జస్ట్ పిజా ఆర్డర్ ఇవ్వండి చాలు..మీ ఇంటిముందే చేసి వేడివేడిగా వడ్డిస్తాం..!!
హాట్ హాట్ పిజ్జాస్ అంటే ఇష్టపడని మోడ్రన్ పీపుల్ ఎవరుంటారు చెప్పండి..పిజ్జా హాట్ గా ఉన్నప్పుడు తినడంలో ఉండే మజాయే వేరు. కానీ ఇప్పుడు పిజ్జా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే డెలివరీ అయ్యేటప్పటికీ చల్లబడిపోతుంది. టేస్ట్ కూడా మారిపోతుంది. పొగలు కక్కుతూ ఉండే పిజ్జా తినాలంటే కొంచెం కష్టమైన పనే.. ఎంచక్కా.. వేడి వేడి పిజ్జాలు మన ఇంటి దగ్గరే చేసిస్తే ఎంత బావుంటుందో కదా.. సరిగ్గా ఇలాంటి కాన్సెప్ట్ తోనే దూసుకొచ్చింది సరికొత్త ఫుడ్ స్టార్టప్ రాకెట్ చెఫ్. హాట్ హాట్ పిజ్జాల్ని కస్టమర్స్ కి డోర్ స్టెప్స్ దగ్గరే అందిస్తూ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తోంది.
ఏమిటీ రాకెట్ చెఫ్..?
పుడ్ ఆన్ వీల్స్ కాన్సెప్ట్ గురించి వినే ఉంటారు కదా..అలాగే రాకెట్ చెఫ్ అనేది పిజ్జా వ్యాన్.కోరుకున్న ప్లేస్ కే వచ్చి హాట్ పిజ్జాలతో పాటు గరం సాండ్ విచ్ లను ప్రెష్ గా మీ ముంగిట్లోనే తయారు చేసి అందిస్తుంది. జియో లోకేషన్ ఆదారంగా పనిచేసే యాప్ తో లేదా కాల్ ద్వారా ఆర్డర్ చేస్తే చాలు రాకెట్ చెఫ్ మీ చెంతకే వచ్చి వేడి వేడిగా వడ్డిస్తుంది.జియో లోకేషన్ ద్వారా రియల్ టైమ్ ట్రాకింగ్ తో ఈ వ్యాన్ మీకు ఎంత దగ్గరగా ఉందో కూడా తెలుసుకోవచ్చు.
అలా వచ్చింది ఐడియా...
న్యూ ఢిల్లీ లోని పూసాఇన్ స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ..ఒబెరాయ్ స్కూల్ ఆప్ హోటల్ మేనేజ్ మెంట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన రామ్ నిధి వాసన్ రెండు దశాబ్దాల పాటు హోటల్ ఇండస్ట్రీలో ప్రసిద్ది చెందిన దిఒబెరాయ్,ది మానర్,సిట్రస్ హోటల్,వెస్టిన్ (హైదరాబాద్),మ్యారియట్ వంటి స్టార్ హోటల్లలో పనిచేసి చెఫ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.తన అనుభవాన్నంతా ఉపయోగించి కస్టమర్ కి బెస్ట్ ఫుడ్ తో పాటు క్వాలిటీ సర్వీస్ అందించాలని తపన పడుతూ ఉండేవాడు. ఓ రోజు రెస్టారెంట్లో లాగే కస్టమర్స్ కి ఇంటి దగ్గరే వేడి వేడిగా సర్వ్ చేస్తే ఇంకా బాగుటుంది కదా అనే ఐడియా వచ్చింది..అలా 2015 అక్టోబర్ లో గుర్గావ్ లో 70 లక్షల పెట్టుబడితో రాకెట్ చెఫ్ ప్రారంభ మైంది.
ప్రస్తుతం రాకెట్ చెఫ్ కి గుర్గావ్ లో నలుగురు ప్రోఫెషనల్ చెఫ్స్ తో పాటు మూడు వెహికిల్స్ ఉన్నాయి. ప్రతీ వ్యాన్ లో ఫుడ్ ని వేడిగా వేగంగా అందించేందుకు స్పెషల్ గా డిజైన్ చేసిన ఓవెన్స్ ఉన్నాయి. రోజుకి 60 నుంచి 70 పిజ్జాలు తయారుచేసే సామర్థ్యం వీటికి ఉంటుంది. వీటిని మేం 60 శాతం మార్జిన్ తో 500 రూపాయల మినిమం ఆర్డర్ తో సెర్వ్ చేస్తున్నారు.
