Brands
Discover
Events
Newsletter
More

Follow Us

twitterfacebookinstagramyoutube
ADVERTISEMENT
Advertise with us

కంటెంట్ మార్కెటింగ్‌కు వైరల్ వీడియోలను ఉపయోగించుకోడం ఎలా..?

కంటెంట్ మార్కెటింగ్‌కు వైరల్ వీడియోలను ఉపయోగించుకోడం ఎలా..?

Thursday May 12, 2016 , 5 min Read


ఏదైనా ప్రాడక్ట్ సక్సెస్ కావాలంటే అందుకు ప్రచారం కూడా ఎంతో ముఖ్యం. ఇప్పుడు అంతా వీడియో జమానా. ఆడియో కంటే అవే ఎంతో పవర్‌ఫుల్. ఒక్క చిత్రం వేల అక్షరాలతో సమానం. ఒక్క వీడియో పదివేల ఫొటోలతో సమానం. అందుకే ఇప్పుడందరూ వీడియో ప్రచారాలవైపే మొగ్గు చూపుతున్నారు. అయితే వీడియో మేకింగ్ అంత ఈజీ ప్రాసెస్ కాదు. చాలా ఖర్చుతో కూడుకున్నది. మరి ఇప్పుడిప్పుడే పురుడుపోసుకుంటున్న స్టార్టప్ కంపెనీలు తమ ప్రాడక్ట్‌ను వీడియోల ద్వారా ఎలా ప్రచారం చేసుకోవాలి.. వైరల్ వీడియోగా ఎలా మల్చాలి.. అన్న విషయాలను సీరియల్ ఆంట్రప్రెన్యూర్ ప్రదీప్ గోయల్ వివరిస్తున్నారు. వీడియో వైరల్ గురించి ఆయన మాటల్లోనే..

నేను రెండో స్టార్టప్ ప్రారంభించినప్పుడు, దానికి మార్కెటింగ్ కోసం చాలా కొద్దిగా సోషల్ మీడియాను ఉపయోగించుకునేవాడిని. అలాగే బ్లాగ్ రైటింగ్ కూడా. ఆ తర్వాత నెమ్మదిగా ఇమేజ్‌లను ఉపయోగించి కథలు చెప్పడం, స్లైడ్ షోలు, ఇన్ఫోగ్రాఫిక్స్ ద్వారా కంటెంట్ మార్కెటింగ్ ఎలాగో నేర్చుకున్నాను.

ఇటీవలే వీడియో మార్కెటింగ్ నేను నేర్చుకున్నాను. అదెమీ సీక్రెట్ కాదు. వీడియోల ద్వారా మార్కెటింగ్ చేయడం చాలా ఎఫెక్టివ్ గా ఉంది. మీడియో మేకింగ్ ప్లాట్‌ఫామ్ స్టేజ్‌ఫాడ్‌తో కలిసి కొన్ని రోజులు పనిచేసి, వీడియో మేకింగ్ బేకింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాను. స్టార్టప్‌ల కోసం వీడియో మేకింగ్ ప్రాసెస్ గురించి రాశాను.

గత వారంలో అవార్డు విన్నింగ్ వీడియో మార్కెటర్ ఆషిష్ చోప్రాతో సమావేశమై వీడియో మార్కెటింగ్ గురించి నా ఆలోచనలు పంచుకున్నాను.

క్రెడిట్ షట్టర్‌స్టాక్

క్రెడిట్ షట్టర్‌స్టాక్


వీడియో మార్కెటింగ్‌లో నేను నేర్చుకున్న అంశాల్లో కొన్ని..

మూడు దశల్లో వీడియో మార్కెటింగ్ క్యాంపెయిన్..

1. రీచ్ యువర్ క్యాంపైన్

వీడియోలకున్న ప్రత్యేకత కారణంగా టార్గెట్ ఆడియన్స్‌ను చేరేందుకు వీడియో మార్కెటింగ్‌ను మించిన మార్గం మరొకటి లేదు. టెక్ట్స్, ఇమేజెస్‌తో పోలిస్తే ఫేస్‌బుక్‌లో వీడియోలను పోస్ట్ చేస్తే మన ప్రాడక్ట్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సందేహంగా ఉంటే ఒకసారి ఫేస్‌బుక్‌ను ఓపెన్ చేసి వీడియో అప్‌డేట్స్‌లను ఒక్కసారి కౌంట్ చేయండి.

యూట్యూబ్ వీడియోల కంటే నేటివ్ ఫేస్‌బుక్ వీడియోల వల్ల ఎంతో లాభం. ఫేస్‌బుక్‌లో వీడియోను అప్‌లోడ్ చేసి కొద్దిగా ప్రచారం చేసి వదిలేయండి. జరిగే మ్యాజిక్‌ను గమనించండి. మీ టార్గెట్ ఆడియన్స్‌ను వీడియో కనెక్ట్ అయితేనే మ్యాజిక్ జరుగుతుంది సుమా. ఒక్క రాత్రిలోనే లక్షలాదిమంది ఆడియన్స్‌ను చేరుకునే సత్తా వీడియోలకుంది.

2. ట్రాఫిక్‌ను వెబ్‌సైట్‌కు మళ్లించండి

రెండో స్టెప్ ఏంటంటే ఆడియన్స్‌ను మీ ప్లాట్‌ఫామ్‌కు మళ్లించడం. వీడియోల నుంచి వెబ్‌సైట్‌కు యూజర్లను మళ్లించడం చాలా కష్టంతో కూడుకున్నది. అయితే బాధపడాల్సిందేమీ లేదు. గొప్ప వీడియోలను సృష్టిస్తే ప్రజలు మీ పనితనాన్ని తెలుసుకుని, ఆ తర్వాత మీ వెబ్‌సైట్‌కు మళ్లుతారు. వారికి అవసరమైన సేవలను మీ వెబ్‌సైట్ ద్వారా తీసుకుంటారు.

ఆడియన్స్ మీ వెబ్‌సైట్ లింక్‌ను క్లిక్ చేయాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. బెస్ట్ ఎఫర్ట్‌ను పెట్టాల్సి ఉంటుంది. వీడియో కింద మీ వెబ్‌సైట్ పేరును ఇవ్వడం మరవొద్దు. అలాగే వెబ్‌సైట్‌కు ఎందుకు రావాలో కూడా కారణాలివ్వాలి. బ్రాండ్‌ నేమ్‌తోనే వీడియోలను క్రియేట్ చేయాలి. ఒకవేళ మీ వెబ్‌సైట్ లింక్ దొరక్కపోతే.. గూగుల్‌లో బ్రాండ్ నేమ్‌తో యూజర్లు సెర్చ్ చేసే అవకాశం ఉంటుంది.

యూజర్ల అటెన్షన్ పొందేందుకు కొన్ని ఆఫర్లను, సైనప్ బోనస్‌లను ప్రకటించండి. ఈ విధానం ద్వారా మీడియో మార్కెటింగ్ నుంచి ఎంతమంది మీ వెబ్‌సైట్‌కు వస్తున్నారో కూడా తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది.

ట్రాఫిక్ నుంచి సైనప్‌కు మార్చండి

మూడో దశలో విక్రయాలకు చేరువ కావాలి. మీ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిందనుకోండి 0.5 నుంచి 1 పర్సెంట్ వరకు వీక్షకులు మీ వెబ్‌సైట్‌ను దర్శించొచ్చు. 0.5 పర్సెంట్ అంటే వినడానికి తక్కువ సంఖ్యే కావొచ్చు. కానీ మిలియన్ వ్యూవర్లలో 0.5 పర్సెంట్ అంటే 50 వేలు. ఒక్కరోజులో 50 వేలంటే చాలా ఎక్కువే కదా..

మీ హోమ్ పేజీలను యూజర్లకు సైనప్ అయ్యేందుకు అనుకూలంగా మార్చండి..

వైరల్ వీడియోల వల్ల ఉపయోగాలు ఉన్నో. వెబ్‌సైట్ ట్రాఫిక్ పెరగడమొక్కటే కాదు. మీ బ్రాండ్‌పై ఇంప్రెషన్ వినియోగదారుల మనసుల్లో పడి అది కలకాలం నిలిచిపోతుంది.

వీడియో మేకింగ్ ప్రాసెస్..

వీడియో మేకింగ్ చాలా సులభం. మీ మొబైల్ ఫోన్ ద్వారానే రికార్డ్ చేసుకోవచ్చు. దాని ఖర్చు కూడా చాలా తక్కువ. ఒకవేళ మంచి కాన్సెప్ట్ ఉండి మీ టీమే నటించగలిగితే ఖర్చే ఉండదు.

మీ స్టార్టప్‌ల కోసం వీడియో మేకింగ్ విధానం..

• వీడియో కోసం మంచి, దృఢమైన కాన్సెప్ట్ కోసం ఆలోచించండి. మంచి స్టోరీ లేకుండా గొప్ప వీడియోను తీయడం సాధ్యం కాదు.

• ముందుగా స్టోరీ బోర్డింగ్‌ రూపొందించండి. ఆ తర్వాత స్క్రిప్ట్‌ను రాయండి. ఒకవేళ మీ బృందంలో మంచి కథకుడు లేనట్టయితే రెండు దశలను ఔట్ సోర్స్ ద్వారా తెప్పించుకోండి.

• యాక్షన్/ప్రొడక్షన్: స్టోరీ ప్రకారం వీడియోను ఎగ్జిక్యూట్ చేయండి.

• పోస్ట్ ప్రొడక్షన్: మీకు ఏది అవసరమో అది వచ్చే వరకు ఎడిటింగ్ చేస్తూనే ఉండండి. వీడియో పిక్చర్ క్వాలిటీ పెంచేందుకు కలర్ కరక్షన్ చేయండి.

• సౌండ్: సౌండ్ క్వాలిటీని ఎప్పుడూ ఇగ్నోర్ చేయొద్దు. యానిమేషన్ వీడియోస్ కోసం సౌండ్స్‌ను కొనుగోలు చేయండి.

• సబ్‌టైటిల్స్: సబ్‌టైటిల్స్‌తో కూడిన వీడియోలు మరింత వైరల్ అవుతాయి. ఎందుకంటే ఫేస్‌బుక్‌లో ఆటో ప్లే వీడియోలు సౌండ్ లేకుండానే ప్లే అవుతాయి.

వీడియోలకు అవసరమయ్యే వనరులు..

# లైట్స్, కెమెరా, యాక్టింగ్ (నటులు): ఒక వీడియోకు ఇవి తప్పనిసరి. కానీ యానిమేషన్ వీడియోలకు ఇవేవీ అవసరముండవు.

# వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్: విండోస్ మూవీమేకర్ అండ్ అడోబ్ ప్రీమియర్ ప్రొ ద్వారా మనం తీసిన వీడియోలను మనమే చక్కగా ఎడిటింగ్ చేసుకోవచ్చు.

# యానిమేటెడ్ వీడియోలకు పౌటూన్స్, గోయానిమేట్స్ లేదా బీటీబుల్‌ను ప్రయత్నించండి.

# బ్యాక్‌గ్రౌండ్ సౌండ్స్: యూట్యూబ్ ఆడియో లైబ్రరీ, ఇన్ కంప్‌టెక్, లేదా ఫైవర్ నుంచి కేవలం ఐదు డాలర్లే కొనుగోలు చేయండి.

#స్టాక్ ఫుటేజ్: మీ వీడియోలో మీ వద్ద బ్రాండ్‌కు సంబంధించి ఉన్న వీడియోలను కూడా ఉపయోగించొచ్చు. జీఐఎఫ్‌ఎస్‌లను జోడించడం ద్వారా సింపుల్ వీడియోలను సృష్టించొచ్చు.

ప్రీ పబ్లిషింగ్ వర్క్..

వీడియో సిద్ధమైన తర్వాత కింది పాయింట్లను చెక్ చేయకుండా వీడియోను పబ్లిష్ చేయకండి..

స్టాంగ్ టైటిల్: వీడియో కంటే ముందుగా టైటిల్‌నే ప్రజలు వీక్షిస్తారు. ప్రేక్షకులకు ఆసక్తి కలిగించే, యాక్షన్ ఓరియంటెడ్ టైటిల్‌ను ఎంపికచేయాలి. అప్పుడే వీక్షకులు మీ వీడియోను వీక్షించేందుకు ఆసక్తి ప్రదర్శిస్తారు.

ఇమేజ్: మీ వీడియో కంటెంట్ గురించి చెప్పేందుకు మీ వీడియోలోని ఓ శక్తిమంతమైన ఇమేజ్‌ను కానీ లేక ఇతర కస్టమ్ ఇమేజ్‌ను కాని ఉపయోగించండి. కస్టమర్లు మీ సంబంధాన్ని అర్థం చేసుకునేందుకు ఏదైనా ప్రదర్శించండి. వీడియో గురించిన డిస్క్రిప్షన్ ఓ కథను వివరించేలా ఉండాలి (ముఖ్యమైన కీవర్డ్స్‌తో సహా)

వీడియోను మార్కెట్ చేసుకోవడం ఎలా..

మీ వీడియోను మార్కెట్ చేసేందుకు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. వీడియోలోని కంటెంట్ చాలా శక్తిమంతంగా ఉంటేనే ఈజీగా మార్కెట్ చేసుకునేందుకు వీలవుతుంది.

వీడియోకు సంబంధించిన కాన్సెప్ట్‌ కస్టమర్లకు కనెక్ట్ అయితేనే ఏ వీడియో అయినా వైరల్‌గా మారుతుంది. స్టోరీ బోర్డింగ్, స్క్రిప్టే వీడియోలో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. వీడియో మేకింగ్ ప్రాసెస్‌లో ఈ రెండు దశల కోసమే ఎక్కువ డబ్బును, సమయాన్ని వెచ్చించండి.

పూర్ కాన్సెప్ట్, గ్రేట్ ఎగ్జిక్యూషన్ కంటే, స్ట్రాంగ్ కాన్సెప్ట్, యావరేజ్ ఎగ్జిక్యూషన్ మంచి ఫలితాలను ఇస్తుంది.

మంచి కథనంతోపాటు అద్భుతమైన వీడియో ఎగ్జిక్యూషన్ మీ స్టార్టప్‌కు గ్రోత్ హ్యాక్‌ మాదిరిగా ఉపయోగపడుతుంది.

మీ వీడియోలను ఫేస్‌బుక్‌లో పబ్లిష్ చేసిన తర్వాత 10 నుంచి 15 నిమిషాలు వేచి చూడండి. ఫేస్‌బుక్ అల్గొరిథమ్ ఆటోమెటిక్‌గా మీ వీడియోను ప్రమోట్ చేస్తుంది. మీ వీడియోను పోస్ట్ చేసిన తర్వాత ఈ కింది స్టెప్స్‌ను ఫాలో అవ్వండి.

• మీ సోషల్ మీడియా, కంపెనీ వెబ్‌సైట్, బ్లాగ్, మీ కస్టమర్లు ఎక్కువగా ఉండే చోట మీ వీడియో ఉన్న ఫేస్‌బుక్ లింక్‌ను షేర్ చేయండి. మీ వీడియో వైరల్‌గా మారేందుకు ఫేస్‌బుక్‌లో మీరు వీడియోను పోస్టు చేసిన తొలి 10-15 నిమిషాలు ఎంతో కీలకం.

• మీ వీడియోను వీలైనంత మందికి షేర్ చేయండి. సోషల్ నెట్‌వర్క్స్ (వీడియోను పబ్లిష్ చేసిన తొలి ఐదు నిమిషాల్లోనే..) మీ వీడియోను షేర్ చేయాలని మీ కుటుంబ సభ్యులను, మీ మిత్రులను, మీ టీమ్ మెంబర్స్‌ను కోరండి.

• డిస్కషన్ గ్రూప్స్ (రెడిట్, ఫేస్‌బుక్, లింక్డిన్, గూగుల్)లో మీ వీడియోను షేర్ చేయండి.

• మీ సబ్ స్క్రైబర్లకు, కస్టమర్లకు మెయిల్ పంపండి. ఒకవేళ వీడియో కాన్సెప్ట్ బాగుంటే వారు తప్పకుండా దాన్ని షేర్ చేస్తారు.

• ఇండస్ట్రీ ఇన్‌ఫ్లూయెన్సర్లకు అప్‌డేట్‌ను పంపండి. వారితో మంచి సంబంధాలుంటే వారే మీ వీడియోను ప్రమోట్ చేస్తారు.

• కొన్ని నిమిషాల్లోనే 100-200 షేర్లు వచ్చాయనుకోండి.. అప్పుడు పెయిడ్ ప్రమోషన్‌ను ఉపయోగించి ఫేస్‌బుక్‌లో ప్రచారం చేసుకోండి. అనుకున్నంత స్పందన రాకపోతే.. పెయిడ్ ప్రమోషన్లు కూడా మీ ప్రాడక్ట్‌కు ఏవిధంగాను ఉపయోగపడవని గుర్తుంచుకోండి.

• అంతే.. ఫేస్‌బుక్కే మీకు కావాల్సిన పనిని చేసి పెడుతుంది.

సారాంశం..

కస్టమర్‌ను పొందేందుకు, గుర్తింపు పొందేందుకు, బ్రాండ్ ఇమేజ్‌ను తెచ్చేందుకు వైరల్ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది. మీ వీడియో మార్కెటింగ్ స్కిల్స్ మీ ఇన్వెస్టర్లకు నచ్చితే మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది.

(విజ్ఞ‌ప్తి: ఈ స్టోరీలో వివరించిన ఆలోచనలు, అభిప్రాయాలు రచయితవి మాత్రమే. వాటితో యువర్‌స్టోరీకి ఎలాంటి సంబంధంలేదని గ్రహించగలరు)