విలక్షణ వెంచర్ కేపటలిస్ట్ సుమేర్ జునేజా
స్విగ్గీలో పెట్టుబడులు పెట్టిన సుమేర్పెట్టుబడుల రంగంలో కీలక అనుభవంప్రతి అంశాన్ని క్షణ్ణంగా అధ్యయనం చేసే సుమేర్అనలిస్ట్ నుంచి వెంచర్ కేపటలిస్ట్ గా మారిన సుమేర్
‘ పెట్టుబడి లేదు.. లాభమూ లేదు’ అనే శీర్షికన పలు పెట్టుబడిదారుల స్టోరీలను మీ ముందుకు తీసుకురాదలిచాం. ఈ స్టోరీల్లో కొన్ని అధికారికం.. మరికొన్ని అనధికారికం. వారి ఆర్థిక ప్రణాళికలు, వారు క్లిక్ కావడానికి దోహదపడిన అంశాలు ఉందులో ఉంటాయి. ఈ సిరీస్ లో మొదటగా నార్వెస్ట్ వెంచర్ పార్ట్ నర్స్ (Norwest Venture Partners) అధినేత సుమేర్ జునేజా (Sumer Juneja) గురించి తెలుసుకుందాం.
అనుకోని పెట్టుబడిదారుడు
పెట్టుబడిదారులకోసం భారతీయ స్టార్టప్ కంపెనీలు పెద్దఎత్తున ఎదురుచూస్తున్నాయి. కేవలం పారిశ్రామిక వేత్తలకోసం మాత్రమే కాదు, పెట్టుబడిదారులు, వెంచర్ కేపిటలిస్టులకోసం కూడా..! ఒక పెట్టుబడిదారుడు ఓ కంపెనీలో బోర్డు మెంబర్ గా జాయిన్ అవుతున్నారంటే కేవలం డబ్బు మాత్రమే ప్రాధాన్యం కాదు.. అతని వ్యాపార దృక్పథం, సంస్థకు ఉపయోగపడే అతని పరిచయాలు లాంటివి కూడా ముఖ్యమే.. “ వెంచర్ కేపటలిస్టుగా నువ్వు నిత్యం ఒక పారిశ్రామికవేత్తగా పరుగెడుతూనే ఉండాలి. మార్కెట్ పల్స్ తెలిసి ఉండాలి. ఆర్మ్-ఛైర్ లో కూర్చుని అన్నీ నువ్వు అనుకున్నట్టు జరుగుతాయనుకుంటే పొరపాటే” అంటారు కాఫీ తాగుతూ సుమేర్ జునేజా. పలు భారతీయ ఈక్విటీ కంపెనీలకు సుమేర్ సలహాదారుగా పనిచేశారు. పదేళ్లపాటు పెట్టుబడుల రంగంలో పనిచేసిన తర్వాత ఆయన Goldman Sachsలో ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ అనలిస్టుగా పనిచేశారు. ఆ తర్వాత నార్వెస్ట్ ఇండియాలో ప్రిన్సిపాల్ గా జాయిన్ అయ్యారు. అయితే సుమేర్ బిజినెస్ డీల్స్ చేయడంలో దిట్ట అనేది పారిశ్రామికవేత్తలు ముక్తకంఠంతో చెప్పే మాట. అందుకే ఆయన గురించి తెలుసుకోవడం నిత్యం ఆసక్తి కలిగిస్తుంది.
అందరి వెంచర్ కేపటలిస్టులా కాదు..
సుమేర్ అందరి వెంచర్ కేపటలిస్టులా కాదు.. అతను అందరు పారిశ్రామిక వేత్తల్లాగే పరుగెత్తుతూ ఉంటారు.
ఉదాహరణకు స్విగ్గీ (Swiggy) డీల్ తీసుకుందాం.. పెద్దఎత్తున కాంపిటీషన్ ఉండడంతో సుమేర్ దాదాపు ఆ పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే దీన్ని ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో వారం రోజులపాటు బెంగళూరులో మకా వేసి (వాస్తవానికి సుమేర్ ముంబైలో నివాసముంటారు) ఈ డీల్ ను పూర్తి చేశారు.
“ఈ రంగంలోకి ప్రవేశించే ముందు దీనిపై చాలానే స్టడీ చేశాం. దేశవ్యాప్తంగా పర్యటించి వంటకాలను పరిశీలించాం.. వాటిని టేస్ట్ చేశాం. టెక్నాలజీ జోడించి తయారు చేస్తున్న వంటకాలను బేరీజు వేశాం” అన్నారు సుమేర్.
“ నా కడుపు నిండినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది” అన్నారు నవ్వుతూ.. “ డిసెంబర్ లో మేము స్విగ్గీ టీంను కలిశాం. జనవరి, ఫిబ్రవరిలో మరో రెండు సార్లు కూర్చున్నాం. వాళ్లతో సంబంధాలు కొనసాగిస్తూ ఉండడంతో వాళ్లతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాం”
ఫుడ్ టెక్నాలజీ.. చాలా ఆసక్తికరమైన అంశం
పది నెలలుగా మేం దీనిపై పని చేస్తున్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే.. ఫుడ్ టెక్నాలజీ సెగ్మెంట్ చాలా మంది పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. నార్వెస్ట్ లో ఉన్నప్పుడు సుమేర్ ఫుడ్ సెగ్మెంట్ ను చాలా ఆసక్తిగా పరిశీలించేవారు. ఇంటర్నెట్ ఇన్వెస్ట్ మెంట్ లో అప్పటికే అనుభవం ఉండడంతో ఈ సెగ్మెంట్ లో ప్రవేశించడానికి సుమేర్ కు పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు.
“బ్యాంకాక్, సింగపూర్ లాంటి ప్రదేశాల్లో రోజూ రెండు పూట్ల బయటే తింటారు. అమెరికా, చైనాలలో మార్కెట్లు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. భారత్ లో ప్రజలు ఇప్పుడిప్పుడే ఎక్కువగా బయట భోంచేస్తున్నారు. ఈ పద్ధతి ఇక ముందు కూడా కొనసాగుతుంది ఎందుకంటే ఆదాయం పెరుగుతోంది కాబట్టి. ఇది వినియోగదారుడిని చాలా సంతృప్తికి గురిచేస్తోంది” అని చెప్పారు సుమేర్.
ఫుడ్ టెక్నాలజీ సెగ్మెంట్ ను కింది విభాగాలుగా విభజించవచ్చు..
1. అగ్రిగేషన్
2. అగ్రిగేషన్ విత్ డెలివరీ
3. రెస్టారెంట్ ఇన్ ది క్లౌడ్
సుమేర్ ప్రకారం వినియోగదారుడు ఎంత మంచి ఆహారం అందుబాటులో ఉంది.. అది ఎంత వేగంగా అందించగలుగుతారు అనే అంశాలనే చూస్తాడు. స్విగ్గీ ఈ అంశాల్లో చాలా కచ్చితంగా వ్యవహరిస్తున్నట్టు అతనికి అనిపించింది. నాణ్యమైన ఆహారం అందించే రెస్టారెంట్లు మాత్రమే ఇందులో నెగ్గుతాయని.. లేకుంటే వెనుకబడిపోవడం ఖాయమని ముందే ఊహించారు. “ రాబోయే ఒకటి రెండేళ్లలో వివిధ విభాగాల్లో ఫుడ్ డెలివరీ విభాగం బిలియన్ డాలర్లకు చేరుతుందని మా అంచనా” అన్నారు సుమేర్. “ స్విగ్గీలో పెట్టుబడులు పెట్టే ముందు మేము సుమారు 30 కంపెనీలను సంప్రదించాం. ఇందులో పెట్టుబడులు పెట్టిన తర్వాత చాలా కంపెనీలు ఈ రంగంలోకి ప్రవేశించి తమకు గట్టిపోటీ ఇస్తాయని ఊహించాం”
స్టార్టప్ చేయని పెట్టుబడిదారుడు
సుమేర్ ముందు పారిశ్రామికవేత్త కాదు కానీ అలా ఎదగాలనే ఆలోచన మాత్రం అందరు పెట్టుబడిదారులకు ఉండడం సహజం. “పలు కంపెనీలను ఏకతాటిపైకి తీసుకురాగలగడం నాకు తెలుసు. అవి చాలా వేగంగా వృద్ధి చెందుతున్నాయి. వచ్చే ఏడాది కొత్తగా ఏంచేయాలి అని ఆలోచిస్తున్నాయి. నిత్యం మనం మూలాలను గుర్తు పెట్టుకోవాలి. కంపెనీ అభివృద్ధితో పాటు యూనిట్ విలువను కూడా లెక్కిస్తూ ఉండాలి. ఆ నెంబర్స్ తో నువ్వు సంతృప్తి చెందితే.. ( వృద్ధి రేటు, ఆదాయం, వ్యయం, నగదు లభ్యత లాంటివి) చివరకు అంతకంటే నీకు కావల్సిందేముంటుంది..?”
స్టార్టప్ కంపెనీలలో సీఈవో పాత్ర కంపెనీ చాలా కీలకం. అతని సామర్థ్యాన్ని బట్టే కంపెనీ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. కంపెనీ పనితీరుపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించకుండా రేపేంటి అని ఆలోచించినప్పుడే కంపెనీ ఎదుగుదల ఉంటుంది. కంపెనీకి సంబంధించిన సమస్త సమచారాన్ని బేరీజు వేసుకునేలా సీఈవో దగ్గర నిత్యం డేటా ఉండాలి. దాన్నుంచి ఎప్పటికప్పుడు పనితీరును మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. తొలిసారి సీఈవోగా బాధ్యతలు చేపట్టినప్పుడు, కంపెనీలో భాగస్వామి అయినప్పుడు సుమేర్ ఇవన్నీ కచ్చితంగా ఆచరించి చూపాడు.
స్విగ్గీ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన శ్రీహర్ష మాజేటిని అడిగినప్పుడు సుమేర్ పనితీరు చాలా డైనమిక్ గా ఉంటుందని చెప్పారు.
అప్పటికే పెద్ద విజయాన్ని అందుకున్న స్విగ్గీ.. సుమేర్ ఎంటరైన తర్వాత దాని స్వరూపమే మారిపోయింది. రెస్టారెంట్లు, పెట్టుబడిదారులు, సిబ్బంది నియామకం.. ఇలా ఒకటేంటి.. అన్నీ చకచకా జరిగిపోయాయి. ఫుడ్ టెక్నాలజీని చాలా నిశితంగా గమనించాడాయన. వాటిని ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవడం ద్వారా భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ముందే క్లారిటీకి వచ్చాడు.
సూక్ష్మస్థాయి పరిశీలన
నార్వెస్ట్ లో సుమేరా ఆరేళ్లపాటు చాలా నేర్చుకున్నాడు. అప్పుడే భారత్ లో స్టార్టప్ కంపెనీలకు దివ్యమైన భవిష్యత్ ఉందని అంచనాకు వచ్చాడు.. అవి చాలా కీలకపాత్ర పోషించబోతున్నట్టు ఊహించాడు. “ సూక్ష్మస్థాయిలో పరిశీలించినప్పుడు భారత్ లో వాటికి తిరుగులేదనిపించింది. మొబైల్ యూజర్లు, తలసరి ఆదాయం, గృహ వినియోగం, మధ్య తరగతి జనాభా.. ఇలా ప్రతి ఒక్కరూ ఎదుగుతున్నారు. అందుకే భారత్ స్టార్టప్ లలో పెట్టుబడి పెట్టాలనుకున్నా. కానీ మైక్రో లెవలే అతి పెద్ద సవాల్. ఉదాహరణకు ముంబైలో ఓ రెస్టారెంట్ ప్రారంభించాలనుకుంటే 20కి పైగా అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా లేకపోవడంతో డెలివరీ బాయ్స్ గమ్యస్థానాన్ని చేరుకోవడానికి ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.”
ఆరంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే వృద్ధి చెందుతున్నకొద్దీ ఆ కష్టం నుంచి మంచి ఫలితాలు రావడం ఖాయం. మార్కెట్లో మంచి ఫలితాలు రాబట్టడానికి మించి ఆశించేదేముంది.. మన పని మనం చేసుకుపోవడం తప్పా..! కిందిస్థాయిలో చాలా అద్భుతంగా పనిచేసిన చాలా మంది పారిశ్రామిక వేత్తలను సుమేర్ దగ్గరగా చూశాడు. చాలా తక్కువ సమయంలోనే సుమేర్ పెట్టుబడి విధానం టీమ్ లో చాలా మందికి అర్థమైంది. సింపుల్‌గా చెప్పాలంటే అతనో ప్రణాళిక వెనుకున్న పెద్ద మనిషి.
సుమేర్ చాలా నెమ్మదస్తుడు.. ప్రతీ పెట్టుబడి నుంచి ఆయన ఎంతో నేర్చుకుంటాడు.
పారిశ్రామికవేత్తలు కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తుంటారు. అయితే వాటి నుంచి ఏం నేర్చుకున్నామనేదానిపైనే వాళ్లు దృష్టి పెడతారు. ప్రస్తుతం అన్నీ సక్రమంగానే నడుస్తున్నాయి. అయితే ఇంతటితోనే అంతా అయిపోయిందనుకుంటే పొరపాటే.. ఇంకా సమగ్రరూపానికి రాలేదు.
ప్రారంభించడంతోనే సరిపోదు
అన్నిటికీ మించి మిగిలినవాళ్లతో పోల్చినప్పుడు సుమేర్ లో గమనించిందేంటంటే ఆయనో మంచి మానవతావాది. (అతనితో కలిసి కాఫీ తాగినప్పుడు నాకు కూడా ఆ విషయం అర్థమైంది). స్మార్ట్ గా ఉంటే సరిపోదు. అందరూ మనతో పని చేసేందుకు ఆసక్తి చూపించాలి.. మంచి మనిషిగా గుర్తింపు పొందాలి.
ఈ స్టోరీకోసం నేను చాలా సంప్రదించా.. సుమేర్ పైన కథనం రాస్తున్నానని చెప్పినప్పుడు అందరూ చాలా ఆసక్తి చూపించారు. సుమేర్ కేవలం బోర్డ్ రూమ్ లో వెంచర్ కేపటలిస్ట్ మాత్రమే కాదు.. పబ్బులో బీర్ తాగే స్నేహితుడు కూడా...!!