సంకలనాలు
Telugu

రైడ్ షేరింగ్ డొమైన్ లో దుమ్మురేపుతున్న హైదరాబాదీ ‘రైడ్ఇట్’

ashok patnaik
21st Feb 2016
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

కార్ పూలింగ్, ట్రాన్స్ పోర్ట్ మేనేజ్మెంట్ లాంటివి కార్పోరేట్ సెక్టార్ లో ఈ మధ్య బాగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. అయితే ఈ రంగంలో ప్రారంభమైన స్టార్టప్ లు ఏవీ సస్టేనబుల్ మోడల్ ను అందుకోలేక అర్థంతరంగా సేవలు నిలిపేసిన అనుభవాలే ఎక్కువ. ప్రపంచ వ్యాప్తంగా బ్లాబ్లా క్యాబ్ తప్పితే అంత పెద్ద సక్సెస్ అందుకున్న దాఖలాల్లేవు. కానీ ఇదే సెగ్మెంట్ లో ప్రవేశించిన మన హైదరాబాదీ స్టార్టప్ దుమ్మురేపుతోంది. ఏంజిల్ ఫండింగ్ అందుకొని ఆహా అనిపిస్తోంది.

“ఐదేళ్లక్రితం మేం మొదటిసారి కలసి నప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇంత విజయవంతం అవుతుందని అనుకోలేదు,” రాహుల్ జాకబ్

రాహుల్ రైడ్ఇట్ కి సీఈవో గా వ్యవహరిస్తున్నారు. ఆయన చెప్పిగ గణాంకాలు చూస్తే ఈ స్టార్టప్ ఈ స్థాయికి రాడానికి ఎంత కష్టపడిందనేది అర్థం అవుతుంది.

image


రైడ్ఇట్ పనితీరు

ఆలోచన అయితే ఐదేళ్ల క్రితం వచ్చినా, పూర్తిస్థాయి పైలట్ ప్రాజెక్ట్ రాడానికి దాదాపు రెండేళ్లు పట్టింది. మార్కెట్ రీసెర్చి దాదాపు ఏడాదిన్నర పట్టిదంటున్నారు రాహుల్. తాము పనిచేసే ఇన్ఫోసిన్ హైదరాబాద్ క్యాంపస్ ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఇది 2013 మాట. ఈ ప్రాజెక్టుని దాదాపు ఏడాది కాలం నడిపారు.

“నేను, మరో కో ఫౌండర్ జెనోవెవా గలార్జా ఇద్దరం 2014 డిసెంబర్ లో ఇన్ఫోసిస్ ఉద్యోగాలొదిలేశాం,” రాహుల్

అప్పటి నుంచి పూర్తిస్థాయిలో ఈ స్టార్టప్ పై పనిచేయడం ప్రారంభించారు. అన్ లిమిటెడ్ హైదరాబాద్ ఇంక్యుబేటర్ లో స్టార్టప్ కార్యనిర్వహణ చేపట్టింది. ఇప్పటికి 12,500 మంది రిజిస్టర్ యూజర్లున్నారు. దాదాపు 70 కంపెనీల నుంచి యూజర్ బేస్ ఉంది. దాదాపు రోజుకి 40 కొత్త కార్ పూల్స్ చేస్తోంది. ఇది సామాన్య విషయమైతే కాదు. ఈ టీంలో సభ్యుల మొత్తం ఎక్స్ పీరియన్స్ 29 ఏళ్లు. కార్ ఫ్రీ థర్స్ డే లో భాగస్వామ్యంగా ఉన్న ఈ సంస్థ, తెలంగాణ ప్రభుత్వంతో కలసి పనిచేస్తోంది. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసమే డిజైన్ చేసిన తమ సర్వీసు కిలోమీటర్ చార్జీ మూడున్నర రూపాయిలవుతుందని అంటున్నారు రాహుల్.

image


రైడ్ఇట్ టీం

రైడ్ ఇట్ లో ఆరుగురు సభ్యులున్నారు. రాహుల్ కో ఫౌండర్, సీఈవోగా వ్యవహరిస్తున్నారు. బిజినెస్ స్ట్రాటజీ చూసుకుంటున్నారు. తను 3ఏళ్లు ఇన్ఫోసిస్ లో పనిచేశారు. అనంతరం ఎడ్యు స్టార్టప్ ఈ థేమ్స్ ఆన్ లైన్ లో 2 ఏళ్లు పనిచేశారు. అక్కడ సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజర్ గా వ్యవహరించారు. జెన్ మరో కో ఫౌండర్. రైడ్ ఇట్ కి మాత్రమే ఉపయోగపడే సెర్చ్ అల్గారిథమ్ డిజైన్ చేశారు. స్పెయిన్ లో కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ డిగ్రీ పొందిన జెన్.. ఏఐ రీసెర్చ్, ఇన్నివేషన్ లో అనుభవం సంపాదించారు. 4ఏళ్లు ఇన్ఫోసిస్ లో పనిచేశారు. ఇన్ఫోసిస్ ల్యాబ్ తీసుకున్న మొదటి ఇంటర్నేషనల్ ఉద్యోగి ఆమెనే. నాలుగున్నర నెలల్లో టీం సంఖ్య 8 కి చేరింది. ముగ్గురు టెక్, ముగ్గురు బిజినెస్, మరో ఇద్దరు ఆపరేషన్స్ లో ఉన్నారు. రెడ్ బస్, వన్97, యాడ్ టెక్ ఇలా మూడు కంపెనీల్లో పనిచేసి టీం సభ్యుల ఎక్స్ పీరియన్స్ 16 ఏళ్లు కాగా, టైని ఓవల్, ఈథేమ్స్ లాంటి స్టార్టప్ లలో చేసిన బిజినెస్ డెవలప్ మెంట్ అనుభవం 13 ఏళ్లు. మొత్తం 29 ఏళ్ల ఎక్స్ పీరియన్స్ టీం అని రాహుల్ చెప్పుకొచ్చారు.

ఫండింగ్

ట్రాన్స్ పోర్ట్ డొమైన్ లో లక్ష పదివేల అమెరికన్ డాలర్ల ఇన్వెస్ట్ మెంట్ ఇందులోకి వచ్చింది. హైదరాబాద్ కి చెందిన ఓ ఆంట్రప్రెన్యూర్ ఈ మొత్తాన్ని ఏంజిల్ ఇన్వెస్ట్ మెంట్ గా సమకూర్చారు. ప్రస్తుతం రైడ్ ఇట్ ప్రమోషన్ కి దీన్ని ఉపయోగిస్తున్నారు. దీంతో పాటు ఆదాయ వనరులను సమకూర్చే పనిలో పడ్డారు.

image


సవాళ్లు,పోటీ దారులు

ఈ సెగ్మెంట్ లో ఫండింగ్ పొందడం పెద్ద సవాల్ . దాన్ని అధిగమించారు. ఇప్పుడు కార్ పూలింగ్ పై పూర్తి స్థాయి అవగాహన లేదు. ఉన్నవారు దాన్ని ఉపయోగించడానికి ముందుకు రావడం లేదు. ఇంత పెద్ద యూజర్ బేస్ ఉన్న తాము అతితక్కవ శాతం మందికే సేవలందిస్తున్నామన్నారు రాహుల్

“నూటికి నూరుశాతం కార్ పూలింగ్ చేయడమే మా ముందున్న పెద్ద సవాల్”- రాహుల్

తొందరలోనే దీన్ని అధిగమిస్తామని ఆయన అంటున్నారు. సాధారణంగా A పాయింట్ నుంచి D పాయింట్ కి వెళ్లాలంటే ముందగా A నుంచి B , B నుంచి C కి వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వత B,C పాయింట్ల వద్ద కలసిన వ్యక్తులతో కలసి Dకి చేరుకోవాలి. ఇందులో మార్పులేదు. మధ్యలో డ్రాప్ అయిన వారిని విడిచి Dకి చేరడమే తప్పితే వేరే మార్గం లేదు. ఇలా చేయడం వల్ల పూలింగ్ మరింత పెరుగుతుంది. ఇదే వీరి సక్సెస్ ఫార్ములా.

ఈ రంగంలో పోటీ బాగానే ఉన్నా తమలాంటి సస్టేనబుల్ మోడల్ లో ఎవరూ లేరనేది రాహుల్ అభిప్రాయం. కొత్తగా ఎంత మంది ట్రై చేసినా లాంగ్ రన్ లో కొనసాగడంలేదు కనక తమకి పోటీ లేదంటన్నారు. ఫండ్స్ ఉండటం ప్లస్ పాయింట్ అంటున్నారాయన.

భవిష్యత్ ప్రణాళికలు

హైదరాబాద్ సహా ఇతర మెట్రో నగరాలకు విస్తరిస్తామని రాహుల్ అంటున్నారు. ఇంటర్ కంపెనీ సర్వీసు కావడం ఆదాయానికి ఢోకా లేదు. ఇదే మోడల్ ని ఐటీ, ఇతర రంగాల్లో విస్తరించాలని చూస్తున్నారు. తమ మోడల్ అమలు చేయడానికి చాలా రీసెర్చీ చేశాం. భవిష్యత్ లో కూడా ప్రణాళికా బద్దంగానే ముందుకెళ్తాం. దీన్ని బ్రేక్ చేయనంత వరకూ విజయం సాధిస్తునే ఉంటామని ముగించారు రాహుల్.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags