ప్రేమవైఫల్యం నుంచి పుట్టిన 'బుక్ మై బ్యాటరీ'

ఇది ఒక విజేత గాథ. ఒక యువపారిశ్రామికవేత్త కథ. ఎవరూ ఊహించని, సాహసించని రంగంలో అడుగుపెట్టాడు. ఎవరు నిరాశపరిచినా అదరలేదు. బెదరలేదు. కస్టమర్ల ఆకాంక్షలను అర్థం చేసుకుని వారి నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. బ్యాటరీలు,ఇన్వర్టర్ల రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు ఈ -కామర్స్ బాట పట్టాడు. బుక్ మై బ్యాటరీ వెబ్ సైట్ ద్వారా కొద్దికాలంలోనే వినియోగదారుల మనసు గెలుచుకున్న... యంగ్ ఆంట్రప్రెన్యూర్ దావూద్ జాఫర్ సక్సెస్ స్టోరీ...

30th Apr 2015
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

ప్రేమలో విఫలం కసి పెంచింది...

ఫిబ్రవరి 14, 2011లో బ్యాటరీరంగంలో తన స్టార్టప్ ను లాంఛ్ చేశాడు...దావూద్ జాఫర్. కానీ ఆ రోజు అతనికి ఎక్కువ ఆనందాన్నివ్వలేదు. ‘’నా గార్ల్ ఫ్రెండ్ నన్ను తీవ్ర నిరాశకు గురి చేసిన రోజది. ప్రేమను కాదని వారి కుటుంబ సభ్యుల ఒత్తిడికి తలొగ్గింది’’ అని చేదు జ్ణాపకాలు నెమరు వేసుకున్నాడు దావూద్. ఏడాది గడిచిన తర్వాత...తన ప్రియురాలు ఇంటి నుంచే పోన్ వచ్చింది కానీ, ఈసారి ఆమె తండ్రి నుంచి. ‘’మరుసటి ఏడాది సరిగ్గా అదే రోజు. మా వెబ్ పోర్టల్‌ను చూసిన ఆమె నాన్న... ఓ బ్యాటరీ ఆర్డర్ చేస్తూ కాల్ చేశారు. కానీ అది నా వ్యాపారమేనని ఆయనకు తెలియదు. మా దగ్గర డెలివరీ బాయ్స్ తక్కువున్నారు. నేనే వెళ్లి బ్యాటరీ ఇన్‌స్టాల్ చెయ్యాలి. బ్యాటరీ ఇన్‌స్టాల్ చెయ్యడానికి వెళ్లిన నన్ను చూసి ఆయన ముఖంలో ఎలాంటి సంతోషమూ కనిపించలేదు. అంతేకాదు నా పరిస్థితులపై ఏవేవో అంచనాలతో ఏదో ఒక నిర్ణయానికి వచ్చేసినట్టున్నారు. ఆ అనుభవం చాలా ఇబ్బందికరంగా అనిపించింది నాకు. కానీ ఇదే జాబ్‌లో మరింత ఉన్నతంగా ఎదగాలన్న కసి పెరిగింది. ఆయన తన నిర్ణయం పట్ల పశ్చాతాప పడాలని తీర్మానించుకున్నా.”

బుక్ మై బ్యాటరీ డాట్ కామ్ అనేది ఈ కామర్స్ వేదికగా వివిధ రకాల ఆటోమొబైల్ బ్యాటరీలు అమ్ముతుంది. ఆర్డర్ చేసిన రెండు గంటల్లోనే బ్యాటరీలను కస్టమర్లకు చెంతకు చేర్చి వారి నమ్మకాన్ని సంపాదించుకుంది. కస్టమర్లకు నాణ్యమైన బ్యాటరీలను సరసమైన ధరలకు విక్రయించడానికి వీరికి ఆథరైజ్డ్ బ్యాటరీ డీలర్లతో వ్యాపార ఒప్పందాలున్నాయి. బ్యాటరీ అమ్మకాలకు ముందు తర్వాత కస్టమర్లతో రిలేషన్స్ కొనసాగించి...వారి విశ్వాసాన్ని చూరగొంది....బుక్ మై బ్యాటరీ.

దావూద్ జాఫర్, బుక్ మై బ్యాటరీ వ్యవస్థాపకుడు

దావూద్ జాఫర్, బుక్ మై బ్యాటరీ వ్యవస్థాపకుడు


బాల్యంలోనే బిజినెస్ బీజం...

ఏడో తరగతిలోనే ఆంట్రపెన్యూర్‌గా అవతారమెత్తాడు దావూద్. 

“ నా దగ్గర ఇంక్ రీ-ఫిల్లర్స్ ఉండేవి. నా క్లాస్‌మేట్స్ పెన్నులను రిఫిల్ చేయడానికి వారి నుంచి రూపాయ వసూలు చేసేవాణ్ణి. దుకాణం నుంచి కొని తెచ్చే ఒక్కో రిఫల్లర్ పై ఐదు రూపాయలు సంపాదించాను’’ అని తన తొలి సంపాదన వివరించాడు...దావూద్. 

ప్రవగడ... కర్ణాటక, ఆంద్రప్రదేశ్ సరిహద్దులోని చిన్న పట్టణం. పాఠశాల విద్యను అక్కడే పూర్తి చేశాడు. ఏఐ అమీన్ కాలేజీలో బిజినెస్ మేనేజ్‌మెంట్ చదవడానికి 2010లో బెంగళూరులో అడుగుపెట్టాడు. ఒకపక్క చదువు కొనసాగిస్తూనే...ఏ రంగంలో స్టార్టప్ ప్రారంభిస్తే ఎలా ఉంటుందన్న సాధ్యాసాధ్యాలపై తన కజిన్‌తో కలిసి మార్కెట్ పరిస్థితులను అధ్యయనం చేశాడు. చివరికి ఒక ఐడియా దావూద్ మనసులో మెరిసింది.

యూరేకా

“మా అంకుల్ ఇంటి దగ్గర ఒక బ్యాటరీ స్టోర్ ఉండేది. ఎంతో కొంత జీతంతో ఆ షాపులో కొన్ని వారాల పాటు పని చేశాను. రిటైల్ మార్కెట్‌లోని బ్యాటరీ బిజినెస్ లోపాలు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. బ్యాటరీల గురించి అవగాహన ఉన్న వినియోగదారులు మోసపోయే అవకాశం చాలా తక్కువ. కానీ ఏమాత్రం వీటి గురించి పెద్దగా తెలియని వారు మాత్రం చాలా మోసపోతున్నారు. తప్పుడు బ్యాటరీలు, ధరల ట్యాంపరింగ్‌తో ఎన్నో మోసాలు, ఇబ్బందులున్నాయని అర్ధమైంది.

ఈ లోపాలు, సమస్యలు పరిష్కరిస్తే ఈ రంగంలో మంచి అవకాశముందని తెలుసుకున్నాను. కానీ నా దగ్గర తగిన నిధులు, వనరులు లేవు. అందుకే మొదట జస్ట్ డయల్‌లో రిజిస్టర్ చేసుకుని కస్టమర్లను సంపాదించుకున్నాను. తక్కువ పెట్టుబడితో స్టార్టప్ మొదలుపెట్టడానికి ఇదే సులువైన మార్గమని భావించాను. కానీ అది నా సొంత వ్యాపారం కాకపోవడంతో కస్టమర్లకు సరైన విధంగా, నేను అనుకున్నట్టుగా బిజినెస్ చేయలేకపోయాను. అందుకే వ్యాపార భాగస్వామ్యాన్ని వద్దనుకుని, నా బిజినెస్ ఐడియాను ఈ కామర్స్ బాట పట్టించాను.”

బుక్ మై బ్యాటరీ డాట్ కామ్...

వ్యాపారంలో సమర్థమైన పని తీరుకు....బుక్ మై బ్యాటరీ డాట్ కామ్ కు రెండు మోడల్స్ ఉన్నాయి. అవి దావూద్ మాటల్లోనే చెప్పాలంటే... 

  • ''తొలుత మొదలుపెట్టిన జస్ట్ డయల్ కాల్స్‌తో బిజినెస్ పెంచుకోవడం మొదటి మోడల్. కస్టమర్ల నుంచి ఆర్డర్లు స్వీకరించడం, ధరలపై మాట్లాడుకోవడం, వారిక్కావాల్సిన అడ్రస్‌లో డెలివరి చేయడం.
  • ఇక సెకండ్ మోడల్. ఇన్వర్టర్ బ్యాటరీలను వెబ్‌సైట్‌లోనే కస్టమర్ ఎంపిక చేసుకుంటాడు. బుకింగ్స్ ఖరారు చేస్తాడు. ఇక బుకింగ్ తర్వాత రెండు గంటల్లోనే వారు కోరుకున్న లోకేషన్‌లో, వారు కావాలనుకున్నసమయంలోనే బ్యాటరీలు, ఇన్వర్టర్లు అందజేయడం.
image


తన లక్ష్యాన్ని వడివడిగా చేరుకోవాలని దావూద్ నిశ్చయించుకున్నాడు. దేశవ్యాప్తంగా ముఖ్య నగరాల్లో తన వ్యాపారాన్ని విస్తరించాలని ప్రణాళికలు వేసుకున్నాడు. అయితే అశేష వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించడం, తాను లక్ష్యంగా నిర్దేశించుకున్న మార్కెట్ లో ఎక్కువమందిని చేరుకోవడం అంత సులభంగా కాదని భావించాడు. ఎందుకంటే ఎక్కువమంది ఆన్‌లైన్లో బ్యాటరీలు కొనడానికి ఇష్టపడరు. అయితే పెరుగుతున్న ఆన్‌లైన్ బూమ్ దావూద్‌లో కొత్త ఉత్సాహం నింపింది. తన వ్యాపారాన్ని కొత్త శిఖరాలకు చేర్చడానికి వేదికయ్యింది.

డెక్లథాన్, నోటరి మామ, మై కనెక్షన్ డాట్ కామ్ తదితర కంపెనీలతో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంది.... బుక్ మై బ్యాటరీ. ఎక్కువ మంది వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను అందించడంలో వీటిదే ఘనత. వెంచర్ మొత్తానికి దావూద్ ఒక్కడే నిధులు సమకూర్చుకున్నాడు. అయితే తన విస్తారమైన లక్ష్యాలు వాస్తవరూపం సంతరించుకోవడానికి పెట్టుబడుదారుల కోసం వెతుకుతున్నాడు....దావూద్.

ఓ భయానక వాస్తవం

పారిశ్రామికవేత్త కావాలని అనుకోవడం వేరు, వాస్తవంగా అలా అవడం వేరు. గొప్ప ఉద్యోగం గురించి బాల్యంలో చాలా ఊహలుంటాయి. కానీ పెద్దయ్యాక ఎత్తుపల్లాలు ఎదురవుతాయి. ఐడియాలు చాలా సులభం. వాటిని ఆచరణలో పెట్టడమే చాలా కష్టమంటాడు...దావూద్. తన ఇంటర్నెట్ బిల్లు కోసం డబ్బులు ఆదా చేయడానికి మద్యాహ్న భోజనం మానేయడమే కాదు ఎన్నో మైళ్లు నడుచుకుంటూనే వెళ్లానని...స్టార్టప్ కోసం ఎంత కష్టపడ్డాడో వివరిస్తున్నాడు.

“ఏదైనా వ్యాపారం మొదలుపెట్టే సమయంలో కంపెనీ ఎక్కువ మార్జిన్ తీసుకోవాలని, మిగతాది భాగస్వాములకు ఇచ్చేయాలని మనకు బిజినెస్ స్కూల్‌లో బోధిస్తారు. కానీ ఆ పద్ధతి విఫలమైంది. ఎందుకంటే నువ్వు పార్ట్‌నర్స్‌తో కొన్ని విషయాల్లో విభేదిస్తే...వారు కస్టమర్లకు వాగ్దానంలో చేసిన టైంలో వస్తువులను డెలివరి చేయరు. తర్వాత ఏదో ఒక విధంగా మొక్కుబడిగా ఆ పని పూర్తి చేస్తారు.

భవిష్యత్ ప్రణాళికలు

‘బ్యాటరీ, ఇన్వర్టర్ రంగంలో నెంబర్ వన్ గా నిలుస్తామన్న నమ్మకముంది. కస్టమర్లను చేరుకోవడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేశాం. ఇప్పుడు మాక్కావాల్సిందల్లా నిధులు. ఇండియన్ మార్కెట్లో బ్యాటరీ రంగంలో లాభాలు సంపాదించడానికి ఆసక్తి ఉన్న పెట్టుబడిదారుల కోసం అన్వేషిస్తున్నాం. భారతదేశ చరిత్రలో ఈ కామర్స్ లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన తరుణం.

దేశంలో ప్రతి ఇంట్లోనూ ఇన్వెర్టర్లను ఇన్‌స్టాల్ చేసి వెలుగులు నింపాలి. యూపీఎస్ బిజినెస్‌లో జీరో మార్జిన్‌కే స్టార్టప్‌లకు చేయూతనివ్వాలన్నది... దావూద్ కల. ఆశయం.

చివరగా నాదొక సలహా..

దావూద్ జాఫర్...తన తోటి యువ పారిశ్రామికవేత్తలకు ఒక దూకుడైన సలహా ఇస్తున్నాడు. “ నువ్వు సాహసోపేత నిర్ణయం తీసుకోకపోతే...బిజినెస్ నుంచి వైదొలగి హాయిగా ఉద్యోగం కొనసాగించు. పరిశ్రమలు స్థాపించడానికి అడుగుపెట్టడమంటే...నీ ఆలోచనను వాస్తవరూపంగా మార్చడానికి ఏదైనా చేయడానికి సిద్దపడటమే. ఏ పని మొదలుపెట్టేముందైనా ముందు ప్రణాళిక వేసుకో. మొదట నీ వినియోగదారులతో మాట్లాడు. నీ ప్రోడక్ట్ లేదా సర్వీస్ గురించి వారి ప్రతిస్పందన తెలుసుకుని దానికనుగుణంగా ప్రణాళిక వేసుకో’. చివరగా ఒక చక్కని మాటతో ముగించాడు.. దావూద్ జాఫర్. ‘ రూములో కూర్చుని కేవలం కలలు కనొద్దు. బయటికెళ్లి దాని సంగతేంటో చూడు.’

Website: BookMyBattery.com

Want to make your startup journey smooth? YS Education brings a comprehensive Funding and Startup Course. Learn from India's top investors and entrepreneurs. Click here to know more.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

Our Partner Events

Hustle across India