ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్‌లో వినూత్న ఒరవడి!
ఒక ఐడియా సక్సెస్ కావాలంటే.. ఒక ప్రాజెక్ట్ పర్ఫెక్ట్గా కంప్లీట్ అవ్వాలంటే.. దానిమీద పని చేస్తున్న నలుగురి మధ్య కోఆర్డినేషన్ ఉండాలి. ఎవరు ఏం చేస్తున్నారు? ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంటి? లాంటి విషయాలపై దానిమీద పనిచేస్తున్న వారు అప్డేట్గా ఉండాలి. మామూలుగా ఏ కంపెనీలో అయినా.. ప్రతీ ప్రాజెక్ట్‌లోనూ ఇది జరుగుతుంది. కానీ.. ఒక్కొ అవసరానికి ఒక్కొక్క అప్లికేషన్ వాడటం.. దాని గురించిన లాగిన్ క్రెడెన్షియల్స్ని షేర్చేయడంలో వచ్చే తలనొప్పులు, ఒక్కొ అప్లికేషన్ నుంచి ఒకొక్క వివరాలు తీసుకోవడం.. కాస్త ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా తయారైందే గ్రిడిల్. "గ్రిడిల్" ఒక ఆల్ ఇన్ వన్ టూల్. నాలుగు అవసరాల కొసం నాలుగువైపులా పరిగెత్తకుండా ప్రాజెక్ట్‌కి సంబంధించిన అన్ని అంశాలను ఒకచోట చేర్చే ఆన్లైన్ టూల్.
అలా మొదలైంది.
2013లో యష్ షా, అభిషేక్ దోషి, అనుపమా పంచల్. ఈ ముగ్గురూ టంబ్లర్ లాంటి ఒక ఆన్లైన్ బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌ను తయారు చేయడం మొదలుపెట్టారు. అయితే, ముగ్గురు ఒకే చోట లేకపోవడంతో కలిసి పనిచేయడం కష్టంగా ఉండేది. వీడియో కాలింగ్‌కు స్కైప్, ఫైల్ షేరింగ్‌కు డ్రాప్‌బాక్స్, చాటింగ్‌కు వాట్సాప్, వివరాలను షేర్ చేయడానికి ఈమెయిల్ లేదా ఫేస్బుక్ గ్రూప్.. ఇలా విడివిడిగా వాడాల్సి వచ్చేది. దాదాపు 5నెలల పాటు కష్టపడ్డ తర్వాత.. ఈ ఐదుగురికి ఒక ఆలోచన వచ్చింది. అదే "గ్రిడిల్"గా రూపాంతరం చెందింది.
ఇలా విడివిడిగా యాప్స్ వాడటంలో ఉన్న సమస్యలను గుర్తించిన ఈ ముగ్గురు., అన్నిటిని కలిపి ఒకేచోట చేర్చి అప్లికేషన్‌ను రెడీ చేయాలని అనుకున్నారు. బాగా ఫేమస్ అయిన 18 టూల్స్‌ని ఎంచుకున్నారు. 33 సంస్ధల్లో దాదాపు 200 మందితో మాట్లాడి.. తమ ఆలోచన గురించి వివరించారు. చాట్, ఫైల్, టాస్క్, ఆడియో-వీడియో కాన్ఫరెన్సింగ్లాంటి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ అన్నీ ఒకే చోట అందుబాటులోకి తెచ్చారు,.
“ఫైల్షేరింగ్కి డ్రాప్‌బాక్స్, వీడియో కాన్ఫరెన్సింగ్కి స్కైప్, చాట్‌కి లింక్, ఈమెయిల్‌కు ఔట్లుక్.. ఇలా అన్నీ ఒకచోట సింగిల్ యూజర్ ఇంటర్ఫేస్లో అందుబాటులో ఉంటాయి, దీని వల్ల ట్యాబ్ మేనేజ్మెంట్ సమస్య తీరిపోవడంతో పాటు.. టైమ్ సేవ్ అవుతుంది” అంటారు ఫౌండర్స్‌లో ఒకరైన యష్!
2013లో మొదలైన గ్రిడిల్..14 ఇండస్ట్రీల్లోని 139 కంపెనీలకు సేవలు అందిస్తోంది. మొత్తం 5,900 మంది యూజర్స్, 1,600 టీమ్స్ సక్సెస్‌ఫుల్‌గా గ్రిడిల్ని వినియోగిస్తున్నారు. ఇండస్ట్రియల్ డిజైన్ దగ్గర్నుంచి.. వెబ్, ఐటీ కన్సల్టెన్సీ, హెల్త్‌కేర్.. ఇలా రకరకాల వ్యవస్ధలకు గ్రిడిల్ సేవలు అందిస్తోంది. స్టెర్లింగ్ హాస్పిటల్, డికాన్ లిమిటెడ్‌లాంటి పేరుమోసిన కంపెనీలు గ్రిడిల్ కస్టమర్లే. 85 శాతం కస్టమర్లు ఎలాంటి చెల్లింపులు లేకుండా చేరినవారే.
కస్టమర్ అవసరాన్ని బట్టి ఈ ప్లాట్ఫామ్లో ప్లాన్లు ఉంటాయి. బేసిక్ ఫీచర్లను ఫ్రీగా అందిస్తున్నా.. అన్లిమిటెడ్ గెస్ట్‌లు, ప్రైవేట్ ప్రాజెక్ట్‌లు, టెంప్లెట్స్, 100 జీబీ ఫైల్ స్టోరేజ్.. ఇలా ఆప్షన్లు ఎక్కవగా ఉన్నవి ఎంటర్ప్రైజ్ ప్లాన్ కింద అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక ఫీచర్లను బట్టి ప్లాన్ల రేట్లలో తేడాలుంటాయి.
భవిష్యత్తుపై భరోసా!
వాడకాన్ని మరింత సులభతరం చేసేందుకు రాబోయే రోజుల్లో మరిన్ని ఫీచర్లను ప్రవేశపెట్టాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఆటోమేటిక్ లాంగ్వేజ్ డిటెక్షన్ ఆప్షన్‌తో.. యూజర్‌కి వర్క్ అసైన్ చేయడాన్ని మరింత ఈజీ చేయాలని అనుకుంటున్నారు. గూగుల్ క్యాలెండర్, ఔట్‌లుక్‌తో పాటు.. డ్రాప్‌బాక్స్, వన్ డ్రైవ్, జెన్ డెస్క్ లాంటి వాటితో కొత్త అప్డేట్ను అనుసంధానం చేయబోతున్నారు. ఈ నెలాఖరుకు యాండ్రాయిడ్ యాప్‌ను, మార్చ్‌లో IOS యాప్‌ను రిలీజ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. సెంటర్ ఫర్ ఇన్క్యుబేషన్ అండ్ అంట్రప్రెన్యూర్‌షిప్, అహ్మదాబాద్‌లో ఉన్న ఈ కంపెనీ..రెండు విడతలుగా ఇప్పటికే రూ.8 కోట్ల రూపాయల ఫండింగ్ దక్కించుకుంది. ఒక కంపెనీలో ప్రాజెక్ట్‌కి కానీ.. టాస్క్‌కి కానీ అవసరమైన అన్ని సదుపాయాలు ఒకే చోట కల్పించాలన్నదే తమ లక్ష్యమంటోంది గ్రిడిల్ టీమ్.
ERP గురించి మాట్లాడినప్పడు SAP ప్రస్తావన ఎలాగైతే వస్తుందో.. ప్రొడక్టివిటీ గురించి మాట్లాడినప్పుడు తమ అప్లికేషన్ గురించి మాట్లాడాలి” - గ్రిడిల్ టీమ్ మెంబర్స్
ఇలా అన్ని సదుపాయాలు ఒకే చోట దొరకడం వల్ల..13 శాతం ఉత్పత్తి సామర్ధ్యం పెరుగుతందని కంపెనీ అంటోంది. కస్టమర్ల డేటాకు పూర్తి సెక్యూరిటీ అందించేందుకు 10 మంది సభ్యులు పనిచేస్తున్నారు. సర్వర్ ప్లాట్‌ఫాం లేని క్లయింట్లకు 128 bit SSL Encryption ద్వారా డేటాకు భద్రత కల్పిస్తున్నారు.
యువర్ స్టోరీ విశ్లేషణ
మార్కెట్స్ అండ్ మార్కెట్స్ జరిపిన రీసెర్చ్ ప్రకారం ఎంటర్ప్రైజ్ కొలాబరేషన్ మార్కెట్ 2019 నాటికి 70.61 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుతుంది. ఇక వీఎం వేర్ లాంటి కంపెనీలు రాబోయే రోజుల్లో ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్‌కి మంచి డిమాండ్ ఉంటుందని, కేవలం ఇండియాలోనే ఆ మార్కెట్ 2.3 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేశాయి. దీన్ని బట్టి చూస్తే ఇప్పటికే ఆశించిన స్ధాయిలో లాభాలను గడిస్తున్న గ్రిడిల్ లాంటి కంపెనీలకు మంచి భవిష్యత్తు ఉంటుందనే చెప్పాలి. స్టార్టప్ కంపెనీలు, ఎన్జీవోలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా మార్కెట్‌ను కొల్లగొట్టాలని ప్లాన్ చేస్తోంది గ్రిడిల్. YS2016 అనే ప్రోమో కోడ్‌ని వినియోగించి ధరల్లో తగ్గింపును పొందచ్చు.