హెల్త్‌కేర్ ఫ్లిప్‌కార్ట్.. మేరా మెడికేర్‌

అది టెలివిజ‌న్‌లో అమీర్‌ఖాన్‌ 'స‌త్య‌మే వ‌జ‌య‌తే' ఫ‌స్ట్ సీజ‌న్ వ‌స్తున్న స‌మ‌యం. ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ గురించే దేశం మొత్తం చ‌ర్చ‌. కుల ర‌క్క‌సి, ఆరోగ్య‌రంగంలో అనారోగ్య వాతావ‌ర‌ణం, ఖాప్ పంచాయ‌త్, భ్రూణ హ‌త్య‌లు.. ఇలా ఆందోళ‌న రేకెత్తిస్తున్న అనేక అంశాల‌పై చ‌ర్చ జ‌రుగుతున్న‌ది.

2nd May 2015
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

ల‌క్ష‌ల‌మందిలాగే మ‌ధు గుప్తా కూడా 'స‌త్య‌మే వ‌జ‌య‌తే' వీక్షిస్తూ వైద్య రంగంలో జ‌రుగుతున్న అన్యాయాన్ని తెలుసుకుని షాక్ గురైంది. దేశంలో ఒక్క డాక్ట‌ర్ కూడా జ‌న‌రిక్ మందుల‌ను పేషంట్ల‌కు సూచించ‌క‌పోవ‌డం ఆమెను విస్మ‌యానికి గురిచేసింది. బ్రాండెడ్ మందుల‌తో పోలిస్తే జ‌న‌రిక్ మందుల ధ‌ర 40 నుంచి 60 శాతం వ‌ర‌కు త‌క్కువ‌గా ఉంటుంది. ఐతే అందులో ఉండే ఫార్ములా మాత్రం ఒక‌టే. పేషంట్‌పై పనిచేసే తీరు కూడా బ్రాండెడ్ మందుల‌తో స‌మానంగానే ఉంటుంది.

image


ఈ ప‌రిస్థితుల్లో మార్పు తీసుకువ‌చ్చే బాధ్య‌త‌ను త‌న‌పై వేసుకుంది మ‌ధు. ప్ర‌జ‌ల‌కు జ‌న‌రిక్ మందులు అంద‌జేసే అవ‌కాశాల‌పై చ‌ర్చించింది. త‌న భ‌ర్త పంక‌జ్‌తో క‌లిసి జ‌న‌రిక్ మందుల కోసం మేరా మెడికేర్‌. కామ్ పేరుతో ఓ ఈ కామ‌ర్స్ పోర్ట‌ల్‌ను ఏర్పాటు చేసింది. మేరా మెడికేర్‌కు ముందు మ‌ధు... ఒరాకిల్‌లో అసోసియేట్ క‌న్స‌ల్టెంట్‌గా రెండుళ్ల‌పాటు ప‌నిచేసింది. పంక‌జ్ వెకో ఇన్‌స్ట్రూమెంట్స్‌లో వివిధ విభాగాల్లో ప‌నిచేశారు. ఇద్ద‌రు అమెరికాలో ఉండేవారు. భార‌త్‌కు దూరంగానే ఉన్న‌ప్ప‌టికీ ఈ కంపెనీని ప్రారంభించ‌డానికి ఎలాంటి అవ‌రోధాలు ఎదురుకాకుండా చూసుకున్నారు. ప్ర‌స్తుతం వారికి 5 వేల మంది రిజిస్ట‌ర్డ్ క‌స్ట‌మ‌ర్స్ ఉన్నారు. 250కిపైగా ఫార్మ‌సీ నెట్‌వ‌ర్క్ ఉంది. ఈ కామ‌ర్స్ వ్యాపారాన్ని ప్రారంభించక‌ముందు ఈ రంగంపై వివిధ కోణాల్లో ప‌రిశోధ‌న జ‌రిపి 2014 జూలైలో ఈ వ్యాపారాన్ని మొద‌లుపెట్టారు. ఏ పేషెంట్ అయినా బ్రాండెడ్ మెడిసిన్‌ను కానీ జ‌న‌రిక్ మందుల‌ను కొనుగోలు చేసే వీలు ఉంటుంది. బ్రాండెడ్ మెడిసిన్ ధ‌ర కాస్త ఎక్కువైతే.. జ‌న‌రిక్ మందులు త‌క్కువ ధ‌ర‌కే ల‌భిస్తాయి. రెండు మందులూ పేషంట్‌పై స‌మాన‌మైన ప్ర‌భావ‌మే చూపుతాయి. ఈ కంపెనీ ప్ర‌స్తుతం ఢిల్లీ, నోయిడా, గుర్గావ్‌, బెంగ‌ళూరుల్లో ఉంది. ప్ర‌స్తుతానికి అతి కొద్ది మొత్తంతో వ్యాపారాన్ని ఆరంభించామ‌ని పంక‌జ్ చెప్తున్నారు.

