Telugu

ఎదగాలనే తపన ఉండాలే కానీ...

ఆమెను చూసి సమస్యలు సెలవు తీసుకోవాల్సిందేఅనేక రంగాల్లో విజయాన్ని సాధించిన వందన.వివిధ వ్యాపారాల్లో ట్రెండ్ సెట్ చేసిన మహిళా పారిశ్రామికవేత్తఎదగాలనే తపన ఉండాలే కానీ ఆడా,మగా బేధం ఉండదు

ABDUL SAMAD
24th Apr 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

అనేక వ్యాపారాలకు అధినేత్రిగా ఉన్న వందనా మెహరోత్రా, తన సక్సెస్‌తో వార్తల్లోకి ఎక్కారు. ఐటీలో మొదలుకుని, పిల్లల హాబీ స్టూడియో, జువెల్రీ, దుస్తుల వ్యాపారం వరకూ అన్నిట్లో పోరాడి ముందుకు సాగుతున్నారు వందన.

నాగపూర్‌లో పుట్టిన ఆమె, చిన్నప్పుడు తండ్రికి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కారణంగా ఆర్ధికంగా అనేక సమస్యలను ఎదురుకున్నారు. తల్లే కుటుంబ భారాన్ని మోయాల్సి వచ్చింది. అయినప్పటికీ వందన చదువుపై ఎలాంటి ప్రభావం రాకుండా చూసుకున్నారు తల్లిందండ్రులు. ఈ రోజు తన సక్సెస్‌కి కారణం తన చదువుతో పాటు తల్లిదండ్రుల కృషి ఉందని అంటారు వందన.

వందన మెహ్రోత్రా

వందన మెహ్రోత్రా


వ్యాపారంలో తన క్రియేటివ్ ఐడియాస్‌తో గుర్తింపు తెచ్చుకున్న వందన, ఓ ఉద్యోగినిగా నా ఐడియాలను అమలు పరిచే అవకాశం దొరికేది కాదని అంటారు. ‘1996 లో ‘నాగ్పూర్ యూనివర్సిటీ’ నుండి గ్రాడ్యూయేషన్ చేసిన ఆమె, ఓ నెల పాటు చిన్నపాటి ఉద్యోగం చేసి, ఆ తరువాత రామ్‌దేవ్‌బాబా కమలా నెహ్రూ ఇంజినీరింగ్ కాలేజ్‌లో లెక్చరర్ గా చేరారు. అప్పట్లో ఎంబీఏ చేయాలకున్నా... కుదరకపోవడంతో టీచింగ్ కంటిన్యూ చేసారు. ఇదంతా నచ్చక అహ్మదాబాద్‌లోని తన సోదరుడి దగ్గరికి వెళ్లి, అక్కడ ఐబీఎం కోర్సులు చేసారు. ఆ వెంటనే ఓ ట్రైనర్‌గా ఉద్యోగం సంపాదించిన వందన... 1999లో టీసీస్‌లో చేరారు. అక్కడే 2007 వరకూ పనిచేశారు.

అక్కడ ఉద్యోగం చేయడం తన కేరీర్‌ని మలుపు తిప్పిందని చెబుతారు. సుమారు 500 కంపెనీలతో పని చేసే అవకాశం అక్కడ దొరికిందని, అనంతరం న్యూజెర్సీలో మంచి టీమ్‌ని హాండిల్ చేసిన అనుభవం దక్కించుకున్నారు.

ఇండియా తిరిగి వచ్చిన వందన, 2003లో అంతా బాగానే సాగుతుందని అనుకున్న సమయంలో మెటర్నిటీ లీవ్‌లో వెళ్లారు. అయితే అదే సమయంలో జరిగిన కంపెనీ అప్రైజల్స్‌లో మాత్రం వెనకబడ్డారు. మళ్లీ 2005లో రెండో కూతురు పుట్టినప్పుడు కూడా ఇదే జరిగింది. కంపెనీ కోసం , తను కష్టపడి టీమ్ తయారు చేసినా... తనకు ప్రమోషన్ రాకపోవడంపై నిరాశ చెందారు. అప్పుడు తను సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన ఆమెలో కలిగింది. అదృష్టవశాత్తు నిత్యం సహకరించే భర్త కారణంగా నా సొంత ఆలోచనలను ఆచరణలోకి పెట్టగలిగానని అంటున్నారు వందన.

తన భర్త అంకుర్‌తో కలిసి విజయదరహాసంతో వందన

తన భర్త అంకుర్‌తో కలిసి విజయదరహాసంతో వందన


2006 నుండి మార్కెట్ గురించి తెలుసుకుంటున్న ఆమెకు, ఫుడ్ ప్లాజా వంటి ఐడియా వచ్చినా... అందులో శ్రమ ఎక్కువ, లాభాలు తక్కువగా ఉంటుందని భావించారు. అయితే ఇంత కాలం తనకు బలంగా ఉన్న ఐటీ రంగం వైపే మళ్లారు. భర్త అంకుర్‌తో కలిసి తన మొదటి కంపెనీ ‘మెటియోనిక్స్’ రిజిస్టర్ చేసుకున్నారు. అయితేప్రాడక్ట్ డెవలెప్మెంట్‌లోకి వెళ్లాలనుకున్న వాళ్లకు పెట్టుబడి సమస్యగా మారింది. అందుకు ముందు సర్వీస్ రంగంలో స్ధిరపడాలని భావించారు వందన. 200 కంపెనీలకు తమ కంపెనీ గురించి మెయిల్స్ పెట్టడం ప్రారంభించి, ఓ వ్యాపార వేత్తగా ఎదిగారు. మా ఓటమి మాకు ముందుకు సాగడం నేర్పించిందని అంటున్నారు.

ఇక అనేక సమస్యలు ఎదురుకుంటున్న సమయంలో ట్రైనింగ్ మరియు స్టాఫింగ్‌లో బలంగా ఉన్నామని భావించిన వందన, అక్కడా... సమస్యలను ఎదురుకున్నారు. చివరికి సాఫ్ట్‌వేర్ టూల్స్ వైపు మళ్లిన ఆమెకు, వివిధ కంపెనీలకు స్ధానిక సపోర్ట్‌గా నిలిచారు. ‘క్లాక్ వర్క్’ కంపెనీతో పొత్తు పెట్టుకున్న మొటియోనిక్స్ ఆ రంగంలో సక్సెస్ సాధించింది.

దురదృష్టవశాత్తు ఆర్ధిర మాంద్యం కారణంగా మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. సంతోషంగా ఎదుగుతున్న సమయంలో సమస్యలు మళ్లీ తలుపుతట్టాయి. ఈ కంపెనీని అలాగే ఉంచుతూ మరో రంగంవైపు కదలాలని అనుకున్న వందన, పిల్లల కోసం హాబీ స్టూడియా మొదలు పెట్టారు. అక్కడ లాభాలు సంపాదించాలని కాకుండా, నష్టం జరగకుండా నడిస్తే చాలనుకన్న వందనకు మళ్లీ నిరాశే మిగిలింది. దాన్ని మూసేసిన ఆమె, 2012లో ఫుడ్ మార్కెట్లో అడుగుపెట్టారు. ఈ సారి సక్సెస్ మాత్రం సక్సెస్ కొట్టారు. కానీ ఆ రంగంపై అంతగా ఆసక్తి లేకపోవడంతో వజ్రాల వ్యాపారంలో ఉన్న ‘గీతాంజలీ జువెల్స్’ ఫ్రాంచైజీ ప్రారంభించారు. ఈ రోజు తన సొంత స్టోర్ ‘నగీనా జెమ్స్’ గా వ్యాపారం చేస్తున్నారు.

రీటైల్ మార్కెట్‌ను అర్థం చేసుకోవడానికి 8 ఏళ్లు తీసుకున్న వందన, ఐటీ రంగం నుండి నేర్చుకున్నఐడియాలను ఇక్కడ పెట్టారు. ఈ రంగంలో విజయం కూడా పొందారు. కొంత కాలం తరువాత ‘యూ & యూ’ పేరుతో దుస్తుల వ్యాపారం కూడా ప్రారంభించారు.

“నేను అనుకున్న ప్లాన్‌కు నా భర్త సహకారం వల్ల ప్రతీ పని చేయగలిగానంటున్నారు. ఇంత సాహసం చేయడానికి తన సహకారం ఎంతో ఉందని అంటారు”, ఇక ఈ ప్రయాణంలో తను చేర్చుకున్నదేంటి అని అడిగిన ప్రశ్నకు, “ఓటమితో ఎప్పుడు భయపడలేదని, తన మనోబలం తనకు ముందుకు నడిపించిందని అంటున్నారు.”

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags