పోటాపోటీ ఉన్నా హైపర్ లోకల్‌లో 'జాపర్' పట్టు

జోపర్ తో ధరలు పోల్చుకునే అవకాశం30కు పైగా నగరాల్లో విస్తరణఈ-కామర్స్ తో పోటీపడుతున్న ఎం-కామర్స్

పోటాపోటీ ఉన్నా హైపర్ లోకల్‌లో 'జాపర్' పట్టు

Thursday September 03, 2015,

4 min Read

మొబైల్ లో ఒక్క క్లిక్ మనిపిస్తే చాలు...మనకు కావాల్సిన వస్తువు ఇంటికొస్తుంది. ఆన్ లైన్ షాపింగ్ కోసం ఎన్నో యాప్‌లు వెలిశాయి. నచ్చిన వస్తువులను మన చెంతకు చేరుస్తున్నాయి. అయితే ఆన్ లైన్ షాపింగ్లో కొన్ని లోపాలు ఉన్నాయి. మొబైల్ లోనో, కంప్యూటర్ లోనో వస్తువు నచ్చుతుంది కానీ....దాన్ని పోల్చిచూసుకునే అవకాశం ఉండదు. భారతీయులకు ఏదన్నా ఓ వస్తువు చూసిన వెంటనే కొనేసే అలవాటుండదు. అలాంటి వస్తువే మరో షాపులో ఎంతకు దొరుకుతుందో కనుక్కోవాలనుకుంటాం. వీలైతే రెండు మూడు షాపులు తిరిగి మనకు ఎక్కడ చౌకధరలో దొరుకుతుందో తెలుసుకుని నాణ్యత అన్నీ చూసుకుని ఇష్టమైన చోట కొనుక్కుంటాం. ఏ వస్తువునైనా రెండు, మూడు సార్లు, రెండు, మూడు చోట్ల పరిశీలించకపోతే మనకు సంతృప్తి ఉండదు. సరుకులు, డ్రెస్సులు, యాక్సెసరీలు.. ఇలా ఏవైనా కావొచ్చు. అందుకే మన మనస్తత్వానికి తగ్గట్టుగా సేవలందిస్తోంది ఒక హైపర్ లోకల్ మార్కెట్ ప్లేస్. అదే జాపర్. లెట్స్ గో షాపింగ్ అనేది జోపర్ టాగ్. నాణ్యమైన ఉత్పత్తులను చౌకధరలకు అందించే గ్యారంటీ ఇస్తోంది ఈ మొబైల్ యాప్. ధరలను సరిపోల్చుకుని....తక్కువ ధరకు లభించే చోట మనం కావల్సిన వస్తువులను కొనుక్కోవచ్చు.

రీటైల్ రంగంలో జాపర్ గణనీయ పాత్ర పోషిస్తోంది. స్థానిక వ్యాపారులను, వినియోగదారులతో అనుసంధానించటం ద్వారా అటు వ్యాపారులకు, ఇటు కస్టమర్లకు ఇద్దరికీ మేలు చేకూరుస్తోంది. గత కొన్నేళ్లగా హైపర్ లోకల్ సెక్టార్ భారీ స్థాయిలో విస్తరిస్తోంది. ప్రస్తుతం ఈ రంగంలోకి ఎంతో మంది ప్రవేశిస్తున్నారు. జాపర్ కూడా అలానే ప్రవేశించింది. కొద్దికాలంలోనే వినియోగదారులకు చేరువై ఇక్కడ పాగా వేసింది. 2012 డిసెంబరులో నీరజ్ జైన్, కుయిలా కలిసి జాపర్ ప్రారంభించారు.

జాపర్ యాప్ ద్వారా ఐదు లక్షలకు పైగా రీటైల్ మార్కెట్లను మనం సందర్శించవచ్చు. ఆన్ లైన్ ధరలుతో పాటు...ఆఫ్ లైన్ రేట్లూ యాప్ ద్వారా సరిచూసుకోవచ్చు. ఇంట్లో కూర్చుని మొబైల్‌లో ఆయా వస్తువులను, ధరలను పోల్చి చూసుకోవచ్చు. ఓ వస్తువు కొనాలనుకున్నప్పుడు ఏయే షాపుల్లో ఎంతెంత ధర ఉందో పరిశీలించి మనకు చౌకధరకు లభించే షాపును ఎంపికచేసుకోవచ్చు. యాప్ ను చూస్తూ ఉంటే...మనకు కలిగే షాపింగ్ అనుభూతిని మాటల్లో చెప్పలేం.

ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాల కోసం దేశంలో ఏర్పాటయిన తొలి హైపర్ లోకల్ మార్కెట్ ప్లేస్ జాపర్ అని సంస్థ సీఈవో, సహవ్యవస్థాపకులు నీరజ్ జైన్ చెబుతారు. టెక్నాలజీకి పెద్ద పీట వేయటం ద్వారా జాపర్ వస్తువు నిజమైన విలువను వినియోగదారులకు తెలియజేస్తోంది. వినియోగదారులకు అవసరమైన వస్తువుల కోసం షాపింగ్ చేయటమంటే...జాపర్‌ను విజిట్ చేస్తే చాలు. స్థానిక షాపుల్లో చౌకధరల గురించి తెలియజేయటమే కాకుండా...కోరుకున్న వస్తువులను 24 గంటల్లో ఇంటివద్దకు చేరుస్తుంది. జాపర్ ద్వారా ఎలాంటి అవాంతరాలు లేకుండా షాపింగ్ చేసిన అనుభూతి పొందొచ్చు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ రీటైలింగ్ షాపుల్లో దొరికే అన్ని రకాల వస్తువుల గురించి విస్తృత సమాచారం అందిస్తుంది.

జాప‌ర్ టీమ్‌

జాప‌ర్ టీమ్‌


ఆన్ లైన్, ఆఫ్ లైన్ రెండింటిపైనా దృష్టి

జోపర్ 30కు పైగా నగరాలలో స్థానిక వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకుంది. తన బ్రాండ్ ద్వారా మార్కెటింగ్ పై దృష్టిపెట్టింది. ఒప్పందాలు, సాంకేతికత ద్వారా కంపెనీ వృద్ధిని సరిచూసుకుంటోంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ మార్కెటింగ్ రెండింటిలోనూ చురుగ్గా ఉంటోంది. డిజిటల్ ప్రచారం, సోషల్ మీడియా ప్రచారం, వినియోగదారులతో నిరంతర సంప్రదింపులు, వారిని ఆకర్షించేందుకు రీటైల్ షాపుల బ్రాండింగ్ వంటి మార్కెట్ వ్యూహాలను జోపర్ అనుసరిస్తోంది.

ప్రారంభమైన దగ్గరి నుంచి జాపర్ నిరంతరం వృద్ధి సాధిస్తోంది. గత ఏడాది ఒక నగరం నుంచి పది నగరాలకు విస్తరించిన జాపర్ ఈ ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 30కు పైగానగరాలకు వ్యాపించింది. జాపర్ యాప్‌లో దాదాపు 5లక్షల మంది వ్యాపారుల జాబితా ఉంది. యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న వారి సంఖ్య పదిలక్షలకు చేరువలో ఉంది.

పెట్టుబడుల ప్రవాహం

జాపర్ కు నిధుల కొరత ఏమాత్రం లేదు. 2014లో అనేక సంస్థల నుంచి సిరీస్ ఎ కింద నిధులు అందాయి. మార్‌క్వీ ఇన్వెస్టర్ల నుంచి 6.6 మిలియన్ డాలర్లు సమకూరాయి. టైగర్ గ్లోబల్, బ్లమ్ వెంచర్స్, నిర్వానా వెంచర్స్ అడ్వైజర్ల నుంచి కూడా నిధులు వచ్చాయి. కంపెనీని మరింత బలోపేతం చేయటానికి ఈ నిధులు ఉపయోగిస్తున్నారు. ఈ ఏడాది కూడా కంపెనీలోకి సిరీస్ బి కింద పెట్టుబడులు వచ్చాయి. టైగర్ గ్లోబల్, నిర్వానా వెంచర్స్ అడ్వైజర్స్ ఇంకోసారి 20 మిలియన్ డాలర్ల నిధులు అందించాయి. వీటి ద్వారా విస్తరణ ప్రణాళికలు అమలు చేయాలని, వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని జోపర్ భావిస్తోంది.

హైపర్ లోకల్ సెక్టార్‌లో స్థిరంగా వృద్ధి సాధిస్తూ.. నిధులు సమకూర్చుకుంటోంది జోపర్ ఒక్కటే కాదు. ఇతర సంస్థలు కూడా ముఖాముఖి తలపడుతూ ఈ రంగాన్ని మరింత పోటీదాయకంగా మార్చివేశాయి.

హైపర్ లోకల్ డెలివరీ ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా భారీ మార్పులొచ్చాయి. గ్రోఫర్స్, స్విగ్గీ, టైనీ ఓల్, పెప్పర్ టాప్ వంటి డెలివరీ మోడళ్లు ప్రముఖ వెంచర్ క్యాపిటల్ సంస్థల నుంచి పెద్ద స్థాయిలో పెట్టుబడులను రాబట్టుకున్నాయి.

టైగర్ గ్లోబల్ మేనేజ్ మెంట్, సెకోయో క్యాపిటల్ నేతృత్వం వహిస్తున్న కిరాణా వస్తువుల డెలివరీ మోడల్ గ్రాఫర్స్‌కు ఈ ఏడాది ఏప్రిల్ లో 35 మిలియన్ డాలర్ల నిధులు సమకూరాయి. ఫిబ్రవరిలో నార్వెస్ట్ వెంచర్ పార్టనర్స్, సెయిఫ్ పార్టనర్స్, యాక్సెల్ ఇండియా పార్టనర్స్ స్విగ్గీలో 16.5 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. అదే నెలలో టైనీ ఓల్‌కు సెకోయా క్యాపిటల్, నెక్సస్ వెంచర్స్, మ్యాట్రిక్స్ పార్ట‌నర్స్ ఇండియా వంద కోట్లు నిధులు అందించాయి.

ఈ కామర్స్ సైట్లతో పోటీ

ప్రత్యక్ష పోటీ విషయానికొస్తే....ఈ రంగంలో అలాంటి వాటికి అవకాశం లేదు. స్థానిక రీటైలర్లు కాని ఎవరితోనైనా సంస్థలకు పోటీ ఉంటుంది. వినియోగదారులకు అవసరమయ్యే వస్తువులను ఆన్ లైన్ అందుబాటులో ఉంచుతున్న ప్రధాన ఈ కామర్స్ సంస్థలు, ఇతర సంస్థలతోనే తాము పోటీ పడతామని జాపర్ వంటి కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు. స్నాప్ డీల్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్, జస్ట్ డయల్, ప్రైస్ బాబ్ వంటి సంస్థలతోనే జోపర్ పోటీపడుతుంది.

ఈ-కామర్స్, ఎం-కామర్స్ పోటాపోటీ

ఈ కామర్స్ రంగం కొన్నేళ్లగా అసాధారణ రీతిలో పెరుగుతోంది. 600 శాతం పైగా పెరుగుదల నమోదు చేసుకున్న ఈ రంగం 2014లో 16 బిలియన్ డాలర్ల మార్కును చేరుకుంది. అయితే ప్రస్తుతం ఈ-కామర్స్ రంగాన్ని అధిగమించటానికి ఎం-కామర్స్ సిద్ధంగా ఉంది. కొన్నేళ్లగా 200 శాతం వృద్ధిని నమోదు చేస్తున్న ఎం-కామర్స్ అంతర్జాతీయంగా సంప్రదాయ ఈ-కామర్స్ ను అధిగమించింది. భారత్‌లోనూ ఇదే జరగనుంది. మొబైల్‌లో ఇంటర్నెట్ వాడుతున్న వారి సంఖ్య భారత్ లో అసాధారణ స్థాయిలో పెరుగుతోంది. ఈ ఏడాది జూన్ నాటికి వారి సంఖ్య 213 మిలియన్లు దాటింది.

భారత రీటైల్ మార్కెట్ 2020 నాటికి 650 మిలియన్ డాలర్ల నుంచి ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది. హైపర్ లోకల్ బిజినెస్ వ్యాప్తికి దేశంలో అపారమైన అవకాశం ఉంది. మరింతమంది రీటైలర్లను హైపర్ లోకల్ బిజినెస్‌కు అనుసంధానం చేసి....లాభాలను పంచగలిగితే...అనుకున్న లక్ష్యాన్ని తేలిగ్గా సాధించవచ్చని నీరజ్ చెప్పారు.

మన దేశ ఆర్థిక వ్యవస్థలో రిటైల్ రంగానికి ప్రముఖ స్థానం ఉంది. రీటైల్ రంగం ఆదాయం అంతకంతకూ పెరుగుతోంది. అలాగే ఆన్ లైన్ షాపింగ్ నగరాలు, పట్టణాలను దాటి గ్రామాల్లోనూ ప్రవేశించింది. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగటంతో ఆన్ లైన్ లోనే షాపింగ్ అంతా జరుగుతోంది. జోపర్ లాంటి సంస్థలు ఉత్పత్తుల గురించి, చౌకధరల గురించి విరివిగా అందించే సమాచారం వినియోగదారులకూ, వ్యాపారులకూ లాభం చేకూరుస్తుంది. జోపర్ మరింతగా విస్తరించి అందరికీ చేరువయితే ఆన్ లైన్ షాపింగ్ మరింత తేలిక కానుంది.