ఈశాన్యంలో భారతంలో దూసుకుపోతున్న "వెబ్ ఎక్స్"ప్రెస్
గువహాతి ఆంట్రప్రెన్యూర్ సక్సెస్ స్టోరీ
దేశంలో స్టార్టప్ ఎకో సిస్టం ను ప్రారంభించాల్సిన ఎన్నో నగరాల్లో గువహాతి ఒకటి. అయినప్పటికీ, 2004లోనే, సంజీవ్ శర్మ ఇంకా ఏదో చేయాలన్న తపనతో తన ఉద్యోగాన్ని వదులుకును బయటకు వచ్చారు. ఐబిఎం గ్లోబల్ సర్వీసెస్ కుచెందిన, మంచి జీతం వచ్చే ఐబిఎం ఏస్ (అడ్వాన్స్ కెరీర్ ఎడ్యుకేషన్) ను వదులుకుని "rupaliparda.com" ను స్టార్ట్ చేశారు. తన సంస్థ అయిన WebX ద్వారా అస్సాం ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ పై రెండు భాషలో పొర్టల్ ను ప్రారంభించారు.
కంప్యూటర్ అప్లికేషన్స్ లో మాస్టర్స్ డిగ్రీ పొందిన సంజీవ్, ZAP ఇన్ఫోటెక్ లిమిటెడ్ లో సాఫ్ట్ వేర్ కన్సల్టెంట్ గా కెరీర్ ప్రారంభించారు. తండ్రి ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ కావడంతో, దేశంలోని వివిధ ప్రాతాలకు తిరిగే అవకాశం లభించింది. అస్సామీ కావడంతో, రిటైర్మెంట్ తర్వాత గువహాతిలోనే సెటిల్ అవ్వాలని సంజీవ్ తండ్రి భావించారు. "నా వెంచర్ ను అస్సాం బయటే ప్రారంభించాలని భావించినా, మా తండ్రి అకాల మరణంతో అక్కడే ఉండిపోయాను. గువహాతి లో లిమిటెడ్ రిసోర్సులున్నప్పటికీ, దాన్నే నా "కర్మభూమి"గా భావించి, ఉన్న అవకాశాల్నే సద్వినియోగం చేసుకోవదం ప్రారంభించాను" అంటూ బాధాకరమైన గతాన్ని గుర్తుచేసుకుంటున్నారు సంజీవ్.
అస్సామీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీకి సంబంధించిన అంశాల్ని Rupaliparda.com చూస్తుంది. ఇందులోఆ రంగానికి చెందిన హిస్టరీ, కరెంట్ అఫైర్స్, ఆర్టికల్స్, డైరెక్టరీ, హూ ఈజ్ హు, ఇంటర్వ్యూ, రివ్యూస్, ఆడియో, వీడియో ఫైల్స్ ఉంటాయి. అప్పటికి ఆ కాన్సెప్ట్ చాలా కొత్తది కావడంతో తగినంత గుర్తింపు రాలేదు. దాంతో దానిమీద పెద్దగా ఆశలు పెట్టుకోకుండా, తొందర్లోనే వెబ్ సైట్ ను రివాంప్ చేయాలని భావించారు సంజీవ్. అలా మారిన తర్వాత మంచి వ్యూయర్‌షిప్ వచ్చింది. దీంతో Rupaliparda.com ను ఈశాన్య భారత్ లో తొలి ఇంటర్నెట్ టీవీ గా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు సంజీవ్.
సంజీవ్ ను 2004 లో స్టార్టప్ గా ప్రారంభిస్తే, 2008 లో ఆయన ఇద్దరు సోదరులు జాయినయ్యారు. ఆ తర్వత అది వెబ్ ఎక్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గా మారింది. ఇప్పుడా కంపెనీకి సాఫ్ట్ వేర్ సర్వీసెస్, ఐటి ఇంఫ్రాస్ట్రక్చర్ మేనేజ్ మెంట్ సర్వీసెస్, ఐటి సేల్స్ & మార్కెటింగ్ విభాగాలకు ముగ్గురు ఫుల్ టైం డైరెక్టర్లున్నారు.
వెబ్ ఎక్స్
హై క్వాలిటీ టెక్నికల్ సపోర్ట్ తో ఈ కంపెనీ, సిస్టం అనాలిసిస్ మొదలు సొల్యూషన్ ఇంప్లిమెంటేషన్ వరకు అన్ని రేంజ్ లను అందిస్తుంది. "వెబ్ ఎక్స్ ప్రొఫెషనల్ ఐటి కన్సల్టింగ్ కంపెనీ. ఇది ఐటి సొల్యూషన్స్, ప్లానింగ్, డిజైన్, డెవలపింగ్, ఆన్ సైట్, రిమోట్ ఏరియాల్లో ఐటి మెయింటెన్ చేస్తుంది. సొల్యూషన్ కోసం అవసరమైన అన్ని అంశాల్ని సేకరిస్తాం. టైం/పీపుల్/రిసోర్స్ ట్రేడ్ అఫ్స్ ను బట్టి సొల్యూషన్ డిజైన్ చేస్తాం. ఆ తర్వాత కీ స్టేక్ హోల్డర్లు, టీం సభ్యులకు దాన్ని కమ్యూనికేట్ చేస్తాం" అంటున్నారు సంజీవ్.
ప్రారంభంలో సవాళ్లు
సీడ్ క్యాపిటల్ గా సంజీవ్ చేతిలో రూ. 15,000 మాత్రమే ఉన్నాయి. అయితే అతని పట్టుదల ముందు అదేమంత పెద్ద సమస్య అనిపించలేదు. తన కలల తీరాన్ని చేరుకోవడానికి ఏదీ అడ్డంకి కాలేదు. తన స్నేహితుడి దగ్గరనుంచి రెండు డెస్క్ టాప్ లను అడిగి తెచ్చుకున్నారు. ఇంటర్నెట్ కనెక్టివిటి అంతగా లేకపోయినా, ఇంటర్నెట్ మీద అవగాహన సరిగా లేకపోయినా, మ్యాన్ పవర్ తక్కువగా ఉన్నా, భౌగోళికంగా అవరోధాలున్నా అవన్నీపెద్ద సమస్యలుగా భావించలేదు. ఎన్ని అవరోధాలున్నా అస్సాం స్టేట్ ట్రాన్స్ పోర్ట్ కార్పోరేషన్ (ASTC) ను తన తొలి క్లైంట్ గా సాధించుకున్నారు సంజీవ్.
ఐటి రంగంలో అస్సాం అంతగా అభివృద్ధి చెందకపోవడంతో, తొలినాళ్లలో టెక్నాలజీ గురించి చెప్పడం సంజీవ్ కు కాస్త ఇబ్బంది కలిగించింది. అయితే కొత్త గా రమేష్ సిహెచ్ జైన్ రావడంతో అది కాస్తా సులభం అయింది. ASTC ని కంప్యూటరైజ్డ్ చేయాలని ఆయన భావించారు.
"ఆన్ లైన్ టికెటింగ్ సిస్టం గురించి ఆయనకు ప్రజెంటేషన్ ఇచ్చాను. ఆయన అందుకు సుముఖంగా ఉన్నప్పటికీ ఒక ఐటి రంగ నిపుణుడు అది సాధ్యం కాదని చెప్పారు. అయితే దాన్ని సవాల్ గా తీసుకున్న నేను కేవలం 15 రొజుల్లోనే చేసి చూపించాను. 65 kbps లీజ్డ్ లైన్ మీదే మొత్తం సిస్టం అంతా రన్ అయ్యేది" అంటున్నారు సంజీవ్.
ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంతో, 150 మంది యువతకు ఉపాధి దొరికింది. దాంతో పాటుగా, ASTC మార్కెట్ షేర్, రెవెన్యూ మూడింతలు పెరిగింది. B2B ప్లాట్ ఫాం మీద ఆన్ లైన్ టికెట్ బుకింగ్స్ కోసం 150 మంది ఏజెంట్లను అపాయింట్ చేసుకున్నారు.
ఈశాన్య భారత్ లో వెబ్ ఎక్స్ ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటి కన్సల్టింగ్ కంపెనీ అయిందని సంజీవ్ చాలా గర్వంగా చెప్తున్నారు. ప్రస్తుతం కంపెనీకి అనుభవజ్ఞులైన 42 మంది టీం మెంబర్లున్నారు. అస్సాం మొత్తంతో పాటుగా, మేఘాలయా,అరుణాచల్ ప్రదేశ్ లో కంపెనీకి బ్రాంచ్ లున్నాయి. ఇక కార్పొరేట్ ఆఫీస్ గువహాతిలో ఉంది. స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ లతో కలిపి ఇప్పుడు కంపెనీ కి 200 క్లయింట్స్ ఉన్నారు. ఇందులో సాఫ్ట్ వేర్ సర్వీసులు, గవర్నమెంట్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్, ఐటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్ మెంట్, వెబ్ అప్లికేషన్లున్నాయి. సంజీవ్ కున్న క్లయింట్లలో 80% స్మాల్ ఎంటర్ ప్రైజెస్, 12% మీడియం ఎంటర్ ప్రైజెస్, ఇక 8% లార్జ్ ఎంటర్ ప్రైజెస్ ఉన్నారు.
పెద్ద అవరోధాలు ఇప్పటికీ ఉన్నాయి
అనుభవుజ్ఞులైన టీం మెంబర్లున్నప్పటికీ, ఎక్కువగా క్వాలిటీ మ్యాన్ పవర్ లేకపోవడం సమస్యగానే భావిస్తున్నారు సంజీవ్. ఈ సవాల్ తొ కొన్నిసార్లు క్లైంట్లకు అవసరమైన డెలివరి లు చేయలేకపోతున్నామని సంజీవ్ అంటున్నారు. దీంతోపాటే అక్కడి స్టార్టప్ ఎకో సిస్టం అంత ప్రోత్సాహకరంగా లేదంటున్నారు సంజీవ్. వెంచర్ ఫండ్స్, మెంటార్ షిప్, గైడెన్స్, మార్కెట్, ప్రభుత్వ సపోర్ట్ స్టార్టప్ లకు లేదని అంటున్నారు. అస్సాం ఐటి డిపార్ట్ మెంట్ ఇటీవలే కొత్త స్కీం ను ప్రారంభించినప్పటికీ అందులో క్లారిటీ మాత్రం కొరవడింది.
సక్సెస్ కు మార్గం
ఇప్పటిదాకా వెబ్ ఎక్స్ 200 ప్రాజెక్టులకు పైగా పూర్తిచేసింది. ప్రారంభంలో అవన్నీ వెబ్ సైట్లకు సంబంధించినవే . 2008 తర్వాతే, స్టాటిక్ వెబ్ సైట్స్ కోసం పనిచేయడం మానేసి, వెబ్ అప్లికేషన్స్, కంటెంట్ మేనేజ్ మేంట్ మీద దృష్టిపెట్ట సాగారు. 2006 లోనే రైల్వేస్ కోసం సిఎంఎస్ ను ఇంప్లిమెంట్ చేసిన ఘనత తమదేనంటున్నారు సంజీవ్.
"మేము ఇటీవలే రూపొందించిన NF Railways మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం అవార్డ్ గెలుచుకోవడం తోపాటుగా, రైల్వే బోర్డ్ నుంచి అభినందనలు అందుకుంది. దీన్నే మేము అన్ని రకాల రైల్వేల కోసం రూపొందించాలని భావిస్తున్నాం. వెస్ట్రన్ రైల్వేస్ నుంచే కాకుండా, సెంట్రల్ ఆర్గనైజేషన్ ఫర్ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ (CORE) నుంచి కూడా మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఇదే కాకుండా, ఇతర రైల్వేలను కూడా మేము కలవాలనుకుంటున్నాం" అంటున్నారు సంజీవ్.
ప్రస్తుతం వెబ్ ఎక్స్ అస్సాం ట్రాన్స్‌పోర్టు చెందిన సిటీ బస్ మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం కోసం, వెబ్-బేస్డ్ ఈ-సర్వీసెస్ డెలివరీ సిస్టం ఫర్ లేబర్ & ఎంప్లాయిమెంట్ డిపార్ట్ మెంట్ ఆఫ్ అస్సాం, ఆన్-డిమాండ్ వెబ్ కాస్టింగ్ ప్ల్లట్ ఫాం ఫర్ ఆయిల్ ఇండియా లిమిటెడ్, అస్సాం లో రెండు జిల్లాల్లో ఉన్న పోషకాహార లోపాన్ని అధిగమించే ప్రాజెక్ట్ MIS ఫర్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ తో పాటుగా MIS for కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీ మొదలైన ప్రాజెక్టుల కోసం పనిచేస్తోంది. సరాసరి ప్రతీ ప్రాజెక్ట్ కోసం 25-30 లక్షలైతే, ప్రతీ ప్రాజెక్ట్ మీద 20-30 % లాభం వస్తోంది.
తమకు గువహాతి లో ఉన్న 12 సీట్ డెవలప్మెంట్ యూనిట్ తో, వెబ్ ఎక్స్ హై-క్వాలిటి ఐటి, ITMS కన్సల్టెన్సీ సర్వీసెస్ ను, ఎంటర్ ప్రైస్ ఆర్కిటెక్చర్ సొలూషన్స్ ను తన క్లైంట్లకు అందిస్తోంది. ఈ డెవలప్ మెంట్ యూనిట్ కోసం తాము 22 లక్షలు కేటాయించినట్లుగా సంజీవ్ చెప్తున్నారు.
స్టార్టప్ పవర్ హౌస్
కొత్త ఆలోచనలు సృష్టించడంతొ పాటుగా వాటిని డెవలప్ చేయడానికి వెబ్ ఎక్స్ ఇటీవలే స్టార్టప్ పవర్ హౌస్ ను ప్రారంభించింది. దీంతో 13 గొప్ప ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. అవన్నీ ఇప్పుడు స్క్రూటినీ దశలో ఉన్నాయి. స్టార్టప్ పవర్ హౌస్ గువహాతి బయటే బేస్ గా ఉంది. ప్రారంభంలో వచ్చిన ఐడియాల్లో 11 గువహాతి నుంచి వస్తే, ఒక్కోటి నాగాలాండ్, అరుణాచల్ నుంచి వచ్చాయి.
సంజీవ్ చెప్తున్న వివరాలు
ఇండస్ట్రీ నిపుణులు, విద్యావేత్తలు, బిజినెస్ మ్యాన్ లతో కూడిన మెంటార్ గ్రూప్ మాకుంది. వారంతా స్టార్టప్ ల సక్సెస్ ఫుల్ లాంచ్ కోసం అవసరమైన సహాయం చేస్తుంటారు. ప్రస్తుతం మంచి స్టార్టప్ కోసం మేము ఒక కోటి రుపాయల ఫండ్స్ ఇవ్వడానికి రెడీ గా ఉన్నాం.
"ఫోటోగ్రాఫ్స్ టు డిజిటల్ విలేజ్" పేరుతో ఇటీవలే సంజీవ్, snapsspeak.com అనే స్టార్టప్ ఐడియాను (13 స్టార్టప్ ఐడియాల్లో ఒకటి) CeBIT 2015 కు ఇచ్చారు. ఆ ఐడియా CeBIT కి వచ్చిన వేలాది మంది నుంచి ప్రశంసలు అందుకుని, STPI - మేక్ ఇన్ ఇండియా అవార్డ్ గెలుచుకుంది.
విస్తరణే ధ్యేయం
11 ఏళ్ల స్ట్రగుల్ తర్వాత, ధైర్యం తో పాటుగా అనుభవం కూడా వారి సొంతమయింది. దీంతో బెంగళూరు, కోల్ కత, పూణే ల్లో కొత్త డెవలప్‌మెంట్ సెంటర్లను ప్రారంభించాలని భావిస్తున్నారు.
స్టార్టప్ ఇనిషియేటివ్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొత్త మార్కెట్ ను డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. "మేము ప్లాన్ చేస్తున్న ఎన్నో సర్వీసుల్ని డెలివర్ చేయడానికి గాను గ్రామీణ యువతను గుర్తించి, వారికి అవకాశాల్నివాలని భావిస్తున్నాం. ఈశాన్య భారతంలోని సబ్-అర్బన్ ప్రాతాలను టార్గెట్ చేసుకుని, ఆ తర్వాత మారుమూల ప్రాంతాలకు విస్తరించాలని అనుకుంటున్నాం" అంటున్నారు సంజీవ్.
గత ఆర్ధిక సంవత్సరానికి గాను, వెబ్ ఎక్స్ 5 కోట్ల రెవెన్యూ ను సొంతం చేసుకుంది. వచ్చే ఆర్ధిక సంవత్సరానికి దాన్ని 8 కోట్లకు పెంచుకోవాలని సంస్థ భావిస్తోంది.