చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా.. అనుకున్న గమ్యాన్ని చేరుకున్న ఆకాశ్

చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా.. అనుకున్న గమ్యాన్ని చేరుకున్న ఆకాశ్

Wednesday January 13, 2016,

4 min Read

తప్పిపోయిన వాళ్లే ఎక్కడెక్కడో తిరుగుతుంటారనుకోద్దు. JRR Tolkein అన్న ఈ మాటలు ఆకాశ్ రాణిసన్ ను చూస్తే నిజమే అనిపిస్తాయి. ఒక లక్ష్యం కోసం, చేసి చూపించాలన్న తపనతోనే ఆకాశ్ నిరంతరం పర్యటిస్తుంటారు. ఇప్పటికే ఆకాశ్ 18,000 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తూ, 48,000 కిలోమీటర్లు కాలినడకన దేశంలోని 80 నగరాల్ని, పనిలో పనిగా భూటాన్ ను చుట్టేశారు. ఇదంతా చేతిలో డబ్బులు లేకుండానే అంటే మీరు ఆశ్చర్యపోతారు. 

21 ఏళ్ల ఆకాశ్ కు ట్రావెలింగ్ చేయాలన్న ఆలోచన 2013 లోనే వచ్చింది. ఇక ఆకాశ్ కున్న మరో ప్రత్యేకత తన 15 ఏళ్ల వయసులోనే ఒక స్వచ్చంద సంస్థను స్థాపించడం. ది గోల్డెన్ బర్డ్ ఫౌండేషన్ పేరుతో ఏర్పాటుచేసిన ఈ స్వచ్చంధ సంస్థ అండర్ ప్రివిలేజ్డ్ పిల్లల కోసం పనిచేస్తుంది. ఇక వీటితో పాటే ఆకాశ్ టెక్ జంకీ, గ్రాఫిక్ డిజైనర్, రెడ్ హ్యాట్ సర్టిఫైడ్ ఇంజినీర్. సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ కూడా అయిన ఆకాశ్, రాజస్థాన్ ప్రభుత్వ సైబర్ డిపార్ట్ మెంట్లో పనిచేశారు. దీంతోపాటే, ట్రావెలింగ్ లో ఆకాశ్ అనుభవాల్ని వివరించమని టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అతన్ని ఆహ్వానిస్తుంటాయి.

image


పేరునే మార్చేసిన ట్రిప్

చెన్నై నుంచి బెంగళూరు కు సోలో సైక్లింగ్ ట్రిప్ చేసిన తర్వాత ఆకాశ్ తన పేరును మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. తండ్రికి, ఇతర కుటుంబ సభ్యులకు ఎప్పుడు దగ్గరగా లేకపోవడం, సింగిల్ మదర్ గా తన తల్లి పెంపకం చూసిన తర్వాత, ఆకాశ్ తన పేరును తానే పెట్టుకున్నారు. తల్లి పేరులోని రాణి ని తీసుకుని, ఆమెకు కుమారుడైనందున దానికి సన్ ను కలుపుకుని ఆకాశ్ రాణిసన్ గా మార్చుకున్నారు.

విధి రాతనే మార్చుకుంటున్న ఆకాశ్

టీనేజ్ లో బిడియస్తుడైన ఆకాశ్ ఎలా ట్రావెల్ అండ్ సోషల్ ఎంట్రప్రెన్యూర్ గా మారాడో గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇండోర్ కు చెందిన ఆకాశ్ 14 ఏళ్ల వయసులో ఉన్నపుడు కంప్యూటర్ కోర్సులో చేరాలనుకున్నా, ఒంటరిదైన తల్లికి ఆ ఖర్చును భరించే స్తోమత లేకపోయింది. అంతా సమానమే, అందరికీ సమాన అవకాశాలు అన్న మాటలకు నిజంగా ఆచరణ సాధ్యం కాకపోవడం అతన్ని బాధించింది. 

"మీ కుటుంబ నేపధ్యం మీదే మీరు ఎన్నుకునే అవకాశాలు ఆధారపడి ఉంటాయని అప్పుడు నాకర్ధం అయింది" అంటారు ఆకాశ్.

ఇలాంటి పరిస్థితులు ఎవరినైనా ఒత్తిడికి గురిచేస్తాయి. అయితే ఆకాశ్ తన ఆల్ టైం ఫేవరెట్ హీరో అయిన స్వామీ వివేకానంద నుంచి స్ఫూర్తి పొందారు. బిడియస్తుడైన టీనేజర్ అయిన ఆకాశ్ శక్తివంతుడిగా మారారు.

తనలాగే ఆర్ధిక స్తోమత లేని వారికోసం బాసటగా నిలవాలన్న నిర్ణయానికి వచ్చారు ఆకాశ్. ఆర్ధికంగా అవకాశాలు లేని అండర్ ప్రివిలేజ్డ్ పిల్లల కలలు నెరవేర్చుకునేలా వారికోసం ఏదైనా చేయాలనుకున్నారు. అలా ది గోల్డెన్ బర్డ్ ఫౌండేషన్ అనే స్వచ్చంధ సంస్థను 15 ఏళ్ల వయస్సులోనే స్థాపించారు. ఇది భారత దేశంలోని అణగారిన పిల్లల చదువుకోసం పనిచేస్తుంది.

image


ఆకాశ్ ను మొదటగా చాలామంది సీరియస్ గా తీసుకోలేదు, మరికొంతమంది గేలి చేశారు. జీవితం చూపించాల్సిన కష్టాల్ని చూపించింది. స్వచ్చంద సంస్థ పెట్టడానికి అవసరమైన డబ్బులు కానీ, నెల నెలా వచ్చే జీతం కానీ ఆకాశ్ దగ్గరలేవు. ఇక NGO ఏర్పాటుచేయడానికి ఉన్న లీగాలిటీస్ గురించి చదువుకోలేదు. 

15 ఏళ్ల వయసులో డబ్బులు సంపాదించడానికి ఏం చెయ్యాలన్న దానిపైనే దృష్టి పెట్టాను. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అయిన టికోన లో డోర్-టు-డోర్ సేల్స్ పర్సన్ గా చేరాను. నేను చేసిన ఉద్యోగం చాలా మందికి అర్థం కాకపోయేది, ఆశించినంత ప్రయోజనం ఉండకపోయేది. అయినప్పటికీ NGO ఏర్పాటు ఆలోచన మాత్రం పోలేదు, అదే నన్ను ముందుకు నడిపించింది అంటూ అప్పటి సంగతుల్ని గుర్తుచేసుకుంటున్నారు ఆకాశ్.

2011 లో తన NGO ను రిజిస్టర్ చేయించుకోవడానికి ఢిల్లీకి వెళ్లారు ఆకాశ్. ఇక అప్పటినుంచి వెనుదిరిగి చూసుకోలేదు. అలా సోషల్ ఎంట్రప్రెన్యూర్ గా మారి, అణగారిన వర్గాలకు సహాయపడుతూ తన విధి రాతను రాసుకున్నారు. ట్రావెల్ చేస్తూ, సాధ్యమైనంత మందికి సేవ చేయాలని నిర్ణయించుకున్నారు.

ఆకాశ్ సాధించిందేమిటి?

బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో బ్యాచిలర్స్ డిగ్రీ సొంతం చేసుకున్నారు ఆకాశ్. " నేను ట్రావెల్ చేస్తున్నపుడు, ప్రపంచాన్ని దగ్గరినుంచి చూస్తాను. అది నన్ను జీవించేలా చేస్తుంది. నన్ను నేను ఆత్మావలోకనం చేసుకోవడానికి, ఇతరుల బాధలు అర్థం చేసుకోవడానికి, వారికవసరమైన మెరుగైన స్థితిగతులు కల్పించడానికి ట్రావెలింగ్ ఉపయోగపడింది. ఇలాంటి రియల్ ఎక్స్పీరియన్స్ అందించే విజ్ఞానం వెలకట్టలేనిది అంటున్న ఆకాశ్ సోషల్ ఎంట్రప్రన్యూర్ షిప్ లో మాస్టర్స్ డిగ్రీ చేయాలనుకుంటున్నాడు.

అయితే ఇవన్నీ చేయడానికి డబ్బులు కావాలి. చేతిలో అవసరమైనన్ని డబ్బులు లేకపోయినా, చేయాలన్న తపన మాత్రం ముందుకుసాగేలా చేసింది. "చాలా సార్లు చేతిలో డబ్బులు ఉండకపోయేవి. దాంతో చాలా నిజాయితీగా నా ఖర్చుల్ని తగ్గించుకుని డబ్బుల్ని ఆదా చేసేవాడ్ని. అది ఒకరకంగా థ్రిల్ ను కలిగిస్తుంది" అంటున్నారు ఆకాశ్. అయినప్పటికీ ట్రావెలింగ్ ను మాత్రం మానుకోకపోవడం స్పాన్సరర్లను ఆకర్షించింది. దీంతో గతంలో ఉన్న ఆర్ధిక ఇబ్బందుల్ని కొద్దిగా అధిగమించారు ఆకాశ్.

అందరికంటే భిన్నమైన మార్గాన్ని అంచుకున్నాపుడు, చాలా మంది అతన్ని నానా రకాల మాటలన్నారు, ఇప్పటికీ కొంతమంది ఆ పని చేస్తున్నారు. అయితే తనకు అండగా నిలబడ్డ స్నేహితులు, తాను చేస్తున్నాదాన్ని అభినందించే టీచర్ల ప్రోత్సాహంతో అనుకున్నది సాధిస్తున్నారు ఆకాశ్.

image


సైక్లింగ్ చేస్తూ, కాలి నడకన సుదూర ప్రాంతాలకు ఆకాశ్ వెళ్లడం అతని తల్లికి మొదట ఇష్టముండకపోయేది. అయితే కాలం గడిచే కొద్దీ ఆకాశ్ ను అర్థం చేసుకోవడం అతనికి కలిసొచ్చింది.

image


ఇంకా ఎంతో దూరం పయనించాలి...

తన భవిష్యత్ ప్రణాళికల గురించి అడిగితే తన జీవితమంతా ప్రయాణించాలనుకుంటున్నానన్న సమాధానం ఠక్కున వస్తుంది. "ట్రావెలింగ్ ద్వారానే నేను బిజినెస్ ను రూపొందించుకోవాలని భావిస్తున్నాను. ప్రస్తుతం నా కలల్ని బిజినెస్ రూపంలోకి మార్చుకునే ప్రయత్నాల్లో ఉన్నాను. నా మాస్టర్స్ డిగ్రీ తర్వాత ఫాక్స్ ట్రావెలర్, TLC వంటి ట్రావెల్ కంపెనీ లో పనిచేయాలనుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఇంకేం చేయగలనో ఆలోచిస్తాను. ఒంటరిగానే నా జీవితంలో ట్రావెల్ చేయాలని భావిస్తున్నాను. నా జీవితాన్నిNGO కే అంకితం చేయాలనుకుంటున్నాను" అంటున్నారు ఆకాశ్.