సంకలనాలు
Telugu

వీళ్ల దగ్గర బట్టలు భలే దొరుకుతాయ్..!!

Pavani Reddy
24th Feb 2016
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

ఆన్ లైన్లో అన్నీ కొనడం వేరు.. బట్టలు కొనడం వేరు. ఎందుకంటే, ప్యాంటు, షర్టు, కుర్తా, పటియాలా.. ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ నచ్చాలి. కలర్ మ్యాచ్ అవ్వాలి. ఫిటింగ్ రూంలోకి వెళ్లి వేసుకుని చూడాలి. టాప్ అండ్ బాటమ్ ఓకే అనకుంటేనే అప్పుడు బిల్ వేయిస్తాం. ఏమాత్రం కంఫర్ట్ లేకున్నా, వేరే బ్రాండ్ దగ్గరికి వెళ్లి బ్రౌజ్ చేస్తాం. ఇంత హంగామా ఉంటుంది బట్టల సెలక్షన్లో. అయితే అందరూ అలాగే ఉంటారని చెప్పలేం. కొందరికి ఆన్ లైన్ పర్ఫెక్ట్ కావొచ్చు. కొంతమందికి అంతగా సాటిస్ఫై కాకపోవచ్చు. అలాంటి వారికోసమే గోఫైండ్.కామ్.  

నేర్చుకోవడం, ఏదైనా కొత్తగా ట్రై చేయడం, అపజయాలు ఎదురైనా వెరవకుండా ముందుకు సాగిపోవడం ఏ స్టార్టప్ కైనా ఉండాల్సిన లక్షణాలు. అలాంటి క్వాలిటీస్ పుష్కలంగా ఉన్న ముగ్గురు స్నేహితుల ఆలోచనకు ప్రతిరూపమే ఫైండ్ డాట్ కామ్. ఫరూక్, హర్ష, శ్రీరామన్ కలిసి ముంబైలో గోఫైండ్ స్టార్టప్ ప్రారంభించారు. బ్రాండెడ్ బట్టలకు టెక్ మంత్రను అద్దితే ఎలాంటి ఫలితాలు వస్తాయో చేసి చూపిస్తున్నారు. షాపింగ్ ప్రియులకు ఈ తరహా షాపింగ్ మంచి ఫ్రెండ్ అయింది. 

ఫైండ్ యాప్ మొబైల్ లో డౌన్ లోడ్ చేసుకుంటే చాలు మనకు ఇష్టమైన దుస్తులను కొనుక్కోవచ్చు. ఒక్క షాపు కూడా తిరగకుండానే మనకు నచ్చిన డ్రెస్ ను మౌస్ క్లిక్ తో ఆర్డర్ ఇవ్వొచ్చు. గంటల వ్యవధిలోనే అది మనముందు ప్రత్యక్షమవుతుంది. ఈ యాప్ గత ఏడాది డిసెంబర్ వరకు పదివేల మందే డౌన్ లోడ్ చేసుకున్నారు. సోషల్ మీడియా, సరైన మార్కెటింగ్ చేసుకున్నాక ఫెండ్ యాప్ డౌన్ లోడ్ల సంఖ్య లక్ష దాటింది. ఇన్ మొబీ, ఎస్టీజీ మీడియాలో ప్రచారం చేశాక, దీనికి ఆదరణ మరింతగా పెరిగింది.

ఈ కామర్స్ లో కొత్త విధానం

ఫైండ్ ఇప్పుడు ఫ్యాషన్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటున్న క్లాత్స్ యాప్. ఆన్ లైన్లో దుస్తులు కొంటే అవి ఇంటికొచ్చాక మనకు నచ్చుతాయో లేదో… కొలతలు సరిపోతాయో లేదో వంటి అనుమానాలు వెంటాడుతుంటాయి. ఈ యాప్ లో ఆ సమస్యే లేదు. ఎందుకంటే ఇది ఆఫ్ లైన్ క్లాత్ స్టోర్స్ తో అనుసంధానమై ఉంది. ఆర్డరిస్తే చాలు ఏ షాపులో ఆ బట్టలు ఉన్నా… వెతికి మరీ పంపిస్తారు.

బ్రాండ్స్ పై యువతీ యువకులకు అవగాహన బాగా పెరిగింది. ఇన్ సీజన్ సమయంలో చాలా షాపులు తమ ఉత్పత్తులను ఎలాగోలా అమ్ముకోవాలని చూస్తాయి. వారిచ్చి డిస్కౌంట్లు, ఆన్ లైన్ బయ్యర్లకు కూడా అందిస్తున్నాం అంటున్నారు హర్ష. 

పలు నగరాల్లో ఫెండ్ యాప్… ఆఫ్ లైన్ బ్రాండ్ స్టోర్స్ తో టై అప్ అయ్యింది. వినియోగదారులు కోరుకున్న వస్త్రాలను వారికి అత్యంత సమీపంలోని షాపు నుంచే అందిస్తారు.