రాకెట్ చెఫ్ కి మెయిన్ ఇన్వెస్ట్ మెంట్ పిజ్జా వ్యాన్. వెహికిల్, ఎక్విప్ మెంట్ మొత్తానికి కలుపుకొని ఆరు నుంచి ఏడు లక్షల వరకు ఖర్చవుతుంది. ఒక్క వ్యాన్ రోజుకి 3500 రూపాయల బిజినెస్ చేస్తే బ్రేక్ ఈవెన్ అయినట్టు లెక్క. పిజ్జా వ్యాన్ తో పాటు వీరు రెండు లక్షల ఖర్చయ్యే పిజ్జా కియోస్క్ ని కూడా డెవలెప్ చేశారు. ప్రస్తుతానికి రాకెట్ చెఫ్ 16 మంది ఉద్యోగులతో నడుస్తోంది.
"నెలకి 40 శాతం వృద్ది రేటుతో రాకెట్ చెఫ్ దూసుకుపోతోంది.రాబోయే రెండు మూడు ఏళ్లలో గుర్గావ్, డిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో 250 పిజ్జా వ్యాన్స్ తో 10 నుంచి 12 కోట్ల వరకూ ఆదాయం పెంచుకునే లక్ష్యం తో పనిచేస్తున్నాం"-రామ్ నిథి వాసన్
యువర్ స్టోరీ.కామ్ టేక్
నిజానికి మీల్స్ ఆన్ వీల్స్ అనేది అమెరికన్ కాన్సెప్ట్. 1800 సంవత్సవరంలో టెక్సాస్ నగరంలో చుక్వాగన్ తో మొదలైన ఈ ఫుడ్ ట్రక్ కాన్సెప్ట్ ఆ తర్వాత మెల్లగా ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడా, ప్రాన్స్ , మెక్సికో వంటి దేశాలకు విస్తరించి క్రమక్రమంగా పాపులార్టీ సంపాదించుకుంది. వరల్డ్ వైడ్ గా విస్తరించినప్పటికీ ఈ కాన్సెప్ట్ ఇండియాకి మాత్రం కొత్తే. ఇప్పుడిప్పుడే ప్రధాన నగరాల్లో ఈ ట్రెండ్ ఊపందుకుంటోంది. ఈ మధ్య కాలంలో జిప్సీ కిచెన్,స్పిట్ ఫైర్,బీబీక్యూ,దోశాప్లేస్ వంటి ఫుడ్ స్టార్టప్స్ బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో సేవలను ప్రారంభించి విభిన్న రుచులను అందిస్తూ ఫుడ్ లవర్స్ ను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇండియా బ్రాండ్ ఈక్విటీ పౌండేషన్ (ఐబీఈఎఫ్) అంచనాల ప్రకారం ఈ ఫుడ్ ట్రక్ మార్కెట్ విలువ 1.3 బిలియన్ డాలర్స్ ఏటా 20 శాతం వృద్ది రేటు ఉండే అవకాశముంది. అలాగే ఆర్గనైజ్డ్ ఫుడ్ బిజినెస్ వాటా 48 బిలియన్ డాలర్లు అయితే దానిలో ఫుడ్ డెలివరీ వాటా 15 బిలియన్ డాలర్లు. పైకి అంతా బాగానే కనిపిస్తున్నప్పటికీ 2015 లో ఈ ఫుడ్ ఇండస్ట్రీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. మొత్తం ఏడు ఫండింగ్ డీల్స్ లో ఏప్రిల్ ఒక్క నెలలోనే ఆహారరంగంలో 74 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. అయితే ఆగస్టులో ఇది ఐదు డీల్స్‌లో 19 మిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇక సెప్టెంబర్‌లో మరీ రెండు డీల్స్ కి పడిపోయాయి. డాజో ,స్ఫూన్ జాయ్ వంటి సంస్థలు ఆక్టోబర్ లోనే మూతబడ్డి షాకిచ్చాయి. టినీ ఔల్ కాస్ట్ కటింగ్ లో భాగంగా నాలుగు నగరాల్లో 300 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. మార్చిలోనే 110 మిలియన్ డాలర్ల ఫండ్ రైజ్ చేసిన ఫుడ్ పండా కూడా ఇటీవలే 300 మందిని ఉద్యోగులను నుంచి తొలగించింది.
ఇలాంటి పరిస్థితుల్లో రాకెట్ చెఫ్ ఇంటిదగ్గరే వేడి వేడిగా వడ్డించడమనే సరికొత్త కాన్సెప్ట్ తో కస్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తోంది మరి ఈ ఫార్ములా ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.
"రాకెట్ చెఫ్ అనేది కస్టమర్ కి బెస్ట్ ఫుడ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేందుకు ఇంటి దగ్గరే ప్రెష్ గా సెర్వె చేసేలా తయారు చేసిన సరికొత్త కాన్సెప్ట్. మేం సింపుల్ గా ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి రాలేదు. పిజ్జా తయారీ, డెలివరీలో సరికొత్త ఇకో సిస్టమ్ బిల్డ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం"-రామ్ నిథి