కేరళలో మొట్టమొదటి మహిళా బయోటెక్ స్టార్టప్ వీరి ఘనతే !

కేరళలో మొట్టమొదటి మహిళా బయోటెక్ స్టార్టప్ వీరి ఘనతే !

Monday November 16, 2015,

4 min Read

ఏడేళ్ల క్రితం త్రివేండ్రంలోని చైత్ర తిరునల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజిలో పుట్టిన ఆలోచనలే ఏక్తాకు ప్రాణం పోశాయి. ఆర్ద్ర చంద్ర మౌళీ, గాయత్రి తంగచ్చి చదువుకునేటప్పుడే కలలు కనేవారు. వారిద్దరితోపాటు వాళ్ల సహచర విద్యార్థులు, బయెటెక్నాలజీ అండ్ బయో కెమికల్ ఇంజినీరింగ్ ఎసిటిసీఈ బ్యాచ్ అందరి కల కూడా. కేరళలో పూర్తిగా మహిళల సొంతమైన ఏకైక బయోకెమికల్ స్టార్టప్ ఏకా బయోకెమికల్ ప్రైవేట్ లిమిటెడ్, త్రివేండ్రంలో ఉంది.

ఈ కంపెనీ బయోటెక్నలాజికల్, బయో కెమికల్ , ఎంజైమ్ ఉత్పత్తులను తయారు చేస్తుంది. స్నేహపూరిత వాతావరణం సృష్టించాలన్న తపన వల్లే సృజనాత్మకత, టీమ్ వర్క్, వినూత్నత, ఐక్యత అభివృద్ధి చెందుతాయని ఏకా సభ్యురాలు ఆర్ద్ర చెబుతారు. ‘‘మా కష్టం ద్వారా, ఉత్పత్తులు సామాన్య మానవులకు ఉపయోగపడేలా రూపుదిద్దుకుంటాయి.’’ అంటారు ఆర్ద్ర.

ఆర్ద్ర (ఎడమ), గాయత్రి (కుడి)

ఆర్ద్ర (ఎడమ), గాయత్రి (కుడి)


ప్రధాన బృంద సభ్యులు

ఆర్ద్ర, గాయత్రి ఇద్దరూ కూడా త్రివేండ్రంలోని ఎస్‌సిటి ఇంజినీరింగ్ కాలేజీ నుంచి బయోటెక్నాలజీ అండ్ బయో కెమికల్ ఇంనీరింగ్‌లో డిగ్రీ చేశారు. ఆర్ద్ర ఆ తర్వాత మెనేజ్‌మెంట్ కోర్సును బ్రిటన్ చెందిన వార్ వీక్ బిజినెస్ స్కూల్‌లో, పూర్తి స్కాలర్షిప్‌తో చేశారు. ఇద్దరికీ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, బయోకెమికల్ రంగంలో అనుభవం ఉంది.

ఏకా సంస్థ సైంటిఫిక్ టీం హెడ్ నిధిన్ శ్రీకుమార్ ఎన్ఐటి కాలికట్ నుంచి పీహెచ్‌డి చేస్తున్నారు. ఎన్ఐఐఎస్‌టి - సిఎస్ఐఆర్‌లో సీనియర్ రీసెర్చ్ ఫెలో గా ఉన్నారు. ఏకా ల్యాబ్ హెడ్ జయరామ్ బయోటెక్నాలజీ అండ్ బయోకెమికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తిచేశారు. ‘‘మాకు మెంటర్, సైంటిఫిక్ కన్సల్టెంట్ వి.పి. పోట్టీకి పరిశోధనా రంగంలో దాదాపు 42 ఏళ్ల అనుభవం ఉంది. 100కుపైగా పేపర్లు సమర్పించిన ఘనత ఆయనది.’’ అంటారు ఆర్ద్ర.

ఆర్ద్ర (ఎడమ), క్రిష్ గోపాలకృష్ణన్ (మధ్య), గాయత్రి (కుడి)

ఆర్ద్ర (ఎడమ), క్రిష్ గోపాలకృష్ణన్ (మధ్య), గాయత్రి (కుడి)


అప్పటికీ కేరళలో బయోటెక్ స్టార్టప్‌లు చాలా తక్కువగా ఉన్నప్పటీకి వీరు అదే రంగంలో అడుగుపెట్టాలని దృఢంగా నిశ్చయించుకున్నారు. ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నారు. అందులో అవినీతి కూడా ఉందంటారు ఆర్ద్ర. ఏకా లాంటి సంస్ధను ఏర్పాటు చేయడానికి న్యాయపరమైన సమాచారం, లైసెన్సు పొందడానికి అనుసరించాల్సిన నియమాలకు సంబంధించిన సమాచారం తెలియజేసే సమగ్రమైన మార్గం లేకపోవడం అతి పెద్ద అవరోధం అంటారామె. ‘‘అయినా మెంటర్లు, స్థానికంగా ఉన్న సంస్థలు తోడ్పాటును అందించారు. మంచి అనుభవం ఉన్న వ్యక్తులు అందించిన సలహాతో అరంభంలో ఎదురైన కష్టాల నుంచి గట్టెక్కాం’’ అని చెబుతున్నారు .

