ఆ తలనొప్పి మాదే… మీరు హాయిగా అమ్ముకోండి
దేశంలో ఈ కామర్స్ రంగం రోజురోజుకూ విస్తరిస్తోంది. చిన్న చిన్న వస్తువులను సైతం ఇప్పుడు ఆన్ లైన్లోనే మౌస్ క్లిక్ తో ఆర్డర్స్ ఇస్తున్నారు. అయితే ఆన్ లెన్ సెల్లర్స్, ఈ కామర్స్ కంపెనీలకు ఆన్ లైన్ చెల్లింపులు పెద్ద తలనొప్పిగా మారాయి. ఆన్ లైన్లో ఆర్డర్స్ ఇస్తే సరుకులు ఇంటి దగ్గరకు తీసుకెళ్లి డబ్బులు వసూలు చేసుకుంటాయి ఈ కామర్స్ కంపెనీలు. తమ కమీషన్, డెలివరి ఛార్జీలు, పన్నులను మినహాయించుకుని మిగతా డబ్బు ఆ వస్తువును తయారు చేసే కంపెనీకి చెల్లిస్తాయి. ఈ కామర్స్ కంపెనీలు చాలా మార్కెట్ ప్లేసెస్, మానుఫ్యాక్చరింగ్ కంపెనీలలతో కనెక్ట్ అయ్యుంటాయి. వారికి పేమెంట్స్, ఆర్డర్స్ తీసుకోవడం చాలా కష్టమైన పని. స్నాప్ డీల్, ఫ్లిప్ కార్ట్ లాంటి కంపెనీలకు సైతం ఇది తలకు మించిన వ్యవహారమే. ఇలాంటి సమస్యలకు ఈజీగా పరిష్కరిస్తున్నారు అహ్మదాబాద్ కు చెందిన సూరజ్ వజిరానీ.
మానియక్ స్టోర్ డాట్ కాం పేరుతో 2011లోనే స్టార్టప్ పెట్టారు సూరజ్. ఈ కామర్స్ వేదికలపై అమ్మకాలు చేపట్టారు. ఈ రంగంలో కష్టనష్టాలను పూర్తిగా అవగతం చేసుకున్నారు. సెల్లర్స్ ఎవరైనా సమస్యలున్నాయని వీరి దగ్గరకు వస్తే వాటన్నింటినీ సింగిల్ విండో పద్ధతిలో పరిష్కారం చూపుతారు. దీనికోసమే DSYH పేరుతో గత ఏడాది నవంబర్ లో సాస్ స్టార్టప్ ను ఏర్పాటు చేశారు. 50 లక్షల పెట్టుబడి పెట్టారు. DSYH అంటే డోన్ట్ స్క్రాచ్ యువర్ హెడ్. అంటే తలను బాదుకోవద్దు లేదా గోక్కోవద్దు అని అర్థం. ఈ-కామర్స్ కంపెనీలు చెల్లింపుల్లో ఏమాత్రం తేడా వచ్చినా పెద్ద ప్రమాదమే వస్తుంది. అందుకే ఫన్నీ పేరుపెట్టామని అంటున్నారు సూరజ్.
పోటీదారులకన్నా పైచేయి
ఈ-కామర్స్ కంపెనీ స్నాప్ డీల్ యూనికామర్స్, ప్రైమ్ సెల్లర్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ ను ఉపయోగిస్తోంది. యూనికామర్స్, ప్రైమ్ సెల్లర్ సాస్ లకు మార్కెట్లో మంచి పేరుంది. ప్రైమ్ సెల్లర్ క్లౌడ్ కంప్యూటింగ్. ఈబే, అమెజాన్ కూడా క్లౌడ్ బేస్డ్ కంప్యూటింగ్ నే ఉపయోగిస్తున్నారు. గోవాకు చెందిన ఈ కామర్స్ కంపెనీ బ్రౌన్ టేప్ కూడా ఆన్ లైన్ చెల్లింపులకు నిపుణులను నియమించుకుంది. DSYH పూర్తిస్థాయిలో ఎంటర్ ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ ను అందిస్తోంది. ఈ కామర్స్ కంపెనీలకు – సెల్లర్లు- తయారీదారులకు మధ్య వారధిలా ఉపయోగపడుతోంది.
వీరు రియల్ టైంలో సమస్యలను పరిష్కరిస్తున్నారు. రీప్రైజింగ్ పుష్ అనే ఆప్షన్ ను కూడా పెట్టారు. రిటర్న్స్, రీఇంబర్స్ మెంట్, మార్కెట్ ప్లేస్ ప్రమోషన్స్, పేమెంట్స్ అండ్ ఆర్డర్స్ అన్నీ పక్కాగా చేస్తున్నారు. ప్రీషిప్పింగ్ ప్రోఫిటబులిటీ, క్లిష్టమైన సమస్యలకు క్రమపద్ధతిలో పరిష్కారం చూపుతున్నామంటున్నారు సూరజ్.
సెల్లింగ్, ఛార్జెస్ లో అవకతవకలను సైతం DSYH గుర్తిస్తుంది. షిప్పింగ్, పేమెంట్స్ కు ముందు బోగస్ ఛార్జ్ లు వేస్తే వెంటనే కనిపెట్టేస్తుంది. అందుకే మార్కెట్లో తమలాంటి వైవిధ్యభరితమైన టెక్నాలజీ లేదంటున్నారు సూరజ్. పాలీగ్లోట్ సిస్టమ్స్, ఎంవీసీ ఫ్లాట్ ఫాం లాంటి పెద్ద పెద్ద డాటా సొల్యూషన్లకు సైతం సాధ్యంకాని పనిని తాము చేస్తున్నామంటూ సగర్వంగా చెప్పుకుంటున్నారు.
తొలి అడుగులు
60వేల గంటలపాటు ప్రయోగాలు చేసి DSYHను స్థాపించారు.ఈ స్టార్టప్ కు 51 కంపెనీలు క్లైంట్స్ గా ఉన్నాయి. 200 వందల మందికిపైగా సెల్లర్స్ వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. ఫ్లిప్ కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్, పేటీఎం, ఆరామెక్స్, ఫెడెక్స్, బ్లూడార్ట్, ఢిల్లీవెరీ లాంటి పెద్ద పెద్ద సంస్థలకు సైతం సేవలందిస్తూ డాటా సొల్యూషన్స్ లో దూసుకెళ్తోంది. వచ్చే మూడేళ్లలో DSYH రెండు వందల కోట్ల రూపాయల ఆదాయాన్నే లక్ష్యంగా పెట్టుకుంది.
“చాలా కంపెనీలు మమ్మల్ని సంప్రదిస్తున్నాయి. సెల్లర్ ఎకోసిస్టమ్ ను మెరుగు పరచుకోవాలనుకునే కంపెనీలతో కలిసి పనిచేస్తున్నాం. ఆగ్రిగేటర్ బేస్డ్ సర్వీస్ పార్టనర్స్ మాతో టచ్ లో ఉన్నారు. వారితో త్వరలోనే ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నారు. మా కంపెనీకి మంచి భవిష్యత్ ఉంది”- సూరజ్
ప్రచారం ఇలా
DSYH సేవల గురించి ఆనోటా ఈనోటా పడి మంచి పాపులారిటీ వచ్చింది. ఎస్ఎంఎస్, ఈమెయిల్, సోషల్ మీడియా, కంటెంట్ మార్కెటింగ్ ద్వారా ప్రచారం నిర్వహిస్తోంది. ఆన్ లైన్ సెల్లర్స్ కోసం వివిధ నగరాల్లో వర్క్ షాపులుకూడా నిర్వహిస్తున్నారు. వ్యాపార మెళకువలను సైతం స్టార్టప్స్ కు బోధిస్తోంది. ఆన్ లైన్ – ఆఫ్ లైన్ సెల్లర్స్ కు అనుసంధానంగా మారింది DSYH. చాలా తక్కువ ఛార్జ్ వసూలు చేస్తూ ఆఫ్ లైన్ కంపెనీలను ఆన్ లైన్ లోకి తీసుకొస్తోంది.
“ఈ పరిశ్రమ 2020 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. చాలా కంపెనీలు ఆన్ లైన్లోకి వస్తాయి. ఈ కామర్స్ నే సాధనంగా ఉపయోగించుకుంటాయి. మేం అందించే సేవల్లోనూ పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్ షిఫ్ కు అవకాశం కల్పిస్తుంది. ఈకామర్స్ రంగంలో ఎంట్రీ ట్యాక్స్, సర్వీస్, ట్యాక్స్, వ్యాట్ లాంటి ఎన్నో తలనొప్పులు రానున్నాయి. వాటికి మాలాంటివారే పరిష్కారం చూపాలి” సూరజ్
DSYH వ్యవస్థాపకుడు సహా ఈ టీంలో ఆరుగురు సభ్యులున్నారు. దీనికి సీఈఓగా ఉన్న సూరజ్.. కామర్స్ లో పట్టభద్రుడు. ఈబే లాంటి సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది. స్నాప్ డీల్ స్థాపించకముందే ఈ మార్కెటింగ్ రంగంలో పనిచేశారు. ప్రస్తుతం ఆలిండియా ఆన్ లైన్ వెండర్స్ అసోసియేషన్ కు కన్వీనర్ గా ఉన్నారు. సహ వ్యవస్థాపకుడు హరి వాగ్ దీనికి సీటీఓ. ట్రావెల్ గురూ డాట్ కాంలోనూ కీలక సభ్యుడు. 2012 నుంచి మానియక్ స్టోర్ కు కూడా సీటీఓగా పనిచేస్తున్నారు. సీఓఓగా పనిచేస్తున్న సుమిత్ కరాంజీ బిజినెస్ మేనేజ్ మెంట్ చదివారు. ఆటోమోటివ్, హెల్త్ కేర్ రంగాల్లో రెండు స్టార్టప్స్ పెట్టారు.
పాకిస్థాన్, నేపాల్, మయన్మార్ నుంచి కూడా తమకు ఆర్డర్స్ వస్తున్నాయని సుమిత్ చెప్పారు. పలు ఆసియా దేశాలకు కూడా తమ సేవలను అందిస్తామన్నారు. లాజీనెక్స్ట్ సొల్యూషన్స్ సహ వ్యవస్థాపకుడు ధ్రువిల్ సింఘ్వీ వీరికి సహాయం చేస్తున్నారు.
ఈ కామర్స్ ను మరింత ముందుకు తీసుకెళ్లాలంటే ఆన్ లైన్ మార్కెట్ ప్లేసులను బలోపేతం చేయాలి. ప్రతి వస్తువు ఆన్ లైన్లో అమ్మకాలకు, కొనుగోళ్లకు అవకాశం కల్పించాలి. అప్పుడే మార్కెట్లో మోసాలు సైతం తగ్గుతాయి.