సంకలనాలు
Telugu

యాక్షన్ కెమెరా మార్కెట్‌లో నెక్స్‌గేర్ ప్రభంజనం..

అడ్వంచర్ స్పోర్ట్స్ వీడియోస్ షేరింగ్ ఇప్పుడు సులభతరం

GOPAL
5th Apr 2016
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on


స్మార్ట్ ఫోన్స్ వచ్చాక ఫొటో, వీడియో షూటింగ్‌కు క్రేజ్ మరింత పెరిగింది. అయితే అడ్వెంచర్ వీడియోలను షూట్ చేసి, షేరింగ్ చేయడం మాత్రం కాస్త కష్టమైన పనే. పెద్దపెద్ద కెమెరాలను తీసుకెళ్లి, హెచ్‌డీ క్వాలిటీలో వీడియోను తీసి.. దాన్ని ఇంటికో, ఆఫీసుకో వచ్చి ఎడిటింగ్ చేయడం చాలా కష్టం. పైగా టైం టేకెన్ ప్రాసెస్. అందుకే చాలామంది వీడియోలు తీసినా వాటిని షేర్ చేయకుండా అలానే ఉంచేస్తున్నారు. అలాంటి అడ్వెంచర్ వీడియోలను తీసేవారి కోసం ఇద్దరు బాంబే ఐఐటీ కుర్రాళ్లు ఒక స్టార్టప్ ప్రారంభించారు. దానిపేరు నెక్స్‌గేర్. అదెలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. .

డ్రోన్స్ టు వియరబుల్ కెమెరా..

బాంబే ఐఐటీలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన అమర్‌దీప్ సింగ్ ఆరేళ్ల క్రితం ఫ్రెండ్స్ తో కలిసి ‘ఐడియాఫోర్జ్’ పేరిట డ్రోన్స్ స్టార్టప్‌ను ప్రారంభించారు. డ్రోన్లను తయారు చేయడం, కాశ్మీర్ నుంచి అండమాన్ దీవుల వరకు, రాజస్థాన్ నుంచి బంగ్లాదేశ్ బార్డర్ వరకు వాటిని ప్రయోగించారు అమర్‌దీప్. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన జార్ఖండ్‌తో పాటు వరదల సమయంలో ఉత్తరాఖండ్‌లోనూ దాన్ని ప్రయోగించారు. డ్రోన్లలో షూటింగ్ చేయడం, ఆ తర్వాత దాన్ని డాక్యూమెంట్ల రూపంలో పొందుపర్చడం చేస్తుండేవారు. చాలావరకు ఫొటోలను కెమెరా ఫోన్స్, డీఎస్‌ఎల్‌ఆర్‌ఎస్, ఫ్లిప్స్, గోప్రోస్ ద్వారా షూట్ చేస్తుండేవారు. 

 నెక్స్ ‌గేర్..

నెక్స్ ‌గేర్..


షేరింగ్..

ఫొటోలను, వీడియోలను తీయడం సులభమే అయినా.. అందుకోసం పెద్దపెద్ద కెమెరా పరికరాలను మోసుకెళ్లడం, వాటిని హార్డ్‌డిస్క్‌లలో భద్రపర్చడం, ఆ తర్వాత రా ఫుటేజీని ఎడిటంగ్ చేయడం చాలా కష్టంగా ఉండేది. ప్రతిసారీ ఇదే సమస్య ఎదురవడంతో దీనిపై దృష్టిసారించారు అమర్‌దీప్. ఈ సమస్య గురించి తన స్నేహితుడు రాహుల్ వాట్స్‌తో చర్చించారు. వీరిద్దరూ కలిసి వీడియోటేపింగ్, రికార్డింగ్ లైఫ్‌సైకిల్స్‌పై లోతుగా అధ్యయనం చేశారు. చాలామంది మొబైల్స్‌లో వీడియోలను షూట్ చేస్తున్నప్పటికీ, వాటిని షేర్ చేయలేకపోతుండటాన్ని వారు గమనించారు. ఈ సమయంలోనే వారికి సీమ్‌లెస్‌ వియరబుల్ టెక్ డివైజెస్ ఉపయోగించి నెక్స్‌గేర్‌ను రూపొందించాలన్న ఐడియా వచ్చింది.

‘‘మా తొలి ఇంటలిజెంట్ అడ్వెంచర్ కెమెరా ఫ్రోడో. కాప్చర్ చేసిన వీడియోను పార్టులుగా విభజించి, ఆసక్తికరంగా ఉన్న వీడియోను ఆటోమెటిక్‌గా ఎడిట్ చేస్తుంది’’- అమర్‌దీప్

హార్డ్‌వేర్-సాఫ్ట్‌వేర్ ప్లే..

ఫ్రోడోకు కూడా సాఫ్ట్‌వేర్-హార్డ్‌వేర్ సమస్యలు తప్పలేదు. ఇలాంటి ప్రాడక్ట్‌ రూపొందించిన సాఫ్ట్‌వేర్ అకస్మాత్తుగా పనిచేయడం మానేసినప్పుడు, కాంపొనెంట్స్ ఆలస్యంగా కదులుతున్నప్పుడు, మెకానికల్ ఫిట్‌మెంట్స్‌లో సమస్యలున్నప్పుడు హార్డ్‌వేర్ చాలెంజెస్ ఎదురవుతాయి. ఇలాంటి సమస్యలు ముందుగానే పరిష్కారం చూపించడం కుదరదు. సమస్యలు తలెత్తినప్పుడే పరిష్కారాలు వెతకాల్సి ఉంటుంది. అలాగే బ్యాక్ ఎండ్, బగ్ ఫిక్సెస్ వంటి సాఫ్ట్‌వేర్ సమస్యలు కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సి ఉంటుంది.

నెక్స్ ‌గేర్ టీమ్

నెక్స్ ‌గేర్ టీమ్


ఇలా పనిచేస్తుంది...

ఈ వియరబుల్ కెమెరాను మనకు నచ్చిన చోట పెట్టుకోవచ్చు. మణికట్టుకు కానీ, బైక్ హ్యాండిల్‌కు లేదా నుదుటికి.. ఎక్కడైనా బెల్ట్ సాయంతో ఫిక్స్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక్క బటన్‌ను ప్రెస్ చేస్తే చాలు రికార్డింగ్ మొదలవుతుంది. ఏడు సెకన్లకు మొదలై.. చకచకా ఫుటేజీని కలెక్ట్ చేసుకుంటుంది. ఫుల్ చార్జింగ్‌లో ఉంటే గంటా 50 నిమిషాల హెచ్‌డీ ఫుటేజ్‌ను రికార్డు చేస్తుందీ వియరబుల్ కెమెరా. అవుట్‌డోర్ ఎక్స్‌కర్షన్‌లాంటి సమయాల్లో భలే ఉంటుంది.

ఆ తర్వాత నెక్స్‌గేర్ యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటే.. అప్పటివరకు రికార్డు చేసిన ఫుటేజీని అది అటోమెటిక్‌గా తీసేసుకుని.. చిన్నచిన్న షేరింగ్ వీడియోలను క్రియేట్ చేస్తుంది. ప్రీ ఇన్‌స్టాల్డ్ ఎడిటింగ్ స్టయిల్స్ జీనియస్, యాక్షన్, స్లో, ఫేస్‌ సాయంతో 15 సెకండ్ల ఇన్‌స్టాగ్రామ్‌ను రూపొందిస్తుంది. మోషన్ డాటా, ఫేస్ డిటెక్షన్, సౌండ్ ఎనాలసిస్, కంప్యూటర్ విజన్ వంటివాటిని కూడా ఫ్రోడో దానంతట అదే ఉపయోగిస్తుంది.

వియరబుల్ కెమెరా ఫ్రోడో

వియరబుల్ కెమెరా ఫ్రోడో


నెక్స్‌గేర్, ఫ్రోడోలను రూపొందించేందుకు ఫ్యాన్సీ వర్క్ స్పేస్ అవసరం లేదు. మంచి టీమ్ ఉంటే సరిపోతుంది. ఇతర సంస్థలతో తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో టాలెంటెడ్ ఉద్యోగుల కోసం వీరు తీవ్రంగా అన్వేషించారు. అలా అదృష్టవశాత్తూ ఐఐటీ బాంబే మంచి టీమ్‌ వచ్చింది. తర్వాత పనులు ప్రారంభించారు. టీమ్‌లో అందరికీ ఫొటోగ్రఫీ, వీడియో మేకింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్ మీద అవగాహన ఉండటం మా అదృష్టం అంటారు అమర్‌దీప్. 

రాహుల్, అమర్‌దీప్‌తోపాటు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్, మార్కెటర్ తరుణ్ గుప్తా, సొంత సంస్థను ఏర్పాటు చేసుకున్న విశాల్ షా, బ్రాండింగ్‌, యూజర్ ఇంటర్‌ఫేస్‌, డైరెక్షన్‌లో పదేళ్ల అనుభవమున్న రోహిత్ టండన్‌లు నెక్స్‌గేర్‌ బృందంలో కీలక సభ్యులు.

రెవెన్యూ మోడల్..

లాస్ వెగాస్‌లో జరిగిన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షోలో తమ తొలి ప్రాడక్ట్ ఫ్రోడోను ప్రవేశపెట్టారు నెక్స్‌గేర్ బృందం. అలాగే క్రౌడ్ ఫండింగ్ క్యాంపైన్‌ను కూడా ప్రారంభించాలని ఈ టీమ్ భావిస్తోంది. అంతర్జాతీయంగా అడ్వంచర్ కెమెరా, బ్యాటరీ ప్యాక్‌, యాక్ససరీస్‌లను అమ్మడం ద్వారా ఆదాయాన్ని గడిస్తోందీ ఈ సంస్థ.

పెట్టుబడులు

ఈ సంస్థలో పొవాయ్ లేక్ వెంచర్స్, గ్రో ఎక్స్ వెంచర్స్ పెట్టుబడులు పెట్టాయి. ఇన్వెస్ట్‌మెంట్‌కు సమస్యలు లేకపోవడంతో మాస్ ప్రొడక్షన్‌ను ప్రారంభించి, బ్రాండ్‌ను క్రియేట్ చేయాలని వీరు భావిస్తున్నారు. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ సహకరాంతో ప్రోడక్ట్‌ను మరింత మెరుగ్గా రూపొందించాలనుకుంటున్నారు. ‘‘భవిష్యత్‌లో మంచి హార్డ్‌వేర్‌-సాఫ్ట్‌వేర్ ప్లేలలో మరిన్ని ప్రాడక్ట్‌లను తీసుకురావాలనుకుంటున్నాం’’ అని అమర్‌దీప్ వివరించారు.

యాక్షన్ కెమెరాలు..

మార్కెట్ రియలిస్ట్ అంచనా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 5.5 మిలియన్ల కెమెరాలు తయారవుతున్నాయి. వీటి విలువ దాదాపుగా 2 బిలియన్ డాలర్లు. మార్కెట్లో అత్యంత ప్రభావవంతమైన కెమెరాగా పేరొందిన గోప్రో మార్కెట్ షేర్ 47.5%, సోనీ యాక్షన్ కామ్ 6.5%, పోలారాయిడ్ ఒక శాతాన్ని, ఇయాన్ 12% వాటాను కలిగి ఉంది. ఈ యాక్షన్ కెమెరా మార్కెట్‌లోకి ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తున్న నెక్స్‌గేర్ మరింత వృద్ధి చెందాలని ఆశిద్దాం.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags