22 నెలల్లో 100 కోట్ల ఆదాయం ! రియల్ ఎస్టేట్‌లో “స్క్వేర్ యార్డ్స్” రేర్ ఫీట్

30th Oct 2015
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

గత కొన్నేళ్ల నుంచి భారతదేశంలో రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పురోగతి కనిపిస్తోంది. ఆన్ లైన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లాది రూపాయలు పెట్టుబడులు వచ్చిపడ్తున్నాయి. చాలా మంది వ్యాపారులు తమ మార్కెటింగ్ స్ట్రాటజీస్, ఉత్పత్తులతో సాధారణ ప్రజలను తమ వైపు ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణ వ్యాపార నమూనాలను చేధించుకుని ముందుకి వెళ్తూ స్థిరమైన లాభాలను గడిస్తున్నారు. ఈ రంగంలో ఉన్న ఇతర పోటీదారులకు సవాలుగా నిలుస్తున్నారు.

image


రియల్ ఎస్టేట్ స్టార్టప్ స్క్వేర్ యార్డ్స్ ప్రధానంగా ఎన్ఆర్ఐ విభాగం మీదే దృష్టిసారించింది. రూ.100 కోట్ల ఆదాయాన్ని అధిగమించినట్టు తాజాగా వెల్లడించింది. తమ మొత్తం వ్యాపార లావాదేవీల విలువ 450 మిలియన్ యూఎస్ డాలర్లుగా ప్రకటించింది. కీలకమైన వ్యాపార ప్రమాణాలు-ఆదాయ మార్గాలు, లాభాలు, మార్కెట్ మీద దృష్టిసారించడం ద్వారా ఈ స్టార్టప్ కంపెనీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ స్టార్టప్ ఆరు దేశాల్లోని 21 ప్రధాన నగరాలకు విస్తరించింది. మొత్తం 900లకుపైగా ఉద్యోగులు ఉన్నారు. ఈ కంపెనీ విజయగాథ ఇదే.

ఆరంభం ఇలా..

ఐఐఎం లక్నో పూర్వ విద్యార్థి తంజు షోరీ, వెల్త్ మేనేజర్ కనిక గుప్తాలు కలిసి 2013 అక్టోబర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ సాయంతో స్క్వేర్ యార్డ్స్‌ను స్థాపించారు. ఆ భార్యభర్తలిద్దరూ హాంకాంగ్ లో ఉన్నప్పుడు ఈ అవకాశాన్ని గుర్తించారు. చాలా మంది భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని భావించేవారు, కానీ తమ అవసరాలకు తగిన విధంగా నిష్పక్షపాతమైన సమాచారం, సహకారం లభించేది కాదు. కార్యకలాపాలు నిర్వహించిన తర్వాత తగిన సేవలు అందుబాటులో ఉండేవి కాదు.

స్క్వేర్ యార్డ్స్ వ్యవస్థాపకులు భారతదేశంలోని 10 నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద సూక్ష్మస్థాయిలో పరిశోధన చేశారు. ఆ సమాచారాన్ని ఎన్ఆర్ఐ కమ్యూనిటీకి అందించడం మొదలుపెట్టారు. ఎన్ఆర్ఐల నుంచి భారీ డిమాండ్ ఉందని గుర్తించిన వెంటనే వారు చాలా వేగంగా ఇండియాలో పునాదులు విస్తరించారు. భారతదేశంలోని ప్రధాన మెట్రోనగరాల్లో కార్యాలయాలు తెరిచి, ప్రముఖ డెవలపర్స్‌తో సంబంధాలు పెంచుకున్నారు. కొనుగోలుదారులు తమంతట తాముగా భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను లోతుగా పరిశీలించడానికి వీలుగా ఈ ఇద్దరూ ఒక వెబ్ సైట్‌ను కూడా ప్రారంభించారు.

ఎదుగుదల

ఆ తర్వాత ఏడాదిన్నరకే స్క్వేర్ యార్డ్స్ భారతదేశంలోని 15 ప్రధాన నగరాలకు విస్తరించింది. ఐదు దేశాల్లో పాగా వేసింది. సింగపూర్, హాంకాంగ్, దుబాయి, అబుదాబి, లండన్‌లలోని ప్రవాస భారతీయుల మార్కెట్ మీద వర్చువల్ అధిపత్యాన్ని సంపాదించింది. లివర్ పూల్‌లో విద్యార్థులకు ఎకామిడేషన్, కెనడాలో మాల్ రీ-డెవలప్‌మెంట్ ప్రాజెక్టులు, గ్లాస్కో నుంచి భారత్ వరకు కారు ప్రోత్సాహకాలు అందించడం వంటి ఇన్వెస్టర్ ఫ్ల్రెండ్లీ చర్యల ద్వారా కంపెనీ ఈ పురోగతిని సాధించింది.

image


ఇప్పటకీ స్క్వేర్ యార్డ్స్ పురోగతి కొనసాగుతూనే ఉంది. నెలకు 300లకు పైగా లావాదేవీలు నిర్వహిస్తూ 1.5 మిలియన్ డాలర్లకుపైగా ఆదాయాన్ని సంపాదిస్తోంది. ఏప్రిల్ 2015లో కంపెనీ ప్రీ –సీరిస్ ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్ గ్రూప్ నుంచి ఆరు మిలియన్ డాలర్లు పెట్టుబడులను సమకూర్చుకుంది. ఆ తర్వాత ఆన్‌లైన్ సెర్చ్ అండ్ డిస్కవరీకి సంబంధించిన రియలైజింగ్. ఇన్ (Realizing.in )అనే ఒక టెక్కీ ప్లాట్ ఫామ్ ను సొంతం చేసుకున్నారు. జూన్‌లో సింగపూర్‌లోని లక్స్ రియల్ ఎస్టేట్‌ను కూడా చేజిక్కించుకున్నారు.

తర్వాత దశలో సాంకేతికత సాయంతో అభివృద్ధి

కంపెనీ ఇప్పుడు టెక్నాలజీతో కూడిన అభివృద్ధి నమూనాతో ముందుకు సాగుతోంది. మల్టీ మోడల్ డిస్ట్రిబ్యూషన్ ఫ్లాట్‌ఫామ్‌ను నిర్మించుకొంటోంది. స్క్వేర్ యార్డ్స్ డాట్ కామ్(Squareyards.com) ఇప్పుడు నగరాల మ్యాప్‌లను పరిశోధించేందుకు సాయపడే పోర్టల్. మన అవసరాలకు తగినట్టుగా సూచనలు అందిస్తుంది. భారతదేశంలోని 12 నగరాలకు చెందిన 6,000 ప్రైమరీ ప్రాజెక్టులు... 20,000 యూనిట్ ప్లాన్లకు సంబంధించి సౌలభ్యం, నివాసయోగ్యం, కార్పెట్ ఏరియా, జీవనశైలి ఇలా ఎన్నో అంశాలకు సంబంధంచి రేటింగ్స్ కూడా తెలియజేస్తుంది.

స్క్వేర్ యార్డ్స్ తాజాగా స్కేప్స్ అనే కొత్త ప్లాట్‌ఫాంను ప్రారంభించింది. ఇది రియల్ ఎస్టేట్ ఈ-కామర్స్ పోర్టల్. దాదాపు రెండు బిలియన్ యూఎస్ డాలర్లు విలువైన జాబితాను ఆన్ లైన్‌లో అందుబాటులోకి తీసుకొస్తుందని అంచనా. రియల్ టైమ్ ఆన్ లైన్ జాబితా నుంచి ఎంపిక చేసుకోవడం, 360 డిగ్రీల వాక్ త్రూ, అభివృద్ధి చేయబడిన 3డి రియాలిటీ వంటి సదుపాయలు ఇందులో ఉన్నాయి. కొనుగోలుదారుల, డెవలపర్ల చెల్లింపులు, పోర్ట్‌ఫోలియో ట్రాకింగ్ సదుపాయం కూడా ఉంది. ఈ కామర్స్ పోర్టల్ అయినప్పటికీ జులైలో అది ప్రారంభించబడిన 19 గంటల్లోనే 350 ఇళ్లను అమ్మి రికార్డు సృష్టించింది. గ్రేడ్ ఎ డెవలపర్లు తమ తర్వాత ప్రాజెక్టులకు సంబంధించిన జాబితాలను ఆన్ లైన్ లో పెట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో బిజిబిజిగా ఉంది కంపెనీ.

