మీకెలాంటి ఇల్లు కావాలో మాకే తెలుసంటున్న 'హౌజింగ్'

ఎవ‌రండీ చెప్పింది ఐఐటీ చేస్తే... సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్లే కావాల‌ని చెప్పిందీ? ఏ చ‌దువు చ‌దివినా క‌ళ్లు మూసుకుని ప్ర‌తి ఒక్క‌రూ అదే ప‌ని చెయ్యాల‌ని చెప్పిన రొటీన్ రంగారావ్ ఎవ‌రండీ? ఏం ఐఐటీ చేసి రియ‌ల్ ఎస్టేట్ రంగంలో అడుగు పెడితే ఎవ‌రైనా కొడ‌తారా? థింక్ డిఫ‌రెంట్ ఫార్ములా ఉట్టిగా వ‌ల్లె వేయ‌డం కాదు.. అప్పుడ‌ప్పుడూ అప్లై చేయాలి బాసూ ! అయినా ఇటు ఐఐటీ చేసి అటు ఏ యూఎస్, యూకేకో చెక్కెయ్య‌క ఇదేం ప‌నీ? అయినా ఇండియాలో రియ‌ల్ ఎస్టేట్ రంగంలో ఏ చ‌దువు సంధ్యా లేని వాళ్లు అడుగు పెడ‌తారు. అస‌లిదో మాఫియా. ఇందులో రౌడీలూ డెకాయిట్లు ఉంటారు. ఇంత చ‌దువు చ‌దివి ఇదేంటీ? ఇలా ఎంతమంది వెనక్కిలాగినా పట్టించుకోకపోవడం వల్లే హౌజింగ్ డాట్ కామ్ పుట్టుకొచ్చింది.

26th Mar 2015
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

ముంబై కిచెందిన హౌసింగ్ డాట్ కో దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రియ‌ల్ ఎస్టేట్ కంపెనీల్లో ఒక‌టి. రెండున్న‌ర మిలియ‌న్ డాల‌ర్ల సామ‌ర్ధ్యం గ‌ల నెక్సెస్ వెంచ‌ర్ పార్ట్ న‌ర్స్ ప్రారంభించింది. అద్వితీయ శ‌ర్మ బృందం ప్రారంభించిన ఈ కంపెనీ మిలియ‌న్ డాల‌ర్ల ప్రాజెక్టులు చేప‌డుతూ మున్ముందుకు దూసుకుపోతోంది. రియ‌ల్ రంగంలో అధునాత‌న పోక‌డ‌ల‌ను ప్ర‌వేశపెడుతూ అద్వితీయ‌మ‌నిపిస్తోంది.

ఆన్ లైన్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో రియ‌ల్ ఎస్టేట్ రంగం ఒక‌టి. మాజిక్ బ్రిక్స్, 99 ఎక‌ర్స్ లాంటి సంస్థ‌లు సాధిస్తున్న ప్ర‌గ‌తే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. కూడు- గుడ్డ- నీడ అనే ఈ మూడింటికీ నాటికీ నేటికీ ఏనాటికీ డిమాండ్ త‌గ్గే ప‌రిస్థితే లేదు. భూమ్మీద మ‌నుషులున్నంత వ‌ర‌కూ వీటి అవ‌స‌రం త‌ప్ప‌క ఉంటుంది. మ‌రీ ముఖ్యంగా మ‌నుషులెంత పెరిగినా.. భూమి మాత్రం కొరతే. కాబ‌ట్టి వ‌చ్చే రోజుల్లో మ‌రింత ఎక్కువ డిమాండ్ ఉన్న రంగం రియ‌ల్ ఎస్టేటే. కాబ‌ట్టి ఇందులోనే మ‌న‌క్కావ‌ల్సిన ఫ్యూచ‌ర్ వెతుక్కోవ‌చ్చ‌నుకున్నారు వాళ్లు. అనుకున్న‌ట్టుగానే హౌసింగ్ సంస్థ‌ను స్థాపించారు.

హౌసింగ్.. ముంబైలో ఐఐటీ చేసిన 12 మంది కుర్రాళ్లు స్థాపించిన రియ‌ల్ కంపెనీ. ఆన్ లైన్లో మంచి ఇళ్ల‌ను వెతికి పెట్ట‌డ‌మే ధ్యేయంగా తామీ సంస్థ స్థాపించిన‌ట్టు చెబుతారీ బృంద స‌భ్యులు. గొప్ప సాంకేతిక ప‌రిజ్ఞానం వినియోగించి త‌మ సంస్థ‌ను న‌డ‌పాల‌న్న‌ది ఈ ఐఐటియ‌న్ల ల‌క్ష్యం. వ్యాపారంలో వీరి అభిరుచి, ఆస‌క్తిన‌చ్చే ఫ్యూచ‌ర్ బ‌జార్ స‌హ స్థాప‌కుడైన జీష‌న్ వీరి సంస్థ‌లో పెట్టుబ‌డికి ముందుకు వ‌చ్చారు. అద్వితీయ శ‌ర్మ బృందం అత్యంత శ‌క్తిమంతం. ఆన్ లైన్ పై ఎలాంటి విచిత్రాలైనా న‌మోదు చేయ‌గ‌ల సామ‌ర్ధ్య‌మున్న‌ద‌ని అంటారాయ‌న‌. అందుకే ఈ సంస్థ‌లో త‌మ పెట్టుబ‌డులు పెట్టామ‌న్న‌ది జీష‌న్ మాట‌.

ఇక్కడ ఉద్యోగం కన్నా సివిల్స్ కొట్టడం ఈజీ !

హౌసింగ్ డాట్ కో నిర్వాహ‌కులు త‌మ కంపెనీల్లో బాగా చ‌దువుకున్న వారికి మాత్ర‌మే ప్రాధాన్య‌త ఇవ్వద‌లుచుకున్నారు. ఐఐటియ‌న్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చేర్చుకుంటూ కంపెనీని సాంకేతికంగా ఉన్న‌తంగా తీర్చిదిద్దాల‌న్న‌దే ధ్యేయం. రియ‌ల్ రంగం కూడా సంవ‌త్స‌రానికి 12 నుంచి 18 ల‌క్ష‌ల వ‌ర‌కూ జీతాల‌ను ఇవ్వ‌గ‌ల‌ రంగ‌మే. ఈ రంగంలో మేం ఏ ప్లస్ టీంతో ముందుకెళ్లాల‌ని అనుకుంటున్నాం. ఏ-బీ-సీ కేట‌గిరీ జోలికే వెళ్ల‌ద‌లుచుకోడం లేదంటాడు హౌసింగ్ స్థాప‌కుల్లో ముఖ్యుడైన‌ అద్వితీయ శ‌ర్మ‌. త‌మ‌ హౌసింగ్ కి మంచి మార్కెట్ నిర్మించుకోవాలి. మ‌రీ ముఖ్యంగా ఇళ్లు కొనాల‌నుకునే వారి బెస్ట్ ఆప్ష‌న్స్ లో మా పేరే ముందు వినిపించాలి. కొత్త త‌రం హౌసింగ్ సొల్యూష‌న్స్ కి త‌మ హౌసింగ్ ఒక ప్ర‌తినిధిగా నిల‌వాల‌ని చెప్పుకొస్తాడు శ‌ర్మ‌.

హౌసింగ్ టీంలో చేరాలంటే ఎంతో క‌ష్టం. వీళ్లు చేసే ఇంట‌ర్వ్యూ జ‌యించిన‌ట్టైతే దేశంలో పెద్ద పెద్ద కంపెనీల్లో ఈజీగా ఉద్యోగం సంపాదించ‌వ‌చ్చు. వీరిదగ్గ‌ర ఉద్యోగం సంపాదించ‌డం క‌న్నా సివిల్స్ లో ర్యాంకు సాధించ‌డ‌మే ఈజీ అన్న పేరొచ్చేసింద‌ప్పుడే. ఎంతైనా ఐఐటీయ‌న్లు క‌దా? త‌మ టాలెంట్ మొత్తం ఉత్త‌మ ఉద్యోగస్తులను వెతికి ప‌ట్ట‌డంలో వాడుతున్నారు.

హౌసింగ్ ప‌టిష్ట‌మైన శిక్ష‌ణా కార్య‌క్ర‌మం కూడా క‌లిగి ఉంది. సాంకేతిక‌, క్షేత్ర స్థాయి ఉద్యోగులు, జాబ్ లో చేరిన వెంట‌నే ప‌నిలోకి దిగే ప‌రిస్థితే ఉండ‌దు. ముందుగా వారికి త‌గిన శిక్ష‌ణా త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తారు. ఆ త‌ర్వాతే వారిని విధుల్లోకి వెళ్ల‌నిస్తారు. ఖ‌చ్చిత‌మైన స‌మాచారం వారి మెదుడులో ముద్రించుకు పోయింద‌న్న‌ న‌మ్మ‌కం క‌లిగాక మాత్ర‌మే వాళ్లను రంగంలోకి దించుతారు. క‌స్ట‌మ‌ర్ల‌ను క‌ల‌వ‌డానికి పంపుతారు. త‌గిన సామ‌ర్ధ్యం లేకుంటే హౌసింగ్ లో ఉద్యోగ‌మే రాదు. త‌మ లావాదేవీల‌ను కేవ‌లం ముంబై మాత్ర‌మే కాదు.. భ‌విష్య‌త్ లో క‌ల‌క‌త్తా వంటి మ‌రో పెద్ద న‌గ‌రాల‌కు సైతం విస్త‌రించాలి. ఇదే అద్వితీయ శ‌ర్మ టీం టార్గెట్‌.

రాహుల్ యాదవ్, హౌజింగ్ ఫౌండర్

రాహుల్ యాదవ్, హౌజింగ్ ఫౌండర్


మీకెలాంటి ఇల్లు కావాలో మాకే బాగా తెలుసు !

హౌసింగ్ పోర్ట‌ల్ సంద‌ర్శించిన వారికి గ్రేట్ యూజ‌ర్ ఎక్స్ పీరియ‌న్స్ ల‌భిస్తుంద‌ని అంటారు నిర్వాహ‌కులు. మ్యాపుల‌తో స‌హా చూపుతూ కావ‌ల్సిన చోట కావ‌ల్సిన నివాసం ఎంపిక చేసుకునే స‌దుపాయం క‌ల్పిస్తారు. ఇవాళ రేపు మోబైల్లోనే స‌మ‌స్త స‌మాచారం ఆశిస్తున్నారు. రంగ‌మేదైనా దాని స‌మాచారం మోబైల్ యాప్స్ రూపంలో కావాల‌ని కోరుకుంటున్నారు. కాబ‌ట్టి ఈ టెక్నాల‌జీని కూడా త‌మ హౌసింగ్ కోసం వినియోగిస్తున్నారు. అలాగే త‌మ వ్యాపార విధానం సులువైన‌ది గా చెబుతున్నారు. ఇత‌ర ఆన్ లైన్ కంపెనీల‌తో పోల్చితే హౌసింగ్ చాలా ఈజీగా మీకు కావ‌ల్సిన ఆస్తులను సేక‌ర‌ణ చేయ‌గ‌ల‌దని అంటున్నారు.

మీ ఇంటి బాధ్య‌త మీది మాత్ర‌మే కాదు. మాది కూడా. అస‌లు మీకెలాంటి ఇల్లు కావాలో మీకంటే మాకే ఎక్కువ తెలుసు. మీ మ‌న‌సెరిగి మీకో నివాసం ఏర్ప‌ర‌చ‌డ‌మే మా ల‌క్ష్యం. కాబ‌ట్టి రండి! హౌసింగ్ లో ఒక్క సారి అడుగు పెడితే ఇక మీక్కావ‌ల్సిన ఇల్లు ఇట్టే దొరికేసిన‌ట్టే!! అంటారు టీం మెంబ‌ర్స్. అంత ప‌క్కా స‌మాచారంతో హౌసింగ్ సైట్ నిర్వ‌హిస్తున్నారు వీళ్లు. ఇత‌ర సైట్ల‌ను చూసి మా వెబ్ సైట్ చూసిన వారికీ విష‌యం ఇట్టే అర్ధ‌మై పోతుంద‌ని న‌మ్మ‌కంగా చెబుతున్నారు. చ‌క్క‌టి ఇల్లు ప్ర‌తి ఒక్క‌రి క‌ల‌. అది నెర‌వేర్చ‌డ‌మే హౌసింగ్ డాట్ కో బృందం క‌ల‌. మ‌రి వారి క‌ల‌లు నెర‌వేర‌డ‌మంటే మ‌రేదో కాదు. అంద‌రి క‌ల‌లు నెర‌వేర‌డ‌మే !

హౌజింగ్ టీమ్

హౌజింగ్ టీమ్


Want to make your startup journey smooth? YS Education brings a comprehensive Funding and Startup Course. Learn from India's top investors and entrepreneurs. Click here to know more.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

మా రోజువారీ వార్తాలేఖ కోసం సైన్ అప్ చేయండి

Our Partner Events

Hustle across India