సంకలనాలు
Telugu

వృద్ధులు, పేషెంట్లకు ప్రత్యేక క్యాబ్ సర్వీస్

వికలాంగులు,వృద్ధులకు ప్రత్యేక క్యాబ్ సర్వీస్వారికోసమే తయారు చేసిన వాహనాలుబెంగళూరులో బెంగలేని ప్రయాణం

CLN RAJU
24th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

వీల్స్ ఆప్ ఛేంజ్ .. సమాజం నుంచి నిరాదరణకు గురవుతున్న వారి అభ్యున్నతి కోసం పనిచేస్తున్న ప్రభుత్వేతర సంస్థ. ఇటీవలే తన సరికొత్త ప్రాజెక్ట్ కిక్ స్టార్ట్ క్యాబ్ ని స్టార్ట్ చేసింది. కదల్లేని స్థితిలో ఉన్న వ్యక్తులకు ఈ సామాజిక సంస్థ ట్యాక్సీ సేవలను అందిస్తోంది. ప్రత్యేకంగా తయారు చేసిన వాహనాలను నిర్ణీత ఛార్జీలతో అందుబాటులోకి తెచ్చిందీ MphasiS సంస్థ. ఎంఫసిస్ సంస్థ ఓ గ్లోబల్ సర్వీస్ ప్రొవైడర్. ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికత ఆధారిత పరిష్కారాలను అందిస్తోంది. వీల్స్ ఆఫ్ చేంజ్, కర్ణాటక ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టింది.

కిక్‌స్టార్ట్ క్యాబ్ సర్వీస్‌లో ఉన్న మూడు వాహనాలను వికలాంగులు, వృద్ధులకోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. వాటిలో మొదటిది స్విఫ్ట్ డిజైర్. దానికి ప్రత్యేకంగా ఓ చక్రాల కుర్చీని అమర్చారు. డ్రైవర్ సీట్ పక్కనే ఉన్న ఈ కుర్చీ ఫ్రంట్ డోర్ నుంచి సగం వరకు బయటకు వస్తుంది. వీల్ ఛైర్ పైనో వాకింగ్ స్టిక్ పట్టుకునో నెమ్మదిగా అక్కడకు చేరుకుంటే చాలు ఆ కుర్చీలో ఎటువంటి ఇబ్బందీ లేకుండా కూర్చోవచ్చు. 

ఇక సెకండ్ మోడల్ వాగనార్, దీనికి వెనుక వైపు ర్యాంప్ అమర్చారు. వీల్ చైర్‌ని తోసుకుంటూ నేరుగా వ్యాన్‌లోకి వెళ్లిపోయేలా ఏర్పాటు చేశారు. వికలాంగులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక మూడో వాహనం టొయోట లివ, దీనికి డిటాచబుల్ సీట్‌ని అమర్చారు. వాహనం నుంచి సీట్‌ని వేరు చేసి వీల్ చైర్ గా మార్చేయొచ్చు. ఈ మూడు వాహనాలను జీపీఎస్‌తో అనుసంధానించడంతో వెహికల్స్ కదలికలను మోనటరింగ్ చేసేందుకు వీలుంది.

స్పెషల్ గా  తయారు చేసిన వాహనాల పనితీరుని వివరిస్తున్న కిక్ స్టార్ట్  క్యాబ్ డైరెక్టర్ విద్యా రామసుబ్బన్

స్పెషల్ గా తయారు చేసిన వాహనాల పనితీరుని వివరిస్తున్న కిక్ స్టార్ట్ క్యాబ్ డైరెక్టర్ విద్యా రామసుబ్బన్


"ఒక్కమాటలో చెప్పాలంటే సాంకేతికత, సేవ కలయికే కిక్ స్టార్ట్ క్యాబ్స్ అంటారు కిక్ స్టార్ట్ డైరెక్టర్ విద్య. వచ్చే ఐదేళ్లలో ఐదు వేల మంది వికలాంగులు, వృద్ధులకు మా సేవలు చేరేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. ఇది మొత్తం జనాభాలో నాలుగుశాతం ఉంటుందన్నారు.” అయితే సంఖ్యలను అంచనావేయం కష్టంగానీ మేం ప్రారంభించిన ప్రాజెక్ట్ ద్వారా వైకల్యం ఉన్న చాలామందికి ఉపాధి దొరుకుతుందని చెప్పగలం అన్నారు విద్య. సరైన రవాణా సదుపాయం లేక సమస్యలెదుర్కొంటున్న వారికిది ఎంతో ఉపయోగం. దీర్ఘకాల వ్యాధులకు చికిత్స పొందుతున్న చాలా మంది రోగులు హాస్పిటల్స్ కి వెళ్లడం మానేస్తుంటారు. ఈ క్యాబ్ సర్వీసుల వల్ల అలాంటి వారికి మేలు జరుగుతుంది. ప్రస్తుతానికి బెంగళూరులో మాత్రమే కిక్‌స్టార్ట్ క్యాబ్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

చాలాకాలంగా వికలాంగుల కోసం పనిచేస్తున్న విద్య వారికోసం సొంతంగా ఏదైనా సర్వీస్ ప్రారంభించాలని అనుకున్నారు. తన అనుభవం, పరపతి ఉపయోగించి కిక్ స్టార్ట్ క్యాబ్ సర్వీస్‌ని కానుకగా అందించారు. “వయసులో పెద్దవారు, వికలాంగులతో పలు వాహనదారుల దుష్ప్రవర్తనను చాలా సార్లు గమనించాను, అదే ఈ క్యాబ్ సర్వీస్ ప్రారంభించేలా ఆలోచన కల్గించింది. ఇక ఈ సమస్యపై ప్రజల్లో అవగాహన కల్పించడం, అట్టడుగున ఉన్న వారికి ఉపాధి కల్పించగలగడం మా ముందున్న సవాళ్లు” అని విద్య చెప్పారు. మా ప్రయత్నంలో ఇది చిన్న ముందడుగు మాత్రమే దీని ద్వారా కొంతమందికైనా సాంత్వన చేకూరుతుందని భావిస్తున్నామన్నారు విద్య.

కిక్ స్టార్ లాంచింగ్ సందర్భంగా ప్రాజెక్ట్ ప్రాధాన్యతను తన మాటల్లో చెప్పారు అయ్యర్. “ ఇది చాలా అవసరమైన సర్వీస్, మద్దతు కావాల్సిన వారు స్వేచ్ఛగా, గౌరవంగా తమకు కావాల్సిన చోటుకెళ్లవచ్చు. ఈ సమాజిక సంస్థతో మా భాగస్వామ్యం స్థిరమైంది, సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.” అన్నారు అయ్యర్.

కిక్ స్టార్ట్ క్యాబ్ సర్వీస్ ప్రారంభ వేడుకలో కర్ణాటక రాష్ట్ర వికలాంగుల శాఖ కమిషనర్ కేఎస్ రాజన్న, MphasiS సీఈవో గణేశ్ అయ్యర్

కిక్ స్టార్ట్ క్యాబ్ సర్వీస్ ప్రారంభ వేడుకలో కర్ణాటక రాష్ట్ర వికలాంగుల శాఖ కమిషనర్ కేఎస్ రాజన్న, MphasiS సీఈవో గణేశ్ అయ్యర్


అంగవైకల్యం ఉన్న వ్యక్తులు గడపదాటితే ఎదుర్కొనే సమస్యలు అన్నిఇన్నీ కావు, జనాభాలో అతి తక్కువ మందే తమకు కావాల్సిన చోటుకి స్వేచ్ఛగా వెళ్లగలుగుతారు. బహిరంగ ప్రదేశాలకు, బస్సులు ఇతర వాహనాలు ఎక్కేందుకు వెళ్లాలంటే వారికి పెద్ద సమస్యే. గత జనాభా లెక్కల ప్రకారం బెంగళూరులో ఆరు లక్షల మంది వికలాంగులు, ఏడు లక్షల మంది వయోవృద్ధులున్నారు. “మామూలుగా ఆలోచిస్తే వారి కోసం చాలా చేయాల్సి ఉంది” అన్నారు విద్య . “ ఇప్పుడిప్పుడే సమాజంలో మార్పు వస్తోంది. వైకల్యం ఉన్న వారికి చాలా సంస్థలు ఉద్యోగాలిస్తున్నాయి. ఇది ఒక సానుకూల పరిణామమే, వీళ్లలో కొంతమంది పెద్ద ఉద్యోగాలే సంపాదించడం మొదలుపెట్టారు. పనిచేసే చోటుకి వెళ్లేందుకు వారికిప్పుడో మార్గం అవసరం. గతంలోలాగ వికలాంగులు ఇంట్లోనే కూర్చోవాలని భావించక్కర్లేదు.”

www.kickstartcabs.com ద్వారా మామూలు ప్రజలు కూడా ఆన్ లైన్ లో క్యాబ్ లు బుక్ చేసుకోవచ్చు. సంస్థలో పనిచేస్తున్న చెవిటి,మూగ ఉద్యోగులకు ఈ విధంగా సాయపడినట్లవుతుంది. కిక్ స్టార్ట్ వెబ్ సైట్ Web Content Accessibility Guidelines for disable నిర్దేశించిన అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు. 8105600445 నెంబర్ కి ఫోన చేసి కూడా కిక్ స్టార్ట్ క్యాబ్ సర్వీసు పొందొచ్చు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags