ఇంటర్నెట్, జీపీఎస్ లేకుండానే క్యాబ్ బుకింగ్ చేసుకోండి..
ఒక్క క్లిక్‌తో సమీపంలో ఉన్న క్యాబ్‌ను బుక్ చేస్తున్న ఐజిగో
క్యాబ్ సర్వీస్ రంగంలో కొత్త కొత్త ఆవిష్కరణలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఓలా, ఉబర్ వంటి క్యాబ్ సర్వీసులు కేవలం ఆన్‌లైన్ ద్వారానే సేవలందిస్తూ వినియోగదారుల మనసు గెలుచుకుంటున్నాయి. ఇప్పుడు ఇప్పుడీ క్యాబ్ సర్వీసుల్లోనే మరో వినూత్న ఆవిష్కరణ జరిగింది. దానిపేరే ఐజిగో.
మనం ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ఏం చేస్తాం. యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేస్తాం. క్యాబ్ మన ఇంటికి సమీపంలోనే ఉంటేనే బుక్ అవుతుంది లేదంటే, వేచి చూడాల్సిందిగా సమాధానం వస్తుంది. అలాగే ఇంటర్నెట్ లేదా జీపీఎస్ ఉంటేనే క్యాబ్ సమీపంలో ఎక్కడ ఉందో తెలుసుకుంటాం. ఒకవేళ ఇంటర్నెట్ కానీ, జీపీఎస్‌కానీ లేని పక్షంలో మరో మార్గం చూసుకోవాల్సిందే. అలాంటి సమస్యలకు ఐజిగో చెక్ పెట్టింది. ఇంటర్నెట్, జీపీఎస్ సౌకర్యాలు లేకుండానే మన ఇంటికి సమీపంలో ఏ క్యాబ్ ఉందో ఇట్టే చెప్పేస్తోందీ ఐజిగో 1ట్యాప్ క్యాబ్ బుకింగ్ ఫీచర్.
ఐజిగో.. ఓ ట్రావెల్ సెర్చ్ ఇంజిన్. ఇప్పుడీ సంస్థ తాజాగా తమ సేవల్లోకి క్యాబ్ సర్వీస్ పేరిట ఓ ఫీచర్‌ను అందిస్తోంది. ఈ సంస్థ వెబ్‌సైట్‌లోని హోం స్క్రీన్‌పై ఉన్న 1ట్యాప్ క్యాబ్ బుకింగ్ ఫీచర్‌ను క్లిక్ చేసి ఈ సర్వీసును పొందొచ్చు. ప్రస్తుతం యాండ్రాయిడ్ వెర్షన్‌లో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంది. అయితే ఇంటర్నెట్ సౌకర్యం ఉండని ఎయిర్‌పోర్ట్స్, రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్‌లలో కూడా ఈ 1 ట్యాబ్ క్యాబ్ బుకింగ్ ఫీచర్ పనిచేస్తుందని నిర్వాహకులు చెప్తున్నారు.
‘‘ఒకే యాప్‌లో వివిధ రకాల క్యాబ్ సర్వీసుల యాప్‌లను ఓపెన్ చేయడం, ధర వ్యత్యాసాన్ని పరిశీలించడం, బుక్ చేయడం చాలా సమయంతో కూడుకున్న వ్యవహారం. ఇక ఇంటర్నెట్, జీపీఎస్ సిగ్నల్స్ వీక్‌గా ఉన్నప్పుడు పరిస్థితి మరింత చికాకు పరుస్తుంది. అలాంటి సమయంలో మా 1 ట్యాబ్ క్యాబ్ బుకింగ్స్ ఎంతో ఉపయోగపడుతుంది. హోం స్క్రీన్‌పై కనిపించే బటన్‌ను మూడు సెకన్లు నొక్కి పట్టడం ద్వారా సమీపంలో ఉన్న క్యాబ్‌ల వివరాలు తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్‌లో ఉన్న మరో గొప్పతనమేంటంటే ఇంటర్నెట్, జీపీఎస్ సౌకర్యం లేకపోయినా అది పనిచేస్తుంది’’ -రజనీష్ కుమార్
ఎలా పనిచేస్తుంది..
యూజర్ పీఎన్‌ఆర్ కన్ఫర్మేషన్, ఎస్ఎంఎస్ కాంబినేషన్ ద్వారా లోకేషన్‌ను పసిగట్టి ఈ ఫీచర్ సేవలందిస్తుందని నిర్వాహకులు చెప్తున్నారు. యూజర్ తన ప్రయాణాన్ని ప్రారంభించకముందు, అలాగే గమ్యస్థానానికి చేరుకోబోయే ముందు ఎక్కడున్నారో తెలియజేయాల్సిందిగా ఐజిగో అడుగుతుంది. అలా లొకేషన్‌ను గుర్తించి సేవలందిస్తుంది.
లాంచ్ అయినప్పటి నుంచి క్యాబ్ సర్వీసులకు మెగా అగ్రిగేటర్‌గా మారిపోయింది ఐజిగో. ఓలా, ట్యాక్సీ ఫర్ షూర్, జుగ్నూ వంటి క్యాబ్ సేవలను వారి యాప్ ద్వారా కాకుండా, తమ యాప్ ద్వారా సెర్చ్ చేసేందుకు, బుక్ చేసేందుకు ఈ ఐజిగో యూజర్లకు ఉపయోగపడుతుంది.
గత ఏడాది ఆగస్టులో ఇంటర్‌సిటీ క్యాబ్ అగ్రిగేటర్ రుటోగోను ఐజిగో సొంతం చేసుకుంది. అయితే ఎంత మొత్తానికి సొంతం చేసుకుందో వివరాలు మాత్రం అందుబాటులో లేవు. ఆరంభంలో కేవలం ఒకే నగరానికి పరిమితమైన ఐజిగో క్యాబ్ యాప్ సర్వీసులు, రుటోగోను సొంతం చేసుకున్న తర్వాత వివిధ నగరాలకు విస్తరించగలిగింది.
తమ వెబ్‌సైట్‌లో క్యూరేటెడ్ బడ్జెట్ హోటల్స్, ట్రావెల్ సెర్చ్ మార్కెట్ ప్లేస్ కోసం ఓ కొత్త మెటా సెర్చ్ సర్వీసును గత నవంబర్‌లో ప్రారంభించింది ఐజిగో. బడ్జెట్ ట్రావెలర్స్, బ్యాక్ ప్యాకర్స్ కమ్యూనిటీ ది ఇండియన్ బ్యాక్ ప్యాకర్స్‌ను కూడా కొంత మొత్తానికి ఈ సంస్థ గత ఏడాది సొంతం చేసుకుంది.
అలోక్ బాజ్‌పేయ్, రజనీష్ 2007లో ట్రావెల్ సెర్చ్ మార్కెట్ ప్లేస్ ఈ ఐజిగోను ప్రారంభించారు. తమ కంటెంట్, 25 వేల ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ట్రావెల్, హాస్పిటాలిటీ బిజినెస్ ద్వారా ద్వారా 80 మిలియన్ల ట్రావెలర్లను కనెక్ట్ చేస్తుంది. ఎస్‌ఏఐఎఫ్ పార్ట్‌నర్స్, మేక్ మై ట్రిప్, మైక్రోమాక్స్ వంటి సంస్థలు ఈ ఐజిగోలో పెట్టుబడులు పెట్టాయి. క్యాబ్ సర్వీసుల రంగంలో వినూత్న సేవలను అందిస్తున్న ఐజిగో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని యువర్‌స్టోరీ ఆశిస్తోంది.