Brands
Discover
Events
Newsletter
More

Follow Us

twitterfacebookinstagramyoutube
ADVERTISEMENT
Advertise with us

స్పెషలిస్ట్ డాక్టర్ల సెకండ్ ఒపీనియన్ కావాలా...? ఇదిగో సోమరాజు గారి స్టార్టప్ అందిస్తోంది..!

స్పెషలిస్ట్ డాక్టర్ల సెకండ్ ఒపీనియన్ కావాలా...? ఇదిగో సోమరాజు గారి స్టార్టప్ అందిస్తోంది..!

Tuesday August 23, 2016 , 4 min Read

జగన్నాథం..మధ్యతరగతి మనిషి..! ఇటీవల తరచూ విపరీతమైన తొలనొప్పి..తరచూ జ్వరంలా అనిపిస్తోంటే.... ఆస్పత్రికి వెళ్లి చూపించుకున్నాడు. పరీక్షించిన డాక్టర్... ముక్కునుంచి మెదడు చుట్టూ తెల్లగా ఓ ద్రవం లాటింది పేరుకుపోయిందని... సైనసైటిస్ ఆపరేషన్ చేసి తీసేయాలని చెప్పాడు. ఆపరేషన్ అని డాక్టర్ అనడంతో జగన్నాథం హడలిపోయాడు. అంత పెద్ద జబ్బు చేసిందా అని కంగారు పడిపోయాడు. చివరకు తన కంగారు గమనించిన మిత్రుడు... సెకండ్ ఓపీనియన్ గురించి చెప్పి... తనకు పరిచయం ఉన్న వ్యక్తులతో ప్రముఖ వైద్యుని అపాయింట్ మెంట్ ఇప్పించాడు. జగన్నాధాన్ని పరీక్షించిన వైద్యుడు... ఇప్పటికిప్పుడు ఆపరేషన్ అవసరం లేదు కానీ... మందులు ఇస్తా.. తగ్గకపోతే మాత్రం చేయించుకోవాల్సిందేనని సలహా ఇచ్చాడు. మందులతో నయమయ్యే వైద్యం ఉందని ఊపిరి పీల్చుకున్న జగన్నాథం... సంతోషంగా టాబ్లాట్స్ వాడాడు. ఫలితం కనిపించింది.

పై ఘటన నిజంగానే జరిగింది. ఇటీవలి కాలంలో మెడికల్ రంగంలో సెకండ్ ఒపీనియన్ ప్రాధాన్యత అంతకంతకూ పెరిగిపోతోంది. దానికి సాక్ష్యమే పై ఉదాహరణ. నగరాల నుంచి గ్రామాల వరకు ఇప్పుడు మూలమూలకూ హాస్పిటల్స్ వెలిశాయి. కానీ వైద్యం అనుకున్నంత క్వాలిటీగా లేదు. నిపుణలు, అనుభవజ్ఞుల కొరత వేధిస్తోంది. అందుకే సెకండ్ ఒపీనియన్ ప్రాధాన్యత అంతకంతకూ పెరుగుతోంది. ఇలాంటి సేవలు అందించే స్టార్టప్ లలో సంచలనం సృష్టిస్తోంది.. బెస్ట్ డాక్టర్.

స్పెషలిస్టు డాక్టర్లు - సరసమైన ధరకు..

అత్యంత ఖరీదైన వ్యాధులకు ట్రీట్ మెంట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. పేదలు, మధ్యతరగతి వాళ్లు సెకండ్ ఒపీనియన్ కోసం ప్రముఖ వైద్యుల వద్దకు వెళ్లలేని పరిస్థితి. వారి అపాయింట్ మెంట్లు దొరకడం అంత సులభం కాకపోవడం ఓ కారణమయితే.... వారి రేంజ్ కు తగ్గట్లుగా ఫీజులు చెల్లించే స్థోమత లేకపోవడం మరో కారణం. ఈ రెండు సమస్యలను ఒక్క క్లిక్ తో పరిష్కరించే లక్ష్యంతో అందుబాటులోకి వచ్చిన హైదరాబాద్ స్టార్టప్ "బెస్ట్ డాక్టర్ "

