బ్రిటన్ ఎకానమీని దాటేసిన ఇండియా

ఎంతకాలమో చెప్పలేమంటున్న ఎకానమిస్టులు

బ్రిటన్ ఎకానమీని దాటేసిన ఇండియా

Thursday December 22, 2016,

2 min Read

యునైటెడ్ కింగ్ డమ్ ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఎకానమీ కలిగిన కంట్రీ. అలాంటి దేశాన్ని అధిగమించింది మనదేశం. ఆశ్చర్యంగా ఉంది కదా. అవును. గత వందేళ్లలో మొదటిసారిగా దేశం ఈ అరుదైన ఘనత సాధించింది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ ఇప్పటిదాకా టాప్ ఫైవ్ ఎకానమీ దేశాలు. బ్రెగ్జిట్ పరాజయం తర్వాత ఇండియా బ్రిటన్ ఎకానమీని బీట్ చేసింది. గత ఏడాది కాలంగా పౌండ్ విలువ సుమారు 20 శాతం క్షీణించడమే దీనికి ప్రధాన కారణం. ఈ మాటలన్నది ఎవరో కాదు.. సాక్షాత్తూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరెణ్ రిజిజు తన ట్వీట్టర్లో తెలిపారు. మనదేశ జనాభా అధికంగా ఉండొచ్చుగాక కానీ అదే మనకు పెద్ద అడ్వాంటేజ్ అని ఆయన పేర్కొన్నారు.

ఈ లెక్కన ఫిబ్రవరికల్లా మనం చైనాను అధిగమిస్తాం. ఇంకో విషయం ఏంటంటే 2017లో మన జీడీపీ రేటు 7.6 అవుతుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఫారిన్ పాలసీ నివేదిక ఏం తెలిపిందంటే.. 2016లో బ్రిటన్ ఎకానమీ 1.8 శాతం పెరుగుతుందని.. దాంతోపాటు 2017లో 1.1 శాతం పడిపోతుందని చెప్పింది.

image


ఈ ఏడాది జూన్ లో యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమించిన కారణంగా ఆ దేశం ఆర్ధికంగా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంది. అది భారత్ కు అనకూలమైంది. ఇండియన్ ఎకానమీ క్రమంగా పుంజుకోడానికి ఇదే కారణం. మరోవైపు గ్లోబల్ కమోడిటీస్ దిగిరావడం, మంచి వర్షపాతం నమోదవడం, చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలివ్వడం.. మొదలైన కారణాలు దేశం ఆర్ధికంగా ఎదగడానికి దోహదపడ్డాయి.

ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. 18వ శతాబ్దంలో భారతదేశంలో వచ్చిన పారిశ్రామిక విప్లవం మూలంగా బ్రిటన్ ఎదుగుదల గణనీయంగా పడిపోయింది. ఆ సమయంలో భారత్- బ్రిటన్ ఎకానమీ దాదాపు సమానంగా నడిచింది. 1991 తర్వాత నుంచి నేటిదాకా మార్కెట్ సంస్కరణలు పక్కాగా ఇంప్లిమెంట్ అవుతుండటంతో దేశ ఆర్ధిక వ్యవస్థ గాడిలో పడింది. అలా పుంజుకున్న ఇండియన్ ఎకానమీ నేడు యూకేను దాటేసింది. అలాగని చెప్పి గొప్పగా అనుకోడానికి వీల్లేదు. రెండు దేశాల మధ్య పర్ కేపిటల్ లెవర్ స్వల్ప తేడాలోనే ఉంది.

ఇది మూడు రోజుల మురిపెంగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. డిమానిటైజేషన్ మూలంగా ఈ గ్రోత్ ఎంతకాలం సస్టెయిన్ అవుతుందో చెప్పలేమని ఎకానమిస్టులు అభిప్రాయ పడుతున్నారు.