దుకాణం మీది.. సరుకులు మావి.. ఇండోర్ బేస్డ్ కొత్త కాన్సెప్ట్
రిటెయిలర్లే టార్గెట్... పది నగరాల్లో విస్తరిస్తాం...
Tuesday March 01, 2016 , 3 min Read
వ్యాపారం ఏదైనా అందులో ఎన్నో చిక్కులు ఇమిడి ఉంటాయి. కానీ, టెక్నాలజీ డైలీ లైఫ్ కి ఎన్నో సౌకర్యాలు అందిచినట్టే బిజినెస్ పై కూడా చాలా ఇంపాక్ట్ చూపుతోంది. ఎన్నో కొత్త దారులు తెరుస్తోంది. మరెన్నో కొత్త బిజినెస్ మోడళ్లను తెరపైకి తెస్తోంది. లోకల్ కిరాణా షాపులను ఆండ్రాయిడ్ యాప్ ద్వారా కనెక్ట్ చేస్తూ బీ టూ బీ ప్లాట్ ఫాం ని మొదలు పెట్టిన షాప్ కిిరాణా ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా కొత్త ప్రణాళికలకు సై అంటోంది. శాంసంగ్, హోలా ఛెఫ్ సంస్థల్లో కీలక స్థానాల్లో ఉన్న అతుల్ జైన్, అనిల్ గెల్రాలతో పాటు మరికొందరు దీనికి ఫండింగ్ చేశారు. ఇప్పుడీ డిస్టిబ్యూషన్ ప్లాట్ ఫాం టైర్ వన్, టూ సిటీల్లో మరింత విస్తరణకు సిద్ధమౌతోంది..
షాప్ కిరాణా 2015 లో మొదలైంది. తనుతేజాస్ సరస్వత్, సుమిత్ ఘొరావత్, దీపక్ ధనోతియాలు ఈ ప్లాట్ ఫాం ను మొదలు పెట్టారు. ఇది ఆండ్రాయిడ్ ఆధారంగా పనిచేసే మొబైల్ అప్లికేషన్. దీన్ని ఉచితంగా డౌన్ లోడ్ చేసి ఉపయోగించవచ్చు. రిటెయిల్ దుకాణాదారులు ఈ యాప్ ద్వారా తమ షాప్ కు కావలసిన సరుకులను తెప్పిచుకోవచ్చు. బిల్లుని సరుకు చేతికందిన తర్వాత కట్టొచ్చు.
"ఆయా ఉత్పత్తులు ఇచ్చే మార్జిన్ ద్వారా ఈ యాప్ లాభాలు ఆధారపడి ఉంటాయి. రిటెయిల్ మార్కెట్ లోని పలువురు వ్యాపారులు మాపై ఉంచుతున్న నమ్మకంతోనే షాప్ కిరాణా నిలదొక్కుకుంది".. --సుమిత్
షాప్ కిరాణా ఇండోర్ లో మొదలై, ఆ తర్వాత ముంబయిలో కూడా లాంచ్ అయింది. ఈ స్టార్టప్ ఆల్రెడీ టైర్ 1, టైర్ 2 సిటీల్లో నిలదొక్కుకునే అవకాశాలను పరిశీలించింది. ఇప్పుడిది టైర్ 2 సిటీల్లో విస్తరణకు ప్రణాళికలు వేస్తోంది. మనదేశంలో రిటెయిల్ మార్కెట్ చాలావరకు అనార్గనైజ్డ్ గా నే ఉంది. ఈ క్రమంలో షాప్ కిరాణా చాలా కొద్ది కాలంలోనే కేవలం పది బ్రాండ్లతో 500మంది రిటెయిలర్లను ఆకర్షించింది. 50లక్షలకు పైగా టర్నోవర్ సాధించింది. ఇప్పుడు షాప్ కిరాణాకు 2వేలకు పైగా రిటెయిల్ కస్టమర్లు ఒక్క ఇండోర్ లోనే ఉన్నారు. ఒక్క నెలలోనే రూ.85లక్షల సరుకులు ఆర్డర్ చేస్తున్నారు.
సంప్రదాయ మార్కెట్ ని ఆకర్షించటమే లక్ష్యం..
''మనదేశంలోని కిరాణాషాపుల్లో 90శాతంపైగా ఎలాంటి టెక్నాలజీ వాసనలు లేకుండానే ఉన్నాయి. ఆ దుకాణాల్లోకి యాండ్రాయిడ్ ఎంటరయిందంటే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఈ రంగంలోపలికి వెళ్తున్న కొద్దీ వస్తున్న ఫలితాలు మమ్మల్ని మరింత ఆకట్టుకుంటున్నాయి. 2016కల్లా పది సిటీలను కవర్ చేయటమే మా టార్గెట్..'' --తనుతేజాస్
''పలునగరాల్లో విస్తరించటం ఇప్పుడు పెద్ద సమస్య కానే కాదు. ఎందుకంటే పైలట్ ప్రాజెక్టుగా ఉన్నపుడే రెండు సిటీల్లో సక్సెస్ ఫుల్ గా పనిచేశాం, అందుకే మొదట టెక్నాలజీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఈ యాప్ ద్వారా, వందలాది కస్టమర్లనుండి వస్తున్న డేటాను, వివిధ బ్రాండ్ల సమాచారాన్ని అందించటానికి టెక్నికల్ గా మరింత బలంగా తయారవటం అవసరం.''-- దీపక్, కో ఫౌండర్
ఆఫ్ లైన్ రిటెయిల్ రంగంలో పెరుగుతున్న పోటీ..
మనదేశంలో 18మిలియన్ రిటెయిలర్స్ ఉన్నారని అంచనా. ఈ మార్కెట్ విలువ 500 బిలియన్ డాలర్లు. ఇది 2020 చివరికి 1ట్రిలియన్ ని చేరుతుందని అంచనాలున్నాయి. మనదేశంలోని నిత్యావసరాల మార్కెట్ ప్రపంచంలోనే ఆరవ స్థానంలో ఉంది. కానీ, ఇందులో కేవలం ఐదు నుండి ఎనిమిది శాతం మాత్రమే ఆర్గనైజ్డ్ గా ఉంది. ఇది షాప్ కిరాణా లాంటి స్టార్టప్ లకు కనిపించే పెద్ద సమస్య. మరో పక్క ఆన్ లైన్ గ్రాసరీ మార్కెట్. మెట్రోలతో పాటు, ఇతర నగరాల్లో వెల్లువలా దూసుకొస్తూ, డైరెక్ట్ గా కస్టమర్ నే టార్గెట్ చేస్తూ ఏటా 25 నుండి 30 శాతానికి పెరుగుతోంది. ఓ పక్క షాప్ కిరాణా ప్లాట్ ఫాం దూసుకుపోతూ ఉంటే, మరోపక్క ట్విక్స్టర్, బిజోమ్, అప్లికేట్ లాంటి స్టార్టప్ లతో పాటు, అమెజాన్ బిజినెస్, ఆలిబాబా, వాల్ మార్ట్ లాంటి సంస్థలు కూడా ఈ రంగంలో అడుగుపెడుతున్నాయి.
''షాప్ కిరాణా యాప్ రిటెయిలర్లకే కాదు... కన్స్యూమర్ ప్యాకేజ్డ్ గూడ్స్ కంపెనీలకు, డిస్టిబ్యూటర్లకు కూడా రిటెయిలర్లను వెదికేందుకు ఉపయోగపడుతోంది. ఈ యాప్ ద్వారా ఏ సరుకులకి ఎంత డిమాండ్ ఉంది, ఏ ప్రాంతంలో ఉంది అనే అంశంపై ఓ అవగాహనకు వచ్చి సరైన టైమ్ లో లాంచ్ చేసేందుకు అవసరమైన డేటా లభిస్తోంది.''--తనుతేజాస్
ఇలా రిటెయిలర్లను కలపుకుంటూ సాగుతున్న షాప్ కిరాణా యాండ్రాయిడ్ యాప్, 2015లో ఇండోర్ లో యాన్యువల్ టెక్ స్పార్క్స్ ఈవెంట్ కు ముందు జరిగిన యువర్ స్టోరీ సిటీ మీటప్ లో విన్నర్ గా కూడా ఎంపికయి.. లక్ష్యం దిశగా మరింత వేగంగా సాగుతోంది.