అయినప్పటికీ, అదృష్టం కూడా కలిసొచ్చిదంటారు ఆర్ద్ర. సాధారణ ప్రజల్లో పితృస్వామ్య సమాజానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఆరంభంలో వారు సంప్రదించిన సంస్థలు, క్లైంట్లు, సంస్థలు అందరూ కూడా తమతో మర్యాదగా వ్యవహరించేవారని చెబుతున్నారు.

‘‘ అంతా సాఫీగా సాగిపోయిందని చెప్పడం కూడా కష్టమే. కొన్ని సందర్భాల్లో కొందరు వ్యక్తులు మా వెనుకాల ఎవరో ఉన్నారని అనుమానిస్తూ ప్రశ్నించేవారు. ఇద్దరు అమ్మాయిలకు ఈ వ్యాపారం గురించి తెలుసుకుని నడుపుతారంటే తమకు నమ్మకం కలగడం లేదనేవారు. అయినా కొన్ని సందర్భాల్లో మాత్రం కొన్ని సరదా సంఘటనలు కూడా జరిగేవి. ’’ అంటూ పాత సంగతుల్ని గుర్తు చేసుకుంటారు ఆర్ధ్ర.

3 అక్టోబర్ 2014, ఏకా కార్యాకలాపాలు ప్రారంభమయ్యాయి. నవంబర్ లో కేరళ ప్రభుత్వం కేరళ ఫైనాన్స్ కార్పొరేషన్‌తో (కెఎఫ్‌సి) కలిసి నిర్వహిస్తున్న కేరళ రాష్ట్ర ఎంట్రప్రెన్యూర్ డెవలప్‌మెంట్ మిషన్ స్కీమ్‌కి ఏకా ఎంపికైంది.

image


అదే అత్యంత కీలకమైన మలుపు అంటారు ఆర్ధ్ర. కంపెనీ మొదలైన తర్వాత బయట నుంచి అందిన తొలి ఫండింగ్ ఇదే. జనవరిలో వీరి టీమ్, చిన్న స్థాయిలో త్రివేండంలోని వాజీకోడ్‌లో ఒక లేబోరేటరీని, చిన్న స్థాయిలో ఉత్పాదక సామర్ధ్యం కలిగిన ప్లాంట్ ఏర్పాటు చేశారు. వాజీకోడ్‌లోని ఏకాలో పూర్తి స్థాయి వెట్ లేబరోటరీ సదుపాయం కల్పించారు. ఇందులో ప్రాధమిక ఎనలైటికల్ లేబొరేటరీ, పైలెట్ స్కేల్ బయో కెమికల్ ప్రొడక్షన్ యూనిట్ ఉన్నాయి.

ఫిబ్రవరిలో మార్కెటింగ్ విభాగాన్ని సమకూర్చుకున్నారు. ఈ విభాగం మార్కెటింగ్ కార్యకలాపాలు, రీసెర్చ్ మార్కెటింగ్ వ్యవహారాలు చూస్తుంది. ఏకా ల్యాబ్స్ ఆఫీస్ జగతిలో ఉంది. బయో ఉత్పత్తుల మార్కెటింగ్ దీని ప్రధాన బాధ్యత.

కంపెనీలో సాంకేతిక కార్యకలాపాలను వీరి మెంటర్, సీనియర్ సైంటిస్ట్ డా. వి.పి. పొట్టి , 1 జూన్ 2015న ప్రారంభించారు. ‘‘ నగరం నడిబోడ్డున వాజీకోడ్‌లో ఉన్న ఏకా సంస్థ పూర్తిగా పర్యావరణ సహితమైంది. కాలుష్యరహితమైంది, ఎటువంటి వ్యర్థాలూ వెలువడవు. ఈ ల్యాబ్, ఉత్పాదక యూనిట్ రెండింటి కోసం మైక్రో బయాలజీ, బయోటెక్నీలజీ క్వాలిటీ కంట్రోల్, కెమిల్ (వెట్ ల్యాబ్) వర్క్ విభాగాలు ఉన్నాయి.’’ అంటున్నారు ఆర్ధ్ర. ల్యాబ్ స్కేల్ ఉత్పాదన వారు అనుకున్న స్థాయి నాణ్యతతో జులైలో మొదలుపెట్టారు.

మార్పులతో కొత్తగా రూపొందించిన వారి వెబ్ సైట్‌ను ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించారు. ఆన్ లైన్, సోషల్ మీడియాలో వారి కంపెనీకి సంబంధించి ప్రచారం మరింత బలోపేతం చేయడానికి ఇది దోహదపడింది. ఏకా తన మొదటి ఉత్పత్తులను 9 అక్టోబర్ 2015లో విడుదల చేసింది. మైక్రోబయాలజీ ప్లాంట్ ద్వారా సశ్య పేరుతో సురక్షితమైన, రసాయన రహిత వ్యవసాయానికి అవసరమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నారు.

