బ్యాంకులు కాదుపొమ్మంటే..అక్కున చేర్చుకుంటున్న రంగ్ దే !
ఇంఫాల్, మణిపూర్ లోని వాంగ్కెయి ఆంగొం లెకై కి చెందిన తకెల్లంబన్ మీనారాణి దేవి కి భర్త మరణంతో నలుగురు పిల్లల పోషణ భారం మీద పడింది. స్వెట్టర్లు తయారుచేసుకుంటూ కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పిల్లలకు మంచి జీవితాన్ని ఇచ్చి, వాళ్లకు ఉన్నత చదువులు చెప్పించాలని భావించింది. స్వెట్టర్ల కోసం ఊల్ ను పెద్దమొత్తంలో కొని బిజినెస్ డెవలప్ చేయాలనుకుంది. అందుకు తనకు లోన్ కావాలి.
ఇక మరొకరి స్టోరీ ఇది. 8 ఏళ్ల వయసు నుంచే వ్యర్ధ పదార్ధాలను సేకరిస్తున్న కృష్ణ కు ఇప్పుడు 28 ఏళ్లు. చెత్తను సేకరించి, దానిని వేరుచేసి, అమ్ముకుంటే వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వేస్ట్ సెగ్రిగేషన్ ను బిజినెస్ గా మలచుకోవచ్చని అతనికి తెలుసు, అయితే సమస్యల్లా డబ్బుతోనే. రెండేళ్ల క్రితం హిసరు దళ అనే వేస్ట్ పికర్స్ అసోసియేషన్ కృష్ణకు వేస్ట్ మేనేజ్ మెంట్ ట్రైనింగ్ ఇచ్చింది. దాంతో పాటుగా బృహత్ బెంగళూరు మహానగర పాలికె నుంచి ఐడెంటిటీ కార్డ్, జాకెట్, గ్లోవ్స్, బూట్స్ తో కూడిన సేఫ్టీ ఎక్విప్మెంట్ ఇచ్చారు.
మీనారాణి, కృష్ణలకు వారికవసరమైన సహాయం లభించింది. రంగ్ దే నుంచి మీనరాణికి 8,000 లోన్ తీసుకునేలా సేవ, కృష్ణకు 40,000 లోన్ ను సిహరు దళ, తీసుకునేలా సహకరించారు. దీంతో మీనరాణి తన బిజినెస్ కు అవసరమైన రా మెటీరియల్ ను, కృష్ణ బెంగళూరుకు సమీపంలోని డొంలూర్ లో డ్రై వేస్ట్ కలెక్షన్ సెంటర్ ను ఏర్పాటు చేసుకున్నారు.
రంగ్ దే
RangDe.org అనేది ఇంటర్నెట్ బేస్డ్ పీర్-టు-పీర్ మైక్రో లెండింగ్ వెబ్ సైట్. ఇది దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు రూరల్ ఆంట్రప్రెన్యూర్లుగా మారడానికవసరమైన లోన్లు ఇస్తుంది. యువర్ స్టోరీ 2010 లో రంగ్ దే ను కలిసిన నాటి నుంచి బాగా వృద్ధి చెందింది. విభిన్న రంగాల్లో తాము ప్రోగ్రెస్ సాధించామని అంటున్నారు రంగ్ దే కో-ఫౌండర్, చీఫ్ ఇంపాక్ట్ ఆఫీసర్ అయిన స్మితా రాం. "2010 లో తక్కువ వడ్డీకే కోటి వరకు రుణాలు ఇచ్చాం. ఇప్పుడది 40 కోట్లకు చేరుకుంది. దీంతో దేశంలోని 38,000 అల్పాదాయ కుటుంబాలకు లబ్ధి చేకూరింది. 16 రాష్ట్రాల్లో, 25 ఆక్టివ్ పార్ట్నర్స్ తో కూడిన బలమైన నెట్ వర్క్ ఇప్పుడు మా సొంతం" అంటున్నారు స్మిత.
రంగ్ దే, చేనేత, హస్త కళలు, వేస్ట్ సెగ్రిగేషన్ విద్య వంటి విభిన్న రంగాలతో పాటుగా వికలాంగులకు లోన్లు ఇస్తుంది. ఆర్ధిక రంగ సంస్థలు లోన్లు ఇవ్వడానికి నిరాకరించే వ్యక్తులు, కమ్యూనిటీ లను చేరడమే లక్ష్యంగా పనిచేస్తుంది. రంగ్ దే గత అయిదేళ్లలో ఒక టీం ను ఏర్పాటు చేసుకుంది.
"ఏళ్లు గడుస్తున్న కొద్దీ, వివిధ కమ్యునిటీ ల అవసరాలు తీర్చడానికి గాను నైపుణ్యాన్ని పెంచుకున్నాం. జార్ఖండ్ లోని ట్రైబల్ కమ్యూనిటీ తో ఒక రకంగా, కర్నాటకలోని చేనేత కమ్యూనిటి తో మరో రకంగా జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది" అంటున్నారు స్మిత.
రంగ్ దే చూపించే వైవిధ్యం ఏంటి?
మార్కెట్లో ఇలాంటి ఎన్నో సంస్థలున్నపుడు, రంగ్ దే ఎల్ల విభిన్నమైందని స్మిత ను ప్రశ్నిస్తే, " మా దగ్గర ఫ్రీ గా లోన్ తీసుకున్న వారు సంవత్సరానికి 4.5% - 10% ఇంటరెస్ట్ కడతారు. ఇందులో 100% అప్పు తీసుకునే వారికి సహాయంగా ఉంటుంది. ఇక అప్పులుతీసుకునే వారిలో 50% మొదటిసారి తీసుకునేవారే ఉంటారు. ఇక ఇదంతా పారదర్శకంగా ఉండడానికి గాను, మేము డాక్యుమెంట్లను ఆన్ లైన్ లో పెడతాము" అంటున్నారు.
ఇక స్ట్రాటజీ లో కూడా మార్పు చేసింది రంగ్ దే. "భారత్ లాంటి దేశాల్లో వ్యవసాయ రంగం లో, పెట్టుబడి పెట్టేవారే రాజు. దీంతో వారే యజమానులుగా, నిర్ణాయక శక్తులుగా వ్యవహరిస్తారు. ఇక అగ్రి బిజినెస్ వాల్యూ చైన్ లో వారిదే సింహ భాగం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న విధానాన్ని పార్టిసిపేటివ్ కాపిటల్ సవాల్ చేస్తోంది. దాంతో మా వ్యూహాన్ని మార్చుకున్నాం. ప్రొడ్యూసర్ కంపెనీలు, కో-ఆపరేటివ్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తో కలిసి మరింత ప్రభావ వంతంగా పనిచేస్తున్నాం" అంటున్నారు స్మిత.
ఫండింగ్
వచ్చే నాలుగేళ్ల కాలం కోసం అంటే 2019 వరకు రంగ్ దే, టాటా ట్రస్ట్ సహకారాన్ని తీసుకోనుంది. కమ్యూనిటి డెవలప్ మెంట్ లో భాగంగా, టాటా ట్రస్ట్ విభిన్న రంగాల్లో పనిచేస్తున్న ఫిలంత్రోపిక్ ఆర్గనైజేషన్. నాచురల్ రిసోర్స్ మేనేజ్ మెంట్, రూరల్ లైవ్లీ హుడ్, అర్బన్ లైవ్లీ హుడ్ & పావర్టీ, ఎడ్యుకేషన్, ఎం హాన్సింగ్ సివిల్ సొసైటీ అండ్ గవర్నెన్స్, హెల్త్ అండ్ మీడియా ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ కల్చర్ వంటి రంగాల్లో అవసరమైన రుణాల్ని అందిస్తుంది.
వచ్చే అయిదేళ్లలో, మిలియన్ కుటుంబాల్లో కనీసం పావు వంతుకైనా మైక్రో-క్రెడిట్స్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కుటుంబాలకు మంచి జీవన విధానాన్ని అందివ్వడం, విద్య, వైద్యం, సానిటేషన్ సౌకర్యాలు కలిగించడంలో తోడ్పడుతుంది. ఇక టాటా ట్రస్ట్, రంగ్ దే మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం, క్రౌడ్-ఫండింగ్ నెట్ వర్క్ ను అదనంగా 12,000 సోషల్ ఇన్వెస్టర్లకు పెంచాలని భావిస్తున్నారు.
"100 కార్పోరేట్లు, సామాజిక బాధ్యత ఉన్న 1.5 లక్షల మంది భారతీయులతో కలిసి, వచ్చే అయిదేళ్లలో సోషల్ ఇన్వెస్టర్లుగా ఈ పని చేయాలని ఆలోచిస్తున్నాం" అంటున్నారు అంటున్నారు రంగ్ దే కొ_ఫౌండర్, CEO అయిన రామకృష్ణ NK.