లాట్‌ఫాంలపైనా కలిపి 75వేలకు పైగా డౌన్‌లోడ్స్ నమోదు చేసుకుంది.

డీల్స్ వర్సెస్ ఛాలెంజెస్

వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతున్నా... బ్యాంకుల వైపు నుంచే సవాల్ ఎదురవుతోందంటారు రిషి. బ్యాంకులకు సీఆర్ఎం(కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్) స్థాయికి చేరాలన్నది డీల్స్4లోన్స్ ప్రధాన లక్ష్యం. ఇందుకోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థల నమ్మకాన్ని మరింతగా పొందాల్సి ఉంటుంది. ఇప్పిటికే లాభాల్లో ఉన్న డీ4ఎల్... ₹30కోట్ల ఆదాయం, ₹9కోట్ల లాభాలను గడించే లక్ష్యాన్ని నిర్ణయించుకుంది. “మా దగ్గర నుంచి లోన్ పొందడమంటే... బెస్ట్ డీల్ సాధించినట్లే అని కస్టమర్లు భావించే స్థాయికి మేము చేరుకోవాలి”అంటున్నారు రిషి మెహ్రా.

వెబ్‌సైట్ : http://www.deal4loans.com/

Want to make your startup journey smooth? YS Education brings a comprehensive Funding and Startup Course. Learn from India's top investors and entrepreneurs. Click here to know more.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

Our Partner Events

Hustle across India