వైద్యానికి.. టెక్నాలజీని జోడిస్తేనే ఎన్నో పరిష్కారాలు

వైద్యానికి.. టెక్నాలజీని జోడిస్తేనే ఎన్నో పరిష్కారాలు

Monday October 19, 2015,

4 min Read

హెల్త్ కేర్ రంగంలో తలెత్తే సమస్యలకు పరిష్కారం వెతకడమనేది ఎన్నాళ్లుగానో ఓ సవాలుగా మారిందనే చెప్పాలి. వైద్యరంగంలో వస్తున్న మార్పులను అర్ధం చేసుకోవడంతో పాటు..వాటికి సాంకేతిక రంగంలో నూతన ఆవిష్కరణల జత చేయడంతోనే ఇది సాధ్యమవుతుందని ఈ రంగంలో నిపుణులు చెప్తున్నారు.

ఏడు బిలియన్ల ప్రపంచం జనాభాలో 5.8 బిలియన్ల జనాభాకు సైంటిఫిక్ హెల్త్ కేర్ అంటే శాస్త్ర విజ్ఞానంతో కూడిన వైద్యమనేది అందుబాటులో లేదనేది ఓ చేదు నిజం. కేవలం ఓ పది పదిహేను శాతం మందికి మాత్రమే ఈ ఫలాలు అందుబాటులో ఉంటున్నాయి. ఇదే అంశాన్ని విక్రమ్ దామోదరన్ విశ్లేషిస్తారు. 

జీఈ హెల్త్ కేర్‌లో సస్టైనబుల్ హెల్త్ కేర్ సొల్యూషన్స్‌కు ఛీఫ్ ప్రొడ్యూసింగ్ ఆఫీసర్‌గా విక్రమ్ దామోదరన్ పని చేస్తున్నారు. అఫోర్డబుల్ హెల్త్ సర్వీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను లీడ్ చేస్తున్నారాయన. గ్లోబల్ మార్కెట్లో ఈ దిశగా నూతన ఆవిష్కరణల కోసం పని చేస్తున్నారాయన. ఎక్కువ మంది ప్రజలకు ఏఏ వైద్యసేవలు అత్యంత అవసరమో..వాటిని గుర్తించడమే లక్ష్యంగా పని చేస్తున్నారు విక్రమ్. అలాంటి స్టార్టప్స్‌కు సీడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అన్వేషించడం, వాటిని కమర్షియల్‌గా విజయవంతం చేసేందుకు అవసరమయ్యే బిజినెస్ మోడల్స్ డెవలప్ చేయడం కూడా విక్రమ్ చూస్తున్నారు.

విక్రమ్ దామోదరన్-జీఈ హెల్త్ కేర్ సీపీఓ

విక్రమ్ దామోదరన్-జీఈ హెల్త్ కేర్ సీపీఓ


బెంగళూరులోని CAMTech Jugaad-a-thon ఎఫర్డబుల్ హెల్త్ కేర్ రంగంలో వస్తున్న మార్పులు, ఆ దిశగా జీఈ హెల్త్ కేర్ చేస్తున్న కృషి ఎంత వరకూ సఫలీకృతమైంది వంటి అంశాలను ఆయన యువర్ స్టోరీతో పంచుకున్నారు.

ప్రపంచంలోని జనాభాలో చాలావరకూ సైంటిఫిక్ హెల్త్ కేర్‌పై అవగాహన లేకుండా ఉండటం గమనించామని విక్రమ్ చెప్తారు. ఈ అవగాహనా లేమితోనే ఎక్కువ మంది కమ్యూనికబుల్ వ్యాధులు (సామూహికంగా వ్యాపించే.. అంటే జ్వరం..మలేరియా..ఆటలమ్మ ..టైఫాయిడ్..ఇలాంటి అందరికీ వచ్చే సీజనల్ వ్యాధుల వంటివి) నాన్ కమ్యూనికబుల్ వ్యాధులు బారిన పడేలా చేస్తోంది. ప్రస్తుత ప్రపంచంలో..కమ్యూనికబుల్ వ్యాధుల గురించి పెద్దగా భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే వాటి కోసం ఎన్నో మందులు, టీకాలు కనిపెట్టారు. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు, ప్రభుత్వాల కృషి కూడా ఇందుకు కారణమైంది.

ఐతే ఇతరుల నుంచి సోకనటువంటి కార్డియో వాస్క్యూలర్ (గుండె సంబంధిత), క్యాన్సర్ విషయంలో అవగాహన పెద్దఎత్తున కలిగించాల్సింది ఉంది. ఈ రంగంలో కొత్త మందులతో పాటు.. చికిత్సా పద్ధతులనూ కొత్తగా ఆవిష్కరించే అంశంపై జీఈ హెల్త్ కేర్ దృష్టి పెట్టిందంటారు విక్రమ్. 

గుండె సంబంధిత వ్యాధులు

మన దేశంలో దాదాపు ఏడు కోట్లమంది ప్రజలు ఈ వ్యాధులతో బాధపడుతున్నారు. ప్రతీ సంవత్సరం కేవలం 150మంది కార్డియాలజిస్టులు కొత్తగా వైద్యరంగంలోకి వస్తున్నారు. ఇంత పెద్ద గ్యాప్‌ను భర్తీ చేయడం చాలా కష్టం. గుండె సంబంధిత వ్యాధుల చికిత్సకు అయ్యే ఖర్చును అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. దాంతోపాటుగా.. పర్యావరణాన్ని అందుకు అనువుగా తయారు చేయాలి. అందుకు తగ్గట్లుగా జీవనవిధానం, ఆహార అలవాట్లలోనూ తీసుకురావాల్సిన మార్పులు గురించి ప్రచారం చేయాలి అని చెప్తారు విక్రమ్ దామోదరన్.

ఆంకాలజీ(కేన్సర్ సంబంధిత వ్యాధులు) 

ఒక్క మన దేశంలోనే 30లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇవన్నీ అధికారికంగా తీసుకున్న లెక్కలు. అనధికారికంగా ఈ కేసులు ఇంకా ఎక్కువే ఉన్నట్లు ఓ అంచనా. ఓ కోటి మందికి క్యాన్సర్ సోకినట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉంది.

తల్లీపిల్లలకు వచ్చే వ్యాధులు

మన దేశంలో ప్రతీ ఏటా 3 కోట్ల మంది శిశువులు జన్మిస్తున్నారు.ఇది ఆస్ట్ర్రేలియా జనాభాతో సమానం. కానీ జన్మించిన శిశువుల్లో చాలామంది నవజాత దశలోనే చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది శిశువులు.. పుట్టిన రోజే చనిపోతున్నారు. ఈ పరిస్థితి మారాలంటే జనన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన అవసరం.

పైన చెప్పిన మూడు విభాగాల సమస్యలకు పరిష్కారంగా తక్కువ ధరకు మందులు దొరకడంతో పాటు..వేక్సినేషన్ల కార్యక్రమం ఉపయోగపడతాయి. ఇక నాలుగో విభాగం.. ఇది వ్యాధులకు సంబంధించినది కాదు..పైన మూడు విభాగాల్లో అంతర్గతంగా దాగి ఉన్నదే.

మెడికల్ టెక్నాలజీ ఆవిష్కరణలు..దాని ప్రభావం

ఐదేళ్ల క్రితం 25,26 ప్రొడక్ట్స్‌తో మేం ఓ హెల్త్‌కేర్ పోర్ట్‌ఫోలియో విడుదల చేసాం. ఇవి అందరికీ అన్ని విధాలుగా అందుబాటులో ఉండేవి. ఈ పోర్ట్‌ఫోలియో లక్ష్యమేంటంటే... ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు అత్యుత్తమ చికిత్స అందించడం. మామాలుగా అయితే సామాన్యులకు ఇవి అందుబాటలో ఉండవు. ఉదాహరణకు మేం డిజైన్ చేసి లులబీ వార్మర్. నవజాతశిశువులకు అవసరమైన వెచ్చని వాతావరణాన్ని ఇది ఏర్పరుస్తుంది. ఓ పీహెచ్‌సీ లో ఇలాంటి సౌకర్యం ఉండదు. ఆ స్థాయి ఆపరేటస్ కావాలంటే బాగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది.

ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఈ ఎక్విప్‌మెంట్ ఉన్నా నర్సులు వాటిని వాడలేకపోయారు. ఇదే మా ఆలోచనా విధానాన్ని మార్చింది. కేవలం తక్కువ రేటులో ఉండే వస్తువు తయారు చేయడం, అవగాహన పెంచడంతో మార్పు రాదని మాకు అర్ధమైందని అంటారు విక్రమ్. ధర ఎక్కువా తక్కువా అనేది ఓ అంశమే కానీ..అదొక్కటే ముఖ్యం కాదు. 

విక్రమ్ దామోదరన్

విక్రమ్ దామోదరన్


శిశువుల శరీర ఉష్ణోగ్రత చూసేందుకు వాడే కేబుల్ నైలాన్‌తో తయారు చేస్తారు. ఐతే ఇది ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సి ఉంటుంది. కాని ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న కేబుల్ అలా శుభ్రం చేసిన ప్రతిసారీ నైలాన్‌తో చేసినది కావడంతో తెగిపోతుంటుంది. దాంతో రీప్లేస్ చేయాలంటే టైమ్ కూడా పడుతుంటుంది. అందుకే మేం దాని స్థానంలో కెవ్లార్‌ను వాడాం. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లలో ఈ మెటీరియల్ ఎక్కువగా వాడతారు. ఈ మార్పుతో తక్కువ ధరకు ప్రొడక్ట్ తయారవడమే కాకుండా.. ప్రతీసారీ శుభ్రం చేయకపోయినా సమర్ధవంతంగా టెంపరేచర్‌ను ఇదినమోదు చేస్తుంది.

3 కోట్ల మంది శిశువులు జన్మిస్తే..వారిలో 80లక్షల మంది ఇంటి దగ్గర ప్రసవాల్లోనే జన్మిస్తున్నారు. వీరి ప్రసవాల సయమంలో ఎలాంటి శిక్షణ పొందిన నర్సుల సాయం లేకుండానే డెలివరీ జరుగుతోంది. వీరిలో ఎక్కువగా స్థానికంగా ఉండే మంత్రసానుల సాయంతోనే గర్భిణులు ఎక్కువ మంది పిల్లలను కంటున్నారు. మహిళలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు గానీ..ఆస్పత్రులకు కానీ వచ్చేలా చేయడం ముఖ్యం. వాటిలో ఉండే వసతులను పక్కనబెడితే ముందు ఆస్పత్రులకు వచ్చేలా చేయడమే అవసరం. ఇందుకు అవగాహనతో పాటు ప్రోత్సాహకాలు ఇవ్వడం కూడా అవసరం అంటారు విక్రమ్. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవించే మహిళలకు వెయ్యి రూపాయలు, సిజేరియన్‌కు 3వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తోంది.

ఒక్కసారి హెల్త్ సెంటర్‌కు రావడం వలన కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. ఆ ప్రాంతంలోని అందరికీ దాని ఉపయోగం అర్థమవుతుంది. అలా పీహెచ్‌సీలకు.. ప్రభుత్వాసుపత్రులకు రావడానికి జనాలు అలవాటు పడతారు.


మార్గంలో అడ్డంకులు

కొన్ని దశాబ్దాలుగా అలవాటు పడిన వ్యవస్థ నుంచి ముందుగా బైటికి రావాలి. మెడికల్ టెక్నాలజీ రంగంలో బాగా పెట్టుబడులు పెట్టాలి. అలానే అందుకు ఉన్నఅడ్డంకులనూ తొలగించాలి. అప్పుడే ఈ రంగంలో ఎన్నో మార్పులు జరిగేందుకు ఆస్కారం ఉంటుందని చెబ్తూ ముగించారు దామోదరన్.