స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ మజాను తీర్చే 'ట్రాక్ ఇన్వెస్ట్'
స్టాక్ మార్కెట్లో ప్రవేశించాలనుకునేవారికి గుడ్ న్యూస్..ట్రాక్ ఇన్వెస్ట్ ద్వారా రియల్ టైం ట్రేడింగ్ అనుభవం..ఇంటర్న్‌షిప్ లతో ప్రతిభావంతులను తయారుచేస్తున్న ట్రాక్ ఇన్వెస్ట్..స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను నేరుగా గమనించే ఛాన్స్..
బాబీ భాటియా ఓ విచిత్రమైన విద్యార్థి. భారత్‌లో పుట్టిన ఈయన.. కువైట్ లో పెరిగారు. 16 ఏళ్ల వయసులో స్టాన్‌ఫోర్డ్‌లో యోగా స్కాలర్స్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత డ్యూక్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. 19 ఏళ్లకే కాలేజీ చదువును పూర్తి చేసారు. అంత చిన్న వయసులో డిగ్రీ పూర్తిచేయడం వల్లే అతను ఇవాళ ఎంతో ఉన్నత ఎత్తులో ఉన్నారు.
ఇదీ నా కెరీర్..
'' వ్యాపార రీత్యా అమెరికాలో రెండేళ్లపాటు గడిపాను. ఆ తర్వాత 1995లో హాంకాంగ్‌కు మకాం మార్చాను. 1998లో ఆసియాలో తొలి పరపతి ఫండ్ ఛేస్ క్యాపిటల్ పార్టనర్స్ ఏసియా (Chase Capital Partners Asia)లో మెంబర్ గా జాయినయ్యాను. ఇది జెపి మోర్గాన్ పార్ట్నర్స్ అనుబంధ విభాగం. ఇందులో భాగంగా ఆసియా ప్రాంతంలోని పలు దేశాల్లో పర్యటించడం, విధులు నిర్వర్తించడం గర్వంగా భావిస్తాను.
జెపి మోర్గాన్ పార్ట్నర్స్లో ఆరేళ్లు పనిచేసిన తర్వాత నాకు మరింత ఉన్నతమైన పదవి లభించింది. అదే AIGలో మేనేజింగ్ డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ ప్రిన్సిపల్ ఇన్వెస్ట్మెంట్స్.
కెరీర్ లో నాకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని ఎప్పటి నుంచో కలలుకన్నాను. అది నా DNAలోనే ఉందని భావిస్తాను. నా కెరీర్ ఆరంభంలోనే ఎంతో సీనియర్ల దగ్గర పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. అంతేకాక.. మా తల్లిదండ్రులతో కలిసి కువైట్ వెళ్లకముందు భారత్‌లోని అనేక రాష్ట్రాల్లో నివసించాను. ఆ తర్వాత అమెరికా వెళ్లాను.. అలా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల ఆచార వ్యవహారాల తెలుసుకోగలిగాను. వాటి ప్రభావం నాపై ఉంది. అవన్నీ నన్ను నేను మలుచుకునేందుకు ఎంతో ఉపయోగపడ్డాయి.
అలా ప్రయాణం...
చాలా ఏళ్లపాటు నేను వ్యాపారవేత్తలకు, కంపెనీలకు సలహాలిస్తూనే గడిపాను. నేను అందులో నిపుణుణ్ణి కాబట్టి అలాంటి సంస్థను కూడా సమర్థంగా నిర్వహించగలను అనిపించింది. అందుకే ఒకానొకదశలో ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి సొంతంగా కంపెనీ ప్రారంభించాలనుకున్నాను.
ట్రాక్ ఇన్వెస్ట్ (TrakInvest) పుట్టుక
నేను ఆర్థిక విభాగంలో ఉన్నందున దాని గురించి ఎక్కువగా చదువుతూ ఉండేవాడిని. ఇందుకోసం చాలా వేదికలపై ఎన్నో విషయాలను పంచుకున్నాను. ఒకస్థాయి వరకూ సమాచారం కోసం ఖర్చుచేయగలం.. కానీ అంతకుమించి ఖర్చుచేయడం అసాధ్యం. అది నాకు చాలా భాధాకరమైన విషయం. అదే నాలో ఆలోచనను రేకెత్తించింది. సమాచారమంతా ఒకే చోట లభ్యమయ్యేలా ఓ సాధనాన్ని ఎందుకు అభివృద్ధి చేయకూడదు ? అనిపించింది. ఖాతాదారులకు, విద్యార్థులకు సలహాలిచ్చేటప్పుడు వారి నుంచి కూడా ఈ సమస్య విన్నాను. నేను సలహాలిస్తున్న స్టూడెంట్స్ తరపున ఎంతో మందిని కలిశాను. వాళ్లు చేసిన పని, వాళ్ల పనితీరును చూపించి వాళ్లకు ఇంటర్న్‌షిప్‌కు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరాను.
అలా ట్రాక్ ఇన్వెస్ట్ (TrakInvest) నా మదిలో మొలిచింది. అప్పుడు ఇంకో ఆలోచన కూడా వచ్చింది. ఇలా సమాచారన్నిచ్చే వేదిక మాత్రమే కాకుండా వర్చువల్ గేమింగ్ ప్లాట్ ఫాం కూడా ఎందుకు స్థాపించకూడదు అనిపించింది. దీన్ని వినియోగిస్తూ వ్యాపారంతోపాటు స్కోర్స్ పెంచుకుంటే ఆసక్తిగా ఉంటుంది కదా అనే ఆలోచనా వచ్చింది. ప్రతిభావంతులను వెలికితీసే వేదికలా ట్రాక్ ఇన్వెస్ట్ పురుడు పోసుకుంది.
ట్రాక్ ఇన్వెస్ట్ అంటే ఏంటి ?
సమాజంపై పెట్టుబడి పెట్టడం తాజా మార్పు. ట్రాక్ ఇన్వెస్ట్ ఇలాంటిదే. సోషల్ మీడియాలోని మంచిని, అత్యున్నత వ్యాపారవేత్తలను కలుపుతుంది. ట్రాక్ ఇన్వెస్ట్ ద్వారా మీరు వ్యాపారం చేసుకోవచ్చు. అలాగే ప్రభావశీలురను గుర్తించవచ్చు.
మనం పనిచేస్తున్న రంగంలో మనమే బెస్ట్ అనుకోవడానికి వీల్లేదు. మనపైన ఎన్నో శక్తులు పనిచేస్తూ ఉంటాయి. అవే మన ఐడెంటిటీని నిర్దేశిస్తాయి. ఎంతో మంది వినియోగదారులు తమ విభాగంలోని కంపెనీల కోసం నిత్యం వెతుకుతూ ఉంటారు. సుమారు 12వేల వీక్లీ రిపోర్టులను మీరు ట్రాక్ ఇన్వెస్ట్లో చూడొచ్చు. ఇండియా, అమెరికా, సింగపూర్, హాంకాంగ్, చైనా, ఆస్ట్రేలియా మార్కెట్ల విస్తృత కవరేజ్ ఉంటుంది. ఈ సమాచారంతో వారు ఎంతో సులువుగా మార్కెట్లలో ట్రేడింగ్ ను చేయొచ్చు. నివల్ల కేవలం కొనడం, అమ్మడం విషయాలు మాత్రమే కాకుండా.. వాటివల్ల కలిగే లాభనష్టాలపై విజ్ఞానం కూడా లభిస్తుంది.”
నవంబర్ లో కొత్త యూజర్ ఇంటర్ ఫేస్
ప్రస్తుతం యూజర్లు వెబ్ సైట్ లో సైన్ అప్ కావాల్సి ఉంది. వెబ్ సైట్ ఉచితమే అయినా ఇన్విటేషన్ ఆధారంగానే లాగిన్ అయ్యే అవకాశం కల్పిస్తోంది. యువర్ స్టోరీ (YourStory) పాఠకులు మాత్రం నేరుగా లాగిన్ అయ్యే అవకాశం కల్పిస్తోంది ట్రాక్ ఇన్వెస్ట్. ఒకసారి లాగిన్ అయిన తర్వాత రియల్ టైమ్‌లో స్టాక్ మార్కెట్ అనుభవాన్ని కల్పిస్తుంది. అదే సమయంలో మీ స్నేహితులతో, వినియోగదారులతో మీ నెట్‌వర్క్‌ను షేర్ చేసుకునే అవకాశం కూడా ఉంది. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్న వారిపై ఇప్పుడు మేం దృష్టి పెట్టాం. దీన్ని వినియోగించడం ద్వారా స్టాక్ మార్కెట్లో కలుగుతున్న ఒడిదుడుకులను వారు తెలుసుకోవచ్చు. సత్తా ఉంటే కంపెనీలే వాళ్ల వెంటబడి మరీ తీసుకుంటాయి.
ఇక సాధారణ ప్రజలు కూడా మంచి ట్రేడర్లు అయ్యే అవకాశం ఉందని నేను నమ్ముతాను. వివిధ నేపధ్యాల నుంచి వచ్చిన ఎంతోమంది నేడు టాప్ ట్రేడర్లుగా ఎదుగుతున్నారు. దీన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. భారత్ కు చెందిన రోష్ని కంచన్ ఏటా 12 శాతం రిటర్నులు సాధిస్తోంది. ఆమె ఒక సాధారణ గృహిణి.
స్పార్క్ ల్యాబ్స్ కొరియా (Spark Labs Korea) తో పాటు మధ్య, తూర్పు ఆసియా, భారత్ కు చెందిన ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది వ్యక్తులు మా వెనుక ఉన్నారు. వచ్చే 24 నెలల్లో కనీసం పది లక్షల మంది యూజర్లను ఆకట్టుకోవాలనేది మా లక్ష్యం. అయితే మాలాంటి సీనియర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడం వల్లే మా లక్ష్యం నెరవేరుతుంది'' అంటూ ముగిస్తారు బాబీ భాటియా.