మగువలకు పార్ట్ టైం ఉద్యోగాలు వెతికిపెట్టే స్టార్టప్

మగువలకు పార్ట్ టైం ఉద్యోగాలు వెతికిపెట్టే స్టార్టప్

Monday May 16, 2016,

3 min Read


మారిన లైఫ్ స్టయిల్, పెరిగిన ఖర్చుల మూలంగా, భార్యాభర్తలు ఉద్యోగాలు చేయక తప్పని పరిస్థితి. ఒకరి సంపాదనతో ఇల్లు గడవాలంటే కష్టమే. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో అయితే వేరే చెప్పనక్కర్లేదు. ఆలుమగలిద్దరూ ఆఫీసుకు వెళితే తప్ప, నెలాఖరులో అప్పు చేయకుండా ఉండలేరు. ఇద్దరికిద్దరూ ఫుల్ టైం డ్యూటీలోనే ఉంటే, ఇల్లు, పిల్లలు, వారి చదువుల సంగతేంటి? ఈ సంఘర్షణ ఏ ఒకరిద్దరిదో కాదు. ఈ పరిస్థితుల్లో మధ్యేమార్గంగా కనిపించేది ఒక్కటే. అదే పార్ట్ టైం ఉద్యోగం. ఇటీవలే వర్క్ ఫ్రం హోం, ఫ్రీలాన్సింగ్ ద్వారా కొంతకొంత సంసారం నెట్టుకొస్తున్నారు. ఇలాంటి ఉద్యోగాలనే చూపిస్తామంటూ ముందుకొచ్చింది ఓ హైదరాబాదీ స్టార్టప్ విప్యాక్ట్. 

వీపాక్ట్ ప్రారంభం

ఆరేళ్ల ఇండస్ట్రీయల్ అనుభవం ఉన్న శిల్పారావ్ ఫ్లెక్సిబుల్ జాబ్ చేయాలనుకున్నారు. దానికోసం చాలా ప్రయత్నాలు చేశారు. అయితే అది జరగలేదు. ఇక స్టార్టప్ కంపెనీ పెట్టడమే అని డిసైడైపోయారు. సమస్య తీవ్రత అర్థమైంది. మూడు నెలలు మార్కెట్ రీసెర్చి చేశారు. ఇది 2014 మాట. అన్ని అనుకూలించడంతో అదే ఏడాది డిసెంబర్ లో స్టార్టప్ అనౌన్స్ మెంట్ జరిగిపోయింది. దాదాపు 5వేల రెజ్యుమేలు వచ్చాయి. వారికి సరైన కంఫర్టబుల్ జాబ్ వెతికే బాధ్యత తీసుకోవడం చాలా గర్వంగా అనిపించింది శిల్పారావుకి.

image


వీప్యాక్ట్ పనితీరు

ఇప్పటి వరకూ చాలా ఎమ్మెన్సీ కంపెనీలతో టై అప్స్ జరిగాయి. మరికొన్ని స్టార్టప్ కంపెనీలకు కావల్సిన రిక్రూట్మెంట్ సొల్యూషన్ అందిస్తోంది. టెలికాం, సాఫ్ట్ వేర్, బ్లాగర్స్, కంటెంట్ రైటర్స్ లాంటి ఎన్నో రంగాల్లో పనిచేసిన వారు తమ వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రర్ చేసుకున్నారని శిల్పారావు అంటున్నారు.

కంఫర్టబుల్ ఉద్యోగం కోరుకునే వారిలో మగువలే ఎక్కువ మంది ఉన్నారు. అందుకే వారికి మాత్రమే మా సొల్యూషన్ వర్తిస్తుందని అన్నారామె. విదేశాల్లో పనిచేసి ఇక్కడకు వచ్చేసిన ఎంతో మందికి మేం అవకాశం ఇచ్చాం. అయితే చేయాల్సింది చాలా ఉంది. ఇప్పటికీ స్కోప్ ఉందన్నారు శిల్ప. కార్పొరేట్ టై అప్స్ కొనసాగుతున్నాయి. ఏరోనాటిక్స్, టీచింగ్ లాంటి ప్రొఫెషన్స్ వారు తమని సంప్రదించారని అన్నారామె.

