సంకలనాలు
Telugu

పేరు పర్ఫెక్ట్‌గా ఉండడమూ స్టార్టప్ సక్సెస్‌లో ముఖ్యమే

స్టార్టప్ పేరులోనే ఉంది విషయమంతాపేరు పెట్టేముందు పదిసార్లు ఆలోచించాలిడొమైన్ నేమ్ కీలకమే డాట్ కామ్‌లు లేకుంటే డాట్ ఇన్‌లే బెస్ట్ గెట్‌షిఫు.కాం పేరుతో ఫేమస్ అయిన స్టార్టప్ దిసిగ్నల్స్.నెట్ తోనూ బ్రాండ్ ఇమేజ్

Poornavathi T
23rd Jun 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

ఏదైనా స్టార్టప్ ప్రారంభించాలంటే ముందుగా మనం మంచి పేరు ఎంచుకుంటాం. పేరులో ఏముంది? అనుకుంటారు చాలామంది. కానీ పేరులోనే పెన్నిధి ఉంది. మనం పెట్టే కంపెనీ పేరు పదిమంది నోళ్ళలో నానాలి.

మనం పెట్టే పేరు ఏదో ఒకరోజుకో ఒక వారానికో సంబంధించింది కాదు. ఎందుకంటే అది జీవితాంతం ఉంటుంది.

image


వేలాది స్టార్టప్ కంపెనీలు మంచి పేరు, లోగో డిజైన్ చేసుకోవడానికి నెలల టైం తీసుకుంటాయి. సంప్రదాయబద్దమయిన పేర్లు కంపెనీకి ఓ ఇమేజ్ తీసుకువస్తాయి. అందుకే కంపెనీలు తమ బ్రాండ్ కోసం తాపత్రయపడుతుంటాయి. ఒక లోగో చూడగానే ఆ కంపెనీ ప్రొఫైల్ మొత్తం జనానికి తెలిసిపోతుంటుంది.

అసలు 'షిఫు' అంటే ఏంటి ?

'షిఫు' ఓ చైనీస్ పదం. దీనికి అర్థం మంచి ఫ్రెండ్, టీచర్. మా వినియోగదారుల్లో ఉన్న నెగిటివ్ భావాలను పారద్రోలి, ముందుకు నడిపించడం. ఈ పదంతో పాటు మరికొన్ని టైటిల్ పదాలను జాబితాలో పెట్టుకున్నాం..కానీ అవి అంతగా సంతృప్తిని ఇవ్వలేదు.

'షిఫు' కి మించింది లేదనిపించింది. మా యాప్‌కి మంచి పేరు పెట్టడం కోసం అందరినీ అడిగాం. 20 శాతంమంది పాత తరం పేర్లు చెప్పుకొచ్చారు 'షిఫు' స్టార్టప్ కంపెనీ నిర్వాహకుడు ప్రశాంత్.

image


ప్రశాంత్ 'షిఫు' పేరుతో ఓ స్టార్టప్ కంపెనీ ప్రారంభించారు. స్పైస్ ల్యాబ్‌లో ఇది భాగం. మొబైల్ మండే పేరుతో ఢిల్లీలో ప్రారంభమయిన ఓ యాప్ వ్యవస్థాపకుడు ప్రశాంత్. ప్రశాంత్‌కి స్టార్టప్ కంపెనీలు ప్రారంభించడమే కాదు ట్రావెల్ చేయడం, కవితలు రాయడం, కమ్మగా వంట చేయడం, బుక్స్ చదవడం కూడా వచ్చు. నోయిడాలో ఉండే ప్రశాంత్ హాయిగా తన ఇంట్లో కూర్చుని ఐపాడ్, ఐ ఫోన్, రెండు ఆండ్రాయిడ్ ఫోన్లతో తెగ హడావిడి చేస్తుంటాడు.

యాప్‌కి పేరు పెట్టడం కష్టమే

పేరు పెట్టడంలో మేం తీసుకునే నిర్ణయం దీర్ఘకాలంలో మనపై ప్రబావం చూపుతుందనిపించింది. అయితే కొన్నాళ్ళపాటు ఈ నిర్ణయాన్ని వాయిదా వేశాం. పేర్లు పెట్టడంలో ఎదురవుతున్న ఇబ్బందులపై ఎంతో మందిని కలిశాం.

మనం చేస్తున్న బిజినెస్ ఎలాంటిది ?

ప్రొడక్ట్ ఏంటి ? ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, అరబిక్, చైనీస్, హిందీ, జపనీస్...ఇలా అంతర్జాతీయ భాషల్లో పేర్ల కోసం అన్వేషణ సాగాలి. చారిత్రక, సంస్కృతీ పరంగా అన్వేషించాలి. అందులోంచి వచ్చే పదాలను ఒకచోట రాసి పెట్టుకోవాలి. పదిమంది మిత్రులకు మనకున్న ఐడియాలు చెప్పి, వారి అభిప్రాయాలను ఆహ్వానించాలి. వారు ఇచ్చిన సలహాలను స్వీకరించి.. ఒక నిర్ణయానికి రావాలి.

కార్యాచరణ వర్సెస్ పరిధి

ఓ స్టార్టప్ కంపెనీ గానీ, ఒక యాప్‌గానీ ప్రారంభించాలంటే ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు వచ్చిపడుతుంటాయి. అయితే వాటిని చాలా ఓపికగా అధిగమించాలంటారు ప్రశాంత్. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లాంటి సామాజిక వెబ్‌సైట్లలో కూడా మీ కంపెనీకి మంచి పేరు పెట్టమని అడగండి. జనం నుంచి ఎంతగా స్పందన వస్తుందో మీకే తెలుస్తుంది.

90 శాతం స్టార్టప్‌లు అంతగా జనంలోకి వెళ్ళకపోవడానికి కారణం సరైన పేరు పెట్టకపోవడమే అంటారు ప్రశాంత్. అందరికీ అందుబాటులో ఉండేలా పేరు పెడితే బాగుంటుందంటారు. యాప్‌గానీ, స్టార్టప్‌గానీ నడుస్తున్నప్పుడు చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు.

Vowels అంటే స్టార్టప్ కంపెనీ పేరులో అచ్చులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. చక్కగా చదువుకోవడానికి, పలకడానికి ఈ అచ్చులు బాగా ఉపయోగపడతాయి. చిన్నపిల్లల ఏడుపులో ఎక్కువగా మనకు అచ్చులు కనిపిస్తుంటాయి. మన నాలుక ఈజీగా పలికేందుకు వీలైన పదాలు ఉంటే బాగుంటుంది. పాపులర్ బ్రాండ్‌లైన గూగుల్, ఫేస్‌బుక్, ఈబేలు సక్సెస్‌ఫుల్‌గా దూసుకుని పోవడానికి కారణం కూడా అచ్చులే.

నిరంతరం కొత్తదనం కోసం పరితపించేవారు పేరు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ మధ్యకాలంలో కొన్ని పదాలు తరచుగా మనకు వినిపిస్తుంటాయి. ఉదాహరణకు Kart అనే పదం. ఫ్లిప్‌కార్ట్, లెన్స్‌కార్ట్, బ్యాగ్స్‌కార్ట్, హెల్త్‌కార్ట్, ఫ్రెకార్ట్, కార్ట్ రాకెట్.. ఇలా అనేక కంపెనీలు తమ పేరులో Kart అని తగిలిస్తున్నాయి.

image


ఆచారాలను పాటించాలి

మనది ఆచారాల పునాదుల మీద నడుస్తున్న సమాజం. వ్యాపారంలోనూ ఏదైనా వ్యవహారంలోనూ ఆచారం మనకు కనిపిస్తుంది. జాబ్‌స్టర్, ఫ్రెండ్‌స్టర్, డాగ్‌స్టర్, ఫ్లిక్‌స్టర్, నాప్‌స్టర్ వంటి పదాలను గమనిస్తే కొన్ని విషయాలు మనకు అర్థం అవుతాయి. బాగా సక్సెస్ అయిన స్టార్టప్‌లు కూడా ster పదంతో పూర్తవుతున్నాయి.

డీవీడీ పోస్టల్ మెయిలింగ్ సర్వీస్ అయిన క్విక్‌స్టర్ కూడా ముందు నెట్‌ఫ్లిక్స్ పేరుతో రన్ అయ్యేది. అలాగే ప్రముఖ ఆన్‌లైన్ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కూడా బ్లాక్‌బస్టర్ పేరుతో ఓ స్టార్టప్‌ని నడుపుతోంది. వినియోగదారులను ఆకట్టుకోవడంలో ఈ ఆచారాలు, సంప్రదాయాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

‘‘ప్రతి పేరు వెనుక వివిధ ప్రాంతాల కల్చర్ ఉంటుంది. ఇటు సాహిత్యపరంగా, అటు ఉచ్ఛారణ పరంగా ఎంతో ఉన్నతిని కలిగి ఉంటాయి. 'షిఫు' అనే స్టార్టప్ పదం ఇప్పుడు నాలుగైదు దేశాల్లో ఎంతో ప్రఖ్యాతి పొందింది. యూఎస్ఏ, ఇండియా, సౌత్ ఈస్ట్ ఏషియా, చైనా, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో 'షిఫు' పేరుకి మంచి ఫాలోయింగ్ ఉంది’’ అంటున్నారు ప్రశాంత్.

డొమైన్ పేరు కీలకమే

ఆయా స్టార్టప్‌లకు సంబంధించి డొమైన్ పేర్లు చాలా కీలకం. అయితే కొన్ని డొమైన్ పేర్లు మనకు అందుబాటులో ఉండకపోవచ్చు. అంత మాత్రాన ఆ పేరుకోసం తాపత్రయపడకూడదు. ఉదాహరణకు డాట్ కాం అనేది. అదే పదం లేకపోయినా. వేరే ప్రత్యామ్నాయ డొమైన్‌ల కోసం ప్రయత్నం చేయవచ్చు.

మన కంపెనీ పేరు ముందు the, get, my అనేవి వాడవచ్చు. ఉదాహరణకు ‘ది సిగ్నల్స్.నెట్’, ‘గెట్‌షిఫు.కాం’ ముఖ్యమయినవి.

అలాగే .net, .in, .ly వంటి సబ్‌డొమైన్లు కూడా ప్రయత్నించవచ్చు. భారతదేశంలో ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ http://www.airtel.in పేరుతో ఎంతగా బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకుందో మనం అర్థం చేసుకోవచ్చు. డాట్ కాం అనే డొమైన్ అందుబాటులో లేకపోతే .in ద్వారా ఎయిర్‌టెల్ వినియోగదారులకు దగ్గర కాగలిగింది.

మన స్టార్టప్ ప్రారంభమయిన కొత్తలో వినియోగదారులు అటూ ఇటూగా గూగుల్ సెర్చ్‌బాక్స్‌లో చెక్ చేసుకుంటూ ఉంటారు. అందుకే కంపెనీకి సంబంధించిన బ్రోచర్లలో ఆయా వివరాలు పొందుపరిస్తే బాగుంటుంది. దీంతో పాటు ఈమెయిల్, న్యూస్ లింక్స్, సోషల్ నెట్వర్క్‌లతో పాటు అడ్వర్‌టైజ్‌మెంట్లలో కూడా మన కంపెనీ డొమైన్ నేమ్‌ను తెలియచేయడం వల్ల త్వరగా సెర్చ్ చేయడానికి అవకాశం ఉంటుంది.

'షిఫు' విషయానికే వస్తే మొబైల్ వినియోగదారులు ఈ సైట్‌లోకి వెళ్లి లాగిన్ అయితే మన వివరాలు తెలియచేస్తాం. మనకు సంబంధించిన మేజర్ ఈవెంట్స్‌ను 'షిఫు'కి తెలియచేస్తే ఆయా సందర్భాల్లో మనకు రిమైండ్ చేస్తుంటుంది. మనకు సంబంధించిన కీలకమయిన సమాచారాన్ని వేరెవరితోనూ ఈ సైట్ పంచుకోదు. అంతా కాన్ఫిడెన్షియల్‌గానే ఉంచుతుంది.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags