Brands
Discover
Events
Newsletter
More

Follow Us

twitterfacebookinstagramyoutube
Youtstory

Brands

Resources

Stories

General

In-Depth

Announcement

Reports

News

Funding

Startup Sectors

Women in tech

Sportstech

Agritech

E-Commerce

Education

Lifestyle

Entertainment

Art & Culture

Travel & Leisure

Curtain Raiser

Wine and Food

YSTV

ADVERTISEMENT
Advertise with us

పెప్పర్ ట్యాప్ ప్రయాణం ఎందుకు ఆగిపోయిందంటే..?

షట్‌డౌన్ కారణాలను వివరించిన సీఈవో నవ్‌నీత్ సింగ్

పెప్పర్ ట్యాప్ ప్రయాణం ఎందుకు ఆగిపోయిందంటే..?

Monday May 09, 2016 , 6 min Read


పెప్పర్‌టాప్ ఆన్ డిమాండ్ స్టార్టప్‌ యాప్‌లలో ఓ సంచలనం. అనతి కాలంలోనే వినయోగదారుల మనసులను చూరగొన్న పెప్పర్ ట్యాప్ ఏడాదిన్నరలోనే ఎన్నో కష్టనష్టాలను అనుభవించింది. రోజు 37 వేల ఆర్డర్లంటే మాటలు కాదు.. ఆ స్థాయినుంచి మూసేయాల్సిన పరిస్థితికి సంస్థ వచ్చింది. అసలు ఈ ప్రయాణంలో ఏం జరిగింది. ఈ ఏడాదిన్నర జరిగిన ఘటనలను పెప్పర్ ట్యాప్ సీఈవో నవ్‌నిత్ సింగ్ వివరించారు. అవేంటో ఆయన మాటల్లోనే..

గత ఏడాదిన్నర నుంచి మా ప్రయాణం ఎగుడుదిగుడుగా, థ్రిల్లింగ్ ముందుకు సాగింది. ఆనందం బాధ, అన్ని అంశాలు కలగలిపి ఉన్నాయి. ఒక్కసారి 2014 సెప్టెంబర్‌కు వెనక్కి వెళ్దాం. అది గుర్గావ్‌లోని గలేరియా మార్కెట్‌. అప్పుడప్పుడే మొగ్గ తొడిగిన మా ఆలోచనను కాన్సెప్ట్‌గా మలిచేందుకు మా బృందంతో చర్చోపచర్చలు. కాన్ఫరెన్స్‌లలో పెట్టేంత డబ్బు లేకపోవడంతో కాఫీషాపులే అడ్డా. కిరాణా వ్యాపారంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్నదే మా తాపత్రయం. గంటల తరబడి క్యూలో నిలబడటం, షాప్‌లోకి వెళ్లేందుకు పార్కింగ్ కోసం వెతకడం, చిన్న చిన్న కూరగాయల షాపువాడితో వాగ్వాదం.. ఇలాంటివాటికన్నింటికి చెక్ పెట్టాలనుకున్నాం. స్థానికంగా అందుబాటులో ఉంటే అన్ని వస్తువులను ఆన్‌లైన్‌లోకి, యాప్ ద్వారా తక్కువ ఖర్చుకే కస్టమర్‌కు అందించాలన్నది మా లక్ష్యం. సుశిక్షితమైన డెలివరీ విధానాల ద్వారా సరుకుల రవాణా చేయాలనుకున్నాం.

మా ప్రయాణం ప్రారంభమైంది. ఏడాదిని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే.. మా సంస్థ ఊహించిదానికంటే ఎంతో సాధించింది. అత్యంత తెలివైన, అత్యంత ఉన్నత విలువలు కలిగిన మా వైవిధ్యమైన ఉద్యోగ బృందం చేసిన కృషితో దేశంలోని 17 నగరాల్లో సేవలను విస్తరించగలిగాం. అక్టోబర్ 2015 నాటికే ప్రతి రోజు 20 వేల ఆర్డర్లతో దేశంలో టాప్ త్రీ గ్రోసరీ డెలివరీ సర్వీసుల్లో పెప్పర్ ట్యాప్‌కు చోటు దక్కింది. వంద శాతం ఇన్వెంటరీ-లెస్ మోడల్‌తో పట్టణాల్లో కార్యకలాపాలు నిర్వహించిన ఏకైక వ్యాపారం మాదే.

సులభంగా ఉపయోగించే అవకాశం, గొప్ప పరిచయ డిస్కౌంట్లు, విక్రయాలు ఉండటంతో కస్టమర్లు కూడా మా యాప్‌ను ఎంతో ఇష్టపడ్డారు. మా ప్లాట్‌ఫైపకి వచ్చిన స్థానిక వ్యాపారులు కూడా ఎంతో లాభపడ్డారు. మా యాప్ ద్వారా వారి వ్యాపారాలను 30 నుంచి 40 % పెంచగలిగాం. స్మార్ట్‌ఫోన్లు ఎక్కడ ఉంటే అక్కడికి మా వ్యాపారాన్ని విస్తరించగలిగాం. ఉన్నత శిఖరాలకు చేరడం మాకు ఓ మత్తులా మారిపోయింది.

విజయపు మత్తులో ఊగుతున్న మాకు తొలి సమస్య. మా పార్టనర్లతో మా యాప్‌ను అనుసంధానించడం అంత గొప్పగా లేదు. దేశవ్యాప్తంగా మా సంస్థను విస్తరించడంలో భాగంగా చాలా స్టోర్స్‌ను అత్యంత వేగంగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురాగలిగాం. ఈ నేపథ్యంలో కొన్నిసార్లు కస్టమర్లు కోరిన అన్ని ఐటమ్స్ ఒకే షాపులో దొరికేవి కావు. అత్యంత అవశ్యకమైన ఐటమ్సే కూడా మిస్సయ్యేవి. ఇదేం పెద్ద సమస్య కాదు. దీన్ని మేం సరైన మార్గంలో సరిచేయాల్సింది. ఎలక్ట్రానిక్ ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ బిల్లింగ్ సిస్టమ్‌ను అడాప్ట్ చేసుకునేలా చిన్న షాప్‌లను ఒప్పించాల్సింది. పెద్ద షాపులు, హైపర్ మార్కెట్లు ప్రతి రోజు సృష్టించే వారి డాటాను తీసుకుని మా సిస్టమ్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసేయాల్సింది. ఎప్పటికప్పుడు ధరల పట్టిక, అందుబాటులో ఉండే వస్తువుల గురించి కనీసం ప్రతిరోజు మూడు సార్లు అప్‌డేట్ చేసి ఉండాల్సింది.

image


రెండో సమస్య: కస్టమర్లు పూర్తిగా మా ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చి కొనుగోలు చేసేందుకు డిస్కౌంట్లు, క్లెవర్ సేల్స్ రూపంలో మేం ఎంతో శక్తిని, సమయాన్ని వెచ్చించాల్సి వచ్చింది. అన్ని రకాల విక్రయాలు కేవలం యాప్‌ ద్వారా సాగుతున్న ప్రపంచంలో మనం ఉన్నాం. ఫిజికల్ స్టోర్ల కంటే తక్కువ ధరకే వస్తువులు లభ్యమవుతన్నాయి. ప్రతి వారం అత్యధిక డిస్కౌంట్లు ఇవ్వడం ప్రారంభమైంది. ఇదో పెద్ద సమస్య కాదు. బ్యాంకుల్లో డబ్బ ఉంది. ఈ ప్లాన్‌ను అంగీకరించిన ఇన్వెస్టర్లు కూడా సిద్ధంగా ఉన్నారు.

దీర్ఘకాలం పాటు నమ్మకమైన కస్టమర్ బేస్‌ను సృష్టించేందుకు నాణ్యమైన సేవలు అందించి, కస్టమర్లు తమ జీవితంలో దీన్నో మార్గంగా చేసేందుకు ప్రయత్నించాం. ఎప్పటికైనా విశ్వాసం కలిగిన మా కస్టమర్లు మాకు వెంటే ఉంటారని మాకు మేము నచ్చజెప్పుకున్నాం. ప్రాసెస్ అంతా చక్కగానే ఉన్నా డిస్కౌంట్లు మాత్రం మా వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపాయి.

మూడో సమస్య తల ఎత్తడం ప్రారంభించింది: ఈ గ్రోసరీ బిజినెస్‌లో మేం సుదీర్ఘ ప్రయాణమే చేశాం. ఈ నేపథ్యంలో కస్టమర్లకు ఇబ్బందులు కలుగకుండా మా లాజిస్టిక్, ఆపరేషన్స్ టీమ్‌ సామర్థ్యాన్ని అవసరమైన దానికంటే ఎక్కువగా ఉంచుకోవాల్సి వచ్చింది. రెండు గంటల్లో డెలివరీ ఇస్తామన్న మా ప్రామిస్‌ను నిలబెట్టుకునేందుకు, మేం సేవలు అందించిన 17 నగరాల్లో అదనపు సామర్థ్యాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది.

ప్రతి ఆర్డర్‌కు డిస్కౌంట్లు కలిపి ఇవ్వడమంటే ప్రతి ఒక్క సింగిల్ ఆర్డర్‌ మేం భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. దీనికి ముగింపు ఎక్కడో కనిపించలేదు. మా వరకైతే ఇది అధిగమించలేని సమస్యేమీ కాదు. పెప్పర్ టాప్ పుట్టిందే లాజిస్టిక్ కంపెనీగా ఎదిగేందుకు. ఒక్కసారి మా సామర్థ్యాన్ని గుర్తు చేసుకుంటే వస్తువుల డెలివరీ, డెలివరీకి ఉపయోగించిన మార్గం, జనరల్ లాజిస్టిక్సే మా బలం. కొన్నిసార్లు వ్యాపార మూలాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. వెళ్లిన ప్రతిసారి మరింత మంచి టెక్నాలజీ లెన్స్‌తో రోడ్డుపైకి ఎక్కాం.

ఈ మూడు సమస్యలను ఒకేసారి పరిష్కరించుకోవాల్సి రావడం ఇబ్బందిగా మారింది. దీంతో కొన్ని నగరాల్లో కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చింది. ప్రతి నగరంలో మా కస్టమర్ల సంఖ్యను పరిశీలించి కార్యకలాపాలను నిలిపివేసి, మా పై ఎంతో నమ్మకంపెట్టుకున్న స్టేక్ హోల్డర్లను బాధపెట్టాల్సి వచ్చింది. కొద్ది మంది కస్టమర్లు ఉన్న, చిన్న నగరాల్లోనే వ్యాపారాన్ని క్లోజ్ చేశాం.

ఈ నిర్ణయం మా వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపింది. కొన్ని పనులపై దృష్టి పెట్టడం, కొన్ని దృఢమైన నిర్ణయాలు, మా యావరేజ్ సేల్స్ రెట్టింపు అవడానికి, రిటెన్షన్ రేట్ (ఒకే కస్టమర్ మా యాప్ ద్వారా కొనుగోలు చేయడం) 400% పెరిగేందుకు దోహదపడ్డాయి. సుస్థిరమైన వ్యాపారాన్ని నిర్మించుందుకు అవసరమైన విలువలను, విశ్వసనీయతను పెంపొందించగలిగాం. ఇప్పటికీ ఆర్డర్లను డిస్కౌంట్లతో ఇవ్వగలుగుతున్నప్పటికీ, ఇప్పుడు మరింత ఏకాగ్రతతో, స్పష్టమైన లక్ష్యాలతో, కాలన్ని నిర్ధేశించుకుని నిర్ణయాలు తీసుకుంటున్నాం. కాల రేఖ, లాభధాయకత అనేవి చాలా సుదూరంగా కనిపిస్తున్నాయి. అవి చాలా కఠినమైనవి కూడా.

‘‘మరో ఇబ్బందికర పరిణామమేంటే ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడుల వాతావరణంలో నిరాశావాదం మొదలైంది. వ్యాపార వాతావరణంలో కఠినమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మేం కష్టాల్లో ఉన్నామన్న సంగతి గుర్తించాం.’’

ప్రతి ఆర్డర్‌కు డబ్బు కోల్పోవడం (అది ఎంత చిన్నదైనా కానివ్వండి, ఎంత నియంత్రణలోనైనా ఉండనివ్వండి, ఎంత లక్ష్యానికి ఉద్దేశించినదైనా కానివ్వండి) అంటే ఏదో ఒకరోజు చేతిలో పూర్తిగా డబ్బు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రాసెస్‌ను కొద్దిగా నెమ్మదించాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే అది అవసరం కూడా. మేం పూర్తిగా అగాధంలోకి చేరుకోకముందే పరిస్థితులు మెరుగుపడతాయన్న కొండంత ఆశతో, పోటీ సంస్థల్లా పరిగెత్తకుండా, మెల్లిగా నడవసాగాం.

ఈ దశలో ఈ గ్రోసరీ డెలివరీ స్పేస్‌లో కొనసాగాలా వద్దా అన్న ఆలోచనలు మాలో మొదలయ్యాయి.. వాస్తవంగా చెప్పాలంటే మా పెట్టబడిదారులకు, ఉద్యోగులకు మేం తీవ్ర అన్యాయం చేస్తున్నాం. ఈ రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం అసాధ్యం. భారీ మూలధనం లేకుండా స్వల్ప కాలంలో సమస్యలను పరిష్కరించడం సాధ్యమయ్యే పనికాదు. ఇలాంటి సమస్యను ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కోవాల్సిందే.

ఎప్పుడో ఎదుర్కొవడం కంటే ఇప్పుడే ఎదుర్కోవడమే ఉత్తమమని (మేం సేకరించిన పెట్టుబడులు పెద్ద మొత్తంలో ఉన్న సమయంలోనే) మేం ఓ నిర్ణయానికి వచ్చాం. చివరి రౌండ్ పెట్టుబడుల ద్వారా స్వీకరించిన పెద్ద మొత్తంలో ఈక్విటీ పెట్టుబడులు బ్యాంక్‌లో ఉన్న సమయంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కొంచం కష్టమే.

అన్ని ప్రయత్నాలు చేశామా? ఈ రంగం మనకు అనుకూలమైనది కాదని ఒప్పుకోవాల్సి వచ్చిందా? హైపర్ లోకల్ కామర్స్ రంగం శకం పూర్తయిందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ‘లేదు’ అనే. కాని ఒక్క విషయాన్ని స్పష్టం చేయనివ్వండి. 2014 వేసవిలో కానీ మేం సెట్ చేసుకన్న టాస్క్‌ను పూర్తి చేయలేకపోయాం. మాకున్న కొద్ది సమయంలోనే మేం ముందుగా అనుకున్నట్టుగా ఉన్నత స్థితికి చేరుకోలేకపోయాం.

image


ఈ ప్రయాణంలో మేం ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. కానీ అందులో ఒక్క దాని గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పాలి. ట్రైనింగ్, బ్యాక్ గ్రౌండ్ లాజిస్టిక్స్ పాయింట్ టు పాయింట్ మాదిరిగా జరిగింది. చిన్న నగరాల్లో కూడా అడుగుపెట్టాలన్న మా నిర్ణయం తప్పు. దీంతో మా డెలివరీ నెట్‌వర్క్ మరింత నీరసించిపోయింది. మరింత రీసెర్చ్ చేయడంతోపాటు మార్కెట్‌ను అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని గ్రహించాం. టైర్ టూ, త్రీ నగరాల్లో లాజిస్టిక్ ప్రొవైడర్లు ఒకరోజులో షిప్పింగ్ చేస్తున్న పరిస్థితులు ఉంటే, ఈ కామర్స్ రంగానికి అనుసంధానమైన చిన్న నగరాలు వస్తువులను తీసుకునేందుకు కొన్నిసార్లు 30 రోజులు కూడా వేచి చూడాల్సి వచ్చింది.

నువో ఎక్స్‌తో కలిసి లాజిస్టిక్స్‌ను నడిపించడం మాకు ఎంతో ఉత్సాహభరితంగా అనిపించింది. సులభంగా ఈ కామర్స్ ఆర్డర్లను పొందడం ఎలాగో తెలిసింది. పెప్పర్‌టాప్‌లో ఏడాదిగా గడపడం ద్వారా చివరి నిమిషంలో డెలివరీ నెట్‌వర్క్స్‌ను సమర్థంగా నిర్వహించడం ఎలాగో తెలిసింది. డెలివరీ సమయాన్ని ఎలా తగ్గించేందుకు ఏ టూల్స్ అవసరమో ఇప్పటికే మేం గుర్తించాం. ఈ ఐడియాలను ఈ ఏడాది ఆరంభంలో నువోలో పరీక్షించాం. ఫలితాలు కూడా ఎంతో ఆశాజనంగా కనిపించాయి. అయితే పెప్పర్ ట్యాప్‌లో మేం పాటించిన విధానాలను కొత్త పద్ధతిలో ఉపయోగించాల్సిందా? అంటే ‘అవుననే’ చెప్పాలి.

ఇప్పటివరకు మేం చేసిన ప్రయాణం చాలా దెబ్బతీసింది. ఈ కొత్త రంగం నుంచి వెనక్కి ప్రయాణించేముందు మాకు సహకరించిన కొందరికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పాలనుకుంటున్నాం. పెప్పర్‌ట్యాప్‌ను సృష్టించి, నడిపించేందుకు సహకరించిన, ఈ కష్ట సమయంలో కూడా మా వెన్నంటే ఉన్న పెట్టుబడిదారులందరికీ కృత‌జ్ఞ‌త‌లు చెప్పాలనుకుంటున్నాం. పోటీదారులకు ముందుగా థాంక్స్ చెప్పాలనుకుంటున్నాం. మీరెంతో విలువైన ప్రత్యర్థులు. గ్రోసరీ కన్జూమర్ బిజినెస్‌లో మీ పురోగతిని ఫాలో కావాలనుకుంటున్నాం. అందరికంటే ముఖ్యంగా పెప్పర్ టాప్ కుటుంబానికి థాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. రాత్రనకా, పగలనకా కష్టపడి, కష్టకాలంలోనూ సంస్థ వెన్నెంటే ఉండి ప్రారంభమైన తొమ్మిది నెలల్లోనే రోజుకు 37 వేల ఆర్డర్లు వచ్చేలా కృషి చేయడమంటే మాటలు కాదు. సంస్థను అభివృద్ధి బాటన పయనింపజేసేందుకు నా లక్ష్యాలను వారివిగా చేసుకుని సాయం చేశారు. నేను గీత దాటుతున్నప్పుడు ఎలాంటి మొహమాటం లేకుండా దండిచారు.

‘‘మా ప్రయాణ గాథను ముగించే ముందు కొందరికి నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. వారే మా పెప్పర్ టాప్ విలువైన కస్టమర్లు. మా సంస్థ ఈ స్థాయికి చేరడానికి మీరే కారణం. అయితే చివరి వరకు మీతో భాగస్వామ్యాన్ని పంచుకోలేకపోతున్నందుకు మమ్మల్ని క్షమించండి. మా సేవలు విలువైనవిగా తీర్చిదిద్దింది మీరే. మీ సమీక్షలను, విమర్శలను మేం మిస్సవుతున్నాం. కొందరు మమ్నల్ని ఆనందపర్చారు. మరికొందరు నవ్వించారు. ఇంకొందరు ఏడిపించారు. ఇప్పుడవన్నీ కోల్పోతున్నాం’’.

మేం కొత్త ప్రాజెక్ట్‌ను ఇప్పుడు చేతిలో పెట్టుకున్నాం. పొరపాట్ల నుంచి, సాధించిన విజయాల నుంచి పెప్పర్ ట్యాప్ పాఠాలు నేర్చుకుంది. మేం ఇప్పుడు ఓ కొత్త సమస్యపై పని చేస్తున్నాం. ఈ సమస్యను పరిష్కరించేందుకు మా వద్ద అన్ని రకాల ఆయుధాలు ఉన్నాయని భావిస్తున్నాం. మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన స్నేహితులకు, ఇతర స్టేక్ హోల్డర్లందరికీ మేం ఓ కమిట్‌మెంట్ ఇస్తున్నాం. మేము అలుపన్నది ఎరుగక, విశ్రాంతి అనేది లేకుండా, మా స్వేదాన్ని చిందించి, అవసరమైతే కన్నీళ్లను కార్చి ఈ కొత్త సమస్యను పరిష్కరించుకుంటామని హామీ ఇస్తున్నాం.

‘‘మా ప్రయాణంలో మాకందరికీ సహకరించిన ప్రజలందరికీ మేం ఈ హామీ ఇస్తున్నాం. ’’