image


ఇక టీం విషయానికొస్తే శిల్పారావ్ దీని ఫౌండర్. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ చేశారు. అనంతరం ఆరేళ్లు కార్పొరేట్ ఉద్యోగం చేశారు. వివిధ పొజిషన్స్ లో పనిచేశారు. 2014 డిసెంబర్లో ఈ వెంచర్ ప్రారంభించారు. శిల్పతో పాటు హరి అనే మరో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఈ స్టార్టప్ పై పనిచేస్తున్నారు. టెక్నికల్ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటున్నారు. అతనికి దాదాపు 15 ఏళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. మరో ముగ్గరు ఫ్రీలాన్సింగ్ ఉద్యోగులు వర్క్ చేస్తున్నారు. టీ హబ్ నుంచి ఈ సంస్థ తన ఆపరేషన్స్ చేస్తోంది.

1.కార్పొరేట్ టై అప్స్ ప్రధాన సవాలని శిల్ప చెబుతున్నారు. కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం కల్చర్ ని ఇంకా ఎడాప్ట్ చేసుకునే స్థితిలో ఉన్నాయని అంటున్నారామె. దీన్ని అధిగమించాల్సి ఉంది.

2.ఇంటి నుంచి పనిచేసే కల్చర్ మన ఇళ్లలో కూడా అలవరుచుకోవాల్సి ఉంది. దీన్ని అవకాశాలతో పాటు ఇది మారుతుందని అంటున్నారామె.

3.తమ దగ్గరకు వచ్చిన వారికి ఫ్లెక్సిబుల్ ఉద్యోగం వెతికి పెట్టడం పెద్ద సవాలు. దీని కోసం ప్రత్యేకంగా టీంని ఏర్పాటు చేయడం ద్వారా అధిగమిస్తామని అంటున్నారు శిల్ప.

మార్కెట్ పొటెన్షియల్

భారతదేశంలో పార్ట్ టైం ఉద్యోగాల రంగం ఇప్పుడు మొదటి దశలోనే ఉందని చెప్పాలి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇండియా పూర్తి స్థాయిలో అమలైతే ఈ రంగం భారీగా పుంజుకుంటుంది. రాబోయే 6 నెలల్లో స్టార్టప్ కంపెనీల గ్రోత్ తో పాటు ఫ్లెక్సిబుల్ జాబ్స్ సెగ్మెంట్ గ్రోత్ ఉండబోతున్నట్లు నాస్కాం సర్వేలో తేలింది. ఎనిథింగ్ కెన్ బీ ఔట్ సోర్స్ అని శిల్పారావ్ చెబుతున్నారు. భవిష్యత్ లో ఇది కూడా ఓ బిలియన్ డాలర్ మార్కెట్ గా మారబోతుందని అన్నారామె.

image


ఫండింగ్, భవిష్యత్ ప్రణాళికలు

ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నుంచి 30లక్షల ప్రారంభ పెట్టబడి సమకూర్చుకుందీ స్టార్టప్. బ్రేక్ ఈవెన్ దాటేసిన తర్వాత ప్రాఫిటబుల్ గానే నడుస్తుందని శిల్ప చెప్పుకొచ్చారు. ప్రీ సిరీస్ ఏ రౌండ్ ఫండింగ్ కోసం చూస్తున్నారు. ఫండింగ్ వస్తే మరిన్ని రంగాల్లో సేవలను విస్తరిస్తామని అన్నారామె. కార్పొరేట్ టై అప్స్ నెట్ వర్కింగ్ పెంచుకోడానికి దీన్ని వినయోగిస్తామని అన్నారు.

“అమ్మయిలు ఫ్లెక్సిబుల్ ఉద్యోగాలు చేయడానికే ఇష్టపడతున్నారు. వారికి అవకాశం ఇవ్వడమే మా లక్ష్యం అని ముగించారు శిల్ప”