సినీ ప్రేమికుల సోషల్ నెట్వర్కింగ్‌ ప్లేస్ - ఫిల్మీస్పియర్

షార్ట్ ఫిల్మ్స్‌కు కెమెరాల అద్దెకు మొదలుపెద్ద సినిమాలు, స్టార్స్ మార్కెటింగ్ వరకూకన్నడతో మొదలుపెట్టి వివిధ భాషల్లో దూసుకుపోతున్న ఫిల్మీస్పియర్సినీ రంగంలోకి అడుగుపెట్టాలనుకునే వాళ్లకు టాలెంట్ పోర్టల్ఫిల్మీ దునియాలో అన్ని క్రాప్ట్స్‌ ఒకే చోటికి తెచ్చే యత్నం

5th Jul 2015
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

సినిమా మార్కెట్ అంత సులువుగా ఎవరికీ అర్థం కాదు. ఒకసారి అందులో మర్మం తెలిసాక అందులోని బిజినెస్ అంతా ఇంతా కాదు. వివిధ భాషలు, వందల చిత్రాలు, వాటికి మార్కెటింగ్, యాడ్స్.. ఇదే సమయంలో కొత్త టాలెంట్, తమని తాము నిరూపించుకునేందుకు ముందుకొచ్చే యువత.. అబ్బో.. ఈ ఇండస్ట్రీలో వ్యాపారానికి కొదవేం లేదు. సరైన పాయింట్‌ను టచ్‌ చేస్తూ.. సరైన ట్రాక్‌లో వెళ్లాలి కానీ.. మంచి ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఇది. సరిగ్గా దీన్నే క్యాష్ చేసుకుందో బెంగళూరు కంపెనీ. అదే ఫిల్మీ స్పియర్.

image


H.S. గణేష్ మొదటి వెంచర్ ఐడియా కార్వ్ టెక్నాలజీస్. అదో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, మార్కెటింగ్ సంస్థ. దాన్ని 2010లో ప్రారంభించారు. 2013లో కన్నడ స్టార్ గణేష్ (ఆశ్చర్యంగా.. హీరో పేరు.. ప్రమోటర్ పేరూ ఒక్కటే) నటించిన 'ఆటోరాజా' అనే కన్నడ సినిమా ప్రమోషన్‌ కాంట్రాక్ట్‌ వీళ్లకు దక్కింది. అప్పుడే గణేష్‌ మదిలో ఆలోచన మెదిలింది. తమ సినిమా ప్రమోషన్ కోసం ప్రొడ్యూసర్లు, సెల్ఫ్ ప్రమోషన్ కోసం సినీ స్టార్లు ఏ స్థాయిలో ఖర్చు చేస్తారో అర్థం చేసుకున్నారు. దీన్నే ఓ వ్యాపారవకాశంగా ఎందుకు మార్చుకోకూడదు అనుకున్నారు. అయితే ఇది పూర్తిగా తనకు ఏ మాత్రం అవగాహన లేని రంగం. అయినా సరే ధైర్యం చేసి సినిమా ప్రేమికులకు పర్ఫెక్ట్‌గా సూటయ్యే ఓ సామాజిక మాధ్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అదే ఫిల్మీ స్పియర్‌ ఏర్పాటుకు కారణమైంది.

గౌరీష్ అక్కి, గణేష్ - ఫిల్మీస్పియర్ వ్యవస్థాపకులు

గౌరీష్ అక్కి, గణేష్ - ఫిల్మీస్పియర్ వ్యవస్థాపకులు


ఫిల్మీ స్పియర్ అనేది ఫేస్ బుక్ సోషల్ గ్రాఫ్ ఆధారంగా మన ఫ్రెండ్స్ ఎవరెవరున్నారో గుర్తిస్తుంది. వాళ్లు ఏ సినిమాలు చూశారు, చూస్తున్నారు, వాళ్లకు ఇష్టమైన సెలబ్రిటీలు ఎవరు, రివ్యూలు వంటి విషయాలన్నింటినీ ఎనలైజ్ చేస్తుంది. దీంతో వాళ్ల రెకమెండేషన్‌ ఇతర స్నేహితులకు ఉపయోగపడ్తుంది. సదరు సినిమా ఎలా ఉంది, చూడొచ్చా.. లేదా అనేది అనుభవం ఉన్న స్నేహితుల ద్వారా తెలిసిపోతుంది. ఇదే కాదు ఫిల్మీస్పియర్స్ యూజర్స్ అంతా ఏం చెబ్తున్నారో కూడా అర్థం చేసుకుని ఓ నిర్ణయం తీసుకోవచ్చు.

ఇప్పుడు మార్కెట్లో వివిధ భాషల్లో ఉన్న సినిమాలు ఏవి, తర్వాతి వారాల్లో రిలీజ్ అయ్యే మూవీస్ ఏవి, సినిమా ప్రమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో ఏ ప్రోగ్రామ్స్ ఎప్పుడొస్తాయి అనే వివరాలన్నీ ఈ సైట్లో చూడొచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే సినిమా, ఎంటర్‌టైన్‌మెంట్ స్పేస్‌కి చెందిన వివరాలన్నీ ఒకే చోట గుదిగుచ్చి పెట్టిన వేదిక ఇది.

ఫిల్మీస్పియర్ ప్రారంభానికి ముందు గణేష్ ఎనిమిదేళ్ల పాటు వివిధ స్టార్టప్స్‌లో పనిచేశారు. కొద్దికాలం పాటు యాహూలో కూడా పనిచేసిన అనుభవముంది.

''నాకు కేవలం టెక్నాలజీ బ్యాక్ గ్రౌండ్ మాత్రమే ఉండడంతో అనుభవజ్ఞుడైన కోఫౌండర్ కోసం వెతికాను. పేజ్ త్రీ జర్నలిస్ట్ అయిన గౌరీష్‌ నాకు తారసపడ్డాడు''. 

నా ఆలోచనలు అతడిని ఒప్పించగలిగాయి. పదిహేను మీటింగ్స్ తర్వాత గౌరీష్ మా బోర్డ్‌లోకి వచ్చారు. వీళ్లతో పాటు గణేష్ తమ్ముడు రుద్రేష్ కూడా భాగస్వామి అయ్యారు.

ప్రారంభంలో ఫిల్మీస్పియర్ కన్నడ, తమిళ్, తెలుగు సినిమాల ఆడియన్స్‌కు ఫేస్ బుక్ ద్వారా కనెక్ట్ కావాలని నిర్ణయించుకుంది. వాళ్ల ఆలోచనలకు ఏ మాత్రం తీసిపోకుండా ప్రాజెక్ట్‌కు మంచి పేరొచ్చింది. ప్రారంభంలో దాదాపు 26 వేల ఫ్యాన్స్ ఫేస్‌బుక్‌లో జతయ్యారు. ప్రతీ వారం కనీసం లక్ష మంది మూవీ అభిమానులు ఈ సైట్‌ని వీక్షిస్తున్నారు. ప్రస్తుతం 46 వేల లైక్స్ ఫిల్మీస్పియర్‌కు ఉన్నాయి. మొదట్లో శాండల్‌వుడ్‌పై దృష్టిపెట్టిన కంపెనీ ఇప్పుడు తెలుగు, తమిళ్‌లోనూ తన సత్తా చాటుతోంది.

ఫిల్మీస్పియర్ ప్రధానంగా రెండు విభాగాలపై దృష్టిసారిస్తుంది. మొదటిది సినిమాలకు సంబంధించిన రెకమెండేషన్స్, రివ్యూస్, నెట్వర్క్ బిల్డప్. రెండోది తమ మార్కెట్ ప్లేస్ ద్వారా కొత్త ఆర్టిస్టులను సినిమా రంగానికి పరిచయం చేయడం. ప్రొడక్షన్ హౌజ్‌లు తమకు అవసరమైన ఉద్యోగాలను, ఆర్టిస్టులకు సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ పోస్ట్ చేయొచ్చు. టాలెంట్ ఉన్నవాళ్లు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని, జాబ్స్ వెతుక్కునే సౌలభ్యం ఉంది.

ఈ మధ్యే టాలెంట్ స్పియర్ పేరుతో మరో పోర్టల్‌ను దీనికి అనుబంధంగా మొదలుపెట్టారు. ఇక్కడ ఇండివిడ్యుయల్స్ తమను తాము ప్రమోట్ చేసుకోవచ్చు. తమ టాలెంట్‌ను బయటి ప్రపంచానికి తెలియజేయొచ్చు. నచ్చిన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వీళ్లను చూసి సెలక్ట్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఒకవేళ సినీ ఫీల్డ్‌లో ఇతర క్రాఫ్ట్స్‌లో ఉద్యోగం చేయాలన్నా, పనినేర్చుకోవాలన్నా కూడా ఈ సైట్ దారి చూపిస్తుంది. కొన్ని ప్రత్యేక కోర్సులను కూడా డిజైన్ చేయబోతున్నారు.

image


షార్ట్ ఫిల్మ్స్ తీయాలనుకునేవాళ్లకు సలహాలతో పాటు కెమెరాలను కూడా అద్దెకిస్తుంది ఫిల్మీస్పియర్. అయితే అంతా ఔట్‌సోర్స్‌డ్ కంటెంట్‌పై ఆధారపడకుండా ఇన్‌హౌస్ ప్రొడక్షన్‌పై కూడా కంపెనీ దృష్టి సారించింది. వివిధ ప్రాంతాలకు వెళ్లి ఫిల్మ్ సెలబ్రిటీల ఇంటర్వ్యూలు చేస్తారు. ఇందుకోసం ప్రొడక్షన్ హౌజ్‌లనూ ఏర్పాటు చేసింది.

ఫండింగ్

కంపెనీ ఏర్పాటైన అతికొద్దికాలంలోనే యూఎస్ బేస్డ్ ఇన్వెస్టర్ నుంచి ఫిల్మీస్పియర్‌కు ఫండింగ్ వచ్చింది. దాదాపు లక్ష డాలర్ల వరకూ నిధులు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఎవరు ఇన్వెస్ట్ చేశారు అనే విషయాన్ని మాత్రం ఫిల్మీస్పియర్ ధృవీకరించలేదు. ఏంజిల్ ఇన్వెస్టర్‌కు మూడు శాతం వాటా ఇచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

ఫిల్మిస్పియర్ టీం

ఫిల్మిస్పియర్ టీం


మొత్తానికి సినీ పరిశ్రమనంతటినీ ఒక వేదిక మీదికి తెచ్చే ప్రయత్నం చేస్తోంది ఫిల్మీస్పియర్. షార్ట్ ఫిల్మ్స్ నుంచి పెద్ద సినిమాల మార్కెటింగ్ వరకూ అనేక విభాగాల్లో తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. దక్షిణాది ప్రాంతీయ భాషల్లో విజయం సాధించాక మిగిలిన భాషలపై దృష్టిసారించాలని చూస్తోంది.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close
Report an issue
Authors

Related Tags

Our Partner Events

Hustle across India