Brands
Discover
Events
Newsletter
More

Follow Us

twitterfacebookinstagramyoutube
ADVERTISEMENT
Advertise with us

ఈ ఆన్‌లైన్ సెలబ్రిటీకి ఒబామా ఫ్రెండ్ రిక్వెస్ట్ !

ఈ ఆన్‌లైన్ సెలబ్రిటీకి ఒబామా ఫ్రెండ్ రిక్వెస్ట్ !

Tuesday November 03, 2015 , 6 min Read

శక్తి వడక్కేపట్.. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా కనిపిస్తారీయన. భార్యకు జీవిత భాగస్వామి. కుటుంబానికి సౌకర్యాలు కల్పించే వ్యక్తి. కొడుకుకి ఆయనొక హీరో. తల్లి కంటికి కంటిపాప. ట్విట్టర్ ప్రపంచానికి ఓ సెలబ్రిటీ. చూసేందుకు, వినేందుకు, ముట్టుకునేందుకు కూడా అవకాశమిచ్చే వ్యక్తి. తన పాఠకులకు టెక్నాలజీ నిపుణుడు. స్టార్టప్‌లకు మార్గదర్శకుడు. చివరగా ఒక మాటలో చెప్పాలంటే శక్తి ఒక కింగ్ పిన్. ప్రకృతితో పోరాడే శక్తి ఆయన. సోషల్ మీడియాలో వెక్కిరింపులకు వెరవకుండా ఏమాత్రం సంకోచాలు లేకుండా నడుచుకోగలిగారు. ఫాలోయర్స్‌కు తన పోస్ట్‌ల ద్వారా రోజూ ఉత్సాహాన్ని అందించే శక్తి ప్రదాత. అన్నింటికీ మించి ఓ కంప్లీట్ మ్యాన్.

image


భారతీయ సమాజానికి శక్తి ఓ వికలాంగుడు

పుట్టినపుడు శక్తి అందరిలాంటివాడే. కానీ చిన్న వయసులో ఓ సారి జ్వరం వచ్చి ఎంతకూ తగ్గలేదు. ఒక వైద్యుడు ఇతని శరీరానికి సరిపడని ఇంజెక్షన్ చేయడంతో.. ఆ జ్వరం అంతకంతకూ పెరగసాగింది. ఈ సమయంలో కుడివైపు శరీరభాగాలన్నీ ఉబ్బిపోవడం ప్రారంభించాయి. “వైద్య పరిభాష ప్రకారం నేను చనిపోయినట్లుగా డిసైడ్ చేశారు. ఏదైనా ఆశ్రమంలో నన్ను వదిలేసి, మరో పిల్లాడి కోసం ప్రయత్నించాలని మరొక డాక్టర్ నా పేరెంట్స్‌కి సలహా ఇచ్చాడు. నన్ను వైద్యం కోసం తీసుకోవడానికి డాక్యుమెంట్స్ పూర్తి చేయాల్సిందిగా కోరారు. కానీ తల్లిదండ్రులు మాత్రం నేను బతికే ఉన్నానని నమ్మారు. సాధారణ పిల్లల మాదిరిగా ట్రీట్ చేయాలని నిర్ణయించుకుంది మా అమ్మ. అప్పటికి నా కుడివైపు శరీర భాగాలన్నీ చచ్చుబడిపోయాయి.”-శక్తి వడక్కేపట్

శక్తి వడక్కేపట్

శక్తి వడక్కేపట్


నించునే అవకాశం లేకపోవడంతో.. చిన్నతనమంతా పాకడంతోనే సరిపోయింది. అయితే.. ఈ ప్రభావం చదువుపై మాత్రం పడలేదు. ఉన్నత విద్యాభ్యాసం చేసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఎదగడమే కాదు.. ప్రేమించి పెళ్లాడారు కూడా.

“ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నపుడు కంప్యూటర్ క్లాసులో ఓ అమ్మాయిని చూశాను. అదే కంప్యూటర్ క్లాస్‌లో మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. మరో కంప్యూటర్ క్లాస్‌లో ఆమెకు నా ప్రేమను ప్రపోజ్ చేశాను. ఇప్పటికి మా పెళ్లి జరిగి 18 ఏళ్లు పూర్తయింది. ఈ సుదీర్ఘ కాలంలోమా బంధం ఎంతో బలపడింది.”అని చెప్పారు శక్తి.

ఇంజినీరింగ్ తర్వాత శక్తి ఐటీ రంగంలో ఉద్యోగం చేయడం ప్రారంభించారు. ఇరవై ఏళ్ల పాటు విధుల నిర్వహణలో ఎంతో అలిసిపోయి.. చివరకు తనకు తానే బాస్‌గా ఎదిగారు.

“ఒక డేటా సెంటర్‌లో సిస్టం అడ్మినిస్ట్రేటర్‌‌గా వెయ్యి రూపాయల జీతంతో ఉద్యోగ జీవితం ప్రారంభించాను. అక్కడిని నన్ను తీసుకొచ్చి, తీసుకెళ్లేందుకు మా నాన్నకు అంతకంటే ఎక్కువ ఖర్చయ్యేది. సాంకేతిక సంబంధిత విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఎక్కువ. అందుకే ఇతర అంశాలు పెద్దగా పట్టించుకోలేదు. కొన్నిసార్లు సోమవారం నాడు ఆఫీస్‌కి వెళ్లి గురువారం తిరిగొచ్చేవాడిని.”

అలుపెరగని శ్రామికుడే !

క్రమంగా ఈయన నెట్వర్కింగ్‌లో నిపుణుడిగా అభివృద్ధి సాధించి, అమెరికా వెళ్లారు. అక్కడ బ్లాగింగ్, ట్వీటింగ్‌లతో అనుబంధం ఏర్పడింది. అక్కడి నుంచి జరిగినదంతా చరిత్రగా చెప్పాలి. ట్విట్టర్‌తో ఈయకు ఉన్న రిలేషన్ని పోల్చాలంటే.. అలెగ్జాండర్ తన సామ్రాజ్యాన్ని పెంచుకున్నట్లే అనాలి. ట్వీట్స్ చేశారు, సలహాలిచ్చారు, తన ఫాలోయర్స్‌‌ని ఉర్రూతలూగించారు.

“నేను ట్విట్టర్‌‌లోకి అడుగుపెట్టాక.. ఆ మాధ్యమం బాగా నచ్చింది. ఒక టెకీగా నా బ్యాక్‌గ్రౌండ్ ఇతరులకు సహాయపడేందుకు సహకరించింది. ఇలా ఒక్కో విషయం కొనసాగుతూ.. ప్రజలు నన్ను ఫాలో కావడం ప్రారంభించారు. ”

అంగవైకల్యంపై అవహేళన

ట్విట్టర్‌లో ఎదురైన కొన్ని సంఘటలను ఇక్కడ చెప్పుకోవాలి. ఈయనకు లభిస్తున్న ఫాలోయింగ్ చూసి, కొంతమంది విషం చిమ్మే ప్రయత్నం చేశారు.

“ఓ సమయంలో ఓ గ్రూప్ ఉద్దేశ్యపూర్వకంగా నేను ఆన్‌లైన్‌లో ఉన్నపుడు ట్వీట్ దాడి చేసేవారు. ఇది విపరీతమయిపోయిన పరిస్థితిలో.. నా స్నేహితుల్లో ముగ్గురు ట్విట్టర్ అకౌంట్‌ని వదిలేయడాన్ని ఖండిచారు. ట్వీట్‌లతో పాటే బ్లాగ్ కూడా నిర్వహించాలని ప్రోత్సహించారు.”

డిజిటల్ ప్రపంచంలో ఉండే సౌలభ్యం ఇదే అని చెప్పచ్చు. ఒక మార్గం మూసుకుపోయినపుడు.. సులభంగా హ్యాక్ చేయగలిగే మరొక మార్గం ఓపెన్ అవుతుంది.

“నా అభిప్రాయాలు ఎప్పటికప్పుడు పంచుకోవడానికి నాకో ప్లాట్‌ఫాం ఉండాలనే ఆలోచన అప్పుడే వచ్చింది. అలాంటప్పుడు లభించిన మార్గమే 'ది క్విల్'. అలెక్సా ర్యాంకింగ్స్‌‌లో టాప్‌కి చేరాలని.. ఓ సూపర్బ్ డొమైన్ మెయింటెయిన్ చేయాలన్న కోరికలు నాకు లేవు. అలాగే ఒక్కో పోస్ట్‌కి 2వేల డాలర్లు సంపాదించేయాలని ఇప్పటికీ అనుకోను. ప్రజలతో టచ్‌లో ఉండేందుకు రాస్తానంతే. అవే ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం నేను మార్గనిర్దేశం చేస్తున్న స్టార్టప్‌లతో టచ్‌లో ఉండేందుకు ది క్విల్ ప్లాట్‌‌ఫాం నాకు ఉపయోగపడింది ”అన్నారు శక్తి.

image


హ్యూగో బర్రా, మను కుమార్ జైన్.. వంటి అత్యంత ప్రభావం చూపగల వ్యక్తుల లైక్స్‌ను లెక్కించే అవకాశం కల్పించిన ది క్విల్‌‌కు శక్తి కృతజ్ఞతలు చెబ్తున్నారు.

“అవును, వారే నా నిజమైన స్నేహితులు. వారికి నేనేంటో తెలుసు, నా కుటుంబం గురించి కూడా తెలుసు. నేను మనుషులతో సంబంధాలు కొనసాగించడానికి, మరే ఇతర అంశం కంటే ఎక్కువ విలువనిస్తాను. ఈ విషయంలో ది క్విల్ చాలా మ్యాజిక్స్ చేయగలదు” అని చెప్పారు శక్తి.

“ఇప్పటికీ నేను ఎటువంటి లీక్స్ పబ్లిష్ చేయను. నేను చెప్పినవాటిని, రాసినవాటిన పాఠకులు విలువనివ్వడానికి అది కూడా ఒక కారణం. భవిష్యత్తులో పూర్తి స్థాయిలో సమాచారమివ్వగల ప్లాట్‌‌ఫాంగా ది క్విల్ ఎదగాలన్నది నా ఆలోచన. విభిన్న రకాల శారీరక వైకల్యం ఉన్నవారికి ఉపాధిని కల్పించే డిజిటల్ ఏజన్సీగా మారేందుకు ప్రయత్నిస్తున్నాను” - శక్తిి

ట్విట్టర్ సెలబ్రిటీలో మానవత్వం

ఇంటర్‌నెట్ ప్రపంచంలో బలీయమైన ప్రభావం చూపగల వ్యక్తి.. ఫుల్‌‌టైం ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నాడంటే నమ్మడం కష్టమే. ఒకే మనిషి రెండు ప్రపంచాల్లో నివసించగలగడం సాధ్యమేనని శక్తి నిరూపిస్తున్నారు. ఓ వీల్ ఛెయిర్‌పై కూర్చునే.. దీన్ని సాధ్యం చేస్తున్నారు శక్తి. ది క్విల్ కారణంగా ఎంత బిజీగా ఉన్నా.. ఈయన ఆన్సర్ ఇవ్వని ట్వీట్ ఒక్కటి కూడా ఉండదంటే ఆశ్చర్యం వేయకమానదు.

“నేను ఎవరి మీద దృష్టి పెడతాననే విషయంలో.. ట్విట్టర్‌కీ, నా భార్యకీ పోటీ నేరుగానే ఉంటుంది. నవ్వులాట సంగతి పక్కన పెడితే.. ట్విట్టర్ దేనినైనా చూపించగల ఓ మెగాఫోన్, ఓ టెలిస్కోప్, ఓ మైక్రోస్కోప్. దేనినైనా చూడచ్చు, ఏదైనా వినచ్చు. ప్రతీ అంశానికీ సంబంధించిన అతి చిన్న వివరాలను కూడా శోధించి తెలుసుకోవచ్చు.”

“ఇంతటి డిమాండ్ ఉన్న నెట్వర్క్‌తో అనుబంధం బలంగా ఉండేందుకు నేను పెట్టుకున్న నియమం ఏంటంటే.. నాకు ట్యాగ్ అయ్యే ప్రతీ ట్వీట్‌ని ఆన్సర్ చేయాలనే.”

మొదట్లో ఇందుకు కొంత వ్యతిరేకత వచ్చినా.. క్రమంగా దీనికి మిగిలినవారు అలవాటు పడ్డారు. తనదైన శైలిలో అన్నిటినీ శక్తి పరిష్కరించుకున్నారు.

“మొదట నేను దీన్ని సీరియస్‌గా తీసుకోలేదు. ఒకానొక సమయంలో అకౌంట్‌ను తీసేసి, ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిపోదామని భావించాను. అయితే.. ఆన్‌లైన్ ప్రజలకు నేను విలువ ఇవ్వకపోతే.. నాతో కనెక్ట్ అవరని, నన్ను నమ్మరనే విషయాన్ని గ్రహించాను. ఇందుకోసం నాలుగేళ్ల సమయం పట్టింది. అయితే దీనికి తగిన ప్రతిఫలం దక్కిందనే చెప్పాలి. దానికి సాక్ష్యం ఇప్పుడు మేమున్న స్థాయే.”

“ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, సెనేటర్ రెహమాన్ మాలిక్ నన్ను ఫాలో అవడం చూసి నాకు కరెంట్ షాక్ కొట్టినంత పనైంది. అయితే.. ఇప్పటివరకూ ఏరోజూ కూడా.. ఇవాళ నా ఫాలోయర్స్‌కి ఏం చెప్పాలి అనే ఆలోచనతో నిద్ర లేవలేదు. నేను ఇంకా జస్టిన్ బిబర్‌ని కాలేదు కదా ” అంటారు శక్తి.

డిజిటల్ ఆత్మ కోసం ప్రయాణం

“ఆఫ్‌లైన్‌‌లో చేయని ఏ పనినీ.. ఆన్‌లైన్‌లో చేసేందుకు ప్రయత్నించద్దు. ఆన్‌‍‌లైన్‌లో రహస్యాలు ఏమీ ఉండవు. ప్రతీ అంశం బయటపడిపోతుంది. కాకపోతే ఇందుకు పట్టే సమయంలో కొంచెం తేడా ఉంటుందంతే. ఆన్‌‌లైన్‌‌లో ప్రైవసీ అనే మాటకు అర్ధం లేదు. వీలైనంతవరకూ వ్యక్తిగత వివరాలను ఆఫ్‌లైన్‌లోనే ఉంచండి. అవతలివారికి అవసరం ఉంటే సాయం చేయండి. మీకే అవసరం ఉంటే ఖచ్చితంగా సాయం అడిగి తీసుకోండి. ఫాలోయర్స్ సంఖ్య, క్లౌట్ స్కోర్ కంటే.. సంభాషణ చాలా ముఖ్యం. విమర్శకులతోనూ మృదువుగా, మంచిగానే ఉండండి. వారు దీన్ని తట్టుకోలేరు. అలాగే అన్ని రిక్వెస్ట్‌‌లకు స్పందించండి”-శక్తి.

image


ప్రయత్నించకుండానే ప్రకాశిస్తున్న శక్తి

మరోసారి అసలు విషయానికొస్తే.. వైకల్యాలను అధిగమించడంలో అప్రయత్నంగా కూడా లక్ష్యాలను అధిగమించచ్చని శక్తి నిరూపిస్తున్నారు.

“ఈ ప్రయాణంలో ప్రతికూలతగా భావించింది, గ్రహించింది ఒక అవగాహనను మాత్రమే. ఏదైనా అంశంపై ఎక్కువగా ఆలోచించడం, మాట్లాడ్డం, బాధపడడం చేస్తే.. అది మన మెదడులో ఎక్కువ భాగాన్ని ఆక్రమించేస్తుంది. దీనికి బదులు దాన్ని వదిలేస్తే.. అనేక సమస్యలకు సమాధానం దొరకడమే కాదు.. జీవితం ప్రశాంతంగా అనిపిస్తుంది. నేనెప్పుడైనా పరాజయం పాలైతే.. దానికి బాధపడను. అలా మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాను”అన్నారు శక్తి.

“అంకవైకల్యంతో ఉన్నవారిపై జనాల దగ్గర సానుభూతి తయారుగా ఉంటుంది. మాకు అది అవసరం లేదనే విషయాన్ని వారు గ్రహించరు. నిజానికి మేం దాన్ని ద్వేషిస్తాం. మిగతావారి లాగానే సామాన్య జీవితాన్నే మేం కూడా కోరుకుంటాం”-శక్తి.

“మా వైకల్యాలను అడ్డం పెట్టుకుని, వాటిని ఉపయోగించుకునేందుకు చూస్తున్నామనే వారు కూడా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి.. ఎవరు వైకల్యం ఉన్నవారో ? ఇదే అసలు ప్రధాన సమస్య. కొంతమంది సానుభూతి చూపుతుంటే.. మిగతావాళ్లు అర్ధహీనంగా ఆలోచిస్తున్నారు. మామూలుగా ఆలోచించేవారు మాత్రం అసలు కనిపించడం లేదు.”

రైళ్లలో రాయితీలు, ఆదాయపు పన్ను మినహాయింపులుు, వార్షిక సెమినార్లు.. తమకు కొంత రిలీఫ్‌‌ని ఏ విధంగా వివరించారు శక్తి.

“నేలపై మీరు చేయగలవన్నీ నేను చేయలేను కదా. ఇదే కొలబద్దగా తీసుకోండి. మమ్మల్ని అసమర్ధులుగా భావించద్దు. మమ్మల్ని సాధారణ మనుషులుగానే భావించి, సామాన్య జీవితం గడిపే అవకాశమివ్వండి. వీల్‌‌ఛెయిర్‌‌తో ప్రయాణించేందుకు అనువైన అవకాశాలు చాలా తక్కువ. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో వీల్ చెయిర్ లేచి సపోర్ట్ లేకుండా నుంచోవాల్సి వచ్చింది. దేశంలో ఏ ఊళ్లోనూ బస్ ఎక్కేందుకు మాకు కనీస సౌకర్యం కూడా లేదు. ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి”-శక్తిే

“దేశంలోని ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఇలా పలురకాల అంగవైకల్యం ఉన్న వారిగురించి ఆలోచించకపోవడంం అసలు సమస్య. ఓ మార్పునకు నాంది పలకాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఒక్క భారత్‍‍లోనే మాలాంటి 2కోట్ల మందికి పైగా ఉన్నార”ని చెప్పారు శక్తి.

తన శారీరక పరిస్థితిని ఎంతగా అంచనా వేయాలో.. అంతే లెక్క కట్టి, శ్రమ పడతారు శక్తి. బయట వ్యక్తులకు ఈయన పడే సాధారణంగానే పనులు చేసుకోవడం చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతూ ఉంటారు.

శక్తి వడక్కేపట్‌ను ట్విట్టర్‌లో ఫాలో కావాలంటే..