ఈ మాస్క్ ధ‌రిస్తే పొగ ద‌రికి రాదు !!

పొల్యూషన్ కి మాస్క్ తో సొల్యూషన్

By Sri
3rd Jan 2016
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

ప్రపంచమంతా కాలుష్యం. నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం... ఇలా రకరకాల కాలుష్యాలు. నీటి కాలుష్యం నుంచి తప్పించుకోవడానికి ఫిల్టర్ వాటర్ తాగుతారు. శబ్ద కాలుష్యం నుంచి తప్పించుకోవడానికి చెవులు మూసుకుంటారు. మరి వాయుకాలుష్యం నుంచి తప్పించుకోవడానికి ముక్కు మూసుకోలేం కదా! ఈ సమస్యకు మా దగ్గర ఓ పరిష్కారం ఉందంటోంది ఓ సంస్థ. 

ప్రాణం పోయాల్సిన గాలి కలుషితమై ప్రాణం తీస్తుండటం వారిని కలచివేసింది. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం కనుగొనాలని సంకల్పించారు. ఆ సంకల్పం ఫలితంగా ఓ ఉత్పత్తి ఆవిష్కృతమైంది.

image


ఢిల్లీలో గాలి కాలుష్యం గురించి ఇప్పుడు గోలగోల జరుగుతోంది. దేశంలోని పలు నగరాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన పరిశోధనల్లో వాయుకాలుష్యం ఎక్కువగా ఉన్న నగరంగా ఢిల్లీ రికార్డులకెక్కింది. మనదేశ రాజధాని ఇంతటి అపఖ్యాతి మూటగట్టుకోవడం మన దేశానికే చెడ్డపేరు తీసుకొస్తోంది. రాజధాని మాత్రమే కాదు.. దేశంలోని ప్రధాన పట్టణాల్లో వాయు కాలుష్యం తీవ్రత ఎక్కువగానే ఉంది. పట్టణాల్లో ఇలా గాలి నాణ్యత క్షీణిస్తుండటం ప్రమాదకరం. ఇండియాలో వాయు కాలుష్యం తీవ్రత గుర్తించి స్టాక్ హోం బిజినెస్ స్కూల్ కు చెందిన విద్యార్థులు ఎయిరినం పేరుతో ఓ మాస్క్ తయారు చేశారు. మార్కెట్లో మామూలుగా దొరికే మాస్కులతో పోలిస్తే ఇది చాలా విభిన్నం.

స్వీడన్ కు చెందిన అలెగ్జాండర్... 2014 సంవత్సరంలో ఇండియాకు వచ్చాడు. ఐఐఎంలో విద్యాభ్యాసం కోసం ఆరు నెలల పాటు అహ్మదాబాద్ కు వెళ్లాడు. అక్కడికెళ్లిన తొలి నెలలోనే వాయుకాలుష్యం కారణంగా తనకు ఆరోగ్య సమస్యలొచ్చాయి. ఆస్తమా లక్షణాలు గుర్తించాడు. ఓ మంచి మాస్క్ కోసం మార్కెట్ అంతా తిరిగాడు. రోజూ తొడుక్కోవడానికి వీలుగా ఉండే సురక్షితమైన మాస్క్ అలెగ్జాండర్ కు దొరకలేదు.

"స్కార్ఫ్ వేసుకొని వాయు కాలుష్యం నుంచి ప్రొటెక్ట్ చేసుకునే వాళ్లను వీధుల్లో చూశాను. అంతే తప్ప శ్వాసకోశవ్యాధులతో పాటు తీవ్రమైన అనారోగ్యానికి కారణమయ్యే వాయుకాలుష్యాన్ని తగ్గించడానికి ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ సమస్య గురించి ఏదైనా చేయాలని నేను అప్పుడే నిర్ణయించుకున్నాను. నేను తిరిగి స్వీడన్ వచ్చిన తర్వాత ఎయిరినం మాస్క్ తయారీపై దృష్టి పెట్టా-అలెగ్జాండర్.

స్వచ్ఛమైన గాలి ప్రాథమిక హక్కు

image


స్వీడన్ వెళ్లిన తర్వాత స్టాక్ హోం బిజినెస్ స్కూల్ లో ఫ్రెడ్రిక్ కెంప్, జొహన్నెస్ హెర్మన్, మెహ్దీ రెజ్రాజీలను కలుసుకున్నాడు అలెగ్జాండర్. తన ఐడియా గురించి వివరించాడు. మరికొందరు వ్యక్తుల్ని కలుసుకొని సలహాలు, సూచనలు అడిగాడు. అందరికీ ఐడియా బాగా నచ్చింది. అలెగ్జాండర్ తో కలిసి మాస్క్ తయారీపై బిజీ అయిపోయారు. తన ఐడియాకు బలమైన ప్రయోజనం ఉందని నమ్మిన అలెగ్జాండర్... ప్రపంచంలో గొప్ప మార్పు తీసుకొస్తుందని చెబుతున్నాడు. అందరూ కలిసి అత్యాధునికమైన బ్రీతింగ్ మాస్క్ ను తయారు చేశారు. బయట మార్కెట్లో దొరికే మాస్కులతో ఇది పూర్తిగా భిన్నం. స్వచ్ఛమైన గాలి పీల్చడం ప్రాథమిక హక్కు అనే నినాదంలో మార్కెట్లోకి వస్తోందీ సంస్థ. ఎయిర్ పొల్యూషన్ నుంచి బ్యాక్టీరియా, వైరస్, ఇతర కాలుష్యం నుంచి కాపాడుతుందీ మాస్క్. నిత్యం స్వచ్ఛమైన గాలిని పీల్చే అవకాశం ఇవ్వడమే కాదు... వాయు కాలుష్యం గురించి అవగాహన కల్పించడం ఎయిరినం ప్రాజెక్ట్ లక్ష్యం. హై క్వాలిటీ ప్రొటెక్షన్ అందించే ఈ మాస్క్ సౌకర్యవంతంగా ఉంటుంది. కేవలం ఆరోగ్యం ఒక్కటే కాదు... స్టైల్ పైనా దృష్టి పెట్టారు. అర్బన్ యూత్ టేస్ట్ కు తగ్గట్టుగా మాస్క్ డిజైన్ చేస్తున్నారు.

"అర్బన్ ప్రజలు కోరుకున్నట్టుగా మాస్క్ లను డిజైన్ చేస్తున్నాం. మొహానికి మాస్క్ వేసుకోవాలంటే చికాకుగా భావించకూడదన్నది మా కాన్సెప్ట్. ఇక మా ఆశయం ఏంటంటే... భవిష్యత్తులో అసలు ఈ మాస్క్ అవసరమే రాకూడదు. వాయు కాలుష్యం ఆ స్థాయిలో తగ్గిపోవాలి" - అలెగ్జాండర్

ప్రొడక్ట్ ను తీర్చి దిద్దడం వీరికి పెద్ద సవాలైంది. అందరి మొహాలు వేర్వేరుగా ఉంటాయి. వారికి తగ్గట్టుగా మాస్కులను రూపొందించడం ఓ ఛాలెంజ్ గా మారింది. ఎయిర్ లీకేజ్ కాకుండా, సరిగ్గా ఫిట్ అయ్యేలా మాస్క్ తయారు చెయ్యడంలో సక్సెస్ అయ్యారు. అందరి మొహాలకు సులువుగా బిగిసిపోయేందు సాగే గుణమున్న పాలిస్టర్ లాంటి వస్త్రంతో మాస్క్ ను తయారు చేశారు. అధిక రక్షణ అందించేందుకు అడ్వాన్స్ డ్ మల్టీలేయర్ టెక్నాలజీతో తయారు చేసిన ఫిల్టర్ ను ఇందులో ఉపయోగించారు. శ్వాస తీసుకున్నప్పుడు దుర్వాసన, దుమ్ముధూళి, బ్యాక్టీరియా, వైరస్, పోలెన్, పీఎం2.5 కణాలను 99.9 శాతం ఫిల్టర్ చేస్తాయి.

"మొదట్లో చాలా ప్రయోగాలు చేశాం. చివరకు సౌకర్యవంతంగా తయారు చేయడంలో మేం సక్సెస్ అయ్యాం. ఇతర మాస్క్ లు చాలా రోజులు వాడిన తర్వాత శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని యూజర్లు చాలామంది చెప్పారు. అందుకే శ్వాసక్రియకు ఆటంకంలేని మాస్క్ తయారు చేసేందుకు ప్రత్యేకమైన మెటీరియల్ ఉపయోగించాం" - అలెగ్జాండర్.

ఎయిర్ ఫర్ టుమారో

ఎయిర్ ఫర్ టుమారో నినాదంతో రూపొందిస్తున్న నెక్ట్స్ జెన్ అర్బన్ బ్రీతింగ్ మాస్కులను ఆన్ లైన్ లో అమ్మడమే వీరి వ్యాపార వ్యూహం. భాగస్వాములతో టీమ్ ని ఏర్పాటు చేసుకొని రంగంలోకి దిగారు. స్థిరమైన వేగంతో వ్యాపారంలో పుంజుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వీరి బృందంలో స్వీడన్, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చిన సభ్యులున్నారు. అందరూ బిజినెస్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్సే. 23 నవంబర్ 2015న ప్రారంభమైన తొలిరోజుల్లోనే మంచి సక్సెస్ సాధించింది. ప్రాజెక్ట్ గురించి ప్రపంచానికి చెప్పిన 24 గంటల వ్యవధిలో భారీగా నిధులొచ్చాయి. యూరప్, యూఎస్, ఆసియాల్లోని 30 దేశాలకు చెందిన వారి మద్దతు లభించింది. డిసెంబర్ 27, 2015 వరకు వీరు నిర్వహించిన క్యాంపైన్ లో 1,386 మంది మద్దతుగా నిలిచారు. అనుకున్న దానికంటే ఏడు రెట్లు ఎక్కువగా నిధులు సేకరించగలిగారు.

వీరి బిజినెస్ మోడల్ వినూత్నంగా ఉంది. ఫిల్టర్స్ కోసం సబ్ స్క్రిప్షన్స్ ఆహ్వానిస్తున్నారు. ఫిల్టర్లు మార్చుకొని మాస్క్ ని తిరిగి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లో దొరికే ఫిల్టర్ల జీవితకాలం పరిమితం. కొంతకాలం తర్వాత ధూళికణాలతో ఫిల్టర్ మూసుకుపోతుంది. అందుకే ఎక్కువకాలం మన్నేలా వీళ్లు ఫిల్టర్లు రూపొందిస్తున్నారు. పరిశుభ్రంగా ఉండేందుకు తరచూ ఫిల్టర్లను మారుస్తుండమని కస్టమర్లకు సూచిస్తున్నారు. భవిష్యత్తులో రకరకాల మాస్కులను తయారు చేయాలనుకుంటోంది.

"ప్రస్తుతానికైతే వాయు కాలుష్యం ద్వారా వచ్చే తీవ్రమైన ఆరోగ్య సమస్యల నుంచి రక్షించాలనుకుంటున్నాం. జనం వారిని ప్రొటెక్ట్ చేసుకోగల ఉత్పత్తులు తయారు చేసివ్వడం మా మొదటి అడుగు. దాంతో పాటు నేరుగా కాలుష్యాన్ని తగ్గించే ఉత్పత్తులు తయారు చేయాలనుకున్నాం. వాయు కాలుష్యం గురించి వివరిస్తూ జనానికి చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. కాలుష్యాన్ని వీలైనంత వరకు తగ్గించి స్వచ్ఛమైన గాలిని అందించడమే మా ఆశయం" -అలెగ్జాండర్.
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close
Report an issue
Authors

Related Tags

మా రోజువారీ వార్తాలేఖ కోసం సైన్ అప్ చేయండి

Our Partner Events

Hustle across India