ఈ స్టార్టప్ వెనుక ఉన్నది టెక్నాలజీ రంగంలో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చిన యువతకాదు. అటు వ్యాపారరంగంలో ఇటు వైద్య రంగంలో ఢక్కామొక్కీలు తిన్నవారు. వారే కేర్ ఆస్పత్రుల వ్యవస్థాపకులు సోమరాజు, సీరియల్ అంట్రప్రెన్యూర్ సురేష్ కనుమూరి. మిత్రులైన వీరిద్దరూ ఓ సందర్భంలో సెకండ్ ఓపీనియన్ అంశంపై చర్చ జరిగింది. మధ్యతరగతి వారికి ఈ స్పెషలిస్ట్ డాక్టర్ల సెకండ్ ఒపీనియన్ అందేలా చేసేందుకు ఏదైనా చేద్దామని నిర్ణయించుకున్నారు. అలా బెస్ట్ డాక్టర్ కు అంకురార్పణ జరిగింది. గత ఏడాది రూ.50 లక్షల పెట్టుబడితో దీన్ని ప్రారంభించారు. సురేష్ కనుమూరి పెట్టుబడిని సమకూర్చారు. సురేష్ కనుమూరి హెల్త్ కేర్ స్టార్టప్ రంగంలో ఇప్పటికే రెండు సంస్థలను నడుపుతున్నారు. అందులో ఒకటి ఆస్క్ ద డాక్టర్.కామ్, రెండోది సెహత్ డాట్ కామ్.

సురేష్ గతంలో ఘాడి.కామ్ స్టార్టప్ కు ఏంజిల్ ఇన్వెస్టర్ గా వ్యవహరించారు. ఆస్క్ ద డాక్టర్.కామ్ అమెరికా కెనడాల్లో వేగంగా ఎదుగుతున్న కంపెని. హెల్త్ కేర్ రంగంలో ఆన్ డిమాండ్ సర్వీసెస్ అందిస్తోంది. సెహత్.కామ్ పేషెంట్లు, మంచి డాక్టర్లు, హాస్పిటల్స్ ను ఎంపిక చేసుకునే సేవలను అందిస్తోంది.

"నిపుణులైన వైద్యులు సెకండ్ ఓపీనియన్ అందిస్తారు. వారి క్వాలిఫికేషన్, ఎక్స్ పీరియన్స్, వైద్య వర్గాల్లో ఉన్న పేరు ప్రఖ్యాతులు, పరిశోధనా రంగంలో కంట్రిబ్యూషన్ లాంటి వన్నింటినీ పరిశీలించి స్పెషలిస్ట్ లను సెకండ్ ఒపీనియన్ ఇవ్వడానికి ఎంపిక చేస్తున్నాం..." సురేష్ కనుమూరి, బెస్ట్ డాక్టర్ ఫౌండర్

హెల్త్ స్టార్టప్స్ కు మంచి ఫ్యూచర్

ఇటీవలి కాలంలో పలు సందర్భాల్లో వైద్యపరంగా జరిగిన తప్పులు తరచూ చర్చనీయాంశమవుతున్నాయి. తప్పుడు మెడిసిన్స్ సజెస్ట్ చేసినా... మనిషి శరీరతత్వానికి సరిపడని మందులు రాసి పెషెంట్ పై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. దీర్ఘ కాలిక రోగాలు అధికంగా వచ్చే ప్రమాదం ఉంది. ఈ రిస్క్ ను వీలైనంతగా తగ్గించడానికే బెస్ట్ డాక్టర్ స్టార్టప్ ఉపయోగపడుతుంది. కీలకమైన అన్ని విభాగాల్లో ప్రపంచ ప్రఖ్యాత నిపుణులను ఇప్పటికే ఈ స్టార్టప్ ద్వారా సేవలు అందించడం ప్రారంభించారు.

బెస్ట్ డాక్టర్ సైట్ లో సైన్ ఇన్ అయిన తర్వాత పేషెంట్ తన మెడికల్ కండిషన్ రిపోర్టులు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. వాటిని ఆయా రంగాల నిపుణులు పరిశీలిస్తారు. తర్వాత డాక్టర్ల అబ్జర్వేషన్ రిపోర్ట్... వారి సలహాలు, సూచనలు సెకండ్ ఓపీనియన్ గా వ్యక్తిగతంగా మెయిల్ చేస్తారు. ఈ సెకండ్ ఒపీనియన్ ని బెస్ట్ డాక్టర్ కు చెందిన చీఫ్ మెడికల్ ఆఫీసర్ నేతృత్వంలోని బృందం క్రాస్ చెక్ చేస్తుంది.

ఇలాంటి స్టార్టప్ లకు... నిపుణుల సేవలను అందించేలా చేయగలగడం చాలా కష్టం. కానీ ఈ బాధ్యతను డాక్టర్ సోమరాజు తీసుకున్నారు. ప్రస్తుతం సోమరాజు బెస్ట్ డాక్టర్ కు సలహాదారుగా ఉన్నారు. సోమరాజు చొరవతో వివిధ రంగాలకు చెందిన 400 మంది నిపుణులైన వైద్యులు బెస్ట్ డాక్టర్ కు సేవలందిస్తున్నవారి జాబితాలో చేరారు.

"సుప్రసిద్దులైన వైద్యుల్ని ఎంపిక చేయడానికి ప్రత్యేకంగా ఓ బృందం పనిచేస్తోంది. ఆన్ డిమాండ్ ఆఫీస్ ప్యానెల్ కూడా మాకు ఉంది. ప్రత్యేకమైన సందర్భాల్లో ఆఫ్ లైన్ ప్యానల్ డాక్టర్లు సెకండ్ ఒపీనియన్ అందిస్తారు"- సురేష్, బెస్ట్ డాక్టర్ ఫౌండర్

ప్రపంచవ్యాప్తంగా విస్తరణ

బెస్ట్ డాక్టర్ లో ప్రస్తుతం ఎనిమిది మంది బృందం కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 20 మంది ఫ్రీలాన్స్ కన్సల్టెంట్లు సేవలందిస్తున్నారు. ఒక్క ఇండియాకే పరిమితమవ్వాలని బెస్ట్ డాక్టర్ అనుకోవడం లేదు. అందుకే ఇప్పటికే అమెరికా, యూకే, యూఏఈలలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు కసర్తతు ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేందుకు ఓ బ్లూప్రింట్ ను కూడా రెడీ చేసుకుంటున్నారు.

ఇప్పటికే 12000 మెడికల్ కేసుల్ని బెస్ట్ డాక్టర్ నిపుణుల బృందం ప్రాసెస్ చేసింది. ఒక్కో పేషంట్ నుంచి రూ.500 నుంచి రూ.8000 వరకు చార్జ్ చేస్తున్నారు. అరవై శాతం డాక్టర్లతో ప్రతి కన్సల్టేషన్ కు ఇంత రేటు అని ఒప్పందం చేసుకున్నారు. బెస్ట్ డాక్టర్ కు 20 నుంచి 50 శాతం కమిషన్ లభిస్తుంది. స్టార్టప్ ఆదాయం నెలకు 15 నుంచి 20 శాతం వరకు పెరుగుతోంది. ఈ ఏడాది కోటి రూపాయల ఆదాయాన్ని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బీటూసీ విధానంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వీలైనంత త్వరలో బిజినెస్ టు బిజినెస్ మోడల్ కి మారాలని భావిస్తున్నారు.

మెడికల్ టూరిజం బిజినెస్ ఇండియాలో టాప్ రేంజ్ లో ఉంది. మూడు బిలియన్లు దాటిపోయిందని ఇండస్ట్రీ వర్గాల అంచనా. అయితే ఈ రంగంలో పోటీ కూడా ఎక్కువగానే ఉంది. వీడియో హెల్త్ కన్సల్టెషన్ క్వాలిటీతో హెల్త్ పిక్స్, వీడియోలు, చాట్స్ తో సేవలు అందించే ఈకిన్కెర్ లాంటి స్టార్టప్ లు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. మరో వైపు ప్రాక్టో టాప్ రేంజ్ లో ఉండగా... పోర్టియో మెడికల్, లైబ్రేట్ లాంటివి పెట్టుబడులు సాధిస్తూ ముందుకెళ్తున్నారు. లైబ్రాట్ లో రతన్ టాటా పెట్టుబడి పెట్టారు.

అయితే ... సోమరాజు ట్రీట్ మెంట్ నెట్ వర్క్...సురేష్ వ్యాపారనిపుణ కలిసి... వీటన్నింటిలోనూ బెస్ట్ డాక్టర్ కు ప్రత్యేకత తీసుకొస్తున్నాయి.

వెబ్ సైట్