ఆన్ లైన్‌లో డాక్టర్లు.. ఇంటికే మెడిసిన్లు! వైద్య రంగంలో సరికొత్త ఆలోచన !!
హోమ్ రెమెడీస్ కు కొదవలేదు. ఎలాంటి వ్యాధికైనా మార్కెట్లో రకరకాల మెడిసిన్స్ దొరుకుతాయి. కానీ ఒకటే సందేహం! అవన్నీ ప్రాపర్ గా పనిచేస్తాయా? వాటితో జబ్బు నయం అయిపోతుందా? ఈ నేపథ్యంలోనే తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ తో వ్యాధి నయమయ్యే ఆల్టర్నేట్ మెడిసిన్ కు డిమాండ్ పెరుగుతోంది. అందునా ఆన్ లైన్ అయితే మరీ బెటర్ అంటున్నారు జనం. అలాంటి వారి కోసమే వచ్చింది వెల్ కమ్ క్యూర్!
ఆన్ లైన్ లో ట్రీట్ మెంట్, మెడిసిన్ కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలా హెల్త్ కేర్, హెల్త్ టెక్ ప్లాట్ ఫామ్స్ ఆన్ లైన్ సేవలందిస్తున్నాయి. కాకపోతే అవి డాక్టర్లు, పేషెంట్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లను జనానికి కనెక్ట్ చేయడం వరకే పరిమితమయ్యాయి. కానీ వెల్ కమ్ క్యూర్ అలా కాదు! కంప్లీట్ గా డిఫరెంట్! ఇదొక ఆల్టర్నేట్ మెడిసిన్ పోర్టల్!
డాక్టర్ జవహర్ షా. హోమియోపతీ ఫిజీషియన్. 30 ఏళ్ల అనుభవం. జవహర్ షా అల్లుడు పునీత్ దేశాయ్, కూతురు నిధి దేశాయ్. ఈ ముగ్గురే వెల్ కమ్ క్యూర్ సృష్టికర్తలు. చాలా మంది పేషెంట్లు హోమియోపతి మెడిసిన్ తో సంతృప్తిగా ఉన్నప్పటికీ- చికిత్స ఇంకా చాలా మందికి అందుబాటులోకి రాలేదని వీళ్లు గుర్తించారు. మరింత మందికి హోమియోపతి ట్రీట్ మెంట్ ను దగ్గర చేయాలని నిర్ణయించుకున్నారు. దానికి వెల్ క్యూమ్ కూరే సరైన వేదిక అని డిసైడయ్యారు.
ఆల్టర్నేట్ మెడిసిన్ ప్లాట్ ఫామ్..
వన్ స్టాప్, ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ప్రొవైడర్ గా వెలక్ కమ్ క్యూర్ ని ఏర్పాటు చేశామంటున్నారు సీఈవో పునిత్ దేశాయ్. ఇందులో డాక్టర్లు, కన్సల్టేషన్లు, డైట్, న్యూట్రిషన్ ప్లాన్స్, మెడిసిన్ డెలివరీ- వగైరా వగైరా సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. వరల్డ్ లోనే ది బెస్ట్ డాక్టర్స్ ను అపాయింట్ చేసుకున్నామన్నారు పునీత్. ఇంకో ప్రత్యేకత ఏంటంటే.. వెల్ కమ్ క్యూర్ లో పేషంట్లు ఎప్పుడైనా, ఎన్ని సార్లయినా డాక్టర్లను సంప్రదించవచ్చు. లైవ్ చాట్, వీడియో చాట్, టెలిఫోన్, ఈ-మెయిల్ ఇలా ఏదో ఒక మాధ్యమం ద్వారా డాక్టర్లకు తమ ఆరోగ్య సమస్య చెప్పుకోవచ్చు. వెబ్ సైట్ లోని ప్రత్యేక మైన టూల్స్ ద్వారా పేషెంట్లు తమ హెల్త్ కండీషన్ ను మానిటర్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.
కన్సల్టేషన్ ఇలా..
- మొదటి స్టెప్
ముందుగా వెబ్ సైట్ లోకి ఎంటరై, సైన్ అప్ కావాలి. రిజిస్ట్రేషన్ ఫ్రీ! పేషెంట్ కి ఒక రిజిస్ట్రేషన్ ఐడీ కేటాయిస్తారు.
- రెండో స్టెప్
పేషెంట్లు డాక్టర్లకు తమ ఆరోగ్య సమస్య చెప్పుకోవచ్చు. వైద్య నిపుణులు పూర్తి ఉచితంగా వైద్య సలహాలు ఇస్తారు.
- మూడో స్టెప్
వైద్య నిపుణులు ఇచ్చిన సలహాల మేరకు పేషెంట్లు ఒక హెల్త్ ప్లాన్ సెలక్ట్ చేసుకోవాలి. అందుబాటు ధరల్లో కూడా హెల్త్ ప్లాన్ లు ఉన్నాయి. ట్రీట్ మెంట్ లో భాగంగా అన్ లిమిటెడ్ డాక్టర్ కన్సల్టేషన్స్, మెడిసిన్స్, కొరియర్స్ ఉంటాయి.
- నాలుగో స్టెప్
డీటెయిల్డ్ కేస్ హిస్టరీ చెప్పిన తర్వాత పేషెంట్ తనకు నచ్చిన డాక్టర్ ను ఎంపిక చేసుకోవచ్చు. సంబంధిత వైద్య నిపుణుడు పేషెంట్ ఆరోగ్య సమస్యను సమగ్రంగా అధ్యయనం చేసి మెడిసిన్ ప్రిఫర్ చేస్తారు.
- చివరి స్టెప్
పేషెంట్ కు మెడిసిన్ డెలివరీ ఇస్తారు. దాంతోపాటు డైట్, లైఫ్ స్టైల్ ప్లాన్స్ కూడా పంపిస్తారు.
సాధారణంగా మా దగ్గరికొచ్చే పేషంట్లు ట్రీట్ మెంట్ కు పట్టే సమయాన్ని బట్టి హెల్త్ ప్లాన్ ఎంపిక చేసుకుంటారు. ఇండియన్ పేషంట్లకు అయితే మూడు నెలలకు రూ.3,500, ఆరు నెలలకు రూ.6 వేలు, తొమ్మిది నెలలకు రూ.8,500, ఏడాదికి రూ.10 వేలు, రెండేళ్లకు రూ. 16 వేలు ఛార్జ్ చేస్తాం- పునీత్
వైద్య రంగంలో కొత్త ఐడియా..
జవహర్ షాకి హోమియోపతి రంగంపై బాగా పట్టుంది. హోమియోపతి డాక్టర్లు డేటాబేస్ నిర్వహించుకోవడానికి ఆయన - హోమ్ పాథ్- అనే సాఫ్ట్ వేర్ ప్రోడక్ట్ డిజైన్ చేశారు. ఆయన అల్లుడు పునీత్ కూడా తక్కువేం కాదు! హోమ్ షాపింగ్ వెంచర్ ట్రేడ్ బజార్ లో వ్యాపార అనుభవం ఉంది. అక్టోబర్ ఫిల్మ్స్ కు మేనేజింగ్ పార్ట్‌నర్ కూడా. పునీత్ సతీమణి నిధి ఆ కంపెనీకి సీవోవో. మొత్తంగా ఈ-కామర్స్ సెగ్మెంట్ లో పునీత్ ది టెన్ ఇయర్స్ ఎక్స్ పీరియెన్స్. కస్టమర్లు బ్రాండ్స్ లేదా పోర్టల్స్ వైపే మొగ్గు చూపుతారని అనుభవం నుంచి తెలుసుకున్నారాయన. హోమ్ షాపింగ్ నెట్ వర్క్ అనుకున్నంత బిజినెస్ చేయకపోవడంతో.. కస్టమర్లను మరింతగా ఆకర్షించాలన్న ఆలోచన వచ్చంది. అప్పటికే హోమ్ పాథ్ సాఫ్ట్ వేర్ కు మంచి స్పందన లభించింది. అంతే! మరో ఆలోచన లేకుండా మామ జవహర్ షాతో కలిసి వెల్ కమ్ క్యూర్ స్థాపించారు పునీత్. వైద్య నిపుణులను ఎంపిక చేయడం, మెడిసిన్ మానిటర్ చేయడం జవహర్ చూసుకుంటారు. ప్రస్తుతం వెల్ కమ్ క్యూర్ లో సీటీవో ఆల్ఫ్రెడ్ డిసౌజా, సపోర్ట్ అండ్ లాజిస్టికల్ హెడ్ రాజేశ్ భాస్కరన్, సేల్స్ అండ్ కస్టమర్ సర్వీస్ జీఎం జాస్మిన్ డిసిల్వాతో కోర్ టీమ్ పని చేస్తోంది. వెల్ కమ్ క్యూర్ లో డాక్టర్లు రెవెన్యూ షేర్ మోడల్ లో పనిచేస్తారు.
దశాబ్దాల తర్వాత ఇప్పుడు హోమియోపతికి ఆదరణ పెరుగుతోంది. ది బెస్ట్ ప్రాక్టీషనర్స్ ను వెల్ కమ్ క్యూర్ ప్లాట్ ఫామ్ మీదికి తీసుకొచ్చాం. హోమియోపతిలో వారికున్న అనుభవంతో ప్రపంచమంతా వైద్య సేవలందించే అవకాశం కల్పించాం- పునీత్
ఏడాదికి లక్ష మందికి వైద్య సేవలు!
కంపెనీ ఏర్పాటుకు హోమియోపతి డేటాబేస్, గట్టి బ్యాక్ గ్రౌండ్ ఉంటే సరిపోదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పేషెంట్లను డాక్టర్లకు కనెక్ట్ చేయడమే అసలైన సవాలు. అందుకు రెండేళ్లు పట్టింది. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద హోమియోపతి డేటాబేస్ వెల్ కమ్ క్యూర్ సొంతం. 2014 నవంబర్ లో వెల్ కమ్ క్యూర్ పోర్టల్ లాంఛైంది. మొదటి ఏడాదిలో టీమంతా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్, టై-అప్స్ పైనే దృష్టి సారించింది. చూస్తుండగానే 4 వేల మంది పేషంట్లకు దగ్గరైంది. గత రెండు వారాల్లోనే వెయ్యి మంది పేషంట్లు పోర్టల్ ను సంప్రదించారు. 2016 జనవరిలో మరో పది వేల మంది పేషంట్లు యాడ్ అవుతారని కంపెనీ భావిస్తోంది.
గత ఏడాది డిసెంబర్ నుంచి బిజినెస్ ను ప్రమోట్ చేసే పనిలో పడ్డారు ఫౌండర్లు. 2015 అక్టోబర్ లో కంపెనీ 60 లక్షల డాలర్ల ఫండ్ సేకరించింది. ఏడాదిలో లక్ష మంది పేషంట్లకు సర్వీస్ అందించాలన్నది లక్ష్యం. ఆన్ లైన్ లో అన్ని రకాల నేచురల్ మెడిసిన్స్ ను అందుబాటులోకి తేవాలన్న దీర్ఘకాలిక లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకుంది.
ప్రత్యామ్నాయ ఔషధాలకు కేరాఫ్..
ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఇండస్డ్రీ అనేది 34 బిలియన్ డాలర్ల మార్కెట్! ఇది స్మిత్ సోనియన్ మ్యాగజైన్ అంచనా! కెన్ రీసెర్చ్ నివేదిక ప్రకారం 2008-2013 మధ్య ఈ మార్కెట్ 19.5 శాతం సీఏజీఆర్ (కాంపౌండ్ ఆన్యువల్ గ్రోత్ రేట్) నమోదు చేసింది. ఆసియా, నార్త్ అమెరికా తర్వాత ఆల్టర్నేటివ్ మెడిసిన్, థెరపీల్లో యూరప్ దే అగ్రస్థానం. రైట్ హెల్త్ గ్రూప్ లిమిటెడ్, సాండోజ్ ఇంటర్నేషనల్, బయోకాన్ లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్, ఆర్య వైద్య ఫార్మసీ, సిప్లా, వెలెడా (యూకే) లిమిటెడ్ వంటి అంతర్జాతీయ కంపెనీలు ప్రత్యామ్నాయ ఔషధాలు, థెరపీలను అందిస్తున్నాయి. ఆదరణ ఉన్నప్పటికీ ఇందులోనూ సమస్యలు లేకపోలేదు. ప్రధానంగా ఆల్టర్నేట్ మెడిసిన్ విషయంలో క్లినికల్ ట్రయల్స్, ప్రమాణికతపై సందేహాలు ఉన్నాయి. ఈ రంగంలో చేయాల్సినన్ని టెస్టులు చేయడం లేదన్నది కొందరి మాట. ఎవరి వాదన ఎలా ఉన్నా వెల్ కమ్ క్యూర్ లాంటి ఆన్ లైన్ పోర్టళ్లు పేషంట్లకు బాగా ఉపయోగపడుతున్నాయన్నది వాస్తవం!