వారి ఉత్పత్తుల వివరాలు ఈ క్రింది ఇవ్వబడ్డాయి. ప్రతి ఉత్పత్తి కూడా నిర్థిష్టమైన పంటలకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించారు. వీటిని అన్ని విధాలుగాను పరీక్షించారు.

సశ్య సూత్ర – నర్సరీలు, తోటల్లో వినియోగానికి రూపొందించబడింది. విత్తనాలు, వేర్లు శుద్ధి చేయడానికి వాడతారు.

సశ్య మిత్ర – వంటగది,ఇంట్లో, టెర్రస్ మీద ఉండే మొక్కలకు వాడతారు, చిన్న చిన్న తోటల్లో ఆకుల మీద చల్లుతారు.

సశ్య రక్ష – తోటలు, పంటపొలాల్లో ఆకుల మీద చల్లుతారు.

సశ్య పోషక్ – భారీ పంటపొలాలకు వాడతారు. విత్తనాలు, వేర్లు, ఆకుల మీద వాడతారు.

సశ్య పోషక్+ - తోటలకు వాడతారు. విత్తనాలు, వేర్లు, ఆకులకు ఉపయోగిస్తారు.

టీమ్ మరియు వారి లక్ష్యం

ఏకా టీమ్ మొదటి ప్రాధాన్యం పర్యావరణానికే, మిగతా అంశాలన్నీ ఆ తర్వాతే అంటారు ఆర్ధ్ర. స్థానికంగా ఉన్నవారి అవసరాలు తీర్చడమే తమ రెండో ప్రాధాన్యమని చెబుతున్నారు. చాలా విశాల దృక్పథంతో ఏకా విస్తృత రంగాల్లో పరిశోధనలు జరిగిపి ఉత్పత్తులను కనిపెట్టి అనే సమస్యలకు ముగింపు పలకాలనుకుంటున్నారు ఏకా టీమ్.

ఏకాలో ప్రతి రోజూ నిర్దేశించుకునే లక్ష్యం ఒక్కటే.. తాము రూపొందించే ఫార్ములాలు.. సామాజిక, పర్యావరణ రంగాలకు సంబంధించి అవసరాలను పూర్తిగా సంతృప్తిపరిచేలా ఉండేలా చూడటమే. ‘‘ ఆరంభంలోనే మేం చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటాం. మా శక్తినంతా ఉపయోగించి వ్యర్థాల స్థాయిని, శక్తి (విద్యుత్ తదితర శక్తిల..) నష్టాన్ని బాగా తగ్గిస్తాం. సమజానికి మా తరఫు నుంచి అందించగలిగినవన్నీ గరిష్ట స్థాయిలో ఉండేలా చూస్తున్నాం. పరిసరాల్లో పచ్చదనం కోసం తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నాం’’ అని చెబుతున్నారు ఆర్ధ్ర.

ఆదాయ నమూనా భవిష్యత్తు

ఏకా టీమ్ ఎంచుకున్న ఆదాయ నమూనా, ప్రొడక్షన్ మోడల్. కంపెనీ ఉత్పత్తులను తయారు చేసి వాటిని ఎంపిక చేసుకున్న వినియోగదారులకు అమ్ముతుంది. మొదట ఏడాది ఏంబి-పిజిపి స్థాయిలో అత్యుత్తమమైన సదుపాయాలను సమకూర్చుకోవడం మీద ఏకా దృష్టిపెట్టింది.

ఇప్పుడు తమ సొంత టీమ్ తోడ్పాటుతో పాటు, కొంత నిపుణులైన కన్సల్టెంట్ల విశేష అనుభవంతో ఆర్ అండ్ డి ని 2015-2017 నాటికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. దాంతో పాటు ప్లాంట్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా తయారుచేసే ప్రమోషన్ ఉత్పత్తులకు ప్లాన్ చేస్తున్నారు. దాంతో పాటు గ్రీన్ సొల్యూషన్స్ పేరుతో వినూత్నమైన, పర్యావరణహితమైన పద్ధతులతో కూడిన మైక్రో బయాలజీ పద్ధతుల్లో వ్యర్థ నీటిని రీసైక్లింగ్ చేయడానికి సొంతంగా పదార్ధాలు తయారు చేసుకున్నారు.

స్థానికంగానూ, ప్రపంచ స్థాయిలోనూ ఉన్న వినియోగదారుల ప్రస్తుతం అవసరాలకు అనుగుణంగా తయారయ్యే ఉత్పత్తులకు తమ కంపెనీ కేంద్రం కావాలన్నదే ఏకా టీమ్ లక్ష్యం.