'ఇప్ప‌టికైతే వ్యాపారాన్ని మా సొంత డ‌బ్బుల‌తోనే ప్రారంభించాం. త్వ‌ర‌లోనే మ‌రింత విస్త‌రించాల‌నుకుంటున్నాం. సంస్థ‌ను న‌డిపించేందుకు మా ద‌గ్గ‌రున్న నిధులు స‌రిపోతాయ‌ని భావిస్తున్నాం. వ్యాపారాన్ని విస్త‌రించేందుకు మాకు త‌ప్ప‌నిస‌రిగా నిధులు అవ‌స‌రం. గ‌త ఆరునెలల్లో ముగ్గురు పెట్టుబ‌డిదారుల నుంచి ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కానీ ఆ ఆఫ‌ర్ల‌ను మేం తిర‌స్క‌రించాం. స‌రైన స‌మ‌యంలో వారితో ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటున్నాం. కొనుగోలుదారులు, అమ్మకం దారుల‌కు మార్కెట్ ప్లేస్‌గా ఈ కంపెనీ ప‌నిచేస్తుంది' అని ఆయ‌న చెప్పారు. 

వ్యవ‌స్థాప‌కులు అమెరికాలో ఉన్న‌ప్పటికీ టీమ్‌ను మాత్రం ఇండియాలోనే ఏర్పాటు చేశారు. ప్ర‌స్తుతం స్కైప్ అప్లికేష‌న్ ద్వారా వీరు త‌మ ఉద్యోగుల‌తో సంబంధాలు నెరుపుతున్నారు. మేరా మెడికేర్‌కు న‌లుగురు ఫుల్‌టైమ్ ఉద్యోగులున్నారు. 40 మంది వివిధ ప్రాంతాల్లో ఇంట‌ర్న్‌గా ప‌నిచేస్తున్నారు. రెగ్యుల‌ర్ పేషంట్లు, హెల్త్‌కేర్ ప్రొఫెష‌న‌ల్స్‌కు స‌బ్‌స్క్రిప్ష‌న్ విధానంలో మందులను ఈ కంపెనీ అంద‌జేస్తుంది. ఇత‌రులు నేరుగా ఆన్‌లైన్‌లో ఇత‌ర ఈకామర్స్ సైట్ల‌లో కొనుగోలు చేసిన‌ట్టే మందుల‌ను కొనుక్కోవచ్చు. ఆర్డ‌ర్ ఇచ్చిన రెండు నుంచి నాలుగు గంట‌ల్లో మందుల‌ను డెలివ‌రీ చేస్తారు. హెల్త్‌కేర్ సెక్టార్‌లో ఫిప్‌కార్ట్ మాదిరిగా గుర్తింపు పొందాల‌న్న‌దే త‌మ ల‌క్ష్య‌మ‌ని పంక‌జ్ అంటున్నారు. వ‌చ్చే రెండేళ్ల‌లో దేశంలోని 25 మేజ‌ర్ సిటీస్‌లో వ్యాపారాన్ని విస్త‌రించాల‌ని మేరా మెడికేర్ యాజ‌మాన్యం భావిస్తున్న‌ది. ముంబై, హైద‌రాబాద్‌, పుణె, సూర‌త్‌, చెన్నై, జైపూర్ వంటి న‌గ‌రాల్లో బిజినెస్‌ను విస్త‌రించాల‌న ల‌క్ష్యంగా పెట్టుకున్న‌దీ కంపెనీ.

అవ‌కాశాలు పుష్క‌లం..

ఓ వైపు ఈ కామ‌ర్స్ రంగం రైజ్‌లో ఉన్న‌ప్ప‌టికీ హెల్త్‌కేర్ వ్యాపారం మాత్రం వృద్ధి చెందేందుకు ఇంకా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశాలున్నాయి. హెల్త్‌కార్ట్‌, మెడిడార్ట్‌, మెడిస్ట్ వంటి సంస్థ‌లు ఆన్‌లైన్‌లో హెల్త్‌కేర్ బిజినెస్‌ను ప్రారంభించిన‌ప్ప‌టికీ, దేశ జ‌నాభాను దృష్టిలోపెట్టుకుంటే ఈ రంగంలో ఎన్నో అవ‌కాశాలున్నాయి. కాగా, ప్ర‌జ‌ల‌కు స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కు జ‌న‌రిక్ మందులు అందివ్వాల‌న్న ల‌క్ష్యంతో వ్యాపారంలోకి అడుగుపెట్టిన మ‌ధు, పంక‌జ్‌లు త‌మ గ‌మ్యాన్ని చేరుకోవాల‌ని ఆశిద్దాం.

website

Want to make your startup journey smooth? YS Education brings a comprehensive Funding and Startup Course. Learn from India's top investors and entrepreneurs. Click here to know more.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

Our Partner Events

Hustle across India