ఆ మూడు తప్పులు మీరు చేయొద్దు
సోషల్ మీడియా ప్రచారంలో బ్రాండ్స్ చేసే మూడు తప్పిదాలు
ఏ సంస్థైనా తమ ప్రాడక్ట్‌ను అమ్ముకోవాలంటే ప్రచారం చేసుకోక తప్పదు. ఇప్పుడంతా డిజిటల్ జమానా. మన నిర్ణయాలపై కూడా సోషల్ మీడియా తీవ్ర ప్రభావం చూపుతున్న పరిస్థితి. మన ఎంపికలను కూడా తోసిరాజని, మన నిర్ణయాలను మార్చేస్తున్నది సోషల్ మీడియా. ఈ నేపథ్యంలో అన్ని బ్రాండ్స్ లెఫ్ట్, రైటు, సెంటర్ అన్నీ సోషల్ మీడియానే చేసుకుంటున్నాయి. తమ బ్రాండ్ల ప్రచారానికి వాడుకుంటున్నాయి. ఇది హెల్దీ ట్రెండ్ కూడా. ఈ సామాజిక కోణం ఆ బ్రాండ్‌ను లైమ్ లైట్ లోకి తీసుకురావడంతోపాటు కామన్ మేన్‌కు పూర్తి దగ్గర చేయగులుగుతున్నది. ఈ ఆలోచనతోనే బ్రాండ్స్ సోషల్ మీడియా సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
బ్రాండ్లకు కూడా ఈ సామాజిక వెబ్సైట్లతో ఎంతో లాభం చేకూరుతుంది. కస్టమర్ల ప్రాధాన్యతలను లక్ష్యంగా పెట్టుకుని, విశ్లేషణ చేసుకుని, తమ ప్రచారాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నాయి. దీనికి తోడు స్మార్ట్ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో బ్రాండ్‌ను నిర్మించేందుకు ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామే సరైనది. సోషల్ మీడియా ద్వారా ఎక్కువమంది కస్టమర్లను తక్కువ బడ్జెట్లో చేరుకోవచ్చు.
ఈ సంతోషకర పరిస్థితి న్యాయబద్ధమే అయినప్పటికీ, చాలాకాలంగా బ్రాండ్లు కొన్ని ట్రాప్‌లలో పడిపోతున్నాయి. కస్టమర్ల నమ్మకాన్ని కోల్పోవద్దంటే బ్రాండ్లు చేయకూడని మూడు పొరపాట్లున్నాయి. ఆ మూడు సోషల్ మీడియా మిస్టేక్లకు దూరంగా ఉంటే బ్రాండ్లు మరింతగా లాభపడతాయి.
‘ట్రెండింగ్’ ఫీవర్..
అండర్వేర్ బ్రాండ్స్ నుంచి న్యూస్ ఔట్ లెట్ల వరకు ప్రతి ఒక్కరూ ఈ ఫీవర్‌లో పడిపోతున్నారు. ట్విట్టర్లో లెఫ్ట్ ప్యానల్, ఫేస్బుక్లో రైట్ ప్యానల్ కనిపించాలన్నదే ప్రతి ఒక్కరి ఆశయం. తమ యాష్ ట్యాగ్ జాతీయ వ్యాప్తంగా ట్రెండ్‌గా మారిపోతున్న విషయాన్ని న్యూస్ యాంకర్లు గొప్పగా చెప్పుకుంటున్నారు. తమ బ్రాండ్ నేమ్ లేదా సందేశం ట్రెండ్‌గా మారితే కంపెనీలు రాత్రికి రాత్రే హైలైట్ అవుతాయి. వాస్తవంగా చూస్తే ఈ ట్రెండ్ తొందరలోనే మొహమెత్తుతుంది. సోషల్ మీడియాను ఎక్కువగా, సీరియస్‌గా ఫాలో అయ్యే యూజర్లు, ట్రెండ్లను త్వరగా మర్చిపోతుంటారు. కొత్త వ్యాపారాలకు షిష్టవుతుంటారు. అత్యంత బాధ కలిగించే విషయం ఏంటంటే.. ఈ ట్రెండింగ్ ఫీవర్ యాష్ ట్యాగ్ స్పామ్‌కు దారితీస్తుంది. ఇది బ్రాండ్ రెప్యుటేషన్‌ను దెబ్బతీస్తుంది. దీనికి బదులుగా అందరూ ఒప్పుకొనే కథనాల ఆధారిత ఎంగేజ్మెంట్కు ప్రయత్నించాలి.
ఇన్ఫ్లూయెన్సర్స్ ఎంగేజ్మెంట్..
రెండు పద్ధతుల్లో బ్రాండ్లు తమ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ రెండు కూడా బ్రాండ్‌ను దెబ్బతీసే విధంగానే ఉంటున్నాయి. ఇందులో మొదటిది ‘ఇన్ఫ్లూయెన్సర్స్’. తమ గురించి ఆన్లైన్లో అందరూ చర్చించుకునేలా చేయడమే ఈ పద్ధతి. ఇందులో సమస్య ఏంటంటే ఇన్‌ఫ్లూయర్స్‌ను గుర్తించే విధానాలే సరైనవి కావు. వారు కేవలం ఫాలోవర్లు లేదా లైక్ చేసిన వారి సంఖ్య ఆధారంగానే ఎవరు ఇన్ఫ్లూయెన్సర్సో డిసైడ్ చేస్తారు. ఈ నంబర్లను ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న పేయింగ్ ఏజెన్సీల ద్వారా ఫాలోవర్ల సంఖ్యను పెంచి చూపిస్తారు. వాస్తవానికి ఆ కంపెనీలు చూపించే ఫాలవర్లు నిజమైన ప్రజలు కానే కాదు. వారు అసలు ఉండనే ఉండరు. ఆ వ్యక్తులు మీ ప్రాడక్ట్ గురించి ట్వీట్ చేస్తే, చూసేవారే ఉండరు. రెండో పద్ధతి ఇన్ఫ్లూయెన్స్ ప్లాట్‌ఫామ్‌ను ఎంపిక చేసుకుని ఆన్లైన్ ట్రాక్షన్‌ను పొందడం. నంబర్ల ఆధారంగా ఇన్ఫ్లూయెన్స్ వాలిడేట్ చేసే టెక్నాలజీ ఇప్పటివరకు రానే రాలేదు. ఎప్పుడైతే మీరు మొబైల్‌ను మార్కెట్ చేయాలనుకుంటారో, అప్పుడు ఓ ఫుడ్ బ్లాగర్ మీ ప్రాడక్ట్ గురించి ట్వీట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈ ట్రాప్‌లో పడకుండా విశ్వసనీయమైన ఇన్ఫ్లూయెన్సర్ల ద్వారా ప్రాడక్ట్ సేల్స్‌ను పెంచుకోవాలి.
ది బడ్డీ సర్కిల్..
చాలా బ్రాండ్లు బడ్డీ సర్కిల్స్‌ను ఏర్పాటు చేస్తుంటాయి. ఈ బ్రాండ్‌తో కలిసి పనిచేసే వారు లేదా బ్రాండ్‌కు అంబాసిడర్లుగా వ్యవహరించే ఇతరులతో ఓ గ్రూప్‌ను తయారుచేయడమే బడ్డి సర్కిల్. మేం కొనుగోలు చేశాం, అద్భుతమైన బ్రాండ్ ఇది అంటూ ఈ బడ్డీ సర్కిల్స్‌లో వీరు తరచుగా వాయిస్ సందేశాలను పెడుతుంటారు. వారు ఆ గ్రూప్‌లో ఉన్నంతవరకు ఆ సందేశాలు ప్రతిబింబిస్తూనే ఉంటాయి. అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా గడిపే యూజర్లు ఇలాంటి సందేశాలు వినిపించకుండా మ్యూట్ చేయడమో లేక.. గ్రూప్‌నే బ్లాక్ చేయడమో చేస్తుంటారు. దీంతో మీరు ప్రణాళికాబద్ధంగా చేసిన ప్రయత్నాల్ని బూడిదలో పోసిన పన్నీరవుతాయి.
ట్రీట్ ఎవరు చేసినా బ్రాండ్ ఇమేజ్ను పెరగదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. చివరకు బాలీవుడ్ స్టార్ షారూఖ్ ట్వీట్ చేసినా ఆ బ్రాండ్‌కు పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. ప్రజలు చాలా తెలివిగలవారు. వారికేమి కావాలో, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో వారికి స్పష్టంగా తెలుసు.
మంచి ప్రచారం కోరుకునే బ్రాండ్లు ఈ మూడు పద్ధతులను వదిలి, కథనాల ఆధారిత, కంటెంట్ ఆధారిత మోడల్స్‌ను ఎంపికచేసుకోవాలి. వాస్తవమైన సత్తా కలిగిన ప్రాడక్ట్సే సోషల్ మీడియాలో ఎక్కువ కాలం నిలువగలుగుతాయి. సోషల్ మీడియా ఓ ఇనుమ ముక్కలాంటిది. దాన్ని ఏ విధంగా వాడుకోవాలన్నది మీ టాలెంట్‌పై ఆధారపడి ఉంటుంది. దాన్ని ఉపయోగకరమైన టూల్‌గా వాడుకుంటారా లేక.. విధ్వంస ఆయుధంగా ఉపయోగించుకుంటారా అనేది సంస్థలే నిర్ణయించుకోవాలి.