హౌసింగ్ డాట్ కామ్(Housing.com) మరియు కామన్ ఫ్లోర్(commonfloor.com) కూడా తమ అభివృద్ధి కోసం టెక్నాలజీని వాడుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఈ మధ్యకాలంలోనే హౌసింగ్, ప్లాట్ అండ్ బిగ్ బిహెచ్‌కె ను సొంతం చేసుకుంది. తద్వారా సరఫరా విభాగంలో తన ఫోర్టుపోలియోను బలోపేతం చేసుకుంది. మొట్టమొదటిసారిగా మ్యాప్ ఆధారిత మాధ్యమాన్ని, స్లైస్ వ్యూ టెక్నాలజీని పరిచయం చేసిన తొలి కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. కామన్ ఫ్లోర్ ఈ మధ్య కాలంలో స్మార్ట్ గార్డ్ అనే యాప్ ప్రారంభించింది. కమ్యూనిటీని సందర్శించడానికి వచ్చే వారి కదలికల్ని ఇది గమనిస్తుంది. ఈ ఏడాది ఆరంభంలో సీఎఫ్ రెటీనా అనే వర్చువల్ రియాలిటీ టూల్‌ను కంపెనీ ఆవిష్కరించింది. ఇది గూగుల్ కార్డ్ బోర్డ్ ఆధారంగా పనిచేస్తుంది. కంపెనీ సొంతంగా అభివృద్ధి చేసిన ఈ యాప్, కొనుగోలుదారులు వర్చువల్‌గానే ప్రాపర్టీ గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.

మొబైల్ సహకారంతో ఏకం చేయడం

కొద్ది రోజుల క్రితమే స్క్వేర్ యార్డ్స్, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, స్వతంత్ర ఫైనాన్సియల్ ఏజెంట్ల కోసం ప్రత్యేకంగా మొబైల్ - ఓన్లీ డిమాండ్ ఆధారిత ఏకీకృత ప్లాట్ ఫామ్ స్క్వేర్ కనెక్ట్ ను ప్రారంభించింది. ఈ మొబైల్ యాప్ వల్ల వారు చాలా పెద్ద సంఖ్యలో ఉన్న ప్రాధమిక రియల్ ఎస్టేట్ జాబితాను పొందగలుగుతారు. దాని ద్వారా వారు ఇప్పుడున్న అవకాశాల పరిధిని దాటి తమ వ్యాపారాల్ని విస్తరించుకోగలుగుతారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 12 నగరాల్లో 15,000 లకు మంది పైగా రియల్ ఎస్టేట్ స్టాక్ బ్రోకర్లు స్క్వేర్ యార్డ్స్‌లో సభ్యులయ్యారు. 25కు పైగా టాప్ స్టాక్ బ్రోకరేజీ సంస్థలు, ఆర్ధిక రంగ సంస్థలు, ఆన్ లైన్ సంస్థలు స్క్వేర్ యార్డ్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

భారతదేశంలోని 12 నగరాల్లోని ఏ గ్రేడ్ డెవలపర్లు నుంచి అందుబాటులో ఉండే సమాచారాన్ని, స్క్వేర్ కనెక్ట్ ప్రోగ్రామ్ ద్వారా.. సభ్యత్వం పొందిన బ్రోకర్లు, ఏజెంట్లు ఉపయోగించుకోగలుగుతారు. ఈ ప్లాట్ ఫామ్ ద్వారా బుకింగ్ చేసుకుని తమ చెల్లింపుల వివరాలను ట్రాక్ చేసుకోవచ్చు. లావాదేవీ వ్యవహరాలను పరిశీలించడానికి డ్యాష్ బోర్డ్ లా ఇది ఉపయోగపడుతుంది. కీలకమైన మార్పులకు సంబంధించిన నోటిఫికేషన్లు, స్టేటస్ మార్పులు, క్లైయింట్ అంగీకారం తదితర అంశాలన్నీ తెలుసుకోవచ్చు. శ్లాబ్ వేయడానికి అనుమతి, బ్రోకరేజ్ ద్వారా పొందే డబ్బుల వివరాలు కూడా తెలుసుకోవచ్చు. వారు డెవలపర్లతో సంప్రదింపులు జరిపేటప్పుడు, కార్యకలాపాలు నిర్వహించేటప్పుడు ఎదురయ్యే ఇబ్బందులన్నీ దీని ద్వారా తొలగిపోతాయి. రిలేషన్‌షిప్ మేనేజర్లు, సిఆర్ఎం హెల్ప్ డెస్క్‌ల సాయంతో బ్రోకర్లు అందుబాటులోకి రాగలుగుతారు.

