Telugu

థింక్ డిఫరెంట్..! ఇన్వెస్ట్ స్మార్ట్..!! ఆర్ధిక స్వాగతం పలుకుతున్న కర్నాటక!

ఫిబ్రవరి 3 -5 వరకు బెంగళూరులో ఇన్వెస్ట్ కర్నాటక సమ్మిట్-స్టార్టప్స్ ను ప్రోత్సహించేందుకు కర్నాటక ప్రభుత్వ నిర్ణయం-

uday kiran
31st Jan 2016
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

దేశంలో ప్రస్తుతం స్టార్టప్ ల శకం నడుస్తోంది. వినూత్న ఆవిష్కరణలతో ముందుకొస్తున్న స్టార్టప్ లను ప్రోత్సహించేందుకు వివిధ రాష్ట్రాలు వాటికి ప్రోత్సహకాలు, రాయితీలు అందిస్తున్నాయి. అయితే దేశంలోనే తొలిసారిగా స్టార్టప్ ల కోసం ప్రత్యేక పాలసీని రూపొందించిన రాష్ట్రంగా కర్నాటక నిలిచింది. 

2015-2020 వరకు ఐదేళ్ల పాటు కొనసాగే ఈ విధానం స్టార్టప్ ల దూకుడు పెంచేందుకు ఎంతో ఉపయోగపడనుంది. స్టార్టప్ లకు అవసరమైన ప్రోత్సాహంతో పాటు నిధుల సమీకరణలో వాటికి సాయం చేసేందుకు కర్నాటక ప్రభుత్వం ఇన్వెస్ట్ కర్నాటక పేరుతో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది. థింక్ డిఫరెంట్, ఇన్వెస్ట్ స్మార్ట్ క్యాప్షన్ తో ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు బెంగళూరులో ఈ సదస్సు జరగనుంది. ఇన్వెస్ట్ కర్నాటక సమ్మిట్ నేపథ్యంలో కర్నాటక స్టార్టప్ పాలసీలో ముఖ్యాంశాలను తెలుసుకుందాం.

image


స్టార్టప్ పాలసీ 2016

-ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్ ఫ్రారంభానికి అనుకూలమైన వ్యవస్థ ఉన్న దేశాలకు సంబంధించి గ్లోబల్ స్టార్టప్ ఎకో సిస్టం ర్యాంకింగ్ రిపోర్ట్ 2015 -ప్రకారం బెంగళూరులో 3100 నుంచి 4900 వరకు టెక్ స్టార్టప్స్ పనిచేస్తున్నాయి.

-వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ టాప్ 20 లిస్టులో బెంగళూరు సెకండ్ ప్లేస్ లో ఉంది.

-2012లో 19వ స్థానంలో ఉన్న బెంగళూరు ప్రస్తుతం 15 ర్యాంకుకు చేరింది.

- భారత్ నుంచి గ్లోబల్ ఎకో సిస్టం ర్యాంకింగ్స్ లో స్థానం దక్కించుకున్న ఒకే ఒక్క సిటీ బెంగళూరు.

- ఐ4 పాలసీ (ఐటీ, ఐటీ ఎనేబుల్డ్ సెక్టార్, ఇన్నోవేషన్, ఇన్సెంటివ్ పాలసీ 2014-19) లో భాగంగా కొత్త ఆవిష్కరణల్ని ప్రోత్సహించేందుకు ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

- ఉపాధి కల్పన, హెల్త్ కేర్, ఎన్విరాన్ మెంట్ ఫ్రెండ్లీ టెక్నాలజీ డెవలప్ మెంట్ కు ప్రాధాన్యం.

కర్నాటక స్టార్టప్ పాలసీ ప్రకారం స్టార్టప్ అంటే?

-కంపెనీ నాలుగేళ్లకు ముందు ప్రారంభించినదై ఉండకూడదు

- కంపెనీ కర్నాటకలోనే రిజిస్టర్ అయి ఉండాలి.

- కంపెనీలోని 50శాతం ఉద్యోగులు కర్నాటకలోనే పనిచేస్తూ ఉండాలి.

-కంపెనీ రెవెన్యూ 50 కోట్లకు చేరుకున్న తర్వాత ప్రభుత్వ ప్రోత్సాహకాలు నిలిపివేస్తారు.

కర్నాటక స్టార్టప్ పాలసీ లక్ష్యాలు

1. ప్రపంచ స్థాయి స్టార్టప్ హబ్

-20,000 టెక్నాలజీ ఆధారిత స్టార్టప్స్ లకు ప్రోత్సహం

-కర్నాటకలో 6 వేల వస్తూత్పత్తి స్టార్టప్స్ ఏర్పాటు

-2000 కోట్ల రూపాయల నిధుల సమీకరణ

-సమాజహితం కోసం పనిచేసే 25 స్టార్టప్ ల ఏర్పాటు

2. న్యూ ఏజ్ ఇంక్యుబేషన్ నెట్ వర్క్ (NAIN)

-ప్రభుత్వం ఎంపిక చేసిన 50 కాలేజీల్లో స్టార్టప్ ప్రోగ్రాంను అమలుచేసి విద్యార్థుల ప్రాజెక్టుల పర్యవేక్షణ, ఒక్కో ప్రాజెక్టుకు రూ. 3 లక్షల రూపాయల ఆర్థికసాయం

-ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ఇంక్యుబేటర్ సెంటర్లలో శిక్షణ

-ప్రతి జిల్లాలోనూ ఎంట్రప్రెన్యూర్ షిప్ సెంటర్స్ ఏర్పాటు

3. రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ కు ప్రోత్సాహం

- మూడేళ్ల పాటు కళాశాలల స్థాయిలో టెక్నాలజీ బిజినెస్ ఇంక్యూబేటర్లకు సాయం

-పరిశ్రమలతో టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ల అనుసంధానం

- ఐఓటీ (ఇంటర్నెట్ ఆన్ థింగ్స్) , రోబోటిక్స్, త్రీడీ ప్రింటింగ్ ను లాభాదాయకంగా మార్చడం

4. వెంచర్ క్యాపిటల్ ఫండింగ్

-ఐడియా స్టేజ్ లో ఉన్న స్టార్టప్ లకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో నిధులు

-రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించనున్న పోర్టల్ ద్వారా ఆర్థికసాయం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం

- టీబీఐల ద్వారా గ్రాంట్ ఇన్ ఎయిడ్ అందజేత

5. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ లో ఇంక్యూబేషన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్

-జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఇంక్యుబేటర్ల భాగస్వామ్యం

- టెండర్ల ద్వారా భాగస్వాముల ఎంపిక

-న్యూ ఏజ్ ఇంక్యుబేటర్ నెట్ వర్క్ తో ఇంక్యుబేటర్ల అనుసంధానం

6. ఫండ్స్ ఆఫ్ ఫండ్స్

- వెంచర్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేందుకు నిధుల సమీకరణ

- ఏంజిల్ స్టేజ్ ఫండింగ్ కోసం నిధులు

-ఓపెన్ బిడ్డింగ్ ప్రాసెస్ ద్వారా ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ల ఎంపిక

7. సామాజిక ప్రభావం చూపే ఆవిష్కరణలు

- సామాజికరుగ్మతల్ని పారదోలే ఐదు కొత్త ఐడియాలను ఏటా ఎంపికచేయడం

8.స్టార్టప్ లకు మౌలిక సదుపాయలు

-గుర్తింపు పొందిన ఇంక్యుబేటర్లలోని స్టార్టప్ లు ప్రభుత్వం రూపొందించిన 7 నిబంధలకు సంబంధించి సెల్ఫ్ సర్టిఫికేషన్ ఫెసిలిటీ

-గవర్నమెంట్ స్టార్టప్ సెల్ ద్వారా నిధులు

విశ్లేషణ

యూత్ ప్రస్తుతం స్టార్టప్ మంత్రం జపిస్తోంది. ఎవరి నోట విన్నా స్టార్టప్ మాటే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో స్టార్టప్ లకు ప్రోత్సహించేందుకు కర్నాటక ప్రభుత్వం ప్లాన్ రెడీ చేసింది. ప్రస్తుతం దేశంలోని స్టార్టప్స్ లో మూడోవంతు కర్నాటకలోనే ఉన్నాయి. రాష్ట్రంలో వివిధ రంగాలకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీలన్నింటినీ ఒకే చోట చేర్చిన కర్నాటక ప్రభుత్వం స్టార్టప్ పాలసీని ప్రకటించింది. పబ్లిక్, ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ లో భాగంగా ఇంక్యుబేటర్ సెంటర్ల ఏర్పాటుతో పాటు కాలేజీ దశ నుంచే ఎంట్రప్రెన్యూర్ షిప్ స్కిల్స్ డెవలప్ చేయాలని డిసైడైంది. అయితే ప్రభుత్వం విధాన ప్రకటన చేసినా వెంచర్ క్యాపిటల్ ఫండ్ కోసం ఎంత నిధులివ్వనుందన్న అంశంపై స్పష్టత ఇవ్వలేదు.

వార్షిక ప్రాతిపదికన మార్కెటింగ్ కాస్ట్ లో 30శాతం వరకు రీయింబర్స్ చేసేందుకు ప్రభుత్వం ముందుకురావడం స్టార్టప్ లకు నిజంగా శుభవార్తే. కొత్త పాలసీ ప్రకారం రాష్ట్రంలోని స్టార్టప్స్ అన్నీ ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇంక్యుబేటర్ సెంటర్లలో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయిన స్టార్టప్ లకు మాత్రమే సర్వీస్ టాక్స్ బెనిఫిట్స్ రీయింబర్స్ చేస్తారు. ప్రస్తుతం 2 నుంచి 10 లక్షలుగా ఉన్న పేటెంట్ ఫైలింగ్ కాస్ట్ ను పేటెంట్ గ్రాంట్ అయిన వెంటనే రీయింబర్స్ చేయాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించేందుకు ఇంక్యుబేటర్ సెంటర్లలో 10శాతం సీట్లు మహిళలకు కేటాయించారు.

స్టార్టప్ పాలసీ ద్వారా 6 లక్షల మందికి ప్రత్యక్షంగా, 12 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. స్టార్టప్ లలో పనిచేసే ఉద్యోగుల్లో 50 శాతం మంది కర్నాటకలోనే పనిచేయాలన్నది నిబంధనను పాటించే స్టార్టప్ లకు మాత్రమే రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తారు.

“టెక్నాలజీ ఆధారిత విధానాల రూపకల్పనలో కర్నాటక ఎప్పుడూ ముందుంది. దేశ అవసరాలను తీర్చేలా కర్నాటక స్టార్టప్ లు పనిచేస్తాయి.”-ఆర్.వి. దేశ్ పాండే, భారీ, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి

వెంచర్ క్యాపిటలిస్టుల అభిప్రాయం

వెంచర్ క్యాపిటలిస్టులు స్టార్టప్ లకు ఎంతశాతం నిధులు అందించవచ్చన్న అంశంపై ప్రభుత్వ స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. ఇన్వెస్ట్ కర్నాటక సదస్సులో ప్రభుత్వం దీనిపై ప్రకటన చేసే అవకాశముంది.

“ఏ రాష్ట్ర ప్రభుత్వమైన సమర్థవంతమైన స్టార్టప్ పాలసీని రూపొందించినప్పుడే వాటి అభివృద్ధి సాధ్యమవుతుంది. ఆచరణ సాధ్యంకాని ప్రకటనలు చేయకూడదు. విధి విధానాలను ప్రకటించడంతో తమ పని అయిపోయిందనుకోకూడదు.”- వి. బాలకృష్ణన్ ఎక్స్ ఫినిటీ వెంచర్స్ ఫౌండర్

హెల్త్ కేర్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో సమస్యల్ని పరిష్కరించేలా స్టార్టప్ లు కొత్త ఆలోచనలతో ముందుకు రావాలన్నది కర్నాటక ఆకాంక్ష. వీటితో పాటు పర్యావరణహితమైన రోబోటిక్, త్రీడీ ప్రింటింగ్ లకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటోంది.

“ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ రంగాల్లో ఆశించిన స్థాయిలో స్టార్టప్ లు ఏర్పాటుకావడం లేదు. గత దశాబ్దకాలంలో ఐటీ సర్వీస్ ఇండస్ట్రీని ప్రోత్సహించినట్లే స్టార్టప్ పాలసీ కూడా ఉంటుందని ఆశిస్తున్నా.”- ఎస్.డి.శిబులాల్, ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ

యువర్ స్టోరీ టేక్

కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పటికే స్టార్టప్ లపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. కేరళ ప్రభుత్వం 5000 కోట్ల రూపాయల నిధుల సేకరణే లక్ష్యంగా కేరళ ఐటీ మిషన్ 2014లో పేరుతో స్టార్టప్ పాలసీ ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటుచేసి స్టార్టప్ లను ప్రోత్సహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ పార్క్ ను ప్రారంభించింది. గుజరాత్, కర్నాటకల్లో ఇప్పటికే స్టార్టప్ లు దూసుకుపోతున్నాయి. కర్నాటక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫండ్(KITVEN) రూపంలో కర్నాటక స్టార్టప్ లకు నిధులు అందిస్తుండగా..గుజరాత్ లో వెంచర్ ఫైనాన్స్ లిమిటెడ్ ఏడేళ్లుగా సేవలందిస్తున్నది.

ప్రభుత్వాలు రూపొందించిన ఏ పాలసీలు అయినా ఆశించిన స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించాలి. కర్నాటక ప్రభుత్వం కొత్త ఇంక్యుబేటర్ సెంటర్ల ఏర్పాటుకు టెండర్ల ద్వారా అవకాశం కల్పించాలనుకుంటోంది. అయితే ఈ ప్రక్రియలో పారదర్శకత పాటించడం అత్యంత కీలకం. దేశంలో స్టార్టప్ లు దూసుకుపోయేందుకు రూపొందించిన ఈ పాలసీ సమర్థంగా అమలైనప్పుడే పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులతో పాటు సమాజానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

కర్నాటక స్టార్టప్ పాలసీ 2015-2020

ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్ లకు అవసరమైన పెట్టుబడుల సమీకరణ కోసం కర్నాటక ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇన్వెస్ట్ కర్నాటక సమ్మిట్ లో యువర్ స్టోరీ కూడా భాగస్వామిగా ఉంది. ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు బెంగళూరులో జరగనున్న ఈ సదస్సులో పాల్గొనేందుకు http://investkarnataka2016.in ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు.

ఇన్వెస్ట్ కర్నాటక 2016 కోసం ప్రభుత్వం మొబైల్ అప్లికేషన్ ను రూపొందించింది. ఆండ్రాయిడ్ డివైజ్ లో ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags