ఫ్రీ టైంలో కోచింగ్ ఇప్పిస్తూ... కోడర్లకు ఆదాయాన్ని తెచ్చిపెడ్తున్న 'ప్రాక్టికల్ కోడింగ్'
ఆండ్రాయిడ్, iOS, వెబ్ లలో ఉపయోగించే యాప్స్ డెవలపింగ్, గేమ్ డిజైనింగ్ స్కిల్స్‌కు ఈ మధ్య డిమాండ్ ఎంతో పెరిగింది. దీంతో ప్రతి కార్నర్‌లో మొబైల్, వెబ్ బేస్డ్ స్టార్టప్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఫలితంగా ఇన్‌కమింగ్ ప్రాజెక్ట్స్ సంఖ్య గణనీయంగా పెరగడం డెవలపర్స్‌కు పెద్ద సర్‌ఫ్రైజ్‌గా అనిపించట్లేదు.
ఈ క్రమంలో … టెక్నికల్ నాలెడ్జ్ పెంచుకోవాలని అనుకుంటున్న వారికి తమ మెంటర్ బేస్డ్ కోడ్ లర్నింగ్ ప్లాట్‌ఫాం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రాక్టికల్ కోడింగ్ వ్యవస్థాపకులు విశ్వసిస్తున్నారు.
ప్రాక్టికల్ కోడింగ్‌లో వందకుపైగా మెంటర్స్ ఉన్నారు. వీరంతా క్వాలిటి ఇంజనీర్స్, సొంతంగా వ్యాపారాలు ప్రారంభించినవారు. పెద్ద పెద్ద MNCలలో పనిచేస్తున్నవారు, పూర్తి అనుభవం ఉన్న ఐటి ప్రొఫెషనల్స్ కూడా .
ప్రాక్టికల్ కోడింగ్ పుట్టుపూర్వోత్తరాలు
బసవరాజ్ హంపాలి … ఆండ్రాయిడ్ డెవలపర్, ఈడి టెక్ వెంచర్ – KanheriEdu.com వ్యవస్థాపకులు. Traffline లో కొన్ని రోజులపాటు ఆండ్రాయిడ్ డెవలపర్‌గా పనిచేశారు. ఆ సమయంలో, కోడింగ్ ఎక్స్‌పీరియన్స్ ఏ మాత్రం లేనివారు కోడింగ్ నేర్పిస్తున్నారని ఆయన అర్థం చేసుకున్నారు. దీంతో ఆయన ఆండ్రాయిడ్‌పై ఆసక్తి ఉన్న వారికి తానే నేర్పించడం మొదలెట్టారు. కొన్ని రోజుల తర్వాత ఇదే ఫుల్ టైమ్ జాబ్‌గా మార్చుకున్నారు.
వెబ్, IOS + ఆండ్రాయిడ్, గేమ్ డెవలప్‌మెంట్‌లో స్పెషలైస్డ్ మెంటర్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉందని తెల్సుకోవడంతో … ఆయనకు ప్రాక్టికల్ కోడింగ్ కాన్సెప్ట్ మదిలో మెదిలింది.
ఈ కంపెనీని బసవరాజ్, అతడి సోదరి సరోజ చూసుకుంటున్నారు. సరోజ … సొంతంగా కోడింగ్ నేర్చుకున్నారు. టెక్నాలజీ, టీచింగ్ అంటే ఆమెకెంతో ఇష్టం. ప్రాక్టికల్ కోడింగ్‌లో ప్రస్తుతం ఆమె కస్టమర్ కేర్, టెక్నాలజీలను చూసుకుంటున్నారు.
వండర్ వెంచర్
ప్రాక్టికల్ కోడింగ్ ఇచ్చే కోర్స్ కంటెంట్ మొత్తం ఒక క్రమ పద్ధతిలో, నిష్ణాతుల సారధ్యంలో తయారైంది. టైమ్ ప్రకారం మెంటర్స్ క్లాసులు తీసుకుంటూ ఉంటారు, దీనివల్ల అటు నేర్చుకునేవారికి, ఇటు నేర్పించేవారికి ఇద్దరికి సమయపాలన తెలుస్తుంది. ఎక్కువగా వీకెండ్స్‌లోనే క్లాసులు ఉంటాయి. అది కూడా గూగుల్ హ్యాంగౌట్స్ సాయంతో. అంతేకాదు .. ఈ స్టూడెంట్స్ వారి టీచర్స్‌కు రేటింగ్ కూడా ఇవ్వొచ్చు. ఇప్పటివరకూ ప్రతి మెంటర్‌కు స్కేల్ 10పై 9+ రేటింగ్సే వచ్చాయని బసవరాజ్ ఎంతో గర్వంగా చెబుతుంటారు. ఒకే సమయంలో ఒక టీచర్ ముగ్గురు విద్యార్థులకు పాఠాలు నేర్పిస్తుండడం విశేషం.
ఈ వెంచర్ లో చేరాలనుకునే మెంటర్స్ ఇంటర్వ్యూ తదితర పూర్తిస్తాయి స్క్రీనింగ్ ప్రాసెస్‌ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాక్టికల్ కోడింగ్‌లో … క్వాలిటి ఇంజనీర్స్, వ్యాపారులు, విద్యార్థులు ఇలా ఎన్నో రంగాలకు చెందిన వారు నేర్చుకోవడానికి వస్తుంటారు. ఈ వెంచర్ ప్రధాన ఉద్దేశం .. ప్రొఫెషనల్స్ అందరికీ చేతనైన సాయం చేయడమే. ఈ వెంచర్‌కు commonfloor.com సహ-వ్యవస్థాపకులు లలిత్ మంగళ్ అడ్వైజర్‌గా వ్యవహరిస్తున్నారు.
తమ ఈ ఐడియా పూర్తిస్థాయి ఫలితాలను ఇస్తుందని బసవరాజ్ నమ్ముతారు. ఇప్పటివరకూ అమెరికాలోని కోడ్ అకాడమీకి 24మిలియన్ యూజర్స్ ఉన్నారు.
“ ఒక పరిశీలన ప్రకారం, కోడింగ్ నేర్చుకున్నాక, 66% QA ఇంజనీర్స్‌కు ప్రస్తుతం వస్తున్న నెల జీతం కంటే రెండుమూడు రెట్లు ఎక్కువ సంపాదన లభిస్తోంది. కాబట్టి ఒక వైపు QA ఇంజనీర్స్‌గా పనిచేస్తూనే మార్కెట్లో ఉన్న లేటెస్ట్ కోడింగ్ స్కిల్స్‌ను నేర్చుకుంటే వారికెంతో ఉపయోగకరంగా ఉంటుంది. కోర్స్ పూర్తయ్యే సమయానికి వారు సొంతంగా ఒక ప్రొడక్ట్‌ను డెవలప్ చేయొచ్చు, దాన్ని యాప్ స్టోర్, వెబ్‌లలో మాత్రమే కాదు గిట్ హబ్‌లో కూడా పెట్టొచ్చు. దీనివల్ల వారి పనితనం అందరికీ తెలుస్తుంది, ఒక ఫ్రూవ్ కూడా ఉంటుంది ” అంటారు బసవరాజ్.
భవిష్యత్తు
ప్రాక్టికల్ కోడింగ్‌ను ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఈ మెంటర్ బేస్డ్ లర్నింగ్ మోడల్ రకరకాల కోర్సులకు ఉపయోగపడుతుంది. అంతెందుకు యోగా, సంగీతానికి కూడా. ప్రస్తుతం ఐటి బూమ్ ఎక్కువగా ఉన్న ఇండోనేషియా తదితర దేశాల్లో ఈ వెంచర్‌ను విస్తరించవచ్చు. అయితే, సరైన మెంటర్స్ దొరకడం, రన్నింగ్ మోడల్ ఏదో తెల్సుకోవడం, స్కేలింగ్ తదితర ఛాలెంజెస్ ఇంకా మిగిలే ఉన్నాయి.
ప్రస్తుతం ఈ టీమ్ మార్కెటింగ్‌ను పెంచుకోవాల్సి ఉంది. తద్వారా ఎక్కువమంది లర్నర్స్ ఈ వేదిక గురించి తెలుసుకుంటారు, ఇందులో చేరతారు. అంతేకాదు మంచి మంచి స్కిల్స్ ఉన్న మెంటర్స్‌ను ఆకర్షించడానికి, ఈ వెంచర్‌లో జాయిన్ చేయడానికి ఇదెంతో ఉపయోగపడుతుంది.
భవిష్యత్తు గురించి ఏం చేయాలో నిర్ణయించే ముందు అన్ని ఆప్షన్స్‌నూ ఎక్స్‌ప్లోర్ చేస్తానంటున్నారు బసవరాజ్.
“ప్రస్తుతానికి ఇది తొలి దశలోనే ఉంది, మున్ముందు కొత్త కొత్త వెంచర్స్ వస్తే ఈ మెంటర్ బేస్డ్ మోడల్ పై ఇంట్రెస్ట్ పెరుగుతుంది ,” అని బసవరాజ్ చెప్పారు. అయితే మెంటర్స్ క్వాలిటి, నేర్పించడంలో వారు చూపే శ్రద్ధ, ఆసక్తి … ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడుతుంది.