కరెంట్, వాటర్ బిల్ ఎంతరావచ్చో లెక్కగట్టి ముందే చెప్పేసే 'బిల్ ప్రెడిక్ట్'

జెనాటిక్స్‌తో ప్రారంభమై జెన్సాఫ్ట్ వరకూ సాగిన జెర్నీరాజధాని జనం కోసం ముందుకొచ్చిన యాప్ప్రభుత్వ పధకాలు పొందాలంటే యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే దేశం మొత్తం విస్తరించే యోచనలో బిల్ ప్రెడిక్ట్

14th May 2015
 • +0
Share on
close
 • +0
Share on
close
Share on
close

కొన్ని దశాబ్దాల క్రితం టెక్నాలజీ ప్రాచూర్యంలోకి రాని రోజులవి. చాలా విషయాలకు ఎన్నో ప్రయాసలు పడాల్సి వచ్చేది. ఆయాసాలు అలవాటుగా మారిపోయేవి. కానీ ఇప్పుడలా కాదు. అన్ని ఎంతో సౌకర్యంగా మారిపోయాయి. రోజువారీ పనులు సైతం టెక్నాలజీ సాయంతో ఎంచక్కా చేసుకునే వెసులుబాటుంది. డేటాను భద్రపరుచుకొని చేసుకోగల పనులు చాలా ఉన్నాయి. అలాంటి విషయాల్లో టెక్నాలజీ సాయం ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఢిల్లీ ఐఐటికి చెందిన ముగ్గురు పూర్వ విద్యార్థులు ప్రారంభించిన జెనాటిక్స్ విద్యుత్ వినియోగాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. విద్యుత్ వినిమయాన్ని గుర్తించి దాన్ని విశ్లేషిస్తుంది. దీంతో ఎనర్జీని సేవ్ చేయడం, ఖర్చులను తగ్గించుకోవడం సాధ్యపడుతుంది. దీనికి సాధారణ చార్జీలు వసూలు చేస్తారు. జెన్సాఫ్ట్ ఒక బిటుబి ప్రాడక్ట్. ఇటీవల బిటుసి స్పేస్ లో బిల్ ప్రెడిక్ట్‌ను కూడా లాంచ్ చేసింది.

అసలేంటీ బిల్ ప్రెడిక్ట్ ?

బిల్ ప్రెడిక్ట్ అనేది విద్యుత్, నీటి వినియోగానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఎంత ఉపయోగించారో తెలియజేస్తుంది. దీని ద్వారా వారు వినియోగాన్ని తగ్గించుకునే వెసులుబాటు ఉంటుంది. తద్వారా ఢిల్లీ వాసుల జేబు భారాన్ని కొద్దిగానైనా తీర్చే వెసులుబాటు కలుగుతుంది. ఇటీవలి ఢిల్లీ ప్రభుత్వం రాజధాని జనం కోసం ఓ ప్రత్యేక పధకాలని ప్రవేశ పెట్టింది. నెలకి 20 కిలోలీటర్ల వరకూ నీటికి ఎలాంటి చార్జీలు వసూలు చేయరు. అంటే మొత్తం సబ్సడీయే అన్నమాట. ఇక కరెంట్ విషయంలో కూడా 400 యూనిట్ల వరకూ యాభై శాతం సబ్సిడీ వర్తిస్తుంది. 400యూనిట్లు దాటితే మొత్తం సబ్సిడి పోయినట్లే లెక్క. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత వినియోగం జరిగింది, సబ్సిడి వర్తించాలంటే ఎంతవరకూ ఉపయోగించాలి లాంటివి ఈ యాప్ ద్వారా తెలుసుకొచ్చు. మీటర్ రీడింగ్ తీసుకొని దాన్ని యాప్‌లో నమోదు చేస్తే .. దాన్ని విశ్లేషించి గడిచిన వాటితో కలుపుకొని ఎంత వాడకం జరిగిందానిపై స్పష్టత ఇస్తుంది. దీని ద్వారా సబ్సిడి లిమిట్ దాటే పరిస్థితి వస్తే.. అలర్ట్ చేస్తుంది.

image


దీని వెనకున్న టీం

ఐఐటి,ఢిల్లీ పూర్వ విద్యార్థులైనా రాహుల్ భల్లా, విశాల్ భన్సాల్, అమర్జిత్ సింగ్‌లు జెనటిక్స్ సొల్యూషన్‌ని 2013లో ప్రారంభించారు. కమర్షియల్ ప్రాజెక్ట్ జెన్సాఫ్ట్‌ను కూడా ఇదే ఏడాది లాంచ్ చేశారు. అమెరికాలోని నెస్ట్ కంపెనీకి పోలి ఉంటుంది జెనటిక్స్ . వ్యవస్థాపకులైన ఈ ముగ్గురూ 16 ఏళ్ల నుంచి స్నేహితులు. జెనటిక్స్‌కు ముందు వీళ్లంతా వేరు వేరు కంపెనీల్లో , వివిధ హోదాల్లో పనిచేశారు. సిఈఓ రాహుల్ స్ట్రాటజి, సేల్స్, ఫార్మింగ్, డెలివరీలో పదకొండేళ్లకు పైగా పనిచేసిన అనుభవం ఉంది. యునైటెడ్ లెక్స్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. సిఓఓ విశాల్ ఐఐఎం-ఎ నుంచి డిగ్రీ పొందారు. ఫైనాన్స్‌కి సంబంధించిన అనుభవం ఉంది. భారత్, హాంకాంగ్,నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా తిరిగి వచ్చారు. అమర్జిత్ యూసిఎల్ఏ నుంచి ఎంఎస్, పిహెచ్.డి. పొందారు. ఢిల్లీ ఐఐటిలో అసిస్టెంట్ ప్రొఫెషర్‌గా ఉన్నారు. వీరు ముగ్గురూ తయారు చేసిన ఈ యాప్ ఢిల్లీవాసులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పాత డేటాతో విశ్లేషించి కొత్తదాన్ని తయారుచేస్తుంది. నూటికి తొంబై తొమ్మిది శాతం కచ్చితమైన విశ్లేషణనిస్తోంది జెన్సాఫ్ట్. ఈ యాప్ కూడా చాలా సింపుల్‌గా జనానికి సులువుగా ఉండేలా తయారు చేశారు. డెయిలీ వాటర్, కరెంట్ ఎంత వినియోగం జరిగిందనే గ్రాఫ్‌ని కూడా చూపిస్తుంది. ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకొనే వెసులుబాటుంది. ప్రతి రోజూ క్రమం తప్పకుండా పుష్ నోటిఫికేషన్లను ఇస్తుంది.

రాహుల్ భల్లా, అమర్జిత్ సింగ్‌,విశాల్ భన్సాల్

రాహుల్ భల్లా, అమర్జిత్ సింగ్‌,విశాల్ భన్సాల్


చేయాల్సింది ఇంకా ఉంది

యాప్ ఎంతో ఇంట్రస్టింగ్ ఉన్నప్పటికీ కొద్దిగ ఎక్కడో చిన్న లోపం కూడా కనిపిస్తోంది. తొందరలోనే మరికొన్ని ఫీచర్లను దీనికి యాడ్ చేస్తామని అమర్జిత్ అన్నారు. దీంతో దేశంలో ఎక్కడి వారైనా దీన్ని ఉపయోగించుకొనే వెసులుబాటు కలిగిస్తామని చెబ్తున్నారు. యూజర్లు మ్యాన్యువల్‌గా డేటాను ఎంటర్ చేస్తున్నారు. కానీ భవిష్యత్ లో స్మార్ట్ మీటర్లను ఇళ్లలో ఇన్‌స్టాల్ చేసేలా ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీంతో ఆటోమేటిగ్ గా ప్రాసస్ పూర్తవుతుంది.

image


‘బిల్ ప్రెడిక్ట్’ అనేది చాలా ఇంట్రస్టింగ్ యాప్. ఈ టీంలో ఎంతో అనుభవం ఉన్న సభ్యులున్నారు. ఇది ఏరకంగా రూపాంతరం చెందనుందో, ఎలాంటి మార్పులు రానున్నాయో తెలియాలంటే కొంతకాలం వెచిచూడాల్సిందే.

 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • WhatsApp Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • WhatsApp Icon
 • Share on
  close
  Report an issue
  Authors

  Related Tags