రీటైల్ సెక్టార్ ను ప్రభావితం చేసే ఐదు స్టార్టప్స్

By Sri
30th Apr 2016
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close


రెండేళ్లు... పదిహేనుకుపైగా స్టార్టప్స్... ఇదీ టార్గెట్ యాక్సిలిరేటర్ ట్రాక్ రికార్డ్. కొత్తకొత్త ఐడియాలను ఆవిష్కరిస్తూ ముందుకెళ్తోంది. ఈ మధ్యే నాలుగో బ్యాచ్ స్టార్టప్స్ ని ప్రారంభించింది. ఈసారి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 1,795 ఔట్ లెట్లపై ప్రభావం చూపేలా ఉన్నాయీ స్టార్టప్స్. గత బ్యాచ్ లతో పోలిస్తే ఈసారి ఏమైనా తేడాలు ఉన్నాయా అంటే... చాలా ఉన్నాయంటారు టార్గెట్ యాక్సిలిరేటర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జమీల్ ఘని.

"గత నాలుగు బ్యాచుల్లో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. మొదట్లో మేము టెక్నాలజీని కీలకంగా వాడుకున్నాం. ఇప్పుడు అంతకు మించి చేయబోతున్నాం. ఆపరేషన్స్, బ్యాక్ ఆఫీస్ ఫంక్షన్స్, ఫైనాన్స్ అండ్ లా పై దృష్టిపెట్టాం. అలా మా అడుగులు మారుస్తూ ముందుకెళ్తున్నాం. మేము చేస్తున్నదంతా వినియోగదారులకు ఉపయోగపడే ఉత్పత్తులే. ఈ బ్యాచ్ లో కొన్ని స్టార్టప్స్ ఇండియా, యూఎస్ మార్కెట్లను దృష్టిలో పెట్టుకొని కన్స్యూమర్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాయి" అని అంటారాయన.

ఇక మెంటారింగ్ గురించి మాట్లాడుతూ... "మేము ఐడియాలను టెస్ట్ చేశాం. వాటిని అభివృద్ధి చేసే పనిలో ఉన్నాం. ఈ సంవత్సరానికి ఐదు స్టార్టప్స్ ని ఎంపిక చేశాం" అని వివరిస్తున్నారు టార్గెట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ నవనీత్ కపూర్.

ఆ స్టార్టప్స్ ఏంటంటే...

1. లేచల్- స్మార్ట్ ఫుట్ వేర్

అంధుల కోసం ప్రత్యేకమైన షూ తయారుచేయడం వీరి ఐడియా. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడిప్పుడే స్టార్టప్ గా మారుతోంది. అంధులకు ఖరీదైన పరికరాలు అవసరం లేదు. ఈ షూ వేసుకుంటే చాలు. వెళ్లాల్సిన చోటుని యాప్ లో సెలెక్ట్ చేసుకుంటే... లేచల్ షూ వైబ్రేషన్స్ ద్వారా దారిని నిర్దేశిస్తుంది. భారతదేశంలో అంధుల కోసం తక్కువ ధరకే షూస్ తయారు చేయడం విశేషం.

2. ప్రేక్ష్- నయా షాపింగ్ ట్రెండ్

కూర్చున్నచోటి నుంచి ఇ-కామర్స్ వెబ్ సైట్లలో వస్తువుల్ని కొనుక్కోవడం కాదు. కూర్చున్న చోటి నుంచే ఓ షాపులో చక్కర్లు కొడుతూ నచ్చినవస్తువుని కొనుక్కునేందుకు సాయపడే స్టార్టప్. గూగుల్ స్ట్రీట్ వ్యూ సాయంతో రూపొందించిన సర్వీస్ ఇది. కంప్యూటర్ ముందు కూర్చొని మనకు కావాల్సిన షాపులో ఉన్న వస్తువులన్నీ చూడొచ్చు. ర్యాక్ లో ఉన్న వాటిలో మనకు నచ్చిన వస్తువును కొనుక్కోవచ్చు. ఇప్పటికే వ్యాన్‌ హ్యూసెన్‌, బేబిఓయ్ లాంటి బడా క్లైంట్లను పట్టేసింది ఈ స్టార్టప్. ఇది సాఫ్ట్ వేర్ యాజ్ ఏ సర్వీస్ సబ్ స్క్రిప్షన్ బిజినెస్ మోడల్. తర్వాతి దశలో కోటిన్నర నిధులు సేకరించి మరింత అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్నారు ఫౌండర్లు.

3.లాబోట్- వర్చువల్ లా సంస్థ

మనస్విని క్రిష్ణ, క్రిష్ణ సుందరేశన్ లు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో ప్రారంభించిన స్టార్టప్ ఇది. కాంట్రాక్టులను రూపొందించడం, రివ్యూ చేయడం ఈ స్టార్టప్ చేసేపని. కాంట్రాక్ట్ ను ఒక్కసారి సిస్టమ్ లో అప్ లోడ్ చేస్తే... అందులో ఉన్న కామన్ ఎర్రర్స్, లూప్ హోల్స్ ని కనిపెట్టేస్తారు. ఆ కాంట్రాక్ట్ లో మర్చిపోయిన నియమాలు, పరిమితులను గుర్తు చేస్తుంది. అంతేకాదు కాంట్రాక్ట్ డ్రాఫ్టింగ్ పైనా దృష్టిపెడుతుంది. మైక్రోసాఫ్ట్ వర్డ్ లాగా లాయర్లు ఫలానా క్లాజ్ కావాలంటే వెతుక్కోవచ్చు. దాన్ని ఆ కాంట్రాక్ట్ లో జతచేయొచ్చు. మే 2015లో ఐడియాపై కసరత్తు మొదలైంది. స్టార్టప్ ను మరింత ముందుకు నడిపించేందుకు నిధుల అవసరం ఉంది.

4. అన్ క్యానీ విజన్- తెలివైనా నిఘా

ఇది నవనీత్, రంజిత్ ప్రారంభించిన స్టార్టప్. పరికరాలకు విజన్ అందించడమే ఈ స్టార్టప్ లక్ష్యం. చాలావరకు నిఘా కెమెరాలు గుడ్డిగా ఉంటున్నాయి. సరైన విజువల్స్ ని క్యాప్చర్ చేయట్లేవు. చేసినవి సరిగ్గా కనిపించట్లేవు. అన్ క్యానీ విజన్ రూపొందించే నిఘా కెమెరాలు వస్తువుల్ని, వ్యక్తుల చర్యల్ని, సన్నివేశాల్ని గుర్తిస్తుంది. ఫేస్ రికగ్నైజేషన్ సౌకర్యం కూడా ఉంది. స్టోర్ కు వచ్చే కస్టమర్ల హావభావాల్ని గుర్తించి సదరు కస్టమర్ కొనడానికి వచ్చారా లేక షాప్ ని చూసి వెళ్లడానికి వచ్చారా, దొంగతనానికి వచ్చారా అని గుర్తిస్తుంది. తద్వారా స్టోర్ సిబ్బంది అప్రమత్తం కావొచ్చు. వీరి క్లైంట్లు ప్రధానంగా ఫార్చ్యూన్ 500 కంపెనీలే. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే లక్షా 57 వేల డాలర్లను సంపాదించింది.

5.మింట్ ఎమ్- ది మ్యాగ్నెట్

ఇది అడ్వర్టైజింగ్ నెట్ వర్క్ మ్యాగ్నెట్. షాపులోకి ఎంతమంది వస్తున్నారు, ఏ వస్తువుల్ని చూస్తున్నారు, వేటికి ఎక్కువ ఆదరణ ఉంది, కస్టమర్ల టేస్ట్ ఎలా ఉందని కనిపెట్టే స్టార్టప్. వచ్చిన సమాచారం ఆధారంగా బ్రాండ్ లకు విశ్లేషణలు పంపిస్తుంది. తద్వారా ఆయా బ్రాండ్ లు కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా తమ ఉత్పత్తులను తయారుచేయొచ్చు. దీని ద్వారా పెద్ద బ్రాండ్లు కస్టమర్లను చేరుకోవడంలో ఇరవై రెట్లు ఎక్కువగా ఫలితం కనిపిస్తుందని అంటారు ఫౌండర్లు. దీని ద్వారా అమ్మకాలు పెరుగుతాయంటున్నారు. ప్రస్తుతం ఐటీసీ, నెస్లే, టెస్కో, గార్నియర్ లాంటి పెద్ద బ్రాండ్లు వీరి క్లైంట్లు. ఈ సంస్థకు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి ప్రీ సిరీస్ ఏ ఫండింగ్ లభించింది. యూకే, యూఎస్, ఐర్లాండ్, బ్రెజిల్ లాంటి దేశాల నుంచి క్లైంట్లు లభించడం విశేషం.

image


ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఆసక్తి పెరుగుతున్నకొద్దీ ఆ ప్రభావం ఏఏ రంగాలపై ఉంటుంది? ఏఏ రంగాలు పుంజుకుంటాయి? అన్నది ప్రశ్నగా మారింది. కీలక వ్యాపారాల్లో ముఖ్యమైన అంశాలపై దృష్టిపెట్టడం సాధ్యమవుతోంది అంటారు జమీల్. వాటిలో...

* ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అంటే సెన్సార్ల నుంచి వస్తువుల వరకు అన్నీ ఉంటాయి. ఇలాంటి వాటిపై శాన్ ఫ్రాన్సిస్కో మార్కెట్లో వ్యూహాత్మక పెట్టుబడులు పెడుతున్నారు రీటైలర్లు.

* ఎంఐటీతో కలిసి ఆహారం, ఆరోగ్యం, అందం లాంటి అంశాలపై ఫోకస్ పెడుతున్నారు. తద్వారా చాలావరకు ఫుడ్ టెక్, వెల్ నెస్ టెక్ కంపెనీలకు అవకాశాలు బాగా పెరుగుతున్నాయి.

* ఇక మూడోది స్టోర్ భవిష్యత్తు. ఇది బ్రిక్ అండ్ మోర్టార్ కు సంబంధించిన విషయం కాదు. ఇది బ్రిక్ అండ్ క్లిక్ కు సంబంధించింది. ఈ రెండింటి సమన్వయం వ్యాపారాలపై సానుకూల ప్రభావం చూపబోతోంది.

"సరికొత్త వ్యాపారానుభవాలపైనే మా ఆసక్తి అంతా. ఇటీవల ఫేస్ బుక్ బోట్ టెక్నాలజీని ప్రారంభించాయి. ఇది మెసెంజర్ ను షాపింగ్ ప్లాట్ ఫామ్ గా మారుస్తోంది. మా లెక్క ప్రకారం మూడున్నర కోట్ల మంది కస్టమర్లు ప్రతీవారం స్టోర్లకు వెళ్తుంటారు. అంతేమంది ఆన్ లైన్ లో షాపింగ్ చేస్తుంటారు. ఈ సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న వ్యాపారాలను మరింత పటిష్టం చేస్తూ లాభాల బాట పట్టించడమే మేం చేయబోయేది" అంటారాయన.

ఇక టార్గెట్ సరికొత్తగా రెండు ఆవిష్కరణలను ప్రారంభించింది. అందులో ఒకటి హ్యాష్ ట్యాగ్ షాపింగ్. సోషల్ మీడియాలో చర్చలు, హ్యాష్ ట్యాగ్ ల ద్వారా వ్యాపారాభివృద్ధికి ఉపయోగపడేది. రెండోది ఏ వర్సెస్ సీ. ఆన్ లైన్ షాపింగ్ కార్ట్ లో కస్టమర్ల అభిరుచిని తెలుసుకునేది. యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ అమలు పర్చడంలో నాలుగో బ్యాచ్ మరో నాలుగడుగులు ముందుకేసింది. ఇంటర్నల్ ఇన్నోవేషన్ కు సంబంధించిన ఇలాంటి మరిన్ని స్టోరీస్ భవిష్యత్తులో చూస్తామని ఆశిస్తున్నారు నవనీత్.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

మా రోజువారీ వార్తాలేఖ కోసం సైన్ అప్ చేయండి

Our Partner Events

Hustle across India