భారతదేశంలో బ్రోకర్ల మార్కెట్ దాదాపు నాలుగు బిలియన్ అమెరికన్ డాలర్ల మేర ఉంటుందని అంచనా. గడిచిన ఏడాది కాలంలో చాలా రకాల స్టార్టప్‌లు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి వేరు వేరు క్యాటగిరీలలో ప్రవేశించాయి. కొన్ని వారాల క్రితమే.. బ్రోకర్ నెట్ వర్కింగ్ ప్లాట్ ఫామ్ ప్లాబ్రో నెట్ వర్క్, ఫ్లిప్ కార్ట్ నుంచి భారీగా నిధులు సమకూర్చుకుంది. వచ్చే 10 నెలల్లో 35 టైర్-1 సిటీల్లో అభివృద్ధి చెందాలని ఇతరులు నిర్ణయించుకున్నారు. జిలాన్ డ్రిమ్ అనేది మొట్టమొదటి రియల్ ఎస్టేట్ మొబైల్ మార్కెట్ ప్లేస్. భారతదేశంలోని 50 నగరాల్లో కొనుగోలుదార్లు, అమ్మకందార్లు, ఏజెంట్లు, బిల్డర్లు లకు చేరువైంది.

ప్రతిఒక్కరికి అందుబాటులో ఉండేలా రూపొందించిన ప్రోపర్టీ ప్లాట్ ఫామ్ నోబ్రోకర్స్ ఫిబ్రవరి 2015లో ఎస్ఏఐఎఫ్ పార్టనర్స్ , ఫ్లుకరమ్ వెంచర్స్ నుంచి 2015 ఫిబ్రవరిలో 3 మిలియన్ డాలర్ల నిధులు సమకూర్చుకుంది. ఈ నిధులతో నాన్ –బ్రోకర్ ఎకోసిస్టమ్ ను బలపర్చడంతో పాటు భారతదేశంలోని ముఖ్యమైన నగరాలకు విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ రంగంలోని మరో ప్రముఖ వ్యాపార సంస్థ బ్రోఎక్స్ గా పిల్చుకునే బ్రోకర్ ఎక్స్ఛేంచ్. తమ ప్లాట్ ఫామ్ లో ఈ ఏడాది జూన్ లో 15,000 మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రిజిస్టర్ అయినట్లు ప్రకటించింది ఈ సంస్థ.

image


భవిష్యత్ ప్రణాళికలు

టెక్నాలజీని వాడుకోవడం ద్వారా సాధ్యమవుతున్న పురోగతి, ఇతర రంగాల్లో ఉద్భవిస్తున్న అత్యుత్తమ డిజిటల్ అనుభవాలు కలసి.. ఈ రంగానికి కొత్త రూపునిస్తున్నాయి. డిజిటల్ టెక్నాలజీ మరియు సర్వీసుల్లో ఎదురయ్యే సమస్యల్ని అధిగమించే స్థాయికి భారతదేశంలోని ప్రాధమిక రియల్ ఎస్టేట్ పరిశ్రమ ఎదిగిందని స్క్వేర్ యార్డ్స్ నమ్ముతోంది. ‘‘స్క్వేర్ కనెక్ట్ ప్రోగ్రామ్, మా బిజినెస్ మోడల్స్ అన్నింటికీ ఇరుసులా పనిచేస్తోంది. ముఖ్యంగా స్వచ్ఛమైన లావాదేవీలు నిర్వహించే సలహాదారుల కంటే కూడా టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఎగ్రిగేటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు ఇది అత్యంత అనువైంది. భారత దేశంలోని సంఘటిత సప్లయ్ – డిమాండ్ ఆధారిత ప్రాధమిక రెసిడెన్షియల్ మర్కెట్ లో 20 శాతం వాటా మేం చేజిక్కుంచుకోవడానికి ఈ ప్లాట్‌ఫాం మాకు ఉపయోగపడుతుంది. సామర్ధ్యాలను అందించే వనరులను ఉపయోగించుకుంటూ అడ్డుగోడలను తొలగించుని ముందుకు సాగిపోయేలా వ్యూహాలు రచించుకోవాలి’’ అంటారు స్క్వేర్ యార్డ్స్ సీఈవో తనుజా.

ఈ కంపెనీ 2016 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి లక్ష మంది బ్రోకర్లును చేరుకోవాలని, 100కి పైగా సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకోవాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. ఈ కంపెనీ ఒక నోడల్ దాస్తావేజు ఎకౌంట్ అధారిత సర్వీస్‌ను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తోంది. వేరు వేరు డెవలపర్లు, బ్యాంకింగ్ భాగస్వాములకు కమిషన్ పంచడం, చానెల్ పార్టనర్స్ నుంచి సేకరించడం వంటి కార్యకలాపాలకు ఇది ఉపయోగపడుతుంది.

website

Want to make your startup journey smooth? YS Education brings a comprehensive Funding and Startup Course. Learn from India's top investors and entrepreneurs. Click here to know more.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

Our Partner Events

Hustle across India