రెస్టారెంట్లకు లాజిస్టిక్స్ సపోర్ట్ అందించే వైహంగ్రీ

ఇప్పుడు ఆన్ లైన్ ఫుడ్ బిజినెస్ మంచి ఊపుమీద ఉందిఅయితే ప్రతీ రెస్టారెంట్ లాజిస్టిక్స్ ఏర్పాటు చేసుకోవడం కష్టమేఖర్చుతో కూడుకున్న వ్యవహారానికి సులువైన పరిష్కారంబి2బి మోడల్‌లో పనిచేస్తున్న వైహంగ్రీ

రెస్టారెంట్లకు లాజిస్టిక్స్ సపోర్ట్ అందించే వైహంగ్రీ

Tuesday July 14, 2015,

4 min Read

ఆన్ లైన్ సంస్థలు కుప్పలుతెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. సబ్బులు, షాంపూల నుంచి పిజ్జాలు, బర్గర్లు, మందులు, చివరకు కూరగాయలు కూడా ఆన్‌లైన్‌లో ఇంటికి తెప్పించుకునే రోజులు వస్తున్నాయి. ఈ-కామర్స్ నానాటికీ విస్తృతమవుతోంది. దీంతో లాజిస్టిక్స్, డెలివరీ ఇప్పుడు అన్నింటికంటే గొప్ప వ్యాపారంలా కనిపిస్తున్నాయి. అందుకే పెద్ద పెద్ద సంస్థలు కూడా వీటిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. అన్నింటికంటే మించి లోకల్ మార్కెట్లో డెలివరీ (హైపర్ లోకల్) సెగ్మెంట్ ఈ సారి పండగ చేసుకుంది. గ్రోఫర్స్, పెప్పర్ ట్యాప్, జాప్ నౌ వంటి బి2బి సంస్థలు మెరుగైన వృద్ధినే కనిపిస్తున్నాయి.

image


ఇప్పుడే ఇదే సెగ్మెంట్లో వైహంగ్రీ అనే స్టార్టప్ కూడా రంగంలోకి దూకింది. తర్వాతి తరం లాజిస్టిక్స్ వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఆర్డర్ చేసిన 30-45 నిమిషాల లోపు వస్తువులను డెలివర్ చేస్తున్నారు. ప్రస్తుతం తక్షణ డెలివరీ సెగ్మెంట్‌లో విస్తృత అవకాశాలు ఉన్నప్పటికీ ఆ రంగాన్ని పట్టించుకున్న వాళ్ల సంఖ్య తక్కువగా ఉంది. అందుకే ఇక్కడ పాగా వేసి పట్టునిలుపుకోవాలని చూస్తోంది వైహంగ్రీ.

వైహంగ్రీ అనేది వికాస్ పాండే మానసపుత్రిక. ఆయన గతంలో సిటీ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన అనుభవం ఉంది. అయితే ఈ స్టార్టప్‌లోకి అడుగుపెట్టిన తర్వాత అంతా పూలపాన్పు మాత్రం కాదని తన మాటల్లో స్పష్టంగా అర్థమవుతోంది.

''మొదటకు నాకు ఇది అనూహ్యమైన మార్పు. అద్భుతమైన ఆఫీస్ వ్యవస్థ, ఎయిర్ కండిషన్డ్ రూములు, ఎప్పుడు ఏం కావాలంటే అవి దగ్గరకు వచ్చే వ్యవస్థ నుంచి నేనే నీళ్లు ఏర్పాటు చేసుకుని క్లీన్ చేసుకునే స్థితికి వచ్చాను. డెలివరీ బాయ్స్‌కు నేనే కాల్ చేసి ఉద్యోగంలో చేరమని వాళ్లను అడిగిన సందర్భాలూ ఉన్నాయి''

వికాస్ ఓ చార్టెడ్ అకౌంటెంట్‌తో పాటు ICWAI ఆలిండియా పన్నెండో ర్యాంకర్. ఢిల్లీ యూనివర్సిటీ కిరోరీ మల్ కాలేజ్ నుంచి కామర్స్ గ్రాడ్యుయేట్.

ఎలా వచ్చిందీ ఆలోచన ?

వికాస్ స్వీయానుభవమే వ్యాపార ఏర్పాటుకు దారితీసింది. కొన్ని సందర్భాల్లో ఆహారం ఆర్డర్ చేసినప్పుడు ఒక్కో కంపెనీ ప్రత్యేకమైన లాజిస్టిక్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుందని తెలిసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఇది బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కొన్ని సందర్భాల్లో ఇది లాభాల కంటే నష్టాలను ఎక్కువగా ఇస్తుందని అతడి విశ్లేషణ. ''అందుకే బి2బి మోడల్‌లో రెస్టారెంట్లకు డెలివరీ వ్యవస్థను సిద్ధం చేశాడు. ఇప్పటికీ బిజినెస్ టు కస్టమర్ రంగంలో కస్టమర్ల సంఖ్య విపరీతంగా ఉన్నందుకే దీన్ని ఎంచుకున్నాం'' అంటారు వికాస్.

ప్రస్తుతానికి బిజినెస్ టు బిజినెస్ సెగ్మెంట్లో అంత పోటీలేదు. వైహంగ్రీతో పాటు క్వికిలీ కూడా పోటీలో ఉంది. అయితే క్వికిలీ అన్ని విభాగాల్లో ఉండే వైహంగ్రీ మాత్రం కేవలం రెస్టారెంట్ డెలివరీలు మాత్రమే చేస్తుండడం ప్రత్యేకత.

''మాకు ఢిల్లీ, క్యాపిటల్ ప్రాంతాల్లో పెద్ద టీం ఉంది. దీన్ని అనూహ్యంగా విస్తరిస్తాం. ఈ ఆర్థిక ఏడాదిలోనే 1200 మంది కొత్త రైడర్లను తీసుకోవాలని యోచిస్తున్నాం''. డెలివరీ అనేది మానవ వనరులతోనో ముడిపడిన వ్యవహారం. ఏ స్టార్టప్ అయితే వీళ్ల నిర్వహణాలో విజయం సాధిస్తుందో వాళ్లకు ఈ రంగంలో తిరుగుండదని నమ్ముతారు వికాస్.

ప్రస్తుతానికి రోజుకు 800-1000 లావాదేవీలను ప్రాసెస్ చేస్తోంది వైహంగ్రీ. ఇందులో గ్రాస్ మర్కండైజ్ వాల్యూమ్ (జిఎంవి) నెలకు కోటి రూపాయల వరక ఉంది. ప్రస్తుతానికి వివిధ కంపెనీలకు చెందిన 200 బ్రాండ్లు వైహంగ్రీ సేవలను వినియోగించుకుంటున్నాయి.

దూరం, ఆర్డర్లను బట్టి ఒక్కో ఆర్డర్‌కు ఇంత మొత్తాన్ని రెస్టారెంట్ల నుంచి ఛార్జ్ చేస్తుంది వైహంగ్రీ. "మేం గతేడాది ఆగస్టులో ప్రారంభించాం, ఇప్పుడు మూడు కోట్ల వరకూ జిఎంవి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే మూడు కోట్ల జిఎంవి సునాయాసంగా చేరుకోగలమనే నమ్మకం నాకు ఉంది అంటారు'' వికాస్.

డెలివరీకి సిద్ధమైన వైహంగ్రీ సభ్యులు

డెలివరీకి సిద్ధమైన వైహంగ్రీ సభ్యులు


కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి సంస్థ ఏర్పాటుకు అవసరమైన నిధులను వికాస్ సమీకరించారు. ప్రస్తుతం సిరీస్ - ఏ ఫండింగ్ కోసం ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నారు. ఆయన ముందున్న సవాళ్లను వివరిస్తూ..

''ఈ రంగంలో అన్నింటికంటే ముఖ్యంగా డెలివరీ బాయ్స్‌ను నిలుపుకోవడమే. మా వ్యాపారంలో అతడు చాలా కీలక భాగస్వామి, అందుకే వాళ్లకు వివిధ అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇంటర్నెట్ పరిధి పెరిగి, ఆదాయ మార్గాలు విస్తృతం కావడంతో మా లాంటి సేవలు అందించే సంస్థలకు గిరాకీ అనూహ్యంగా పెరిగింది''.

సిఏలకు లెక్కలు బాగా తెలుసు !

వికాస్ మాటల ప్రకారం తాను సిఏ చేయడం కంపెనీకి బాగా కలిసొచ్చింది. ''అన్నింటికంటే ముఖ్యం సిఏలు ప్రొఫెషనల్స్. వాళ్లకు వ్యాపార నిర్వాహణతో పాటు వాణిజ్య అంశాలపై లోతైన అవగాహన ఉంటుంది. సిఏలు నడిపే కంపెనీలు ఆర్థికంగా స్థిరంగా ఉంటాయి. అందుకే నేను కూడా ఈ వ్యాపారాన్ని నడపగలుగుతున్నాను. మా EBIDTA (ఎబిటా అంటే పన్నులు, వడ్డీలు, తరుగు, విమోన తీసివేయక ముందు వచ్చిన ఆదాయం) లాభదాయకంగానే ఉంది. నాకు నెంబర్లంటే చాలా ఇష్టం. మా రైడర్ వంద మీటర్లు వెళ్లి డెలివర్ చేసి వస్తే ఎంత ఖర్చవుతుందీ అనే మొత్తాన్ని కూడా లెక్కేలేసి చెప్పగలను. ఎక్కడ లాభ-నష్ట రహిత స్థాయికి చేరగలం, పూర్తిస్థాయి ఉత్పాదకతను ఎప్పుడు తీసుకురాగలం, ఎన్ని ఆర్డర్లు వస్తే మా ఉత్పాదకతను వినియోగించుకోలేం వంటివన్నీ నాకు తెలుసు''.

వై హంగ్రీ టీమ్

వై హంగ్రీ టీమ్


రైల్వేల కంటే పెద్ద వ్యవస్థను తయారు చేయొచ్చు !

రైల్వేల కంటే పెద్ద వ్యవస్థను ఎందుకు తయారు కూడదని నాకు అనిపిస్తూ ఉంటుంది. అది చేయొచ్చు. దీని వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఆ సంఖ్య లక్షల్లో ఉంటుందని మాత్రం నేను చెప్పగలను. కానీ అందరూ పేరోల్స్‌లో ఉండాల్సిన పనిలేదు. సమాజంలో కింది స్థాయి వాళ్లకు కూడా వ్యాపారావకాశాలన్ని అందజేయాలని చూస్తున్నాం''.

ప్రస్తుతానికి వై హంగ్రీ ఓ ఆన్‌లైన్ లాజిస్టిక్ కంపెనీ, అది కూడా కేవలం ఆహార డెలివరీకే పరిమితమైంది. త్వరలో వివిధ విభాగాల్లోకి కూడా వెళ్లే ఆలోచన ఉన్నట్టు వికాస్ చెప్తున్నారు.

వై హంగ్రీతో పాటు క్విక్లీ, స్విగ్గీ, గ్రాబ్.ఇన్ సంస్థలు ప్రస్తుతం బి2బి హైపర్ లోకల్ డెలివరీ విభాగంలో పనిచేస్తున్నాయి. స్విగ్గీ ఇప్పటికే యాక్సెస్ పార్ట్‌నర్స్, సైఫ్ పార్ట్‌నర్స్, ఎన్.వి.బి. నుంచి 18.5 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.115 కోట్లు) ఫండింగ్ పొందింది. ఆలిఫన్స్ క్యాపిటల్‌తో పాటు స్వతంత్ర ఇన్వెస్టర్ హరేష్ చావ్లా నుంచి గ్రాబ్.ఇన్ మిలియన్ డాలర్లు (సుమారు రూ.6 కోట్లు) సమకూర్చుకుంది.