కస్టమర్ ఫ్రెండ్లీ

ఏదైనా ఒక డ్రెస్ ఆన్ లైన్లో ఆర్డర్ ఇస్తే అది ఇంటికి చేరడానికి నాలుగైదు రోజులైనా పడుతుంది. ఫెండ్ యాప్ ఉపయోగిస్తే అలాకాదు. ఆర్డర్ ఇచ్చిన ఆరు గంటల్లోనే కోరుకున్న డ్రెస్ ఇంటిముందు వాలిపోతుంది. మీడియం సైజు ఆర్డర్ ఇస్తే దాంతోపాటు లార్జ్ సైజ్ డ్రెస్ కూడా తీసుకొస్తారు. కస్టమర్ రెండింటినీ ట్రై చేసి, ఒకటి ఉంచుకోవచ్చు. లేదా రెండింటినీ వెనక్కి పంపించొచ్చు. దీంతో డ్రెస్ ఫిట్ అవుతుందా, కాదా అన్న సమస్య అస్సలు రానేరాదు.

ద బెస్ట్ యాప్స్ లో ఒకటి

ఫైండ్ స్టార్టప్ కు… 125 లైవ్ బ్రాండ్స్ ఉన్నాయి. 12 వందల స్టోర్లతో అనుసంధానమై ఉంది. దేశంలోని ఏ ప్రాంతానికైనా గంటల్లో వస్త్రాలను సరఫరా చేయగలదు. రోజుకు వందకుపైగా లావాదేవీలు నిర్వహిస్తోంది. ఒక్క లావాదేవీ సగటున రెండు వేల రూపాయలుంటుంది. వ్యాపారం గత కొంతకాలంగా వారానికి 30శాతం మేర పెరుగుతోంది. గత డిసెంబర్ లో 10 వేల యాప్ డౌన్ లోడ్స్ ఉంటే… ఇప్పుడు లక్ష యాభైవేలు దాటేశాయి. ఇది చాలు మార్కెట్లో అది ఏ స్థాయిలో విజృంభిస్తోందో చెప్పడానికి. ప్రతివారం 70 శాతం కొత్త కస్టమర్ల నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి. మెన్స్ టీ షర్టుల నుంచి అమ్మాయిల టాప్స్ వరకు రకరకాల బ్రాండ్స్ అమ్ముతున్నారు. నైక్, బీయింగ్ హ్యూమన్, ఫ్యాబ్ ఇండియా బ్రాండ్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయట.

బిజినెస్ పెరుగుతున్నా కొద్దీ… వివిధ నగరాల్లో బ్రాండ్ డేస్ పేరిట ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. పలు బ్రాండ్లతో… వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. 38 శాతం సేల్స్ పెరగడానికి కారణం బ్రాండ్ పార్టనర్ షిప్పే. బీయింగ్ హ్యూమన్ తో పార్టనర్ షిప్ కోసం ఇటీవలే భాయ్ కీ పార్టీ ఏర్పాటు చేసింది. ముంబై మారథాన్ లో నైక్, పూమాతో ఒప్పందం పెట్టుకుంది. దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఫెండ్ యాప్ పేరు వాణిజ్య రాజధాని ముంబైలో మార్మోగిపోయింది.

ఫెండ్ కు ఆదాయం ఎలా ?

ప్రతీ లావాదేవీలోనే ఫైండ్ 20 శాతం కమీషన్ తీసుకుంటుంది. అది ఏ బ్రాండ్ అయినా సరే. ఢిల్లీ, బెంగళూరులో ఫిబ్రవరి చివరినాటికి బిజినెస్ విస్తరించనున్నారు. పుణెను కూడా టార్గెట్ చేసింది. టీ-ట్వంటీ వరల్డ్ కప్ లోనూ పార్టనర్ షిప్ కోసం ప్రయత్నిస్తోంది ఫైండ్. దేశంలోనే నంబర్ వన్ ఆన్ లైన్ దుస్తుల అమ్మకాల సంస్థగా ఎదగాలనుకుంటోంది. జబాంగ్, అమెజాన్, స్నాప్ డీల్, ఫ్లిప్ కార్డ్ లాంటి పెద్ద సంస్థలతో ఫైండ్ కు పోటీ ఎదురవుతోంది. మింత్రా, ఎక్స్ క్యూజివ్ లీ డాట్ కాం లాంటి సంస్థలు ప్రత్యక్షంగా పోటీనిస్తున్నాయి.

మార్కెట్లో పోటీ ఎంత ఉన్నా… కస్టమర్ల మనసులను గెలుచుకుంటామంటూ నమ్మకంగా చెబుతున్నారు వ్యవస్థాపకులు. ఏరోజు ఆర్డర్ ఇస్తే ఆ రోజే డ్రెస్ డెలివరీ చేయడం ఫైండ్ ప్రత్యేకత. ఇదే తమను మార్కెట్లో నిలబెడుతుందని భావిస్తున్నారు.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags